సరస్వతి నాగరికత(Sarawati Civilization) : అసలైన భారత చరిత్రకు సాక్ష్యం-(3)
సరస్వతి నది ఎక్కడ ఉద్భవించింది?
సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పుంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రబహించి అరేబియా సముద్రంలో కలిసేది(గంగ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల(హిమాలయాల) నుంచి కొండల ప్రాంతంగుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం అని చెప్పబడింది.
యమున, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతదృ(సట్లెజ్/Sutlej), హక్రా, ఘగ్ఘర్ మొదలైన నదులు హిమాలయల్లో జన్మించి, కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేవి. పూరాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.
యమున, శతదృ నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతి నదీ ప్రవాహానికి అత్యధికంగా యమున, శతదృ(సట్లెజ్) నదులు నీరు అందించేవి. ఋగ్‌వేదంలో [10.75.5] సూక్తంలో భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ దిశవరకు ప్రవహించే నదులు ప్రస్తావన ఉన్నది.
అందులో సరస్వతి, శతదృ, విపస(బీస్/beas), వితస(జేలం/jhelum), పరుషిని(రవి/ravi), అస్కిని(చీనబ్/cheenab), యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన నదులు ఉన్నాయి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతీ, ద్రిషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి.
To be Continued.................

No comments:
Post a Comment