Monday 30 October 2023

శ్రీదత్త పురాణము (302

 


శ్రీ దత్తాత్రేయ ఆపదోద్ధారక స్తోత్రం


1. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ 

శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ 

భావ గ్రాహ్య క్లేశ హారిన్ సుకీర్తే 

ఘోరాత్కష్టా దుద్ధరస్మాన్నమస్తే


2. త్వంనో మాతా త్వం పితాస్తోధిపస్త్వం 

త్రాతా యోగక్షేమ కృత్ సద్గురుస్త్వం 

త్వం సర్వస్వంనో ప్రభో విశ్వమూర్తే 

ఘోరాత్కృష్టా దుద్దరాస్మాన్నమస్తే


3. పాపం తాపం వ్యాధిమాధించ దైన్యం 

భీతిం క్లేశం త్వరహరాశుత్వ దన్యం 

త్రాతారంనో వీక్ష ఈ శాస్త జూర్తే 

ఘోరాత్కృష్ణా దుద్దరాస్మాన్నమస్తే


4. నాన్య స్త్రాతా నాపిదాతా నభర్తా 

త్వత్తో దేవత్వం శరణ్యేకహర్తా 

కుర్వా త్రేయానుగ్రహం పూర్ణరాతే 

ఘోరాత్కృష్ణా దుద్దరాస్మాన్నమస్తే


5. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం 

సత్సంగాప్తిం దేహభుక్తించ ముక్తిం 

భావాసక్తిం చాఖిలానందమూర్తే 

ఘోరాత్కృష్ణా దుద్దరాస్మాన్నుమస్తే


6. శ్లోకపంచక మేతద్యోలోక మంగళ వర్ధనం 

ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీ దత్త ప్రియోభవేత్


Sunday 29 October 2023

శ్రీదత్త పురాణము (301)

 


శ్రీ దత్తస్తోత్రం (భృగుమహర్షి విరచితం)


1. దిగంబరం భస్మవిలేపి తాంగం చక్రం త్రిశూలం డమరుంగదాంచ 

పద్మాసనస్థం శశిసూర్య నేత్రం దత్తాత్రేయం ధ్యేయ మభీష్టసిద్ధిదమ్


2. ఓం నమో శ్రీగురుం దత్తం దత్తదేవం జగద్గురుం 

నిష్కలం నిర్గుణం వందే దత్తాత్రేయం నమామ్యహం


3. బ్రహ్మలోకేశ భూతేశం శంఖచక్ర గదాధరం 

పాణిపాత్ర ధరం దేవం దత్తాత్రేయం నమామ్యహం


4. నిర్మల నీలవర్ణంచ సుందరం శ్యామ శోభితం 

సులోచనం విశాలాక్షం దత్తాత్రేయం నమామ్యహం.


5. సురేశవందితం దేవం త్రైలోకైక వందితం 

హరిహరాత్మకం వందే దత్తాత్రేయం నమామ్యహం


6. త్రిశూలం డమరుం మాలాం జటాముకుట మండితం 

మండితం కుండలం కర్లే దత్తాత్రేయం నమామ్యహం


7. విభూతి భూషితం దేవం హారకేయూర శోభితం 

అనంత ప్రణవాకారం దత్తాత్రేయం నమామ్యహం


8. ప్రసన్నవదనం దేవం భుక్తి ముక్తి ప్రదాయకం 

జనార్ధనం జగత్ప్రణం దత్తాత్రేయం నమామ్యహం.


9. రాజరాజం మితాచారం కార్త వీర్య వరప్రదం 

సుభద్రం భద్రకళ్యాణం దత్తాత్రేయం నమామ్యహం


10. అనసూయా ప్రియకరం అత్రిపుత్రం సురేశ్వరం 

విఖ్యాత యోగినాం మోక్షం దత్తాత్రేయం నమామ్యహం


11. దిగంబరం సురశ్రేష్టం బ్రహ్మచర్య వ్రతేస్థితమ్ 

హంస హంసాత్మకం నిత్యం దత్తాత్రేయం నమామ్యహం


12. కథా యోగీ కథా భోగీ బాలలీలా వినోదకః 

దశనై రత్న సంకాశః దత్తాత్రేయం నమామ్యహం


13. భూతబాధా భవత్రాసో గ్రహపీడా తధైవచ 

దరిద్ర వ్యసన ధ్వంసీ దత్తాత్రేయం నమామ్యహం


14. రక్తోత్పల దళం పాదం సర్వతీర్థ సముద్భవమ్ 

వందితం యోగిభి సర్వై దత్తాత్రేయం నమామ్యహం


15. చతుర్దశాయాం బుధవారే జన్మమార్గశిరే శుభే 

తారకం విపులం వందే దత్తాత్రేయం నమామ్యహం


16. జ్ఞానదాతా ప్రభుస్సాక్షాత్ గతిర్మోక్షపరాయినే 

ఆత్మాభూరీశ్వరః కృష్ణః దత్తాత్రేయం నమామ్యహం


17. భృగువిరచిత మిదం స్తోత్రం దత్తపారాయణాన్వితం 

సాక్షాద్యత్స్వయం బ్రహ్మా దత్తాత్రేయం నమామ్యహం


18. ప్రాణినాం సర్వజం తూకాం కర్మ పాశ ప్రభంజనం 

దత్తాత్రేయ స్తుతి స్తోత్రం సర్వాన్కామా నవాప్నుయాత్,


Saturday 28 October 2023

శ్రీదత్త పురాణము (300)

 


నారదవిరచితం దత్తాత్రేయ స్తోత్రం


జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం | 

సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || 


జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే | 

భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ || 


జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ | 

దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ || 


కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ | 

వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ || 


హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత | 

పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ || 


యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ | 

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ || 


ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః | 

మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ || 


భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే | 

జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ || 


దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ | 

సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ || 


జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే | 

జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ || 


భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే | 

నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ || 


బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే | 

ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ || 


అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే | 

విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ || 


సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ | 

సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ || 


శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర | 

యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ || 


క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ | 

దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ || 


దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే | 

గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ || 


శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ | 

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ || 


ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ | 

దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ || 


ఇతి నారదపురాణే నారదవిరచితం దత్తాత్రేయ స్తోత్రం


Friday 27 October 2023

శ్రీదత్త పురాణము (299)

 


శ్రీ దత్త స్తవం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం | 

ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || ౧


భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి,  తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.



దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం | 

సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || ౨ ||


దీనుల,ఆర్తుల బంధువు, కరుణా సముద్రుడు, అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం | 

నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || ౩ ||


శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం,సర్వ వ్యప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు అయితలచిన వెంటనే   ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం | 

సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || ౪ ||


అన్ని అనర్దాలు  తొలగించేవాడు, శుభములు ప్రసాదించేవాడు, కష్టాలు తొలగించి, ఐహిక సుఖాల కోసం ఉపాసన చేసినా,పారమార్ధిక ఫలం ప్రసాదించి తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం | 

భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || ౫ ||


పరబ్రహ్మ మూర్తి, ధర్మమే తన తత్త్వంగా గలవాడు, భక్తులకు కీర్తిని కలిగించే స్వామి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః | 

తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || ౬ ||


పాపములనే బురదలో ముఇగి పోయిన వారికి జ్ఞానమనే తేజస్సుతో సన్మార్గం చూపేవాడు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక తాపాలు తొలగించేవాడు, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం | 

విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || ౭ ||


సర్వ రోగములను నివారించి, సర్వ పీడలు నివారించి, ఆపదల నుంచి ఉద్ధరించే స్వామి, తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం | 

నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు || ౮ ||


సంసార బంధం నుంచి రక్షించి,జన్మ పరంపరలను హరించి, మానవ జీవిత అంతిమలక్ష్యఒను అనుగ్రహించి , తలచిన వెంటనే ప్రత్యక్షం మయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.


జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవం | 

భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||౯ ||


శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత దత్తాత్రేయ స్తవం పారాయణం చేసినవారికి జయం, లాభము, సంపద, కోరికలు, భోగములు, మోక్షము, దత్తాత్రేయకృపతో శీఘ్రంగా లభిస్తాయి.


Thursday 26 October 2023

శ్రీదత్త పురాణము (298)

 



శ్రీ దత్తాత్రేయ సర్వారిష్ట నివారణ స్తోత్రం


1. భూతప్రేత పిశాచాద్యా యశ్య స్మరణ మాత్రతః 

దూరాదేవ పలాయంతే దత్తాత్రేయం మామితం


2. యన్నామస్మరణాత్ దైన్య పాపం తానంచే నశ్యతి

భీతిగ్రహార్తి దుస్వప్నం దత్తాత్రేయం నమామితం 


3. దదృస్పోటక కుష్టాది మహామారీ విఘాచికా 

నశ్యంత్యనేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామితం


4. సంగజా దేశకాలోఽద్ధాపి సాంక్రమికాగదాః 

శామ్యంతి యస్మరణతో దత్తాత్రేయం నమామితం


5. సర్సవృశ్చిక దష్టానాం విషాదానాం శరీరిణాం

యన్నామ శాంతిదం శ్రీఘ్రం దత్తాత్రేయం నమామితం 


6. త్రివిధోత్పాతశమనం త్రివిధారిష్ట నాశనం

యనామ క్రూర భీతిష్యుం దత్తాత్రేయం నమామితం 


7. వైర్యాది కృతమంత్రాది ప్రయోగాః యశ్య కీర్తనాత్

నశ్యంతి దేవ బాధాశ్చ దత్తాత్రేయం నమామితం. 


8. యచ్చిష్య స్మరణాత్ సద్యోగత నష్టాది లభ్యతే

య ఈశ సర్వతస్రాతా దత్తాత్రేయం నమామితం


9. జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యస్తవమ్ 

భోగ మోక్షప్రద స్యేదం పఠేత్ దత్త ప్రియోభవేత్


Wednesday 25 October 2023

శ్రీదత్త పురాణము (297)

 


శ్రీ దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం 


1) మూలాధారే వారిజపత్రేస చతుష్కే |

వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |

రక్తం వర్ణం శ్రీగణనాథం భగవతం దత్తాత్రేయం|

శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


2) స్వాధిష్ఠానే షడ్దలచక్రే తనులింగే|

బాలాంతావత్ వర్ణవిశాలైః సువిశాలైః |

పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


3) నాభౌస్థానే పత్రదశాబ్దే డ ఫ వర్ణే|

నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాద్యమ్ |

లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరమ్ |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


4) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠ వర్ణే |

శంభో శేషం జీవవిశేషం స్మరయం తమ్ |

సృష్టిస్థిత్యంతం కుర్వంతం శివశక్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||*


5) కంఠస్థానే పత్ర విశుద్ధే కమలాంతే |

చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే |

మాయాధీశం జీవవిశేషం నిజమూర్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


6) ఆజ్ఞాచక్రే భృకుటి స్థానే ద్విదలాంతే |

హం క్షం బీజం జ్ఞానమయం తం గురుమూర్తిం |

విద్యుద్వర్ణం నందమయం తం నిటిలాక్షం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


7) నిత్యానందం బ్రహ్మముకుందం భగవంతం |

బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవ రూపం |

బ్రహ్మా పర్ణం నందమయం తం గురుమూర్తిం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


8) శాంతాకారే శేషశయానం సురవంద్యం |

కాంతానాథం కోమలగాత్రం కమలాక్షమ్ |

చింత్యారత్నం చిద్ఘనరూపం ద్విజరాజం |

దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అజపాజప స్తోత్రం సంపూర్ణమ్ ||


Tuesday 24 October 2023

శ్రీదత్త పురాణము (296)

 


శ్రీ దత్తాత్రేయ శరణాష్టకం


1. దత్తాత్రేయ తవ శరణం దత్తనాథ తవ శరణం 

త్రిగుణాత్మక త్రిగుణాతీత త్రిభువనపాలక తవ శరణం


2. శాశ్వతమూర్తే తన శరణం శ్యామసుందరా తవ శరణం 

శేషాభరణా శేషభూషణా శేషసాయి గురు తవ శరణం


3. షడ్భుజమూర్తే తవ శరణం షడ్భుజ యతివర తవశరణం

దండ కమండల పద్మాకర శంఖచక్రధర తవ శరణం


4. కరుణానిధే తవ శరణం కరుణాసాగరా తవ శరణం 

శ్రీపాద శ్రీవల్లభ గురువర నరసింహ సరస్వతిం తవ శరణం


5. శ్రీగురునాధా తవ శరణం సద్గురునాధా తవ శరణం 

కృష్ణాసంగమ తరుతలవాసి భక్తవత్సలా తవ శరణం 


6. కృపామూర్తి తవ శరణం కృపాసాగరా తవ శరణం

కృపాకటాక్ష కృపావలోకన కృపానిధే ప్రభు తవ శరణం


7. కాలాంతక తవ శరణం కాలనాశక తవ శరణం

పూర్ణానంద పూర్ణపరేశా పురాణపురుషా తవ శరణం| 


8. జగధీశా తవ శరణం జగన్నాధా తవ శరణం 

జగత్పాలక జగధీశా జగదోద్ధారకా తవ శరణం



9. అఖిలాండకా తవ శరణం అఖిలైశర్వ్యా తవ శరణం

భక్తప్రియా వజ్రపంజరా ప్రసన్నవక్త్రా తవ శరణం


10. దిగంబరా తవ శరణం దీనదయాఘన తవ శరణం 

దీననాధా దీనదయాళో దీనోద్ధార తన శరణం 


11. తపోమూర్తే తవ శరణం తేజోరాశీ తవ శరణం 

బ్రహ్మానంద బ్రహ్మసనాతన బ్రహ్మమోహనా తవ శరణం


12. విశ్వాత్మకా తవ శరణం విశ్వరక్షకా తవ శరణం 

విశ్వంభర విశ్వజీవనా విశ్వపరాత్పరా తన శరణం


13. విఘ్నాంతకా తవ శరణం విఘ్నవాశకాతవ శరణం 

ప్రభావాతీతా ప్రేమవర్దనా ప్రకాశమూర్తి తన శరణం


14. నిజానంద తవ శరణం నిజపదదాయకా తవ శరణం

నిత్య నిరంజన నిరాకార నిరాధారా తవ శరణం


15. చిద్ఘనమూర్తి తవ శరణం చిదాకారా తవ శరణం

చిదాత్మరూప చిదానంద చిత్సుభకందా తవ శరణం


16. అనాదిమూర్తే తవ శరనం అఖిలావతారా తవ శరణం

అనంతకోటి బ్రహ్మాండనాయకా తవ శరణం  


17. భక్తోద్ధారా తవ శరణం భక్తరక్షకా తవ శరణం

భక్తానుగ్రహ భక్తప్రియా పతితోద్ధారా తవ శరణం  


Monday 23 October 2023

శ్రీదత్త పురాణము (295)

 

దత్తాత్రేయ స్తుతి


1. భవపాశ వినాశన యోగిపతే 

కమలాయతలోచన ధీరమతే 

వరసాధక పోషక వేదనిధే 

పరిపాలయ సద్గురు దత్తవిభో ॥


2. హృదయే దయయా వదనే సుధయా 

కురుమాం త్వయి భావనయా విషయం 

శరణాగత రక్షణ దత్తగురో 

పరిపాలయ మాం కరుణాజలధే॥


3. గురుదత్త సదాత్సరమన్యమహం 

నభజే నభజే నభజే నభజే 

గురుదత్తపదే మమ భావఝరీ 

పరినృత్యతి చిల్లహరీ సుకరీ॥


4. గురుదత్తవిభో గురుదత్తవిభో

పరిపాలయమాం పరిపాలయమాం 

హరి దత్తగురో హర దత్తగురో 

పరిపాలయమాం పరిపాలయమాం॥


5. భజే దత్తదేవం భజే దత్తదేవం 

ఉమానాధభావం రమానాధహావం 

భజే దత్తదేవం భజే దత్తదేవం 

గురుం దత్తదేవం భజే దేవదేవం॥


6. కృతాన్ దోషాన్ మయాసర్వాన్ స్వచిత్తవశవర్తినీ 

క్షమస్వ త్వం క్షమస్వ త్వం క్షమాభరణభూషిత॥


Sunday 22 October 2023

శ్రీదత్త పురాణము (294)

 


దత్త ప్రపత్తి


1. గౌరాంగీం శరదిందు సుందరముఖీం శీతాంశు కాంపీవరాం 

దత్తాత్రేయ ముఖత్రయాంబుజ మధూత్కేలన్మహేందిరాం 

ప్రోత్తుంగ స్తనమండల ప్రవిలసజ్జాంబూన దైవకావలీం 

ప్రేమానంతగుణోజ్వలాం మధుమతీం వందే జగన్మాతరం ||


2. వేదాంత సూత్ర హృదయాంకిత లోలలీలౌ 

భక్తాభయప్రదచరణో వరయోగ సూర్యౌ 

ప్రజ్ఞానచింతనపఠే ప్రణవ స్వరూపా 

శ్రీదత్తనాథ చరణౌ శరణం ప్రపద్యే ॥


3. దీనార్త రక్షణచరణా కరుణారసార్ద్రౌ 

గాణాపురాంతర మహీమహిమా వహంతా 

దీప్తి, సురేంద్రముని ముఖ్య శిరస్సు తృప్తౌ 

శ్రీదత్తనాథ చరణం శరణం ప్రపద్యే ||


4. నీలోత్పలోపరితలౌ సువిశాల దీర్ఘౌ

రక్తాంగుళీ నఖ ముఖోజ్వల భాసమానౌ 

కైవల్య దామఫలదౌ సకలాఘనాశా 

శ్రీ దత్తనాథ చరణం శరణం ప్రపద్యే॥


5. దత్తే త్రివర్ణయుగ రూపక భాసమానౌ 

ద్వంద్వప్రభావ రహితా గురతత్వనత్త్వౌ 

స్వర్గాపవర్గఫలదౌ నిజబోధరూపా 

శ్రీదత్తనాథ చరణం శరణం ప్రపద్యే ॥


Saturday 21 October 2023

శ్రీదత్త పురాణము (293)

 


శ్రీ దత్తాత్రేయ మంగళాశాసనం


1. అవధూతాయ పూతాయ ధూతానేకాఘలోకినే 

స్వాత్మానంద వినోదాయ దత్తాత్రేయాయ మంగళం ||


2. యోగానంద విలాసాయ యోగమాయాధరాయచ। 

యోగిరాజాధి రాజాయ దత్తాత్రేయాయ మంగళం ॥


3. అత్రిమౌనీశ పుణ్యశ్రీ కోశాగారస్వరూపిణే| 

అత్రివరదరూపాయ దత్తాత్రేయాయ మంగళం ॥


4. చంద్రానంత సుశీతాయ కాలాగ్ని శమనాయచ। 

భక్తారిష్ట వినాశాయ దత్తాత్రేయాయ మంగళమ్ ||


5. పూర్ణబ్రహ్మావతారాయ లీలావిశ్వంభరాయచ 

సూర్యచంద్రాగ్ని రూపాయ దత్తాత్రేయాయ మంగళం||


6. సర్వసిద్ధిఫలోపేత బ్రహ్మమూల కుజాయచ

సిద్ధరాజాధిరాజాయ దత్తాత్రేయాయ మంగళం ॥ 


7. అజ్ఞానాందమన్నానాం జ్ఞానదీపాయచాత్మనే |

సత్యప్రబోధ రూపాయ దత్తాత్రేయాయ మంగళం ॥ 


8. స్వమాయాగుణ గుప్తాయ మాయాముక్తాయ ముక్తయే॥ 

పరశురామనాధాయ దత్తాత్రేయాయ మంగళం ॥


9. ఆదినాధాయనాధాయ గురూణాం చక్రవర్తినే।

బోధరూపాయ వేద్యాయ దత్తాత్రేయాయ మంగళం 


10.దేవదావాయ దివ్యాయ శివరూపాయ యోగినే

దుఃఖనాశాయ శ్యామాయ దత్తాత్రేయాయ మంగళం ॥


11. యదు ప్రహ్లాద ధ్యానాం జ్ఞానోపదేష్టమూర్తినః |

దిగంబరాయ పూజ్యాయ దత్తాత్రేయాయ మంగళం ||


12. సంవర్త కార్తవీరేభ్యో విద్యాదాత్రే చిదాత్మనే |

సద్గురు సార్వభౌమాయ దత్తాత్రేయాయ మంగళం ॥


13. శ్రీపాద శ్రీవల్లభాచార్య నరసింహ సరస్వతీ! 

మాణిక్యప్రభురూపాయ దత్తాత్రేయాయ మంగళం||


14. శ్రీవాసుదేవ మౌనీంద్ర శ్రీధరస్వామిభి స్పదా |

ఆత్మన్యారధ్య దేవాయ దత్తాత్రేయాయ మంగళం ॥


Friday 20 October 2023

శ్రీదత్త పురాణము (292)

 


తరువాత దత్తాత్రేయుని ధ్యానించి :


శ్లో॥ దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయమయ మహాపద్మ యంత్రాధిరూడం 

శంఖం చక్రం త్రిశూలం డమరుక కలశావక్షమాలా త్త ముద్రాం 

షడ్భిర్డోద దానం స్ఫటికమణినిభం షట్జటాబంధమౌళిం 

సర్వాలంకారయుక్తం భజిత మధుమతే మోక్షలక్ష్మీసమేతం  


ధ్యానము తరువాత దత్తగాయత్రిని కనీసము 10 సారులు జపించవలెను.


దత్తగాయత్రి: దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి ! 

తన్నో గురుః ప్రచోదయాత్ ||


దత్త గాయత్రిని జపించిన తరువాత "హంస" స్వరూపునిగ దత్తదేవుని ధ్యానించవలెను.


దత్తాత్రేయ సుప్రభాతము


1. నీవు సర్వేశ్వరుడవు నీవు సిద్ధ 

పురుషుడవు, నీవు త్రిజగతి పోషకుడవు 

జ్ఞానదీప్తుల మోహంబు సడలజేయు 

యోగనిద్రను విడుపుము జగము బ్రోవ


2. యోగి పుంగవులకు నిద్ర యుండ దేవుడు 

యోగవిదుడవు యోగీశ్వరేశ్వరుడవు 

జ్ఞానదీప్తుల మోహంబు సడల జేయు 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ,


3. నిద్రగాదది చిన్మయముద్రగాని 

లయము విక్షేపమును మనో గ్లాని పరమ 

యోగసిద్ధుండవయిన నీ కుండునయ్య 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


4. ధర్మమార్గము చెడకుండ తత్ జ్ఞాలకును 

బాధ లేకుండ, దౌష్ట్యమే పారకుండ 

మూడులోకాల నీవు కాపాడవలదె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ,


5. తుంబురుడు కళావతి నారదుండు మహతి 

వాణి కచ్చపి బృహతి విశ్వాసనుండు 

పట్టుకొని గీతి విన్పింప వచ్చినారు

యోగనిద్రను విడుపుము జగము బ్రోవ.


6. నలుమొగంబుల స్వామికి తొలిచదువులు 

విస్మృతిపథాన పడెనట విన్నవించు 

కొనగ నరుగుదెంచి యరుగుపై గూరుచుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


7. పరులు తమ్మంటకుండెడు కొఱకు నాల్గు 

వేదములు శ్వాసరూపముల్ వెలుగుచుండ 

మోరలెత్తి నీ నలెసల్ చేరియుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


8. ఫలములను పత్రముల, నవ పల్లవముల 

సుమముల సమిత్కుశాది వస్తువుల గొంచు 

నందనవన దేవత వచ్చినది మహాత్మ 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


9. హోమకృత్యంబు నీవు చేయుదు పటంచు 

వలయు పరికరముల తోడవహ్ని వచ్చి 

వేచియున్నాడు స్వామి నివేళ్ళమందు 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


10. వరుణదేవు, కుదకపాత్ర పట్టె రత్న 

పాదుకాయుగమును స్వర్గపతి ధరించె 

తెరువుసూప కుబేరు డేతెంచియుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


11. ప్రాగ్దిశాంగన కాషాయవస్త్ర మొండు 

శ్వేతచీనాంశుకం బొండు చేత బట్టి 

వలసినది నీ కొసంగగా నిలచియుండె 

యోగనిద్రము విడువుము జగము బ్రోవ.


12. వసుమతీజములన్ వనస్పతులు మిన్న 

అందు నౌదుంబరమ్ము నీ కభిమతంబు 

దానికడ వేచియుండెను తాపసాళి 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


13. ఓ మహాత్మ! వేదాంత! ఓ స్వామి దత్త 

అనుపమ శ్రీదయాంతరంగ 

అత్రివాచం యమీంద్ర భాగ్యముల పంట 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


14. యోగిరాజ మహాదేవ ప్రత్యూష స్సంప్రవర్తతే 

ఉత్తిష్ఠ యోగ యోగీశ భక్తానామభయం కురు.


15. ఉత్తిష్టోత్తిష్ఠ దత్తేశ ఉత్తిష్ఠ కరుణాకర 

ఉత్తిష్ఠ గురుదత్తాత్మన్ త్రైలోక్యం మంగళం కురు.


16. ఉత్తిష్ఠ సిద్ధి సమలంకృతపాదపద్మ 

ఉత్తిష్ఠ భక్తహృదయాంబుజ రాజహంస 

ఉత్తిష్ఠ బ్రహ్మవివాదా ప్రతిభా ప్రమోద 

ఏహ్యేహి దత్తహృదయే కురు సుప్రభాతమ్ ॥


¬17. మహ్యం ప్రదేహి తపసా పరచిత్తశుద్ధిం 

మహ్యం ప్రదేహి మనసా పరయోగసిద్ధిం 

మహ్యం ప్రదేహి త్రిపురాపరభావశుద్ధం 

ఏహ్యేహి దత్త హృదయే కురు సుప్రభాతం॥


Thursday 19 October 2023

శ్రీదత్త పురాణము (291)

 


కుండలినీ జాగరణము


ఇది మనలోనున్న ప్రాణశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములను, మనోబుద్ధులను, శరీరమందలి ప్రతి అణువును సజీవముగ నుంచునదీశక్తియె.


పెదిమలు కదుపకుండ ఓంకారనాదమును మూలాధారమునుండి వెన్ను పూసల మధ్యగా వ్యాపించియున్న సుషుమ్నానాడి ద్వారా శిరస్సు వరకు ప్రసరింపజేయుము. 10 సారులు చేయుసరికి ప్రాణశక్తి ఇంద్రియములను విడిచి సుషుమ్నా మార్గమును చేరును. శ్వాసక్రియ హృదయ స్పందనము అతి నెమ్మదిగా జరుగును. కుండలినీ శక్తిని ఈ విధముగా ధ్యానించవలెను.


"ఉత్తిష్ఠ హే జగన్మాతా ! సర్వమంగళ దేవతే 

భక్తహృన్మందిరోపేతే ! సర్వసిద్ధి ప్రదాన్వితే ! 

ఐం నమః ! శ్రీమహాకాళ్వై ! మహాశకై నమోనమః 

మూలధారస్థితాయై శ్రీ కుండలీశ క్తయేనమః 

ఆరోహయ మహాకాళీ మమ మాతర్మహేశ్వరీ 

మూలాధారస్థితే చక్రే ఉపవిశ్య సుఖాసనే 

మయా దత్తమిమాం పూజాం గృహాణ పరమేశ్వరీ 

దుర్వాసన సమూహాంశ్చ భస్మీకురు కృపామతే! 

సుషుమ్నానాడి మధ్యస్తే స్వాధిష్ఠానాఖ్య వారిజే

ఆసీనాభవ మే మాతా సర్వాలంకార శోభితే 

త్వత్పాదాంభోరుహ ద్వంద్వే మేస్తు భక్తిరహైతుకం

దేహిమే దృఢవైరాగ్యం ఆద్వైతావలోకనం! 

శనైశ్శనై రుపరిమేగత్వా మణిపూరక వారిజే 

నాభిస్థాన పురం సంస్థం సుందరం సువిరాజితం 

తత్ర స్థిత్వా సుప్రసన్నా వరదాభవ శాంకరీ 

దూరీకురు ప్రమాదంచ శోక మోహభయానిచ 

అనాహతాజ్ఞ నిలయే యత్తిష్ఠిత్వా హరప్రియే   

ఛిందిసర్వాంశ్చ హృద్గ్రాంధిం కర్మబీజాని దాహయన్ 

క్షమస్వమాతర్హి మహాపచారాన్ కృతాన్ వాక్కరణైః సమస్తాన్ 

కృపాకటాక్షాణి ప్రసారయత్వా రక్షస్వమాంత్వచ్చరణం ప్రసన్నం

కంఠదేశ విరజత్స్వా విశుద్ధాహ్వయ పంకజం 

ఉపగమ్యపరాదేవి దేహివుత్రాయ సన్నిధిమ్

ప్రదర్శయ స్వతేజోమే స్వప్రకాశ స్వరూపిణీమ్ 

ప్రతిష్ఠాపయ మేవాచీతవనామ నిరంతరం 

ఆజ్ఞాపత్రే వివరేకమలే ఆరూఢయ జగదంబమదంబా 

ముక్తికవాటం దర్శయ పాలయమాం తవపుత్రమజస్రం 

శుద్ధ సత్వాత్మికే దేవి బ్రహ్మవిద్యాస్వరూపిణి 

ప్రవేశయ కృపాపూర్ణే సమ్యక్ భిక్ ఊర్ధ్వకుండలీం

సుషుమ్నాంత సహస్రారం నిరావరణసంజ్ఞికం  

కోటిసూర్య ప్రకాశంచ సహస్రదళ సంయుతం 

దహరాగ్రే పుండరికే సుఖాసీనా భవేశ్వరి 

ఐక్యమిచ్చామితే మాతా భవత్పాదారవిందయోః 

సాయుజ్యం దేహి పుత్రాయ సారూప్యాతిష్టి తాయచ 

యస్మాత్కరుణయా దేవీ యావన్మే దేహిసంస్థితాః

అహం బ్రహ్మేతి విజ్ఞానమేస్తు నిర్వాణరూపిణి 

జ్ఞ్యాత్వా తమేవాసి జ్ఞానం త్వమేవా 

ద్రష్టాత్వమే వాసి దృశ్యం త్వమేవా 

కర్తానుమంతాచ భోక్తాత్వమేవా 

త్వమేవ నిర్గుణబ్రహ్మ త్వమేవ సగుణేశ్వరీ 

త్వమేవ విశ్వం భువనం త్వమేవాహ నసంశయః 

నాస్తి దేహోన సంసారీ న జీవో నాస్తికర్మణః 

న కర్తాహం న భోక్తాహం నగతి ర్బంధ మోక్షయః 

అహమేవ పరంబ్రహ్మ అహమేవాస్మి జగత్రయం 

అద్వితీయోహ్యనంతోహం పచ్చిదానంద మస్మ్యహం

మంగళం శ్రీమహాకాళీ మహావాణీచ మంగళం

మంగళం శ్రీమహాలక్ష్మీ మంగళం శ్రీశివాత్మికే


పై విధముగా కుండలినీశక్తి సహస్రారకమలమును భావనాపటిమతో చేర్చి అచ్చట స్రవించు చల్లని అమృతధారలతో తృప్తినొందినట్లు భావించి మరల తన స్వస్థానమగు మూలాధారచక్రమునకు నిదానముగా క్రిందికి దిగుచు మార్గములోనున్న చక్రములను, చక్రదేవతలను అచ్చటి ధాతువులను అమృతమయముగా జేసినట్లు భావించి అనుభూతమగు పరమశాంతితో కొద్దికాలము విశ్రమించవలెను.

Wednesday 18 October 2023

శ్రీదత్త పురాణము (290)

 


ప్రాతఃస్మరణము


శిరస్సులో తెల్లని అష్టదళ పద్మమును భావించి దాని కర్ణికపై మణి పీఠము పై చిరు నగవుతో అభయ, వరదహస్తములతో సర్వాలంకారభూషితుడైన దత్తాత్రేయ సద్గురువును (నీ గురువును) జ్యోతి మండలము మధ్యగా నుండు నట్లు భావన చేయుము.


శ్లో॥ ఆనందం, సద్గురుం శాంతం భవ వైద్యం జగద్గురుం 

వేదవేద్య మనిర్వాద్యం దత్తాత్రేయ ముపాస్మహే 

ఆత్రేయం బ్రహ్మరంధ్రస్థం ద్విభుజం గురురూపిణం 

ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మస్వరూపిణం 

పరామాత్మాన మవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహం


అనసూయాత్మజం చంద్రానుజం దుర్వాసోగ్రణం 

నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహం 

మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం 

చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం 

త్రిమూర్తిం త్రిగుణం త్ర్యన్నం త్రిశక్తిం త్రిసర్వ త్రికం 

త్రికోణాంతర్బిందురూపం దతాత్రేయం భజామ్యహం 

కాశీస్నానానంతరం కొల్హాజాపినం మాహురీభుజం 

సహ్యశాయిన మాత్రేయం అవధూతం భజామ్యహం


పై విధముగా దత్తదేవుని స్మరించి ఆ సద్గురుని పాదముల నుండి స్రవించుచున్న అమృతధారలతో శరీరమంతయు తడిసి అమృతమయమైనట్లు భావించవలెను. కొద్ది నిముషములపాటు కలిగిన ఆనందమును శాంతిని అనుభవించవలెను.


Tuesday 17 October 2023

శ్రీదత్త పురాణము (289)

 


గురోః పరతరం నాస్తి సత్యం సత్యం న సంశయః, 

గురోః పాదోదకం పీత్వా గురోర్నామ సదా జపేత్. 51


తేఽపి సన్న్యాసినో జ్ఞేయా ఇతరే వేషధారిణః, 

గంగాద్యాస్సరితః సర్వా గురుపాదంబుజం సదా. 55


గురుస్తవం న జానాతి గురునామ ముఖే న హి, 

పశుతుల్యం విజానీయాత్ సత్య సత్యం మహామునే 56


ఇదం స్తోత్రం మహద్దవ్యం స్తవరాజం మనోహరమ్, 

పఠనాచ్చవణాద్ధ్యానాత్ సర్వాన్ కామాననాప్నుయాత్. 57


ఇతి శ్రీ రుద్రయామళే శుక ఈశ్వర సంవాదే దత్తాత్రేయ స్తవరాజ స్తోత్రమ్


ధ్యానమూలం గురోర్మూర్తి:

పూజామూలం గురో:పదమ్ | 

మంత్రమూలం గురోర్వాక్యం 

మోక్షమూలం గురోః కృపా॥


శాండిల్యోపనిషత్ లో రమ్యమైన దత్తస్తుతి


దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుమ్ 

ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం 

భస్మోద్ధూలిత సర్వాంగం జటాజూటధరం విభుం 

చతుర్బాహు ముదారాంగం ప్రఫుల్ల కమలేక్షణం 

జ్ఞానయోగ విధిం విశ్వగురుం యోగిజనప్రియం 

భక్తాను కంపినం సర్వసాక్షిణం సిద్ధసేవితం 

ఏవమ్యః సతతం ధ్యాయేద్దేవ దేవం సనాతనమ్ 

సముక్త సర్వపాపేభ్యోని శ్రేయసమవాప్నుయాత్


Monday 16 October 2023

శ్రీదత్త పురాణము (288)

 



నిరంజనం నిరాకారం దేవదేవం జనార్ధనమ్, 

మాయాయుక్తం జపేన్నిత్యం పావనం సర్వదేహినామ్. 44


ఆదినాథం సురశ్రేష్ఠం కృష్ణం శ్యామం జగద్గురుమ్, 

సిద్ధరాజం గుణాతీతం రామం రాజీవలోచనమ్. 45


నారాయణం పరంబ్రహ్మ లక్ష్మీకాంతం పరాత్పరమ్, 

అప్రమేయం సురానందం నమో దత్తం దిగంబరమ్.46


యోగిరాజోఽత్రివరద స్సురాధ్యక్షో గుణాంతకః, 

అనసూయాత్మజో దేవో దేవతాగతిదాయకః. 47


గోపనీయః ప్రయత్నేన అయం సురమునీశ్వరై 

సమస్త ఋషిభిస్సర్వైర్భక్త్యా స్తుత్యా మహాత్మభిః. 48


నారదేన సురేంద్రేణ సనకాద్వైర్మహాత్మభిః, 

గౌతమేన చ గర్గేణ వ్యాసేన కపిలేన చ. 49


వాసుదేవేన దక్షిణ అత్రిభార్గవ ముద్గలైః 

వసిష్ఠప్రముఖై స్సర్వైర్గీయతే సర్వమాదరాత్. 50


వినాయకేన రుద్రేణ స్వామినా కార్తికేన చ, 

మార్కండేయేన ధౌమ్యేన కీర్తితం స్తవముత్తమమ్. 51


మరీచ్యాది మునీంద్రశ్చ శుకకర్దమ సత్తమై, 

అంగిరాకృత పౌలస్త్య భృగుకశ్యపజైమినిః. 52


గురోః స్తవ మధీయానో విజయీ సర్వదా భవేత్, 

గురుసాయుజ్యమాప్నోతి గురునామ పఠేద్బుద్జః 53 


Sunday 15 October 2023

శ్రీదత్త పురాణము (287)

 


కన్యాదానాని పుణ్యాని వానప్రస్థస్య పోషణమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 33


వాపీకూపతటాకాని కాననారోహణాని చ, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 34 


అశ్వత్థం తులసీం రాత్రిం సేవతే యో నరస్సదా, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 35 


శివం విష్ణుం గణేశం చ, శక్తిం సూర్యం చ పూజనమ్, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 36


గోహత్యాదిసహస్రాణి బ్రహ్మహత్యాస్తథైవ చ, 

ఏతత్సర్వం హృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 37

స్వర్ణస్తేయం సురాపానం మాతుర్గమన కిల్బిషమ్, 

స్వర్ణస్తేయం సురాపానం మాతుర్గమన కిల్బిషమ్, 

ముచ్యతే సర్వపాపేభ్యో దత్త ఇత్యక్షరద్వయమ్. 38


స్త్రీహత్యాదికృతం పాపం బాలహత్యాస్తథైవ చ, 

ముచ్యతే సర్వపాపేభ్యో దత్త ఇత్యక్షరద్వయమ్. 39


ప్రాయశ్చిత్తం కృతం తేన సర్వపాపప్రణాశనమ్, 

బ్రహ్మత్వం లభతే జ్ఞానం దత్త ఇత్యక్షరద్వయమ్. 40


కలిదోషవినాశార్థం జపేదేకాగ్ర మానసః, 

శ్రీగురుం పరమానందం దత్త ఇత్యక్షరద్వయమ్. 41


దత్తదత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినామ్, 

శ్రద్ధాయుక్తో జపేన్నిత్యం దత్త ఇత్యక్షరద్వయమ్. 42


కేశవం మాధవం విష్ణుం గోవిందం గోపతిం హరిమ్, 

గురూణాం పఠ్యతే విద్యానేతత్సర్వం శుభావహమ్. 43


Saturday 14 October 2023

శ్రీదత్త పురాణము (286)

 


అయోధ్య మధురా కాంచీ రేణుకా సేతుబంధనమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్, 16


ద్వాదశ జ్యోతిర్లింగాని వారాహే పుష్కరే తథా, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 17


జ్వాలాముఖి హింగులా చ సప్రశ్వంగా తథైవ చ 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 18


అహోబిలం త్రిపథగాం గంగా సాగరమేవ చ,

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 19


కరవీరం మహాస్థానం రంగనాథస్తథైవ చ, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 20


శాకంభరీ చ మూకాంబా కార్తిక స్వామి దర్శనమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 21


ఏకాదశీవ్రతం చైవ అష్టాంగం యోగసాధనమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 22


వ్రతం నిష్ఠా తపో దానం సామగానం తథైవ చ 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 23


ముక్తిక్షేత్రం చ కామాక్షీ తులజా సిద్ధదేవతా,

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 24


అవుహోమాదికం దానం మేదిన్యాశ్చి గణో వృషు, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 25


మాఘకార్తికయోస్స్నానం సన్న్యాసం బ్రహ్మచర్యకమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 26


అశ్వమేధసహస్రాణి మాతాపితృప్రపోషణమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 27


అమితం పోషణం పుణ్యముపకారం తథైవ చ 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 28


జగన్నాథం చ గోకర్ణం పాండురంగం తథవై చ 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 29


సర్వదేవనమస్కారః సర్వయజ్ఞః ప్రకీర్తితాః, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 30


షట్ఛాస్త్రాణి పురాణాని అష్టవ్యాకరణాని చ.

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 31


సావిత్రం ప్రణవం జప్త్వా చతుర్వేదాంశపారగా,

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 32


Friday 13 October 2023

శ్రీదత్త పురాణము (285)

 


శ్రీ దత్తస్తవరాజః


శ్రీ శుక ఉవాచ


మహాదేవ! మహాదేవ! దేవదేవ! మహేశ్వర! 

దేవదేవస్తవం దివ్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో 1


దత్తస్య వద మాహాత్మ్యం దేవదేవ! దయానిధే! 

దత్తాత్పరతరం నాస్తి పురా వ్యాసేన కీర్తితమ్.2 


జగద్గురుర్జగన్నాథో గీయతే నారదాదిభిః, 

తత్పర్వం బ్రూహి మే దేవ! కరుణాకర! శంకర! 3


శ్రీ మహాదేవ ఉవాచ


శృణు దివ్యం వ్యాసపుత్రః! గుహ్యాద్దుహ్యతరం మహత్, 

యస్య స్మరణమాత్రేణ ముచ్యతే సర్వబంధనాత్. 4 


దత్తం సనాతనం బ్రహ్మ నిర్వికారం నిరంజనమ్, 

ఆదిదేవం నిరాకారం వ్యక్తం గుణవివర్జితమ్. 5


నామరూపక్రియాతీతం నిస్సంగం దేవవందితమ్, 

నారాయణం శివం శుద్ధం దృశ్యదర్శన వందితమ్. 6 


పరేశం పార్వతీకాంతం రమాధీశం దిగంబరమ్, 

నిర్మలో నిత్యతృప్తాత్మా నిత్యానందో మహేశ్వరః. 7 


బ్రహ్మా విష్ణుశ్శివస్సాక్షాత్ గోవిందో గతిదాయకః,

పీతాంబరధరో దేవో మాధవస్పురసేవితః 8


మృత్యుంజయో మహారుద్రః కార్తవీర్యవరప్రదః, 

ఓమిత్యేకాక్షరం బీజం క్షరాక్షరపదం హరిమ్. 9


గయాకాశీ కురుక్షేత్రం ప్రయాగం బదిరకాశ్రమమ్, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 10


గౌతమీ జాహ్నవీ భీమా గండకీ చ సరస్వతి, 

ఏతత్సర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్, 11


సరయూ తుంగభద్రా చ యమునా జలవాహినీ, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 12


తామ్రపర్ణీ ప్రణీతా చ గోమతీ తాపనాశనీ, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇతయక్షరద్వయమ్. 13


నర్మదా సింధుకావేరీ కృష్ణవేణీ తథైవ చ, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 14


అవంతీ ద్వారకా మాయా మల్లినాథస్య దర్శనమ్, 

ఏతత్పర్వం కృతం తేన దత్త ఇత్యక్షరద్వయమ్. 15


Thursday 12 October 2023

శ్రీదత్త పురాణము (284)

 


బంధూత్తముడు నా బంధువులను పాలించుగాక. శత్రుజిత్తు నా శత్రువుల నుంచి రక్షించుగాక. శంకరుడు నా యిల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలయినవి రక్షించుగాక (17) ప్రకృతి విదుడు నా భార్యను కాపాడుగాక. - శార్ఙ్గభృత్తు నా పశువులు మొదలయిన వాటిని పాలించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక. భాస్కరుడు నా భక్ష్యాదులను కాపాడుగాక. (18) చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు దుఃఖం నుంచి రక్షించుగాక. పశుపతి పశువులను కాపాడుగాక. భూతేశ్వరుడు నా భూతిని (= ఐశ్వర్యాన్ని) పాలించుగాక. (19) విషహరుడు తూర్పువైపున కాపాడాలి. మఖ (= యజ్ఞ) స్వరూపుడు ఆగ్నేయపు మూల రక్షించాలి. ధర్మాత్మకుడు దక్షిణపు దిక్కున పాలించాలి. సర్వవైరిహృత్తు నైరృతిమూల రక్షించాలి. (20) వరాహుడు పడమటి దిశను కాపాడాలి. ప్రాణదుడు ("ప్రాణాలనిచ్చేవాడు) వాయవ్యపు మూల పాలించాలి. ధనదుడు ఉత్తరపు దిక్కును రక్షించాలి. మహాగురుడు ఈశాన్యపుమూల కాపాడాలి. (21) మహాసిద్దుడు ఊర్ద్వదిక్కును రక్షించాలి. జటాధరుడు అధోదిశను పాలించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిశ రక్షలేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. (22) (హృదయాదిన్యాసం చేయాలి) ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడూ చిరంజీవి కాగలడు అని స్వయంగా దత్తాత్రేయుడనగు నేనే చెప్పాము. (23) అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖదుఃఖరహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు. (24) అని చెప్పి దిగంబర దత్తాత్రేయ యోగి అంతర్ధానం చెందాడు. ఆ దలాదనుడు కూడా అది జపించి జీవన్ముకుడై ఉంటున్నాడు. (25) దూరశ్రవుడు అనే బిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నందుననే అతడు వజ్రకాయుడయ్యాడు.(26) అని దత్తాత్రేయ యోగికవచమంతా శంభుని నోట విని పార్వతి "ఈ కవచం యొక్క మహాత్మ్యమూ, ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఏది, ఎలా ఎలా జపించవలెనో అదీ సవిస్తరంగా చెప్పు" అన్నది. (27,28) పార్వతి వినయంగా అడిగినది కనుక శంభుడు అదంతా (ఇలా) చెప్పాడు చెపుతున్నాను పార్వతీ! ఏకాగ్రతతో నిర్మలతతో విను(29) ధర్మార్థ కామమోక్షాలకిదే ఆధారం. ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. (30) పుత్రమిత్రకళత్రాది సర్వసంతోష సాధనమిది. వేదశాస్త్రాది విద్యలకు పరమనిధానమిది. (31) సంగీత శాస్త్రసాహిత్య సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానం, తత్త్వజ్ఞానం అనే ఆరుగుణాలు గల బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. (32) ఇది సర్వసంతోషాలనూ కలిగిస్తుంది. సర్వదుఃఖాలనూ నివారిస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది, యశస్సునూ కీర్తినీ పెంచుతుంది. (33) దీనిని వెయ్యి సారులు జపించినందువల్ల ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహరోగాలూ, పద్దెనిమిది కుష్టురోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాతరోగాలూ, నలభై పైత్యరోగాలూ, ఇరవై శ్లేష్మరోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్రయంత్ర-కుత్సితయోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులు, భేతాళులు, కూష్మాండాది గ్రహాలు - వీటివల్ల కలిగినవీ, సంగతి (సాంగత్యం) వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్ననీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాలవల్ల కలిగిననీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం. (34-38) పదివేలసారులు జపిస్తే చాలు, గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేల మారులు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. (39) ముప్పైవేల పర్యాయాలు జపిస్తే ఆకాశసంచారం అలవడుతుంది. కోటిమారులు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. (40)  

Wednesday 11 October 2023

శ్రీదత్త పురాణము (283)

 


వజ్రకవచ భావము


ఓం దత్తాత్రేయుడు సహప్రారకమలంలో ఉండే శిరస్సును రక్షించుగాక. అనసూయ తనయుడు చంద్రమండలమధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. (1) మనోమయుడు హం క్షం అనే ద్విదళపద్మభవుడై గడ్డాన్ని రక్షించుగాక. జ్యోతిరూపుడు నా రెండు కన్నులను రక్షించుగాక. శబ్దస్వరూపుడు నా రెండు చెవులనూ కాపాడుగాక (2)


గంధస్వరూపుడు నా నాసికను రక్షించుగాక. రసస్వరూపుడు నా ముఖాన్ని (నోటిని) కాపాడుగాక. వేదస్వరూపుడు నా నాలుకను కాపాడుగాక. ధర్మస్వరూపుడు నా దంతాలనూ రెండు పెదవులనూ కాపాడు గాక. (3) అత్రిభవుడు నా రెండు చెక్కిళ్లనూ రక్షించుగాక. ఆ తత్త్వవేత్త నా ముఖాన్ని అంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మ స్వరూపుడు షోడశార (పదహారు రేకుల) కమలంలో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక. (4) చంద్రానుజుడు నా భుజశిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు నా భుజాలను రెండింటినీ కాపాడుగాక. శత్రుజిత్తు కొంకులు రెంటినీ రక్షించుగాక. హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. (5) కకారం మొదలు రకారం వరకూ కల ద్వాదశారకమలంలో ఉన్న మరుత్ (వాయు) స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు హృదయంలో ఉండి హృదయాన్ని రక్షించుగాక. (6) పార్శ స్థితుడనబడిన హరి పార్శ్యాలలో ఉంటూ పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు, కృపానిధి కుక్షినీ రక్షించుగాక. (7) నాభిస్థలంలోని డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నాభిని కాపాడుగాక. (8) వహ్నితత్త్వమయుడయిన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవస్వరూపుడు నా కటిని కాపాడుగాక. (9) వకారాది అకారాంతమైన పట్పత్రకమలాన్ని వికసింపజేసే జలతత్త్వమయుడైన యోగి నా స్వాధిష్టానచక్రాన్ని రక్షించుగాక. (10) సిద్ధాసనంతో కూర్చున్న సిద్దేశ్వరుడు నా రెండు ఊరువులనూ కాపాడు గాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకులకమలాన్ని వికసింపజేసే (11) మహీ (= భామి) రూపుడయిని వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకొనిన వాడు నా మూలాధార చక్రాన్నీ, అన్ని వైపుల నుంచి పృష్టాన్నీ రక్షించుగాక. (12) అవధూతేంద్రుడు నా రెండు పిక్కలనూ కాపాడుగాక. తీర్ధపావనుడు నా రెండు పాదాలనూ రక్షించుగాకు సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. (13) చర్మాంబరుడు నా చర్మాన్ని కాపాడుగాక, భక్తిప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక. మాంసకరుడు నా మాంసాన్ని కాపాడుగాక.


మజ్జాస్వరూపుడు నా మజ్జను రక్షించుగాక. (14) స్థిరధీ (= స్థిరబుద్ధికలవాడు) నా అస్థులను కాపాడుగాక. వేధ నా మేధను పాలించుగాక, సుఖకరుడు నా శుక్రాన్ని రక్షించుగాక, దృడాకృతి నా చిత్తాన్ని కాపాడుగాక, (15) హృషీకేశాత్మకుడు నా మనస్సుమా బుద్ధినీ అహంకారాన్నీ పాలించుగాక. ఈశుడు నా కర్మేద్రియాలను రక్షించుగాక. అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక, (16) 


Tuesday 10 October 2023

శ్రీదత్త పురాణము (282)

 


(6) ఆయన వక్షఃస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. చేతులు ఎర్రగా ఉదరం పల్చగా ఉంటాయి. ఆయన విశాలమైన పిరుదులతో అందంగా ఉంటాడు. ఆయన కటిస్థలం విశాలంగా ఉంటుంది. (7) ఆయన తొడలు అరటిబోదెలవలె ఉంటాయి. మోకాళ్ళు, పిక్కలూ చక్కగా ఉంటాయి. గుల్ఫాలు (చీలమండలు) గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి పైభాగాలవలె విలసిల్లుతుంటాయి. (8) అరికాళ్ళు ఎర్రతామరపువ్వులవలె అందంగా ఉంటాయి. మృగ చర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ఆ యోగి ప్రతిక్షణమూ తనను తలచుకొన్న వారి వద్దకు చేరుతుంటాడు. (9) ఆయనకు జ్ఞానోపదేశం చేయటమంటే ఆసక్తి. ఆపదలు తొలగించడం ఆయన దీక్ష. సిద్ధాసనం వేసుకొని ఆయన నిటారుగా కూర్చుంటాడు. ఆయన నవ్వుముఖంతో ఉంటాడు. (10) ఆయన ఎడమచేత వరదముద్రా, కుడిచేత అభయముద్రా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన బాలురు, ఉన్మత్తులు, పిశాచులు-మొదలగు వారితో కూడి కనబడుతూ ఉంటాడు. (11) ఆయన త్యాగి, భోగి, మహాయోగి, నిత్యానందుడు, నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి, సర్వకాముదుడు. (12) ఆయన తన సర్వావయాలకూ భస్మం పూసుకొంటాడు. సర్వమహాపాతకాలనూ నాశనం చేస్తాడు. ఆ జీవన్ముక్తుడు భోగాలనూ, మోక్షాలన్నీ ప్రసాదిస్తాడు, ఇందులో సంశయం లేదు. (13)


ఇలా ధ్యానించి, వేరే తలంపు లేకుండా నా వజ్రకవచం పఠించాలి. సర్వత్ర నన్నే దర్శిస్తూ నాతో సంచరించాలి. (14) దిగంబరుడు, భస్మసుగంధం పూసుకొన్నవాడు, చక్రం, త్రిశూలం, డమరువు, గద ఈ ఆయుధాలు - ధరించినవాడు, పద్మాసనంతో కూర్చున్నవాడు, యోగీంద్రులూ, మునీంద్రులూ, నిత్యమూ "దత్తా, దత్తా" అను నామస్మరణతో ఆయనకు నమస్కరిస్తుంటారు. (15)


Monday 9 October 2023

శ్రీదత్త పురాణము (281)

 


నీవు స్మర్తృగామివి అని జనులనుకొనే మాట పరీక్షించాలని (21) నిన్నిప్పుడు స్మరించాను. నా ఆపరాధం క్షమించు" అన్నారు. దత్తాత్రేయుడు మునితో ఇట్లు పలికెను - "నా ప్రకృతి ఇటువంటిది. (22) భక్తిలేకుండి కాని, మంచి భక్తి ఉండి కాని, అన్యాలోచన లేకుండా నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారు కోరినవి ఇస్తాను" అని చెప్పాడు. (23) (మళ్ళీ) దత్తాత్రేయుడు దలాదనమునీశ్వరునితో "నీకేది ఇష్టమయితే అది కోరుకో నీవు తలుచుకొన్నందున వచ్చాను కదా" అన్నాడు. (24) ముని దత్తాత్రేయునితో " మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సలో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది యగు దానిని నాకు ప్రసాదింపుము" అన్నాడు. (25)

 

శ్రీ దత్తాత్రేయుడు "నా వజ్రకవచం ఉన్నది. తీసుకో" అని మునితో అన్నారు. అలాగే అని అంగీకరించాడు దలాదనముని. ఆయనకు (26) దత్తాత్రేయుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషిని, చందస్సునూ ముందుగా చెప్పి న్యాసం, ధ్యానం, దాని ప్రయోజనం అంతా వివరించి చెప్పాడు. (27)

 

ధ్యానమ్

 

జగత్తు అనే మొక్కకు దుంప (నేరు) వంటివాడు, సత్ చిత్ ఆనందమూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. (1) ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నుడు అయి పిశాచంలా ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష వారి స్వరూపుడు, భోగమోక్ష ప్రదాయకుడు. (2) ఆయన ప్రతిదినము వారణాసి (కాశీ) పురంలో స్నానం చేస్తాడు. కొల్హాపురంలో జపం చేస్తారు. మాహురీపురంలో భిక్షతో భోజనం చేస్తాడు. సహ్య పర్వతంపై దిగంబరుడై శయనిస్తాడు. (3) ఆయన ఆకారం ఇంద్రనీలమణిలా ఉంటుంది. ఆయన కాంతి వెన్నెలలా ఉంటుంది. ఆయన చిరుజడలు కదులుతూ వైడూర్యంలా మెరుస్తూ ఉంటాయి. (4) ఆయన కన్నులు తెల్లగా ఉండి మైత్రిని కలిగి ఉంటాయి. ఆయన కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. ఆయన కనుబొమ్మలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ, నల్లగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రునిలా ఉంటుంది. (5) ఆయన నవ్వు పొగమంచును తిరస్కరించేంతటి చల్లగా ఉంటుంది. సొగసైన కంఠం శంఖాన్ని మించిపోయింది. ఆయన భుజాలు పుష్టిగా ఉంటాయి. పొడవైన బాహువులుంటాయి. ఆయన చేతులు చిగుళ్ళను మించి కోమలంగా ఉన్నాయి