Tuesday 30 April 2013

nature is natural therapy

Here are 10 scientific proofs that nature is natural therapy. Put down those pills and get outside.

1. In a study in the American Journal of Preventative Medicine, researchers found that people experienced more deaths from heart disease and respiratory disease when they lived in areas where trees had disappeared.http://www.huffingtonpost.com/2013/01/21/trees-linked-with-human-h_n_2505267.html?ncid=edlinkusaolp00000003&ir=Green

2. Those who live in the areas with the most amount of green space have lower levels of cortisol (known as the stress-hormone), and their self-reported feeling of stress were lower than those who spent more time in urban settings.http://www.prevention.com/mind-body/emotional-health/spending-time-outside-relieves-stress

3. Spending days in nature, away from electronic devices, is linked with 50 percent higher scores on a test for creativity. The findings provide “a rationale for trying to understand what is a healthy way to interact in the world, and that burying yourself in front of a computer 24/7 may have costs that can be remediated by taking a hike in nature,” study researcher David Strayer, a psychology professor at the University of Utah.http://www.huffingtonpost.com/2012/12/16/creativity-nature-unplug-recharge-_n_2286735.html

4. Walking through nature evidence of lower frustration, engagement and arousal, and higher concentration and positive emotions. http://www.ncbi.nlm.nih.gov/pubmed/23467965

5. ADHD symptoms within children are greatly reduced when in the presence of nature and after doing activities in nature. Findings were consistent across age, gender, and income groups; community types; geographic regions; and diagnoses.http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC1448497/

6. Two hours of forest walking improves the following sleep characteristics; impacting actual sleep time, immobile minutes, self-rated depth of sleep, and sleep quality.http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3216244/

7. Living in a green environment with plants in your home is linked to lower stress reduction and improve stress moderation and management.http://www.sciencedirect.com/science/article/pii/S0169204611003665

8. Walking through nature decreases brain fatigue. When volunteers walked through urbanized areas with heavy traffic, their brain wave patterns consistently showed that they were more aroused, attentive and frustrated than when they walked through the parkland, where brain-wave readings became more meditative. This study encourages “taking a break from work,” Dr. Roe said, and “going for a walk in a green space or just sitting, or even viewing green spaces from your office window.”http://well.blogs.nytimes.com/2013/03/27/easing-brain-fatigue-with-a-walk-in-the-park/

9. Juyoung Lee of Chiba University found that leisurely forest walks, compared with urban walks, yield a 12.4 percent decrease in the stress hormone cortisol, a seven percent decrease in sympathetic nerve activity, a 1.4 percent decrease in blood pressure, and a 5.8 percent decrease in heart rate. On subjective tests, study participants also report better moods and lower anxiety. http://www.outsideonline.com/fitness/wellness/Take-Two-Hours-of-Pine-Forest-and-Call-Me-in-the-Morning.html?page=all

10. Nature walks can even fight disease and cancer by increasing your NK (natural killer) cells that are essentially to the innate immune system. When participants agreed to go on morning and afternoon nature hikes, blood tests showed that their NK cells had increased 40 percent. A month later, their NK count was still 15 percent higher than when they started. By contrast, during urban walking trips, NK levels didn’t change.http://www.outsideonline.com/fitness/wellness/Take-Two-Hours-of-Pine-Forest-and-Call-Me-in-the-Morning.html?page=all

If you’re reading this right now, it means you’re on a screen. Promise yourself youll make it outside soon;)

Saturday 20 April 2013

దేశం భద్రంగా ఉంటుంది


ఈ నెల 15వ తేదీ చైనా దళాలు భారతభూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాయి. కాశ్మీర్ లోని తూర్పు లడఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ లో 10 కిలోమీటర్ల లోపలికి రావడమే కాకుండా గుడారాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు, ఆశ్చర్యకరమైన విషయం అంతకంటే కాదు. చైనా తరుచూ అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబాడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశంలో భాగంగా చూపించుకుంటూ మ్యాప్ లు విడుదలచేసింది. గత 2 సంవత్సరాల్లో కొన్ని వందలసార్లు భారతభూభాగంలోకి అక్రమంగా చొరబడింది. చైనా తన మనుష్యుల ద్వారా భారతదేశంలో చీలికలు తీసుకురావడానికి, భారతదేశాన్ని ముక్కలు చేయడానికి అనేక పధకాలు రచించింది. కొన్నిటిని అమలుపరుస్తోంది.

ఒకసారైతే ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్తే తమ అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ ఎదురు ప్రశ్న వేసింది. చాలాకాలం క్రితమే చైనా భారతదేశ సరిహద్దు దగ్గర రోడ్లు నిర్మించి, గుఢారాలు ఏర్పాటు చేసింది. యుద్ధట్యాంకర్లను మొహరించింది. యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను పంపింది.

పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకుంది. ఆయుధాలను సమకూర్చడంలో పాకిస్థాన్ కు సహాయం అందిస్తోంది. శ్రీ లంక, బంగ్లాదేశ్ లో ఓడ రేవుల నిర్మాణానికి సహాయపడింది. మయన్మార్ తో వ్యాపారసంబంధాలు అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. హిందూ మహసముద్రంలో చమురును వెలికితీస్తామన్న నెపంతో హిందూమహా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది. భారత్ ను అష్టదిగ్బంధనం చేసి, తన మిత్ర దేశాలతో కలిసి మూకుమ్మడి దాడి చేయాలనేది కమ్యునిస్ట్ చైనా పధకం.

నదుల మళ్ళింపుకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాల మీద కూడా చైనా సంతకం చేయలేదు. బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యాం నిర్మించి బ్రహ్మపుత్ర నది దారినే మళ్ళించే కుటిల పధకం వేసి అమలు చేస్తోంది చైనా. దీని వల్ల భారత లోని ఈశాన్యరాష్ట్రాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.

చైనా ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్. చైనాకు భారత్ నుంచి చాలా ఆదాయం వస్తోంది. అందువల్ల ఇప్పటికిప్పుడు చైనా భారత్ మీద దాడి చేసి, తన ఆదాయానికి గండి కొట్టుకోదు. కానీ ఎప్పటికైనా చైనా మనకు శత్రువనే విషయం గుర్తుంచుకోవాలి.

మన కేంద్రప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో చైనా కుటిలవైఖరిని, అకరమ చొరబాట్లను ఎండగట్టాలి. కానీ ఇంతవరకు ఇది జరగనే లేదు. ప్రపంచంలో చైనా సనియం చాలా పెద్దది. చైనా సైన్యానికున్న అత్యాధునిక ఆయుధాలు భారత్ వద్ద లేవు. పైగా చైనా రక్షణశాఖ బడ్జెట్ మనకంటే కేటాఇంపులకంటే చాలా ఎక్కువ. మన సైన్యంలో ఉన్న ఖాళీలను మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు భారత్ చైనాతో యుద్ధం చేసి విజయం సాధించడం కష్టమైన పని.

ప్రభుత్వాలు ఏమి చేయలేకపోవచ్చు కానీ భారతీయులగా మన కొన్ని చేయగలం. ప్రతి భారతీయుడు చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలి. చైనాలో తయారైన చిన్నచిన్న లైట్ల దగ్గరినుండి, సెల్ ఫోన్లు, టి.వి.లు అన్నిటిని భారతీయులు స్వచ్ఛందంగా బహిష్కరించాలి. ఇంట్లో ఉన్న చైనా సామాన్లు పడేయమని అర్ధం కాదు, కొత్తగా చైనా సామానులు కొనకండి.

చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది. దాన్ని భారత్ అధికారికంగా చైనా లో భాగంగా గుర్తించింది. కానీ చైనా ఇంతవరకు కాశ్మీర్ ను భారతభూభాగంగా గుర్తించలేదు. అక్కడితో ఆగకుండా ఈశాన్యరాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్రల్ చేస్తోంది. టిబెట్ లో చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతోంది. దానికి మనం కూడా మన గొంతు కలపాలి. చైనాను రాజకీయంగా దెబ్బకొట్టాలి. మనకు ఆ అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర మీద కడుతున్న డ్యాం టిబెట్ లోనే ఉంది. దానికితోడు భారత్ కు టిబెటే సరిహద్దు. టిబెట్ విడిపోతే చైనా సగానికి చీలిపోతుంది. భారత్ ను ఆకర్మించుకున్న ప్రదేశాలు భారత్ కు తిరిగివస్తాయి.

మనం దేశభకి కలిగినవారిని, ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడనివారిని, నిజాయతీపరులను ఎన్నుకోవాలి. అప్పుడే దేశం భద్రంగా ఉంటుంది.

జై హింద్                

Thursday 18 April 2013

రామాయణం సందేశం ఏమిటి


ఓం శ్రీ రామాయ నమః

రామాయణం సందేశం ఏమిటి?

రావణాసురుడు, విభీషణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతారు. రావణుడు మరణం వద్దని కోరుకోగా, అది జరగనిపని అంటాడు బ్రహ్మ దేవుడు. చివరకు కడుపులో ఒక కుండలో ప్రాణాలు ఉండేలా వరం కోరుకుంటాడు. విభీషణుడు "ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేలా, ధర్మాన్ని ఎప్పుడు విడువకుండా ఉండేలా, ధర్మ మార్గంలోనే నడిచేలా వరం ఇవ్వండి" అన్నాడు. సరేనన్న బ్రహ్మ ఈ వరాలతో పాటు "నువ్వు చిరంజీవత్వాన్ని పొందుతావు" అంటూ వరం ఇచ్చాడు.

మరణం వద్దన్నవాడికేమో కుదరదన్నారు, ధర్మమే కావాలన్న వాడు మరణం లేని స్థితిని పొందాడు. ఆనాడు ఆ వరం పొందిన విభీషణుడు ఈనాటికి జీవించి ఉన్నాడు.

పరపరుషుడిని, అందునా పెళ్ళైనా వాడిని కామభావంతో చూసిన శూర్పణక ముక్కు, చెవులు పోయి అందవీహనమైంది. పరస్త్రీని ఎత్తుకుపోయిన రావణాసురుడు సర్వనాశనం అయ్యాడు. అశోకా వనంలో బాధతో కూర్చున్న సీతమ్మను తల్లిలా చూసిన హనుమంతుడు భవిష్యబ్రహ్మై ఈరోజుకు హిమాలయాల్లో మానససరోవరం దగ్గర తపస్సు చేసుకుంటున్నారు.

వాలి మహాపరాక్రమవంతుడు. సుగ్రీవుని భార్యను చెరబట్టాడు. రాముడు సుగ్రీవుని వెనుకాల ఉన్నాడని తెలిసీ, సుగ్రీవునుతో యుద్ధం చేశాడు, రాముని చేతిలో మరణించాడు. అధర్మంగా దేవుడిని నమ్ముకున్నవాడి సొమ్ము దొంగిలించినా, వాడి జోలికి వెళ్ళినవారు ఎంత శక్తివంతులైన వాలిలాగే నాశనమవుతారు.

ఎక్కడ స్త్రీ కంటతడి పెడుతుందో అక్కడ సర్వం నాశనమవుతుంది. లంకలో సీత ఎంతో విలిపించింది. ఆ ప్రభావంతో లంక మొత్త హనుమంతుడి చేతిలో కాలిపోయింది.

"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥
ఓం శ్రీ రామాయ నమః
"श्री*♥ ॐ♥"~"श्री*~*♥ ॐ♥~"श्री*~♥ ॐ♥"~"श्री*~♥ ॐ♥"*"श्री*♥*♥

Tuesday 16 April 2013

భార్య తన భర్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో

ఓం శ్రీ రామాయ నమః

వనవాసానికి వెళ్ళాలనుకున్న రాముడు సీతమ్మను అయోధ్యలోనే ఉండి సమస్త రాజభోగాలు అనుభవించమంటాడు. ఎందుకంటే రాముడు వనవాసానికి వెళ్ళాలని కైకేయి వరం అడిగిందే కానీ, సీతమ్మ కూడా వెళ్ళాలని అడగలేదు. చాలా విధాలుగా చెప్పి చూస్తాడు. 

అప్పుడు సీతమ్మ ప్రేమ వలన కలిగిన కోపంతో "ఏం మాట్లాడుతున్నావు రామ, నువ్వేం చెప్తున్నావో నీకు అర్దం అవుతోందా? ఎవరైన నీ మాటలు వింటే నవ్విపోతారు. తల్లిదండ్రులు, కొడుకుకోడళ్ళ అదృష్టం వారు చేసుకున్న పుణ్యకర్మల మీద ఆధారపడి ఉంటుంది. కానీ భార్య అదృష్టం భర్త మీదే ఆధారపడి ఉంటుంది. అతను చేసుకున్న కర్మల ఫలాన్ని భార్య కూడా అనుభవిస్తుంది. అందువల్ల నువ్వు అడవులకు వెళ్తె నీతో పాటే నేనూ వనవాసానికి  వస్తా. స్త్రీ తల్లి, తండ్రి, కొడుకులు, మిత్రుల దగ్గర ఉంటే సంతోషంగా ఉండదు. స్త్రీ జీవించినా, మరణించినా భర్త దగ్గరే ఉండాలని కోరుకుంటుంది, అదే సంతోషంగా భావిస్తుంది.    

ఓ రామా! నువ్వు అడవులకు బయలుదేరితే నీ ముందు నేను నడుస్తా. కష్టమైన అటవిమార్గంలో నీ కాళ్ళకు అడ్డివచ్చే ముళ్ళపై నీకంటే ముందు నేనే పాదం మోపుతాను. నీకు అపాయం రాకుండా చూసుకుంటా. నీ మార్గాన్ని సుగమం చేస్తా.

ఓ వీరుడా! భర్త పాదాల వద్ద ఉండే రక్షణ కంటే పెద్దపెద్ద బహుళ అంతస్థుల భవనాల్లో ఉండడం, విమానాల్లో తిరగడం గొప్ప ఏమీ కాదు. నాకు చిన్నవయసులోనే మా అమ్మనాన్న అన్నీ నేర్పించారు. నేను నీకు అన్ని విషయాలు చెప్పనవసరంలేదు.  

సందేహమే లేదు, నేను నీతో అడవికి వస్తాను. నువ్వు నన్ను ఈ విషయంలో ఆపలేవు" అని అంటుంది.

భార్య భర్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో, సమస్త భోగాలకన్నా భర్తే మిన్న అని అన్నిటిని భర్త కోసం విడిచిపెట్టగలుగుతుందో సీతమ్మ మాటలలో మనకు అర్దమవుతుంది. అలాంటి సీతమ్మయే తరతరాల భారతనారికీ ఆదర్శమైంది, సీతా మహాసాధ్వీ - మన జాతీయ ఆదర్శం అంటారు స్వామి వివేకానంద. 

ఈ లోకంలో ఉన్న భార్యభర్తలందరూ ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో, గొడవలు లేకుండా జీవించాలని ఆ సీత సమేత శ్రీ రామచంద్ర మూర్తిని వేడుకుందాం.

- వాల్మీకి రామాయణం, అయోధ్యాకాండ, 27వ సర్గ నుంచి 

ఓం శ్రీ రామాయ నమః    

Saturday 13 April 2013

బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ

ఒక టీచరు తరగతిలో ఉన్న విద్యార్ధులందరికీ పాఠాలు చెప్తుంది. అందులో కొందరు విద్యార్ధులు టీచరు చెప్పిందల్లా చేస్తారు, చక్కగా రోజు హోంవర్క్ చేస్తారు, తరగతిలో మౌనంగా ఉంటారు, ఎవరితోనూ గొడవపడరు. కొందరు బాగా అల్లరి చేస్తారు. హోంవర్క్ చేయరు, చదవరు. అందరితోనూ గొడవపడతారు. కాకపోతే రోజుకు పదిసార్లు పొగుడుతున్నారుకోండి,  టీచరు ఎవరిని ఇష్టపడుతుంది?......... తన చెప్పినట్టుండే వారంటే ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది. ఆకతాయిల మమాటలను పట్టించుకొకపోగా, అవన్నీ వట్టిమాటలని కొట్టిపారేస్తుంది.

దేవుడు కూడా అంతే.తన చెప్పినట్టు జీవిచకుండా, నిత్యం ఎన్ని పూజలు చేసిన పెద్దగా పట్టించుకోడు. తను చెప్పిన మార్గంలో నడిచేవారు, తన చెప్పినట్టుగా జీవించేవారి పట్ల అమితమైన ఇష్టం చూపిస్తాడు, నిరంతరం అనుగ్రహం ప్రసరిస్తాడు. వారు ఒక్క నమస్కారం చేసినా పొంగిపోతాడు.  
షిరిడీ సాయినాధుడు సద్గురువు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి మానుషరూపంలో భూమికి వచ్చిన మహాపురుషుడు.

బాబా జీవితమే ఒక సందేశం. అందరిని ప్రేమించమన్నారు, దీనులను ఆదరించమన్నారు. బాబా రోజు బిక్ష యాచించి, తీసుకువచ్చి ఒకపాత్రలో వేసి పశుపక్ష్యాది జీవులకు ఆహారంగా అందిచేవారు. సర్వ జీవుల యందూ దయకలిగి ఉండమన్నారు.

రోగంతో ఉన్నవారిని డబ్బు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం మాట సాయమైన చేసి ధైర్యం ఇవ్వచ్చు. వారికి మనం ప్రేమను పంచవచ్చు. అసహ్యనించుకోకుంటే చాలు. ఇంతకంటే మన నుండి బాబా ఏమి ఆశిస్తాడు చెప్పండి.

మరి మనం చేస్తున్నదేంటి? మన చుట్టు నిత్యం అనేక జీవరాశులు నీరు, ఆహారం లేక మరణిస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. మనం రోజు వాటికి కాసిన్ని నీరు త్రాగడానికి అందుబాటులో పెట్టలేమా? మిగిలిపోయిన అన్నం చెత్తబుట్టలో పడేస్తాం కదా. అలా వృధా చేసేకంటే మన ఇంటిముందున్న వీధికుక్కకు ఆ అన్నంలో కొంచం పాలో, మజ్జిగో కలిపి పెట్టచ్చు కదా. వాటి మీద కాసింత ప్రేమ చూపించవచ్చు కదా.  ఊర్లో ఉన్న అన్నిటికి పెట్టక్కర్లేదు, మన పరిసరాల్లో ఉన్నవాటి జీవనానికి సాయపడచ్చు.


ఇలా బాబా మనకు చెప్పిన సందేశాలను ఆచరించి ఒక్కసారి బాబా ముందుకెళ్ళి నిల్చుని "నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నా బాబా" అని చెప్పండి. ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషిస్తాడు. మనస్ఫూర్తిగా చేస్తే ఆశీర్వదిచడమే కాదు, తప్పకుండా దర్శన భాగ్యం కూడా ఇస్తాడు. ఇచ్చి తీరుతాడు.

మనం బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ "సహనం, శ్రద్ధ". ఆయన మార్గంలో మనస్ఫూర్తిగా నడవడమే ఆయనకు ఇచ్చే గౌరవం.

ఓం శ్రీ సాయినాధాయ నమః    

Friday 12 April 2013

ఊర్ద్ఝ్వ గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

32 గణపతులలో 16వ అవతారం ఊర్ద్ఝ్వ గణపతి. ఊర్ధవ్ అంటే ఉన్నతమైన స్థితి/స్థానం అని అర్దం. ఈ రూపంలో గణపతి శక్తిని రన ఎడమతోడపై కూర్చుబెట్టుకుని, బంగారు రంగు శరీరంతో మెరిసిపోతు, 8 చేతులతో దర్శనమిస్తాడు.

ప్రధానమైన కుడిచేతితో దంతం పెట్టుకుని, ఎడమ చేతితో శక్తిని పట్టుకుంటాడు. మిగితా చేతులతో పూలబాణం, కలువపువ్వు, నీలివర్ణపు లిల్లీపువ్వు, చెఱుకు గడతో చేసిన ధనుస్సు, వరికంకి, గద ధరించి దర్శనమిస్తాడు.

ఊర్ధ్వ గణపతిని నిత్యం ఆరాధించేవారు, అన్ని విధములైన కష్టాల నుంచి ముక్తిపొంది, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

పూర్వ ఫల్ఘుణి నక్షత్ర జాతకులు ఊర్ధ్వగణపతిని జీవితాంతం పూజించడం వలన మంచి ఫలితాలుంటాయి.

ఊర్ధ్వగణపతికి సంబంధించిన ఆలయం తమిళనాడు రాష్ట్రంలో మదురైలో ఉన్న శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది.

ఊర్ద్వగణపతి ధ్యానశ్లోకం :

కల్హారిశాలి కిణిక్షుక చాపబాణ
దంత ప్రరోహ కబరః కనకోజ్వలాంగః
ఆలింగనోద్యత కరః తటిదాభకట్యా
దేవాద్యది శతృభయ మూర్ధ్వ గణేశ్వరన్తే

ఈయనను పూజించడంవలన పాపవిమోచనులవుతారు.

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః  

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Picture of Urdhva Ganapati Form of Lord GaneshUrdhva Ganapati is the 16th among the 32 forms of Lord Ganesh. Urdhva Ganapathi means “the Elevated”. In this formLord Ganesha appears in a tantric posture with his consort Shakti (Devi) on his left lap with eight hands and golden hue complexion. On his main right hand holds his tusk and the main left hand is gently around his Shakti. On the other hand holds sprig of paddy, a lotus, a blue lily, a sugar cane bow, arrow and a mace.

Pooram (Purva Phalguni) Nakshatra is related to Urdhva Ganapati. Worshipping this form  is believed to help the devotees from all sorts of difficulties by giving them refugee and elevate devotees up in their life.

Temples of Urdhva Ganapati

Though there are no famous temples exclusively dedicated to Urdhva Ganapati, this form of Lord Ganesha can be worshipped in Shri Mahalingeshwara Temple in Madurai, Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka, has 32 forms of Ganapati sculptures.

Urdhva Ganapati Mantra 

Kalhaara Shali Kamalekshuka Chapa Bandanta
Prarohakagadi Kanakojwalangaha
Alinganaodhatakaro Harithangashtaya Devya
Karotu Shubhaha Murdhva Ganadhipo Mey!!

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Tuesday 9 April 2013

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

|| ఓం ||

ఉగాది పచ్చడి గురించి శాస్త్రం ఏం చెప్తోంది?

ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

అంటే "ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి" అని పై శ్లోకం అర్దం.

Sunday 7 April 2013

నృత్య గణపతి


।। ॐ गं गणपतये नमः ।।
|| ఓం గం గణపతయే నమః ||

నృత్య గణపతి 32 గణపతులలో 15వ రూపం. ఈ రూపంలో గణపతి ఆనందంతో నాట్యం చేస్తూ కనిపిస్తారు. బంగారు రంగు కలిగిన శరీరంతో ఒక కాలున కల్పవృక్షం మీద పెట్టి నాలుగు చేతులతో దర్శనమిస్తారు. పాసము, అంకుశము, దంతము, దండము ధరించి, వక్రతుండంతో మోదకం పట్టుకుని ఉంటాడు నృత్య గణపతి.

నృత్య గణపతి ఆరాధనతో కళాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, కళరంగంలో రాణిస్తారు. చేసేపనిలో నైపుణ్యం వస్తుంది. నృత్య గణపతిని నాట్యరంగంలో ఉన్నవాళ్ళు విశేషంగా పూజించాలి.

మఖ నక్షత్రంవారు నృత్య గణపతిని ఆరాధిస్తే జీవితంలో మంచిఫలితాలు పొందుతారు.

అరుల్మిగు మగుదేశ్వరర్ దేవాలయం, కొదుముది, తమిళనాడులో నృత్య గణపతి ఆలయం ఉంది.

నృత్య గణపతి శ్లోకం :

పాశంకుశపూప కుఠార సంత చంచత్కరం చారుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్థం భజామి నృత్తైక పదం గణేశం

నృత్య గణపతి శ్లోక పఠనం వలన నిత్యసంతుష్టులవుతారు.

।। ॐ गं गणपतये नमः ।।
|| ఓం గం గణపతయే నమః ||

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Nritya Ganapati is the 15th among the 32 forms of Lord Ganesha. Nritya Ganapati literally means the “Happy Dancer”. 

In this form, Lord Ganesh appears in golden hue complexion in dancing posture on one leg under Kalpavriksha (Wish Fulfill Tree) with four hands. On his main right hand holds the tusk and the upper hand with elephant goad, on the left hand hold a battle-axe and noose. On his fingers with rings and the trunk curled holding his favourite sweet Modaka.

Importance of Nritya Ganapati Form of Ganesha :

Worshipping this form of Ganapathi is believed to give proficiency and success for the devotees in fine arts. Nritya Ganapati is conciliated by many artists especially by dancers.

Magam (Magha) Nakshatra is related to Nritya Ganapati.

Temples Where Nritya Ganapati Form can be Worshipped :

Nritya Ganapati can be worshipped in Arulmigu Magudeshwarar Temple, in Kodumudi, Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka, has 32 forms of Ganapati sculptures. Pazhavangadi Ganesh Temple in Trivandrum also has sculptures of Nritya Ganapati.

Nritya Ganapati Mantra

Kalhaara shali kamalekshuka chapa bandanta
Prarohakagadi kanakojwalangaha
Alinganaodhatakaro harithangashtaya devya
Karotu shubhaha murdhva ganadhipo mey!!

Source : http://www.hindudevotionalblog.com/2012/03/nritya-ganapati-form-of-ganesha.html

Saturday 6 April 2013

విజయ గణపతి

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

విజయ గణపతి 32 గణపతులలో 14వ రూపం. మూషిక(ఎలుక) వాహనం పై కూర్చుని, రక్తవర్ణపు శరీరఛాయతో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు విజయ గణపతి.

బంగారు మామిడి పండు, పాశము, అంకుశము, దంతము పట్టుకుని ఉంటాడు.

విజయ గణపతి ఆరాధనతో ధర్మబద్ధమైన అన్ని కార్యాల్లోనూ విజయాలు లభిస్తాయి. ఈయనను పూజించడం వలన కష్టాలనుండి వెంటనే విముక్తి దొరుకుతుంది.

ఆశ్లేష నక్షత్ర జాతకులు విజయగణపతిని ప్రత్యేకంగా ఆరాధించాలి.

మహారాష్ట్ర పూనేలో ఉన్న అష్టవినాయక దేవాలయంలో విజయగణపతిని దర్శించవచ్చు.

విజయ గణపతి ధ్యాన శ్లోకం :

శంఖేక్షు చాప కుసుమేషు కుంఠారదంత
పాశంకుశైః కళమమంజరికా సనాధైః
పాణిస్థితైః పరిసమావృత భూషణ శ్రీః
విఘ్నేశ్వరో విజయతే కమనీయ గౌరః

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Vijaya Ganapati is the 14th among the 32 forms of Lord Ganesha. In Vijaya Ganapathi form the lord appear in a red hue with four hands sitting on the Mooshika Vahana (Rat) which depicted in proportionate size.

On his main right hand holds his favorite fruit golden mango and the upper right hand the noose. On the main left hand holds his tusk and upper left hand an elephant goad. The word Vijaya means “the Victorious”.

Worshipping this form is believed to give success for the devotees on all their ventures. Also there is popular belief that praying this form will provide instant relief from troubles.

Ashlesha Nakshatra or Ayilyam Nakshatra is related to Vijaya Ganapati.

Temples Where Vijaya Ganapati can be Worshipped :

Vijaya Ganapati form of Lord Ganesh can be worshipped in the Ashtavinayak Temples in Pune, Maharashtara. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka have 32 forms of Ganapati sculptures. Pazhavangadi Ganapathi Temple in Trivandrum also has paintings of Vijaya Ganapati form of Ganesha.

Vijaya Ganapati Mantra :

Pashankusha Svadhantamra Phalavan Akhuvahanah!
Vighnam Nihantu Nah Sarvam Raktavarno Vinayakah!!

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||


Friday 5 April 2013

మహా గణపతి


।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః

32 గణపతులలో 13 వాడు మహా గణపతి. మహా అంటే గొప్ప అని అర్దం. గణపతి అన్ని రూపాల్లోకెల్లా గొప్ప రూపం మహాగణపతి.
ఈ రూపంలో గణపతి శివుని వలె 3 కన్నులు కలిగి, తలపై చంద్రుని ధరించి ఉంటాడు. రక్త వర్ణపు శరీరంతో, 10 హస్తాలు కలిగి, శక్తిని ఎడమతోడపై కూర్చుపెట్టుకుని ఉంటాడు.

విరిగిన దంతము, దానిమ్మ పండు, చెఱుకుగడ, చక్రము, పాశము, గద, వరికంకి, పద్మం, శంఖం, రత్నకుంభాలను తన చేతులతో పత్టుకుని ఉంటాడు.

మహాగణపతి ఆరాధన వలన అష్టైశ్వర్యాలు కలిగి, గొప్ప కీర్తివంతులవుతారు.

మహాగణపతి ఆలయం ద్వారకలో శ్రీ కృష్ణ దేవాలయంలో ఉంది. శ్రీ కృష్ణుడు నిత్యం ఈ మహాగణపతిని ఆరాధించేవారు.

పుష్యమి నక్షత్రం వారు మహాగణపతిని ఆరాధిస్తే జీవితం సుఖంగా సాగుతుంది.

మహాగణపతి శ్లోకం :

బిభ్రాణోబ్జక బీజపూర గదా దంతేక్షు బాణైస్సమం
బిభ్రాణో మణికుంభశాలి కిణిశం పాశం చ వక్త్రాంచితం
గౌరాంగ్యారుచి రారవిందయుతయా దేవ్యా సనాధాంతికః
శోణాంగ శ్శుభమాతానోతుభవతాం నిత్యం గణేశో మహాన్

।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః
।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Maha Ganapati is the 13th of the 32 forms of Lord Ganesha. Maha literally means “the Great” and is one among the most commonly worshipped for of Lord Ganesh. 

In this form Ganapathi is depicted with three eyes and a crescent moon on his head, like his father Lord Shiva. The lord appears with ten hands and is red in complexion and seen with his consort seated on the left thigh. On his hand holds his tusk, a pomegranate, a sugarcane bow, chakra (discuss), noose, a blue lily, a sprig of paddy, a lotus, a mace and ratnakumbha (pot containing gems).

Pushyami Nakshatra is related to Maha Ganapati. 

Worshipping this form is believed to give prosperity and very meritorious. Praying to lord everyday will help devotees attain great glory. 

Maha Ganapati can be worshipped in the famous Lord Krishna Temple in Dwaraka, Gujarat.  It is believed that Sri Krishna is offering prayer to Maha Ganapati. Also temples in Chamarajanagar  and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.

Maha Ganapati Mantra :

“Hasteemdranana Minduchuda Marunachayam Trinetram Rasah
Dashilishtam Priyaya Sa Padmakaraya Svankashtayah Santatam
Beejapoora Gadekshu Karmuka Laschhakrabja Pashotapala
Vreehagra Svavishaana Ratna Kalasham Hastaih Vahantam Bhaje.”

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Thursday 4 April 2013

లక్ష్మీగణపతి

|| ఓం గం గణపతయే నమః ||

Ψ 32 గణపతులలో వినాయకుడి 12వ అవతారం లక్ష్మీగణపతి. ఈ అవతారంలో స్వామి సిద్ధి, బుద్ధి లను తన రెండు తొడలపై కూర్చొబెట్టుకుని దర్శనమిస్తారు. సర్వకార్య సిద్ధికి చిహ్నంగా సిద్ధి లక్ష్మీ, జ్ఞానం, బుద్ధి, విద్యలకు సూచిక బుద్ధిలక్ష్మీ.

Ψ 8 హస్తాలు కలిగి ఉంటాడు. ప్రధానమైన ఎడమచేతితో వరదముద్ర పట్టి ఉంటాడు. మిగితా చేతులలో దానిమ్మ పండు, ఖడ్గం, కల్పవృక్షపు తీగ, పాశం, అంకుశం, చిలుక, అమృత కలశం ధరించి దర్శనమిస్తాడు. సిద్ధి, బుద్ధి తమ చేతిలో కలివ పువ్వు పట్టుకుని ఉంటారు. తెల్లని వర్ణం కలిగి ఉంటాడు.

Ψ ఈయనను పూజించడం వలన సర్వసంపదలు కలుగుతాయి. లక్ష్మీగణపతిని నిత్యం పూజించే భక్తులకు ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి.

Ψ పునర్వసు నక్షత్రం వారు ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ గణపతిని పూజించాలి.

Ψ తమిళనాడులోనున్న పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈయనను ఆలయం ప్రత్యేకంగా ఉంది.

Ψ శ్రీ లక్ష్మీ గణపతి ధ్యాన శ్లోకం Ψ

బిభ్రాణశ్శుక బీజాపూర కమలం మాణిక్య కుంభాకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోస్సరో నిస్సరః
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

Ψ లక్ష్మీగణపతిని నిత్యం పై శ్లోకం పఠిస్తూ ధ్యానిస్తే లక్ష్మీసంపన్నులవుతారు.

|| ఓం గం గణపతయే నమః ||

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Ψ Lakshmi Ganapathi is the 12th of Lord Ganesha’s 32 forms. In this form Lord Ganesh sits flanked by his consorts Siddhi and Buddhi on both of the thighs. Goddess Siddhi is responsible for achievement and Goddess Buddhi is responsible for wisdom. 

Ψ Lakshmi Ganapati appears with eight hands, the main left hand posture Abhya Mudra bestows blessing to all the devotees. The other hands holds green Parrot, a Pomegranate, a sword, a noose, elephant goad, sprig of Kalpavriksha (Wish fulfilling tree) and water vessel (Kamandala). Both his consorts hold white lotus flowers and as the complexion of the lord s also white in colour.

Ψ Punardham (Punarvasu) Nakshatra is related to Lakshmi Ganapati. Worshipping this form of Ganesha is believed to give wealth and wisdom. Praying to lord everyday will help devotees attain materialistic gains. Lakshmi Ganapati can be worshipped in the famous Pazhani Murugan Temple in Palani Tamil Nadu. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures.

Ψ Lakshmi Ganapati Mantra Ψ

Bibhranah Shukha Beejapuraka Milanamanikya
Kumbhakshushaan Paasham Kapalataam Cha Khangavilasijjyotih
Sudhaa Nirjharah Shyaamenaatta Saroruhena Sahitam Devidvyam Chantikee
Gowrango Varadaana Hasta Sahitah Lashmi Ganesha Svataata

।। ॐ गं गणपतये नमः ।।
|| Om gam ganapataye namaha ||

Eco vinayaka

source : http://www.hindudevotionalblog.com/2012/02/lakshmi-ganapati-form-of-ganesha.html

Wednesday 3 April 2013

విగ్రహరాధన

ॐ విగ్రహరాధన సహేతుకమేనా? అని కొంత మంది వాదిస్తూ వుంటారు ॐ

దానిని చిన్న కధ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనగనగా ఒక రాజ్యం వుండేది. అది ముస్లిం రాజ్యం. రాజు, మంత్రి, పరివారం అంతా ముస్లిములే. ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. ఆ రాజ్యం లో ఒక సన్యాసి(యతి )వుండేవాడు. తన శిష్యులతో కలిసి, వున్న కొద్ది మంది హిందువులకు విగ్రహారాధన గురించి చెప్పేవాడు. 

అది చూసి కొంత మంది భటులు ఆ యతి ని రాజు దగ్గరకు తీసుకు వెళ్తారు. రాజా! ఈ యతి ప్రజలను విగ్రహారాధన చేయమంటున్నాడు అని చెప్తారు. అప్పుడు ఆ రాజు " ఏమయ్యా రాళ్ళను, రప్పలను పూజించమని చెప్తున్నావట ఏమి " అని మనకు తెలియని తన భాష లో హుంకరించాడు.

అప్పుడు ఆ యతి " అవును చెప్పాను, కావాలంటే నిరూపిస్తా " అన్నాడు.
సరే అన్నాడు రాజు.

అయితే నాకు ఒక చిత్రకారుడు కావాలి, ప్రవేశపెట్టండి అన్నాడు యతి. రాజు చిత్రకారున్ని పిలిపించాడు.

యతి ఆ చిత్ర కారుడితో రాజు పటం చెక్కించాడు. బ్రహ్మాండంగా వచ్చింది ఆ చిత్రం. అప్పుడు యతి తనను రాజు దగ్గరకు తీసుకువచ్చిన భటున్ని పిలిచి ఈ చిత్రం మీద గాండ్రించి ఉమ్ము వేయి అన్నాడు.

అయ్యబాబోయ్! రాజు గారి బొమ్మ పై ఉమ్మా...... నేను వేయలేను అన్నాడు. అప్పుడు ఆ యతి రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఇది బొమ్మ మాత్రమే, పర్వాలేదు వేసేయ్ అన్నాడు. భటుడు నేను వేయలేను అన్నాడు.

అప్పుడు ఆ యతి, చూసారా రాజా. ఒక రాజ్యాన్ని పరిపాలించే మీ బొమ్మ మీదే వాడికి అంత భక్తి ఉన్నప్పుడు విగ్రహారాధన తప్పెలా అవుతుంది. మీ ప్రతి రూపాన్ని వాడు ఆ చిత్రంలో చూసినట్టే, మేము కూడా పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను విగ్రహంలో చూసుకుంటున్నాం అన్నాడు. అప్పుడు రాజు విగ్రహారాధన సత్యం సత్యం పునః సత్యం అని ప్రకటించాడు.

Tuesday 2 April 2013

హేరంబ గణపతి

ఓం గం గణపతయే నమః

హేరంబ గణపతి 32 గణపతులలో 11వ వాడు. ఆర్తులు, దీనుల రక్షకుడు. 10 చేతులు, 5 తలలతో దర్శనమిస్తాడు. ఒక చేతితో అభయహస్తం ధరించి తనను నమ్మినవారికి భయాన్ని దూరం చేస్తాడు, తాను ఉన్నాననే నమ్మకం కల్పిస్తాడు. మిగితా చేతులలో పాశము, సుత్తి, రుద్రాక్షమాల, అంకుశం, పరశువు(గొడ్డలి), విరిగిన దంతం, పూల మాల, దబ్బ పండు, మోదకం ధరించి ఉంటాడు. తెల్లని శరీర ఛాయ కలిగి, సింహ వాహనం మీద విహరిస్తుంటాడు.

ఆరుద్ర, ఆర్ద్ర నక్షత్రా జాతకులు హేరంబ గణపతి ఆరాధన చేయాలి.

ఈయనను నిత్యం పూజించేవారు దైర్యవంతులవుతారు, సర్వ శక్తివంతులవుతారు.  

హేరంబ గణపతి ఆలయాలు చాలా అరుదు. కాశీలో ఉన్న విశ్వనాధుడి దేవాలయంలో ప్రత్యేక పూజలందుకుంటున్నాడు హేరంబ గణపతి.

అభయ వరదహస్తః పాశదంతాక్షమాలః
పరశుమధ త్రీశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహః పంచమాతంగ వక్త్రః
కనక రుచిర వర్ణః పాతు హేరంబ నామా

హేరంబ గణపతిని భక్తిశ్రద్ధలతో ఆరాధించేవారికి ఆపదలుండవు.

ఓం గం గణపతయే నమః


।। ॐ गं गणपतये नमः ।।
!! Om gam ganapataye namaha !!

Ψ  Heramba Ganapati is 11th among the 32 forms of Lord Ganesha. Among all, the Heramba Ganapathi is very rare form “protector of the weak”. In this form Lord Ganesh appears with five heads and ten hands. The main right hand posture Abhya Mudra bestows blessing to all the devotees and main left hand grants wishes. On the other hands holds a noose, japa beads mala (Rudrashaka), a battle axe, a battle hammer, his broken tusk as a weapon, garland, a fruit and his favorite sweet Modaka. The complexion is white in color and rides on the Vahana (Vehicle) “the king of the beasts”, the mighty Lion.

Ψ  Ardra nakshatra is related to Heramba Ganapati. Worshipping this form is believed to give confidence to the weak and knowledge to achieve their tasks. Praying to lord everyday will help devotees overcome fear.

Ψ  Temples dedicated to Heramba Ganapati :

Ψ  It is very rare to find an exclusive temple for Heramba Ganapati Temple, this form is worshipped in Kasi Vishwanath Temple in Banaras, Uttar Pradesh. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures.

Ψ  Heramba Ganapati mantra Ψ

Abhaya Varadahastah Paashadantakshamala
Srini Parashu Dadhaano Mudgaram Modakam Cha!
Phalamadhi Gatasimhah Panchamaatanga Vakthrah
Ganapatiratigaurah Paatu Herambanamaa!!

।। ॐ गं गणपतये नमः ।।
!! Om gam ganapataye namaha !!

Eco vinayaka

Monday 1 April 2013

పరమేశ్వరుని సేవ



ఓం నమః శివాయ

|| తన్మే మనః శివ సంకల్పమస్తు ||

'లింగ్యతే జ్ఞాయతే అనేన ఇతి లింగం'. లింగం అంటే చిహ్నం, గుర్తు, ప్రతిరూపం అని అర్దం.

మనకు లింగార్చనలో వివిధ రకాల లింగాలున్నాయి. వాటిలో రెండూ స్థావర లింగం, జంగం లింగం. స్థావరములంటే కదలనివి, చెట్లు, లతతలు తీగలు వంటివి. ఇవి కూడా శివలింగానికి ప్రతిరూపాలు.

జంగమాలంటే కదిలేవి. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, చీమలు మొదలైనవి.

అలాగే ప్రతి మనిషి కూడా 7 చక్రాలు కలిగి ఉన్న ఓక శివలింగం. ఆత్మశక్తి కూడా లింగాకారంలో ఉంటుంది.

ఇవన్నీ శివ లింగాలు అంటే శివుడు ప్రతిరూపాలు.

శివం అంటే శుభం, ప్రాణం, ఆత్మ. రుద్ర నమక-చమకాలు ఈ సమస్త బ్రహ్మాండమంతా శివుడే అని, సర్వం శివ మయం జగత్ అని వర్ణిస్తోంది.

స్వయంగా శివమహాపురాణంలో పరమశివుడే చెప్పాడు, చెట్లు, లతలు, మొక్కలు స్థావరలింగాలు కనుక వాటికి నిత్యం నీరు పెడితే అది తన అర్చనగా భావిస్తానన్నాడు. జంతువులు, పక్షులు, క్రిమికీటకములకు నిత్యం ఆహారం, నీరు అందిచడం కూడా తనకు చేసే ఆరాధనగా స్వీకరిస్తానని చెప్తాడు.

ఈ వేసవి కాలంలో ఆహారం, నీరు లేక అనేక జంతువులు, పక్షులు మరణిస్తుంటాయి. చెట్లు ఎండిపోతుంటాయి. కనీసం మన ఇంటి చుట్టు ఉండే చెట్లకు నీరు పోయండి.  పక్షుల కోసం మీ ఇంటి ముందు గోడల మీద, ఇంటి పైకప్పు మీద మట్టిముంతలో ప్రతి రోజు శుభ్రమైన త్రాగు నీరు పెట్టండి. కుక్క కాలభైరవుడికి ప్రతీక. శివగణాల్లో ఒకటి. వీధిలో ఏ దిక్కులేని కుక్కలకు వీలైతే ఆహారం పెట్టండి. కనీసం నీరైన అందుబాటులో ఉంచండి.

అనేక మంది వేసవికి దాహంతో అల్లాడిపోతారు. వీలైతే చలిచేంద్రాలు ఏర్పాటు చేసి, వారి దాహం తీర్చండి. ప్రచారం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కాదు, పరమేశ్వరుని సేవకు ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రతి ఒక్కరిలోనున్న పరమశివుడు, అవి తనకు సమర్పించినవిగా, వాటిని పరమ సంతోషంగా స్వీకరిస్తాడు. తప్పక అనుగ్రహిస్తాడు.

పరమాత్ముడు ఈ సమస్త సృష్టిలో ప్రతి అణువులో ఉన్నాడు. మనం మన తోటి జీవుల జీవనం కోసం చేసే ప్రతి చిన్న సహాయాన్ని ఆయన అర్చనగా భావిస్తాడు. శివతత్వాన్ని అర్దం చేసుకోండి. పరమేశ్వరుడి సృష్టిని గౌరవించండి.

సర్వజీవుల యందున్న పరమేశ్వరుడిని గుర్తించి ఆరాధించండి.

|| తన్మే మనః శివ సంకల్పమస్తు ||

ఓం నమః శివాయ

Shiva temple in Agar Malwa, Madhya Pradesh

ॐ om nama shivaya ॐ 

The British ruled India for hundreds of years, and built many churches and cathedrals. But in the 1880s, a Shiva temple in Agar Malwa, Madhya Pradesh, was rebuilt by Lt. Col. Martin — the only temple ever made by an Englishman in India.

Col. Martin was in the Afghan wars. He used to regularly write to his wife, informing her of conditions there. It was a long war, and gradually the colonel’s letters stopped. Mrs. Martin, who then lived in the cantonment of Agar Malwa, was besides herself with grief, fearing the worst.

She would spend time riding for hours to calm herself. One day she rode her horse, past the temple of Baijnath Mahadev. It was in a decrepit state. It was the time of arti, and the sound of conches and the chanting of mantras compelled her to stop. She went inside to see the worship of Lord Shiva taking place. The priests saw the grief on her face and asked her what was wrong. Mrs. Martin narrated her sad story. The Brahmins told her that Lord Shiva listens to sincere prayers of all devotees and saves them from difficult situations. She was advised by one of the priests to start chanting the mantra: “Om Namah Shivaya” for 11 days. The Englishwoman prayed to Lord Shiva for the colonel’s safe return, promising she would rebuild the temple if he came home safe from the war. On the 10th day, a messenger arrived from Afghanistan with a letter from her husband. It read, “I was regularly sending you letters from the battlefield but then suddenly the Pathans surrounded us. I thought there was no way of escape. Suddenly I saw an Indian yogi with long hair, wearing a tiger skin carrying a trident. He had an awe-inspiring personality and he started wielding his weapon against the Afghans who ran away from the field in fright. With his grace what was certain death our bad times turned into victory. Then the great yogi told me that I should not worry and that he had come to rescue me because he was very pleased with my wife’s prayers.”

Tears of joy and gratitude welled up in Mrs. Martin’s eyes as she read the letter. Her heart was overwhelmed. She fell at the feet of Lord Shiva’s image and sobbed. After a few weeks Lt. Col. Martin returned and his wife told him her story. The couple became devotees of Lord Shiva. In 1883, they donated Rs 15,000 to renovate the temple. This information is engraved on a slab kept in the Baijnath Mahadev Temple.

The Martins sailed for England with the firm resolution that they would make a Shiva temple at their home and pray to him till the end of life. And they did.

ॐ om nama shivaya ॐ