Monday 30 November 2015

రాజీవ్ దీక్షిత్ - జయంతి - వర్ధంతి

స్వామి వివేకానంద భారతదేశానికి ఎలా నూతన శక్తిని ఇచ్చారో, అదే విధంగా తన ప్రసంగాల ద్వారా కొత్త తరం భారతీయులలో దేశభక్తిని నింపి, నూతనశక్తిని, ప్రేరణను ఇచ్చి, బానిస విద్యావ్యవస్థ వలన భారతీయులలో ఏర్పడిన ఆత్మనూన్యతను, భావాదాస్యాన్ని ప్రాలద్రోలడానికి ఎంతో కృషి చేశారు శ్రీ రాజీవ్ దీక్షిత్. స్వదేశీ చికిత్స పేరుతో వాగ్భటుడు మొదలైన మహర్షులు రాసిన ఆయుర్వేద రహస్యాలను సామాన్య జనబాహుళ్యంలో ప్రచారం చేసి, అల్లోపతిలో లక్షలు పోసిన నయం కానీ అనేక వ్యాధులకు సులువైన పరిష్కారాలను చెప్పిన మహామహుడు రాజీవ్ దీక్షిత్. రోగాలను నయం చేసుకోవడమే కాదు, రోగాలు రాకుండా సుఖంగా ఎలా జీవించాలో కూడా చెప్పారు.

ఉన్నతమైన విద్యనభ్యసించినా, దేశం ఎదురుకుంటున్న సవాళ్ళను చూసి, తన జీవితం కంటే దేశభవిష్యత్తు ముఖ్యమని, తన జీవితాన్ని పణంగా పెట్టి, స్వదేశీ ఉద్యమం నడిపారు రాజీవ్ దీక్షిత్. భారతీయులకు తెలియకుండా దాచిపెట్టిన అనేక విషయాలను బట్టబయలు చేశారు. మనలో ఎప్పుడైనా ఆత్మనూన్యత కలిగినా, భారతీయులు ఇతర దేశీయులకంటే తక్కువ అనిపించినా, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలను వింటే, ఇక వారు ఎప్పటికి ఆత్మనూన్యతకు లోనవ్వరు. ఆధునిక భారతావనిలో నిజమైన దేశభక్తుడు రాజీవ్ దీక్షిత్. వారి వలన అనేకమంది భారతీయులు స్ఫూర్తిని పొందారు. వారు జన్మించింది 30 నవంబరు 1967 కాగా, 30 నవంబరు 2010 లో 43 ఏళ్ళ వయసులో పుట్టిన రోజు నాడే మరణించారు. వారి మరణం గుండెపోటు వల్ల సంభవించిందని చెప్తున్నా, వారి మీద విషప్రయోగం జరిగిందని వారి భౌతికకాయాన్ని చూసినవారెవరైనా ఒప్పుకుంటారు. వారి మరణం చుట్టు అనేక వివదాలు ఉన్నాయి. వారి మరణం సహజం కాదని చెప్పే అవకాశం లేకుండా వారి శవాన్ని పోస్ట్ మార్టం చేయకుండానే ఖననం చేశారు. వారు మరణం భరతమాతకు తీరనిలోటు గా మిలిగిపోయింది.

మేమంతా 1857 తిరుగుబాటు తర్వాత విడిపోయిన విప్లవకారులం. పూర్తి స్వదేశీ భారతదేశం ఏర్పడే వరకు మేము మళ్ళీ మళ్ళీ జన్మిస్తాం, విప్లవం తెస్తాం అనేవారు రాజీవ్ దీక్షిత్.

Pic courtesy: Rajiv Dixit - One Man Army అమరజీవి, స్వదేశీ గురువు

Sunday 29 November 2015

హిందూ ధర్మం - 185 (నిరుక్తము - 4)



మాక్స్ ముల్లర్ మొదలైన పండితులు వేద భాష్యానికి చేసిన అవకతవకలు ఎటువంటి వంటే మాక్స్ ముల్లర్ ఒక్క వేద ఋక్కుకు ఇచ్చిన దురర్ధాన్ని ఖండిస్తూ అరవిందులువారు ఒక పుస్తకమే రాసారట. ఐరోపా 'పండితులకు' వేదంలో చరిత్ర కనిపించింది. కానీ స్వామి దయానందులు (ఆర్యసమాజం) వేదంలో చరిత్ర ఉందని అంగీకరించలేదు. గ్రిఫ్ఫిత్, మాక్స్‌ముల్లర్, మోనియర్ విల్లియంస్, మెక్‌డొన్నెల్, బ్లూంఫీల్డ్ ఇత్యాది పాశ్చ్యాతుల భాష్యాలను ఖండించారు. దీని గురించి ఋగ్వేద భాష్య భూమికలో విస్తృతంగా ప్రస్తావించారు. వారి ప్రభావంతో, ఆర్యసమాజానికి చెందిన దేవీచంద్ గారు కూడా యజుర్వేద భాష్యంలో ఇటువంటి అనేక విషయాలను శాస్త్ర ప్రామాణికంగా ఖండిచారు.

వారి మాటల్లోనే 'సాధారణ సంస్కృతంలో 'ల'కార త్రయం భూతకాలాన్ని (గడిచిన కాలాన్ని) సూచిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేకులు వేదంలో చరిత్ర ఉందని నిర్ధారించారు. కానీ ఇది తప్పు. కష్కుడు చెప్పిందేమిటంటే వేదంలో 'ల'కార త్రయం కనిపిస్తే, అది త్రికాలాలకు (భూత, వర్తమాన, భవిష్యత్) సంబందించినదై ఉంటుంది. అది ప్రత్యయం అవుతుంది. అందువల్ల వాటిని కేవలం భూతకాలానికే పరిమితం చేయడం తప్పు. అదే విధంగా వైదిక పదాలు ధాతువులే కానీ, వ్యక్తులు, సంప్రదాయల పేర్లు కావు. ఎప్పుడైతే పండితులు ముఖ్య వేదాంగాలైన నిరుక్తం, వ్యాకరణాలను విడిచిపెట్టారో అప్పుడే వేదంలో చరిత్ర ఉన్నట్టుగా భావించడం మొదలుపెట్టారు.

పతంజలి మహర్షి మాహాభాష్యంలో కష్కుడి వివరణ గురించి వ్యాఖ్యానం చేస్తూ, వేదంలో లకార త్రయాన్ని భూతకాలానికి పరిమితం చేసి అర్దం చెప్పడం, వ్యాకరణ శాస్త్రానికి వ్యతిరేకం. పాణిని వ్యాకరణాన్ని ప్రామాణికంగా తీసుకున్నంతవరకు వైదిక పదజాలానికి చరిత్రను అంతగట్టడం వేదవ్యాక్యాలను నిందించడమే అవుతుంది అన్నారు.

వైదిక పద ధాతువుల ప్రాముఖ్యతను అర్దం చేసుకోవడంలో విఫలమై, వాటిని చారిత్రిక వ్యక్తుల పేరులుగా అనువదించారు. వాటి అసలు ప్రాముఖ్యతను నేను చెప్తాను.

1. సీతా - వేదంలో సీతా అనే పదం శ్రీ రామచంద్రుని భార్యను సూచించదు. పొలంలో నాగలితో దున్నడాన్ని సూచిస్తుంది.
2. బాబర - అనేది రాజు లేక వ్యక్తి పేరు కాదు. ఉరుములు వంటి గట్టి శబ్దాలు చేస్తూ ప్రవహించే గాలిని సూచిస్తుంది.
3. సూదాస్ - అనేది రాజు పేరు కాదు. 'సూదః కళ్యాణదానః| నిరుక్తం 2-25' చక్కటి దానాలు చేస్తూ ఉండేవాడని అర్దం.
4. పైజ్వాన్ అనేది రాజు నామాన్ని సూచించదు. నిరుక్తం 2-24 ఆధారంగా ఏ వ్యక్తైతే సదా అనాలోచితంగా ఉంటూ తొందరపడి వేగంగా పనులు చేసేవాడు పైజ్వాన్.
5.దేవాస్ - రాజు నామం కాదు. వేద విద్యనభ్యసించిన పండితుడు, ఎవరి ఆధ్వర్యంలోనైతే యాగం జరుగుతుందో అతడు.
6. అగు - అనగా చారిత్రాత్మిక వ్యక్తి కాదు. వేద జ్ఞానం, వైదిక పదజాలం తెలియని వ్యక్తి అని అర్దం.

To be continued ..........................

Monday 23 November 2015

వినాయకవ్రతం

25 నవబరు 2015, బుధవారం నుంచి వినాయకవ్రతం.

సాధారణంగా గణపతి స్వామిని పూజించడానికి విశేష సమయం గణేశనవరాత్రులు అని అందరికి తెలుసు. అయితే ఒక్క గణేశనవత్రాలు కాక, వినాయకుడిని ఆరాధించి, ఆయన అనుగ్రహంతో జీవితంలో విఘ్నాలను తొలగించుకోవటానికి, శుభాలను పొందటానికి అనేక ప్రత్యేకమైన తిధులను పూర్వీకులు మనకు అందరించారు. అటువంటి వాటిలో వినాయక వ్రతం.

దీని గురించి సద్గురు శివాయశుభ్రమునియ స్వామి వారు చెప్పారు. వినాయకవ్రతం అనేది గణపతిని ఆరాధించటానికి తమిళుల కార్తిగై పూర్ణిమ నుంచి 21 రోజులు జరుపుతారు. ఈ 21 రోజులు గణపతి ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు, గణేశపురాణం, గణపతికి సంబంధించిన అనేక కధలు పఠిస్తారు, ఆలయాల్లో ప్రవచనాలు చేస్తారు. ఈ వ్రతం పాటించేవారు 21 రోజుల పాటు ప్రతి రోజు ఆలయంలో పూజకు హాజరవ్వాలి, ఏకభుక్తం చేయాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేయాలి.

- సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి

25 నవంబరు 2015, బుధవారం కార్తీక పూర్ణిమ సందర్భంగా ఆ విశేషాలు ఈ లింక్ లో చూడవచ్చు.
http://goo.gl/YcbMnC

హిందూ ధర్మం - 184 (మాక్స్ ముల్లర్ కుట్ర - 3)

మాక్స్ ముల్లరే కాదు, ఆనాటికాలంలో వేదానికి భాష్యం రాసిన అనేకమంది యూరోపియన్లు ప్రధాన ఉద్దేశ్యం వేదాన్ని తక్కువ చేసి చూపడం, హిందువులను తటస్థీకరించి, క్రమంగా మతమార్పిడి చేయడం, సనాతనధర్మాన్ని ఆటవిక సమాజపు అలవాట్లుగా చిత్రీకరించడం. వీరి ఆలోచనలకు బీజం వారి మతంలోనే ఉంది. హైందవేతర మతాలు, ముఖ్యంగా అబ్రహామిక్ మతాలన్నీ 'తన మార్గం మాత్రమే సత్యం, అన్యమైనవన్నీ అసత్యం, అవి అనాగరికం, వాటిని పాటించేవారు ఎంతమంచి వారైనా, వారు నరకానికే వెళతారు' అనే ప్రధానమైన సిద్ధాంతం కలిగి ఉంటాయి. ప్రపంచం మీద విరుచుకుపడిన ఐరోపా (యూరోపియన్) వారు, ఏ దేశంకెళ్ళినా, అక్కడున్న స్థానిక సంస్కృతిని, అలవాట్లను నాశనం చేశారు. అది కుదరనప్పుడు మొత్తం జాతినే ఊచకోత కోశారు. కేవలం మతప్రచారం కోసం, దోపిడి కోసం. అమెరికా మీద పడ్డప్పుడు కుడా వారు చేసింది అదే. అక్కడున్న ప్రజలను అనాగరికులని, ఆటవికులని, వారు ప్రకృతిని పూజిస్తారని చెప్పి, ఆ జాతిని సమూలంగా తుడిచిపెట్టారు. ప్రకృతిని పూజించడంలో తప్పేముందనేది ఓ పెద్ద ప్రశ్న?!

అదే ప్రణాళిక ఇక్కడ అమలు చేద్దామంటే పూర్తిగా కుదరలేదు. ఇక్కడ జాతిని సమూలంగా నాశనం చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అందుకే ముందు హిందువులను పక్కదారి పట్టించాలని భావించారు. అందులో భాగమే వెలుపలివారు (Outsiders) సనాతనధర్మం మీద వ్యాఖ్యానాలు, భాష్యాలు రాయడం. ఒకవేళ హిందువులు కనుక తమ మతసిద్ధాంతాలను ప్రపంచానికి చెప్పుకుంటే, ఆ సమయంలో ఐరోపాలో మొదలైనా ఉద్యమాలు, విద్యావ్యాప్తి, పరివర్తన కారణంగా, ఐరోపావారు కూడా విశాలమైన భావాలు గల ఈ ధర్మాన్ని స్వీకరిస్తారు. తమ మతానికి ముప్పు వాటిల్లుతుంది. రెండవది, భారతీయులని తమకు శాశ్వత బానిసలను చేసుకోవాలన్నా, మతమార్పిడి చేయాలన్నా, ముందు భారతీయులకు హిందూ ధర్మం పట్ల ఏహ్యభావం కలగాలి. దీనికంటే క్రైస్తవమే ఉన్నతమైందిగా అనిపించాలి. అది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకే మాక్స్ ముల్లర్ మొదలైన ఐరోపావారు హిందువులను తమ మతం పట్ల తటస్థీరించాలని (Neutralise) చూశారు. అందుకోసమే వేదం జాతులు సంఘర్షణ, పోరు గురించి చెప్తుందని, అందులో పిచ్చి రాతలున్నాయని, జంతుబలులు, నరబలులున్నాయని చెప్పుకోచ్చారు. ముఖ్యంగా అది అనేకమంది దేవతలను పూజించమని చెప్తుందని, ఆ దేవతలు కూడా నిజమైన శక్తులు కావని, ఆదిమానవుడు వర్షం పడినప్పుడు తనకు తెలియని ఏదో శక్తి కారణంగా వర్షం పడుతోందని, వరదలు సంభవిస్తున్నాయని, పిడిగులు పడుతున్నాయని భావించాడని, ఆ భయంతోనే వాటిని పూజించడం మొదలుపెట్టారని, కాలక్రమంలో ఆ భయాలకు ఒక రూపం అంటగట్టి దేవతారూపాలుగా పూజిస్తున్నారని విస్తృతమైన ప్రచారం చేశారు. అబ్రహామికేతర మతాలన్నిటిని పేగెన్ (pagan) మతాలన్నారు. తమ మత ప్రవక్త పుట్టకముందు నుంచి ఉన్న మతాలన్నీ ఇలాంటివేనని, తమ ప్రవక్త మత్రమే దైవదూత అని, ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే స్వర్గం వస్తుందని ప్రచారం చేశారు.

నిజానికి ఇది ఏ హైందవుడికి ఆమోదయోగ్యం కాదు. హైందవం నమ్మకాల మీద ఆధారపడిన సంస్కృతి కాదు. ఇక్కడ దైవాన్ని దర్శించినవారు అనేకులున్నారు, దైవసాక్షాత్కారాని (God realization) కి అనేకమైన మార్గాలను హైందవం మాత్రమే చూపించింది. అసలు ఈ Realization అనేది ఇక్కడ మాత్రమే ఉన్న అంశం. ఆ మార్గంలో నడిచినవారందరూ గమ్యాన్ని చేరారు. తమ తర్వాతి వారికి మార్గదర్శనం చేశారు. ఇది హైందవుల చరిత్ర. మరేమతంలోను దైవాన్ని చూసినవారు లేరు, దైవసాక్షాత్కారానికి మార్గంలేదు. అక్కడ నమ్మడం (belief) ప్రధానం, ఇక్కడ నమ్మినదాన్ని దర్శించడం, సాక్షాత్కరించుకోవడం ప్రధానం.

అయితే ఇలా వెలువడ్డ వ్యాఖ్యానాలను మనవాళ్ళు పూర్వపక్షం చేయడం మర్చిపోయారు. అప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యవల్ల వీటిని యధాతధంగా స్వీకరించారు. ఇక్కడో విషయం గుర్తించాలి. మాక్స్ ముల్లరే కానీ, మరెవరైనా కానీ, వారిది దురుద్దేశమే అయినా, వారు వేదాల్లో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని అంగీకరించారు. ఎందుకంటే వేదంలో ఏమిలేదు అని కనుక చెప్తే, అది భారతీయుల తిరస్కరణకు గురవుతుంది, తిరుగుబాటుకు కారణమవుతుంది. అందుకని వాటిలో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని చెప్తూనే, తమ రచనలు చదివిన బలమైన హిందువులను తటస్థ (neutral) పరిస్తే, క్రమంగావారు హైందవం పట్ల నాస్తికులుగా మారతారు. అటుతర్వాత వారిని తమ మతంలోకి మార్చుకోవచ్చనేది ప్రణాళిక. Neutralising is the first step towards conversion. అంటే Positive attitude ని తీసివేయడం అన్నమాట.

మూడవది, ఈ వేదం విదేశీయులదని చెప్పి, హిందువుల్లో ఉండే వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెట్టి, తమలో తమకే ద్వేషం పెంచి, అంతర్యుద్ధం సృష్టించాలని, క్రమంగా హిందూజాతి బలహీనపడుతుంది, అప్పుడు తమ పని సులవుతుందని భావించారు.

ఆ ఉద్దేశ్యంతో వేదభాష్యం రాసిన ఐరోపావరిని అనేకమంది హిందువులు స్వీకరించినా, దీన్ని పూర్వపక్షం చేసి, ఈ కుట్రదారుల కుతంత్రాలను బయటపెట్టినవారిలో ముఖ్యులు శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద్ సరస్వతీ. వేదానికి అంటగట్టిన విదేశిభావజాలాన్ని, నాస్తికవాదాన్ని పూర్తిగా వదలగొట్టడానికి వీరు ఎంతో ప్రయత్నం చేశారు.

To be continued ....................

Saturday 21 November 2015

స్వామి శివానంద సూక్తి

Thought is the greatest force on earth. Thought is the most powerful weapon in the armour of a Yogi. Constructive thought transforms, renews and builds. - Swami Sivananda


22 నవంబరు 2015, ఆదివారం, ఉత్థాన ఏకాదశి సందర్భంగా ఆ వివరాలు ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2013/11/blog-post_12.html

Sunday 15 November 2015

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!! - ఎం.వి.ఆర్. శాస్త్రి

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!!
-ఎం.వి.ఆర్. శాస్త్రి 14/11/2015 - ఆంధ్రభూమి

టిప్పు సుల్తాన్ సెక్యులరా, కాదా అని వేరెవరినో అడగవలసిన పనిలేదు.
ఆ సంగతి టిప్పు సుల్తానే చెబుతాడు ఎంచక్కా.
‘‘మీర్ హుస్సేన్ అలీతో మావాళ్లు ఇద్దరిని పంపుతున్నాను. వారి సాయంతో నువ్వు హిందువులందరినీ పట్టి, చంపాలి. 20 ఏళ్ల లోపు వాళ్లని ఖైదు చేయాలి. మిగతావారిలో 5000 మందిని చెట్లకు వేలాడదీసి చంపాలి. ఇది నా ఆజ్ఞ.’’

‘ఆదర్శ ప్రభువు’ టిప్పు సుల్తాన్ 1788 డిసెంబర్ 14న కాలికట్‌లోని తన సేనాపతికి రాసిన జాబు ఇది.
‘‘పనె్నండు వేల మంది హిందువులు ఇస్లాంను స్వీకరించారు. వారిలో చాలా మంది నంబూద్రి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ సంగతి హిందువుల్లో బాగా ప్రచారం చేయించు. అప్పుడు హిందువులని నీ దగ్గరికి రప్పించి ఇస్లాంలోకి మార్పించు. నంబూద్రి బ్రాహ్మణుడు ఒక్కడిని కూడా వదలొద్దు.’’

1788 మార్చి 22న ‘మోడల్ కింగ్’ టిప్పు సుల్తాన్‌గారు అబ్దుల్ కదీర్‌కి రాసి పంపిన ఉత్తర్వు ఇది.
‘‘ఇటీవల మలబార్‌లో నాలుగు లక్షల మందికి పైగా హిందువులను ఇస్లాంలోకి మార్పించి గొప్ప విజయం సాధించాను. ఈ సంగతి నీకు తెలియదా?’’

1790 జనవరి 19న బుద్రుజ్ జుమాన్ ఖాన్‌కి ‘‘జాతీయ వీరుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన ఉత్తరం ఇది.
‘‘మహమ్మద్ ప్రవక్త, అల్లాల దయవల్ల కాలికట్‌లోని హిందువులందరూ ఇస్లాంలోకి మార్చబడ్డారు. కొచ్చిన్ రాజ్య సరిహద్దుల్లోని కొందరు మాత్రమే ఇంకా మారకుండా మిగిలారు. వాళ్లనీ అతిత్వరలో మార్చెయ్యాలని నిశ్చయించాను. ఇదే ‘జిహాద్’ అని నేను అనుకుంటున్నాను.’’

1790 జనవరి 18న సయ్యద్ అబ్దుల్ దులాయ్‌కి ‘‘సెక్యులర్ పాలకుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన లేఖ ఇది.
ఈ ఉత్తరాలన్నీ నిన్నో మొన్నో నరేంద్ర మోదీ గ్యాంగు బనాయించిన బాపతు కాదు. సుప్రసిద్ధ చరిత్రకారుడు కె.ఎం.పణిక్కర్ కష్టపడి సేకరించి నేటికి తొంభై ఏళ్లకింద ‘్భషా పోషిణి’ పత్రిక (1923 ఆగస్టు సంచిక)లో వెలువరించిన ఉత్తరాలివి. దానికి నూరేళ్ల కింద William Kirkpatrick 1811లో ప్రచురించిన Selected Letters of Tipoo Sultan గ్రంథంలోనూ ఇలాంటి లేఖామాణిక్యాలు చాలా దొరుకుతాయి.

ఉత్తరాల్లో రాసుకున్నవి బడాయి గొప్పలు అయి ఉండొచ్చు కదా? ఆదేశాలు పంపినంత మాత్రాన అవన్నీ అక్షరాలా అమలయ్యే ఉంటాయని ఎలా నమ్మగలం?

నమ్మవద్దు. 19వ శతాబ్దపు ‘మైసూర్ గెజిటీర్’ని చూడండి. దక్షిణ భారతంలో టిప్పు సేనలు 8000 దేవాలయాలను సర్వనాశనం చేసినట్టు కనపడుతుంది. ముఖ్యంగా మలబార్, కొచ్చిన్‌లలో జరిగిన దోపిడీలకు, దేవాలయ విధ్వంసాలకు మేర లేదని అర్థమవుతుంది.

పోనీ మనవాడు కాని Lewis B. Boury ని కదపండి. మలబార్‌లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద టిప్పు సుల్తాన్ చేయించిన ఘోర దురాగతాలు గజనీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, నాదిర్షా, ఔరంగజేబుల ప్రతాపాలకు ఏమాత్రం తీసిపోవని మొత్తుకుంటూ ఆయన పెద్దపుస్తకమే రాశాడు.

‘కేరళలో టిప్పు సుల్తాన్ దండయాత్రల ఘాతుకాలు చూస్తే చెంఘిజ్‌ఖాన్, తైమూర్‌లు గుర్తుకొస్తారని సుప్రసిద్ధ మహమ్మదీయ చరిత్రకారుడు పి.ఎస్.సయ్యద్ ముహమ్మద్ ‘‘కేరళ ముస్లిమ్ చరిత్రమ్’’ గ్రంథంలో వర్ణించాడు.
పుస్తకాలకేమి? తెలిసో తెలియకో ఎవడైనా ఏదైనా రాసి పడెయ్యవచ్చు- అని కొట్టేద్దామా?

1783 నుంచి 1791 వరకు మలబార్‌లో టిప్పు సుల్తాన్ రాక్షస కృత్యాల మూలంగా 30,000 మంది బ్రాహ్మణులు, ఇంకా ఎన్నో వేలమంది నాయర్లు ఇళ్లు, ఆస్తులు విడిచిపెట్టి ప్రాణభయంతో తిరువాన్కూరు రాజ్యానికి పారిపోయారని టిప్పు మరణానంతరం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు నియమించిన విచారణ సంఘం దర్యాప్తులో తేలింది. ఆ నివేదిక కేవలం బ్రిటిషు ప్రభువులకు తెలియడం కోసం రూపొందిందే తప్ప పుస్తకం రాద్దామన్న ఉద్దేశంతో పోగేసింది కాదు. 1866-86 మధ్యకాలంలో ఆ ప్రాంతాన కలెక్టరుగా పనిచేసిన William Logan రికార్డులు ఫరిశీలించి, ప్రజలతో మాట్లాడి, విస్తృతంగా సమాచారం సేకరించి వెలువరించిన Malabar Manual లోనూ టిప్పు చేయించిన అత్యాచారాలు, సామూహిక సున్తీలు, ‘కత్తి లేదా టోపీ’ నినాదంతో నెత్తిన ముస్లిం టోపీ పెట్టుకోవటానికి ఒప్పుకోనివారిని వేల సంఖ్యలో నరికేసిన ఉదంతాలు, దేవాలయాలను మలిన పరిచి, బలవంతంగా ఆవు మాసం నోట కుక్కించి, స్ర్తిలను చెరిచి, పసిపిల్లలనూ చంపించిన పైశాచిక కృత్యాలు ఏకరవు పెట్టారు. దాని తాజాముద్రణను కొచ్చిన్, కేరళ యూనివర్సిటీల సహకారంతో విఖ్యాత ముస్లిం చరిత్రకారుడు డాక్టర్ సి.కె.కరీమ్ సరిచూసి ప్రచురించాడు.

పోనీ - బ్రిటిషు వారికి టిప్పు సుల్తాన్ బద్ధ శత్రువు కాబట్టి ఇంగ్లిషు వాళ్ల కళ్లకి అతడిలో అన్నీ తప్పులే కనపడి ఉండొచ్చు; ఆ ‘స్వాతంత్య్ర యోధుడి’ని భ్రష్టు పట్టించేందుకే వాళ్లు లేనిపోనివి కల్పించి ఉండవచ్చు అనుకుందామా?
ఇంగ్లిషు వాడు కాని విదేశీయుడు, 1790లో టిప్పు యుద్ధ బీభత్సాన్ని అక్కడే ఉండి కళ్లారా చూసిన పోర్చుగిసు యాత్రికుడు Barthoelomeo తరవాత కాలంలో రాసిన 'A Voyage to East Indies' లో ఛెప్పిందిది:
First a corps of 30,000 barbarians butchered everybody on the way... Tipu was riding an elephant behind which another army of 30,000 soldiers followed. Most of the men and women were hanged in Calicut. First mothers were hanged with their children tied to necks of mothers. That barbarian Tipu Sultan tied the naked Christians and Hindus to the legs of elephants and made the elephants to move around till the bodies of the helpless victims were torn to pceces. Temples and Churches were ordered to be burned down, desecrated and destroyed...

(ముందు 30 వేల దండు వెడలి దారిలో కనపడ్డ వాళ్లనల్లా నరికేసింది... టిప్పు ఏనుగు మీద ఉన్నాడు. ఇంకో 30వేల సైనికులు అతడి వెనుక నడిచారు. కాలికట్‌లోని స్ర్తి పురుషుల్లో అత్యధిక సంఖ్యాకులను ఉరి తీశారు. బిడ్డలని మెడలకు కట్టి తల్లులను ఉరి తీశారు. కిరాతకుడు టిప్పు సుల్తాన్ క్రైస్తవులను, హిందువులను నగ్నంగా ఏనుగుల కాళ్లకు కట్టేయించి, వారు ముక్కలయ్యేదాకా ఏనుగుల చేత తొక్కించాడు. దేవాలయాలను, చర్చిలను తగలబెట్టి, మలినపరిచి, నాశనం చేయించాడు.)

అదీ సంగతి! అన్ని మతాలనూ సమానంగా చూడవలెను అన్నది సెక్యులరిజం-ట కదా? చంపి పోగులు పెట్టే విషయంలో హిందూ, క్రైస్తవ మతాలకు చెందినవారిని సమానంగా చూశాడు కాబట్టి బహుశా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారి కాంగ్రెసు కళ్లకు టిప్పు సుల్తాన్ సిసలైన సెక్యులరిస్టుగా, ‘మోడల్ కింగ్’గా, ‘జాతీయ వీరుడు’గా కనపడి ఉండవచ్చు.

పూర్వపు కాంగ్రెసు ఇలవేల్పులు ఆ మహా ‘స్వాతంత్య్ర యోధుడి’ సంస్మరణార్థం ప్రత్యేక తపాలా బిళ్లను వెలువరించారు. సెక్యులర్ రాజ్యంలో సర్కారీ దూరదర్శన్The Sword of Tipu Sultan అనే పేర టిప్పుగారిని ఆకాశానికెత్తి మహావీరుడిగా, సుగుణాల రాశిగా చిత్రిస్తూ పక్కా అబద్ధాల అల్లికతో పెద్ద సీరియలే తీసి తరించింది. అలాంటప్పుడు తాను మాత్రం ఆ ‘మైసూర్ టైగర్’కి ఘన నివాళి ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని తలచినవాడై, ఇనే్నళ్లకి ఆ ‘జాతీయ వీరుడి’ జయంతిని కన్నడ సిద్దుడు ప్రభుత్వ పరంగా ఏటేటా మహా ఘనంగా జరిపించబట్టాడు.

అది చూసి గిరీష్ కర్నాడ్ అనే ‘జ్ఞానపీఠ’మెక్కిన మహాజ్ఞానికి ఆనందబాష్పాలురాలి, ఉత్సాహం ఉప్పొంగింది. టిప్పు సుల్తాన్ అనేవాడు శివాజీ, నేతాజీల సరసన అర్జంటుగా చేర్చదగిన మహానుభావుడనీ, అంతటి పుణ్యాత్ముడిని అనుక్షణం గుర్తుపెట్టుకునేలా బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడను పక్కకు తనే్నసి టిప్పు సుల్తాన్ పేరు తగిలిస్తేగానీ సెక్యులర్ భారత్ కీర్తి ప్రతిష్ఠలు ఇంకా మండిపోవనీ ఆ మహామేధావి ఓవరైపోయాడు.
హిందువులను హింసించిన వాడు ఎవడైనా ఆటోమెటిగ్గా సెక్యులరిస్టే అయి తీరతాడు కాబట్టి మన పుణ్యభూమిలోని సమస్త వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర మేధావులు కూడా అమందానందభరితులయ్యారు.

ఎటూచ్చీ మతోన్మాదులైన హిందూ జనాలే ఈ లోకోత్తర జయంతి అద్భుతంగా సాగకుండా పెద్ద న్యూసెన్సు చేస్తున్నారు.

వాళ్లకి మరీ బుద్ధి లేకుండా పోయింది. ‘మా దేశం మీద దాడికి రండి. మీతో చేతులు కలుపుతా’నని టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వాళ్లను పిలవనంపి, దేశ ద్రోహానికి పాల్పడితేనేమి? ఇంగ్లిషు వాళ్లని తీవ్రంగా ఎదిరించాడు కాబట్టి అతడిని స్వాతంత్య్ర వీరుడు, జాతీయ యోధుడు అని పొగిడి, సెక్యులర్ బుద్ధి జీవుల్లా హిందువులు కూడా పొంగి పోవచ్చు కదా? శృంగేరి మఠానికి చేసిన సహాయాన్ని మాత్రమే గుర్తుంచుకోవచ్చు గదా? ఉత్తర కర్ణాటకలో, కూర్గ్‌లో వేలాది హిందువులను చంపి, లక్షల మందిని బలవంతంగా మతం మార్పించి, వందల దేవాలయాలు కూల్చిన ‘టైగర్’ చేతలను మన సెక్యులర్ మేధావుల్లాగే వారూ మరచిపోవచ్చు గదా?

అందులోనూ ‘మహా జయంతి’కి సిద్ద రామయ్య ఎంచుకున్న తేదీ ఏది? టిప్పు సుల్తాన్ పుట్టిన నవంబర్ 20నా? కాదండి. కాదు. మేల్కొటేలో ఒకే రోజు 700 మంది అయ్యంగార్లను టిప్పు సాహెబ్ ఉరి తీయించిన నవంబర్ 10ని! ఆ భయానక దుర్దినాన్ని మరచిపోలేక మేల్కొటే అయ్యంగార్లు ఈనాటికీ దీపావళి పండుగ జరుపుకోరట. అది వారి ఖర్మ. మిగతా ఊళ్ల హిందువులకు ఏమయ్యింది? సిద్దరాముడి సెక్యులర్ ప్రభుత్వం అంతలా పనిగట్టుకుని, ఒక సెక్యులర్ మహావీరుడిని - చచ్చిన రెండు శతాబ్దాలకు గోరీ లోంచి లేపి ‘జయంతి’ని వైభవంగా చేయిస్తూ... పుండుమీద కారం చల్లేలా టిప్పు బాధిత కూర్గ్ ప్రాంతంలో కిరాయి మూకతో పెద్ద ఊరేగింపు కూడా తీయిస్తే హిందువులు నోరు మూసుకుని బుద్ధిగా పడి ఉండవచ్చు కదా?

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఇచ్చి ఉండవచ్చు. అలాగని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి హిందూ మతోన్మాద ఫాసిస్టు సంస్థలు అలాంటి ప్రజాస్వామిక హక్కును తమ చేతిల్లోకి తీసుకుంటే ఎలా సహించగలం? హిందుత్వం వాలాలు శాంతియుతంగానే గుమికూడి నినాదాలు ఇస్తూ ఉండి ఉండవచ్చు. వారి చేతిలో ఏ ఆయుధాలూ లేకపోవచ్చు. కేరళ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్పెషల్ డ్యూటీ మీద రప్పించిన బంగ్లాదేశీ ముస్లింలూ, ఇతర దౌర్జన్య శక్తులే వారి మీద నిష్కారణంగా విరుచుకుపడి నానా ఆగం చేసి ఉండవచ్చు. ఆ దాడిలో 70వ ఏడు దగ్గరపడ్డ ఒక పరువుగల వి.హెచ్.పి. నాయకుడి ప్రాణం పోయి ఉండొచ్చు.

కాని - దాడి జరిగింది హిందువుల మీద అయినప్పుడు దాన్ని ‘రెండు వర్గాల ఘర్షణ’ గానే చూడాలి అని సెక్యులర్ శాస్త్రం కదా? హిందూ సంస్థలు నిరసనకు దిగడంవల్లే నడిరోడ్డుమీద పెద్ద మనిషి ఖూనీ జరిగింది కాబట్టి తప్పు ముమ్మాటికీ ఆ సంస్థలదే; రెచ్చగొట్టబడిన ఉడుకు రక్తపు వారి కంటపడటంవల్లే కదా దురదృష్టవశాత్తు అతడి ప్రాణం పోయింది?

ఒకవేళ మైనారిటీ మతస్థుల మీదే ఇలాంటి దాడి జరిగి ఉంటే ఈపాటికి సెక్యులర్ మేధావులు రంకెలు వేసేవాళ్లు. సాహిత్యకారులు అరిగిపోయిన చచ్చు అవార్డులను వెనక్కిచ్చేవారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక హిందూ ఫాసిజాన్ని ఖండిస్తూ సంపాదకీయం రాసేది. దాడి జరిగింది హిందువుల మీద కాబట్టి, మరణించినవాడు హిందూ సంస్థ ప్రముఖుడు కాబట్టి దాని గురించి మాట్లాడటం మర్యాదస్తులకు నిషిద్ధం. టిప్పును ఒప్పుకోని హిందువుల అసహనానే్న పవిత్ర సెక్యులరిస్టులు ఎంతసేపూ ఖండించాలి... హిందువులను నిరసన అయనా తెలపనివ్వని అన్యుల అసహనాన్ని పట్టించుకుంటే సెక్యులర్ మడి చెడుతుంది. గిరీష్‌కర్నాడ్ అనే సెక్యులర్ దేశభక్తుడిని ఎవడో కడుపు మండినవాడు ట్విట్టర్‌లో బెదిరించాడన్న కబురే ఈ మొత్తం ఉదంతంలో పత్రికలకు పతాక శీర్షిక.
ఇండియన్ బ్రాండు సెక్యులరిజం జిందాబాద్!

సేకరణ: ఆంధ్రభూమి దినపత్రిక 14-11-2015

Wednesday 11 November 2015

దీపావళి గురించి భగవాన్ రమణ మహర్షి



నరక సదృశమైన శరీరమే 'నేను' అనుకునే అభిమానమే నరకుడు. ఆ అభిమానమును నిర్మూలించి, తాను తాను(ఆత్మ)గా ప్రకాశించడమే దీపావళి.

భగవాన్ రమణ మహర్షి

అందరికి దీపావళి శుభాకాంక్షలు

దీపావళీ విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_22.html

నరక చతుర్దశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_21.html

ధన త్రయోదశి విశేషాల కోసం ఈ లింక్ చూడండి
http://ecoganesha.blogspot.in/2013/11/blog-post_1.html

Sunday 8 November 2015

హిందూ ధర్మం - 183 (మాక్స్ ముల్లర్ కుట్ర -2)



1886 లో మాక్స్ ముల్లర్ తన భార్యకు ఈ విధంగా లేఖ వ్రాసాడు. 'ఈ కార్యాన్ని పూర్తి చేస్తానని నేను భావిస్తున్నాను, నాకేమనిపిస్తోదంటే జరగబోయేది చూడటానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు, కానీ నేను చేసిన వేద అనువాదం, రచన భారతదేశం, మరియు ఆ దేశంలో పుట్టబోయే కోట్లమంది భవిష్యత్తు తెలియజేస్తుంది. వేదమే వారి మతానికి తల్లివేరు, దాన్ని చూపించే నెపంతో నేను చేసిన ప్రయత్నం, ఆ వేదం నుంచి గత 3000 సంవత్సరాలలో ఉద్భవించి అభివృద్ధి చెందిన సర్వాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను'.

26 డిసెంబరు 1868 లో అప్పటి భారత సెకరెటరికి డ్యూక్ (the Duke of Argyle) కి లేఖ రాస్తూ, 'భారతదేశపు పురాతనమతం అంతరించబోతున్నది, ఇప్పుడు క్రైస్తవం అడుగుపెట్టకపోతే, తప్పేవరిది' అంటూ రాసాడు. తక్షణమే దేశంలో మతమార్పిడులకు శ్రీకారం చుట్టమని చెప్తున్నాడు.

అతని కుమారిడికి ఈ విధంగా లేఖ రాసాడు. 'ఈ ప్రపంచంలో ఏ ఒక పవిత్ర గ్రంధమైనా, ఇతర గ్రంధాల కంటే ఉన్నతమైందని అనుకుంటున్నావా? చెప్తే పక్షపాతం ఉన్నదని అనుకోవచ్చు, కానీ అన్నిటిని నేను పరిగణలోకి తీసుకుని చెప్పేదేమిటంటే, ఏదైనా ఉన్నతమైన గ్రంధం ఉన్నదంటే అది బైబిల్ కొత్త నిబంధన మాత్రమే. ఆ తర్వాత ఖురాన్, ఎందుకంటే అందులో ఉన్న నైతికి బోధనలు కొత్త నిబంధన కంటే కొత్తగా ఏమీ ఎక్కువ కాదు. ఆ తర్వాత క్రమంగా పాత నిబంధన, దక్షిణ బౌద్ధ త్రిపిఠక, టాయో రచనలు, కంఫ్యూషియస్ రచనలు, వేదం, అవెస్థ. కొత్త మరియు పాత నిబంధనల్లో చెప్పబడిన నైతికి విలువలు ఇతర మతగ్రంధాల్లో కంటే ఉన్నతమైనవి. అదే బైబిల్ ప్రత్యేకత. అన్యమైన పవిత్ర గ్రంధాలన్నీ పాతకాలపు ప్రజలు సేకరించి పెట్టుకున్న జ్ఞాపకాలు మాత్రమే'.

ఇదీ  మాక్స్ ముల్లర్ కి వేదం పట్ల, సనాతనధర్మం పట్ల ఉన్న అభిప్రాయం. తన భార్యకు రాసిన లేఖలో అతడు స్పష్టంగా హిందూ ధర్మాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకో విషయం ఏమిటంటే అతడికి వేదం కాలాతీతం అని ఒప్పుకోవడానికి అహంకారం, స్వమతాభిమానం అడ్డు వచ్చాయి. అందువల్ల వేదాన్ని కేవలం 3000 ఏళ్ళ క్రితం నాటి రచనగా మాత్రమే చెప్పుకొచ్చాడు. సెకరెటరికి రాసిన లేఖలో మతమార్పిడులు చేయమని చెప్పాడు . కుమారుడికి రాసిన లేఖలో వేదం పట్ల తన అభిప్రాయాన్ని, గౌరవాన్ని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ స్వమతాభిమానం ఉండవచ్చు, కానీ పక్క మతాలను తక్కువ చేయకూడదు. కానీ మాక్స్ ముల్లర్‌కు బైబిల్ తప్ప మిగిలిన గ్రంధాలన్నీ ప్రజలు రాసుకున్న తమ జ్ఞాపకాల  ప్రతిరూపం మాత్రమే. వాటికి ఏ మాత్రం దైవత్వం లేదు. అటువంటి ఆలోచన కలిగిన మాక్స్ ముల్లర్ వేదానికి అనువాదం రాస్తే, ఎలాంటి భావాలు చెప్పి ఉంటాడో, అతడికి వేదసంస్కృతి పట్ల ఎట్లాంటి అభిప్రాయం ఉన్నదో, ఎంతవరకు ఈ ధర్మం అర్దమైందో స్పష్టమవుతుంది.

To be continued ..............................

Saturday 7 November 2015

స్వామి శివానంద సూక్తి


Do not store in your brain useless information. Learn to unmind the mind. Unlearn whatever has been of no use to you. Then only can you fill your mind with divine thoughts. You will gain new mental strength as the dissipated mental rays are collected now.  - Swami Sivananda

Friday 6 November 2015

స్వామి కృష్ణానంద సూక్తి


Poison is not real poison. Sense-objects are the real poison. Poison kills one life, but sense-objects can devastate a series of lives. - Swami krishnananda

Wednesday 4 November 2015

స్వామి చిన్మయానంద సూక్తి


Prayer is not to change the pattern around you, but to give you protection from it. We do not travel in a boat to stop the waves, but the sides of the boat do protect us from the raw, direct hits of the waves.

- Swami Chinmayananda

Sunday 1 November 2015

హిందూ ధర్మం - 182 (మాక్స్ ముల్లర్ కుట్ర -1)

భారతదేశంలో, హిందూ ధర్మంలో పుట్టి సనాతనధర్మాన్ని ధార్మిక కోణంలోకాక, కమ్యూనిష్టు, బ్రిటిష్ కోణంలో, ద్వైతకోణంలో చూసే వారంతా కూడా Outsiderలే. ఇక్కడ ద్వైత కోణం అంటే ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత సిద్ధాంతాలు కాదు, సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, జననమరణాలు, స్వర్గ నరకాలనే ద్వందభావాలు. దేవుడు ఉంటే, దెయ్యం  ఉంటుంది, లేదా దెయ్యం ఉంటే, దైవం ఉంటుందన్న భావజాలం. నిజానికి ఈ భావజాలం హైందవేతర మతాలకు సంబంధించినది. ఈ ధర్మంలో సుఖదుఃఖాలు, జననమరణాలే కాక వాటికి అతీతమైన స్థితి కూడా ఉంది. అది యోగం ద్వారా సిద్ధిస్తుంది. దాని పై అవగాహన లేకుండా ధర్మానికి వ్యాఖ్యానాలు చేసేవారు, ధర్మాన్ని విమర్శిస్తూ రచనలు చేసేవారంతా Outsiderలే. రాజకీయ కారణాల కోసం కొందరు తాము హిందువులమని చెప్పుకోవచ్చు. ఇంకొందరు ఇంకొంచం ముందడుగు వేసి, తాము హిందువులైనందుకు గర్విస్తున్నామని చెప్పచ్చు. కానీ ధర్మాన్ని ధార్మికేతర కోణంలో చూస్తున్నందున వీరంతా Outsiderలే. వీరు అంతరంగమేమిటో దేవుడికే తెలియాలి. వీరు అత్యంత ప్రమాదకరం. అదే సమయంలో పుట్టుకతో హిందువు కాకపోయినా, ఈ ధర్మాన్ని స్వీకరించి, దాన్ని యాధతధంగా పాటించి, సిద్ధి పొందిన విదేశీయులను Insiders అనవచ్చు. దానికి ఉదాహరణ డేవిడ్ ప్రాలే గారు. ఇప్పుడు వారి నామం పండిత వామదేవ శాస్త్రి. జన్మతః హైందవేతరుడైనా, హైందవాన్ని స్వీకరించి, ఇందులో సిద్ధి పొంది, ధార్మిక కోణంలో అనేక రచనలు చేశారు, ధార్మిక దృష్టితో, ధర్మంపై వ్యాఖ్యానం చేశారు.

విషయంలోకి వస్తే ఈ మాక్స్ ముల్లర్ Outsider. అతనికి ధర్మం పట్ల ఏ విధమైన అవగాహనలేదు. వేదానికి భాష్యం రాయమని పని అప్పగించిన ఆంగ్లేయులు కూడా  Outsiderలే. వీరి ఇద్దరి ఉద్ద్యేశం ధర్మాన్ని నాశనం చేయడమే. ఆ భావనతోనే మాక్స్ ముల్లర్ రచన సాగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాక్స్ ముల్లర్ సంస్కృతాన్ని కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అధ్యయనం చేశాడు. వేదాలను అర్దం చేసుకోవాలంటే వాటితో పాటు వేదాంగాలను కూడా సరిగ్గా అర్దం చేసుకుని ఉండాలి. అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం, శమదమాలు, బ్రహ్మచర్యం, సత్యం, శౌచం ఇత్యాది గుణాలు అలవర్చుకుని ఉండాలి. కానీ మాక్స్ ముల్లర్ ఇవేమి చేయలేదు. ఇంతకముందు మనం చెప్పుకున్న 6 రకములైన అర్దాలే కాక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అర్దాలను వేదానికి చెప్తారు. ఈ 3 విధములైన అర్దాలు కలిగంది కాబట్టే వేదానికి 'త్రయి' అనే పేరు కూడా ఉంది. ఇంతకముందు మనం చెప్పుకున్నాం, వేదంలో ఉండేది చాలా పైస్థాయి పదజాలం (High-end terminology) అని. దానికి అర్దాలు కూడా అలాగే ఉంటాయి. అదే సమయంలో ప్రకరణము- సమయం అనే కోణం కూడా ఉంటుందని ఉదాహరణతో వివరించుకున్నాం. కానీ మాక్స్ ముల్లర్ ఇవేమీ పట్టించుకోలేదు. ఉన్నతమైన అర్ధాలు కలిగిన వైదికపదాలకు సామన్య సంస్కృత పదాలకు, వాడుకలో ఉన్న సంస్కృత పదాలకు ఉండే అర్దాలను అన్వయం చేసి, భాష్యం అందించాడు. ఇదే పెద్ద తప్పు. అదీగాక దీని వెనుక వారికున్న ఉద్ద్యేశం కూడా కుట్ర పూరితమైనది. అది భారతదేశాన్ని క్రైస్తవంలోకి మార్చడమే.

ఈ.బి. పుస్సే(E.B.Pussey) మాక్స్ ముల్లర్‌కి రాసిన లేఖలో 'భారతదేశాన్ని మతమార్పిడి చేసే ప్రయత్నాలకు ఉపయుక్తంగా మీరు చేసిన కార్యం నూతన శకానికి నాంది పలికింది. ఈ విషయంలో మీకు పని అప్పగించినందుకు గానూ ఆక్స్‌ఫోర్డ్ మీకు కృతజ్ఞతతో ఉంటుంది. మీరు చేసిన కార్యం మతమార్పిడుల విషయంలో ప్రాధమిక మరియు శాశ్వత ప్రాముఖ్యతను కలిగి, మన పనిని సులభతరం చేసింది, మరియు పూర్వపు అబద్దపు మతాన్ని మీరిచ్చిన ఉదాహరణలతో పోల్చి చూచుటకు మాకిది అవకాశాన్ని కలిగించినందుకు సంతోషంగా ఉంది' అని అన్నారు.  

To be continued ..............