Thursday 30 November 2023

శ్రీ గరుడ పురాణము (20)

 


అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మశుడు, అర్థవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా ఆరువేలమంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు.


* వసిష్ఠునికి పత్ని ఊర్జాద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు. (*ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు)


శివశంకరా! దక్షప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి * పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమ ఓజస్వులు. 

* ఈ త్రేతాగ్నులలో విద్యుత్సంబంధియైన అగ్ని పావకం. ఘర్షణ ద్వారా వచ్చేది పవమానం. సూర్యుని లోనిది శుచి. కూర్మ పురాణంలో ఇలా చెప్పబడింది. పావకః పవమానశ్చ శుచి రగ్నిశ్చ తేత్రయః |


నిర్మథ్యః పవమానః స్యాద్ వైద్యుత పావకః స్మృతః ॥

యశ్చాసౌ తపతే సూర్యః శుచిరగ్ని స్త్వ సౌ స్మృతః |


(1-12/25,26)

దక్ష కన్యయైన స్వధకు మేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు 'బ్రహ్మవాదినులు' మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడూ, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి.


అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వాయంభువమనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వాయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధతేజస్వినీ, తపస్వినీయైన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్నీ క్రమంగా రుచి ప్రజాపతికీ, దక్ష ప్రజాపతికీ, కర్దమమునికీ ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకూ దక్షిణయను కూతురూ జన్మించారు. యజ్ఞునికి పన్నెండు మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే 'యామ' అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు.


Wednesday 29 November 2023

శ్రీ గరుడ పురాణము (19)

 


మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి -


సృష్టి విస్తారం


శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు.

రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్హిషద, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు. చివరి నలుగురూ మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.


కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్ఠం (కుడి బొటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు.


దక్షుడు ఒక అసాధారణ రూపవతీ, సుందర సులక్షణ లక్షిత జాతాయగు (తన) ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులూ, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు.


మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు.


మరీచి - సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలీ, కుహూ, రాకా అనుమతీ నామక కన్యలు కలిగారు.


Tuesday 28 November 2023

శ్రీ గరుడ పురాణము (18)

 


తరువాత బ్రహ్మయొక్క సత్త్వగుణ మాత్రవల్ల ఆయన ముఖంనుండి దేవతలుద్భవించారు. తరువాత ఆయన సత్త్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దానినుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం. తరువాత బ్రహ్మయొక్క సాత్త్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్త్విక శరీరాన్ని వదలిపోయినపుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికీ రాత్రికీ మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినపుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు.


తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనులునగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరినుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్షశబ్దానికి తినుటయని అర్ధము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసనపాములకూ తగిలింది. అందుకే వాటికి క్రోధ మెక్కువ. తరువాత బ్రహ్మనుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడే వారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు.


తరువాత ప్రజాపతియైన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము (మేక), ఉదరమునుండి గోవు, పార్శ్వాలనుండి ఏనుగు, గుఱ్ఱము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింసకాలు, పశువులు (ఇది ఒకదశ), రెండు గోళ్ళ (గిట్టల) జంతువులు, నీటిక్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు.


బ్రహ్మయొక్క పూర్వాది నాల్గు ముఖాలనుండి క్రమంగా ఋగ్యజుస్సామాథర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్నీ, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్నీ శూద్రులకు గంధర్వలోకాన్నీ నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్నీ, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్నీ, సన్యాసులకూ పరమతపో నిధులకూ అక్షయలోకాన్నీ ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు.


(అధ్యాయం - 4)


Monday 27 November 2023

శ్రీ గరుడ పురాణము (17)

 


దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే వుంటుంది. ఆ పరమాత్మయే స్వయం స్రష్టయగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు, విష్ణు రూపంలో దాని ఆలనా, పాలనా చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నయైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవా! ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను.


అన్నిటికన్నముందు ఆ పరమాత్మనుండి మహత్తత్త్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల - అనగా - రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల - ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, *నిప్పు (* నిప్పులో అగ్ని, తేజస్సు అంతర్భాగాలు. మండించేదీ కాంతినిచ్చేదీ కూడా నిప్పే), గాలి, నింగి సృష్టింపబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గయని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలూ, వృక్షాలూ మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికాపేరు వచ్చింది. అయిదవది తిర్యక్ సర్గ. పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలూ, ఏడవ సర్గలో మానవులూ సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ స్రోతా, అర్వాక్ స్రోతాతా సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకీ, మానవులది క్రిందికీ చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్త్విక తామసిక గుణ సంయుక్తం. ఈ యెనిమిది సర్గలలో అయిదు వైకృతాలనీ, మూడు ప్రాకృత సర్గలనీ చెప్పబడుతున్నాయి. అయితే, తొమ్మిదవదైన కౌమారనామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు రెండూ చేయబడతాయి.


రుద్రాది దేవతలారా! దేవతల నుండి స్థావరాల వఱకూ నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మనుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది. అపుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మనుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘలనుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకరా! అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకీ రాక్షసులకీ అందుకే రాత్రి అంటే చాల ప్రీతి.


Sunday 26 November 2023

శ్రీ గరుడ పురాణము (16)

 


సృష్టి - వర్ణనం


'హే జనార్దనా! సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి' అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. (* సర్గయనగా సృష్టిలో నొక దశ. ఒక మెట్టు.


ఖగవాహనుడు కాలకంఠాదుల కిలా చెప్పసాగాడు :


'పరమేశ్వరా! *సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి.


నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న, పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే.


జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ(తరువాత ఆయన నుండియే) ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వి పుట్టాయి.


పరమేశ్వరా! దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వ ప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు.


Saturday 25 November 2023

శ్రీ గరుడ పురాణము (15)



గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు


“శౌనక మునీంద్రా! సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను.


ఇందులోని వివిధ అంశాలేవనగా సర్గ వర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణ ధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థము, ఉత్తమజ్ఞానం, ముఖ్యంగా విష్ణుభగవానుని మాయామయ, సహజలీలల విస్తార వర్ణనం.


వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడమహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణు వాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయకార్యాలలో కూడా పాలుపంచుకొంటున్నాడు. దేవతలను జయించి, అమృతాన్ని తెచ్చి యిచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు.


విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలూ ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడుడే దానిని తీర్చాలి. హరి శివాదులకూ, హరిరూపుడైన గరుడుడు కశ్యపమహర్షీకీ చెప్పిన ఈ పవిత్రపురాణం తనను ఆదరంగా చదివే వారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను.


(అధ్యాయం - 3)


Friday 24 November 2023

శ్రీ గరుడ పురాణము (14)

 


అప్పుడు "నేను ('నేను' అనగా విష్ణువు) ఇలా ఆశీర్వదించాను. 'ఓ పక్షిరాజా! నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతల నందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తిసంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలనూ విరిచి వేసే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహితరూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మాహాత్మ్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే 'గరుడ పురాణ' మను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది.


ఓయి వినతాసుతా! దేవగణాలలో ఐశ్వర్యానికీ శ్రీరూపానికీ నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ యీ గరుడపురాణానికుంటుంది. విశ్వంలో నా సంకీర్తనజరిగే ప్రతి చోటా నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి పురాణ ప్రణయనాన్ని గావించు'


ఇంతవఱకూ చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. 'పరమశివా! నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడీ పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్యా బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించ గలిగాడు. గరుడుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు.


*యక్షి ఓం ఉం స్వాహా అనే మంత్రాన్ని జపిస్తే గారుడీ పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవా! నా స్వరూపంచే పరిపూర్ణమైన, గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరూ వినండి.


(అధ్యాయం - 2)


''యక్షి ఓ( ఉం స్వాహా' గానే దీన్ని పఠించాలి. అంటే ఓ తరువాత గల 'సున్న'ని సగమే పలకాలి.      


Thursday 23 November 2023

శ్రీ గరుడ పురాణము (13)

 


రుద్రదేవా, బ్రహ్మాది దేవతలారా! నేనే అందరు దేవతలకు ఆరాధ్యదైవాన్ని, సర్వలోకాలకీ స్వామిని నేనే. దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని, పూజ్యాన్నీ, స్తుతియోగ్యుడనూ నేనే. రుద్రదేవా! మనుష్యులచేత పూజలందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేదీ, వ్రత నియమ, సదాచార, సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేదీ నేనే. నేనే ఈ సృష్టికి మూలాన్ని, స్థితికి కారకుణ్ణి, దుష్ట నాశకుణ్ణి, శిష్టరక్షకుణ్ణి. నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్నీ పాలిస్తుంటాను. మంత్రాన్నీ నేనే, దాని అర్థాన్నీ నేనే. పూజవల్ల, ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్త్వాన్ని నేనే. స్వర్గాదులను సృష్టించినది నేనే ఆ స్వర్గాదులూ నేనే. యోగినీ యోగాన్నీ అధ్యయోగాన్నీ - పురాణాన్నీ నేనే. జ్ఞాతను, శ్రోతనూ, మనన కర్తనూ కూడా నేనే. సంభాషింపబడు విషయాన్నీ, సంభాషించే వ్యక్తినీ నేనే. ఈ జగత్తును నేనే. అందులోని సమస్త పదార్థాలూ నా స్వరూపాలే. భోగ, మోక్షప్రదాయకమైన పరమ దైవాన్ని నేనే. ధ్యానం, పూజ, వాటి ఉపచారాలు, సర్వతోభద్రాది మండలాలు నేనే. హే శివాది దైవతములారా! నేనే వేదాన్ని. ఇతిహాసస్వరూపుడను, సర్వజ్ఞానమయుడను, సర్వలోకమయుడను, బ్రహ్మాది దేవతల ఆత్మ స్వరూపుడను నేనే. సాక్షాత్ సదాచారాన్నీ, ధర్మాన్నీ, వైష్ణవాన్నీ, వర్ణాశ్రమాన్ని వాటి వెనుక నున్న సనాతన ధర్మాన్నీ నేనే. యమ నియమాలూ, వ్రతాలూ, సూర్య చంద్ర మంగళాది గ్రహాలూ నేనే


ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్పతపస్సు ద్వారా నన్నారాధించాడు. అతని తపస్సువల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో" అన్నాను.


'దేవదేవా! నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు. ఆమెను ఆ దాసీత్వగ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి. మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలచిపోతాను. మీరు వరమిస్తే మహాబలశాలిగా, మహాశక్తిశాలిగా, సర్వజ్ఞునిగా, పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే వుంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికీ మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన' అని వరంకోరుకున్నాడు గరుత్మంతుడు.


Wednesday 22 November 2023

శ్రీ గరుడ పురాణము (12)

 


కొలనులో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్య చంద్రులూ గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశవుంజంలో మేఘాలు, అంగ సంధులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలచి వుంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆదియైన అనాది తత్త్వమాయనది. అట్టి నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలయినవో ఆ పరమాత్మ వద్దకేపోయి పరమ సారతత్త్వజ్ఞానమును పొందవలసివున్నది' అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు.


వ్యాసమునీంద్రా! ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామంచేసి స్తుతులొనర్చాం. పరమసారతత్త్వ స్వరూపుడగు విష్ణువు ద్వారానే ఆ పరమతత్త్వముయొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచివుండగా పరమేశ్వరుడు మా అందరి తరఫునా మహా విష్ణువునిలా ప్రార్ధించాడు. హే దేవేశ్వరా! హరే! దేవాధిదేవుడెవరో పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్త్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపఱచగలమో, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏయే ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమెట్టిది, ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది, దీనిని పాలించేదెవరు, ఆయన ఏయే అవతారాలనుధరించి ఈ పనిని చేస్తాడు, ప్రళయ కాలంలో ఈ విశ్వం ఎవరిలో కలసి పోతుంది, సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి. ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై వుంది. ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్త్వం, నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్త్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మాహాత్మ్యాన్నీ ధ్యానయోగాన్నీ కూడా విని తరించాలని వుంది. దయచేసి మమ్ము కృతార్ధులను చేయండి'.


అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మాహాత్మ్యాన్నీ, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్నీ, యోగాదిక నియమాలనూ, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్నీ ఈ విధంగా ప్రసాదించాడు.


Tuesday 21 November 2023

శ్రీ గరుడ పురాణము (11)

 


ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెఱచి మమ్ము చూడగానే ప్రణామం చేసి 'హే సదాశివా! మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీ కంటె గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింత వరకూ ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమ దేవతా స్వరూపముంటే, మమ్ము కరుణించి ఆ పరమసారతత్త్వాన్ని మాకూ అనుగ్రహించండి' అని అడిగాను.


'బ్రహ్మాది దేవతలారా! నేను సర్వఫలదాయకుడూ, సర్వవ్యాపీ, సర్వరూపుడూ, సర్వప్రాణి హృదయనివాసి పరమాత్మా సర్వేవరుడూనగు విష్ణుభగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవా!ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్నీ, జటా జూటాన్నీ ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనైవుంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడూ, అద్వైతుడూ, జయశీలుడూ, నిరాకారుడూ, సాకారుడూ, పద్మనాభుడూ, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడూ అయి వుండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తూన్నాడో ఆ పరమపద పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్త్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి పదండి' అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు.


'సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయ కాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనై వుంటాను కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గ్రుచ్చబడిన మణులలాగ మనమంతా సత్త్వరజస్తమోగుణములతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాధికభుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులకే శ్రేష్టుడు, సత్యాలలో పరమ సత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణపురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయ కాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డ వాడునగు ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తున్నాను.


సత్ అసత్ రూపాలకు ఆవల, సత్య స్వరూపుడై, ఏకాక్షర (ఓంకారం) ప్రణవానికి మూలమై దేవ, యక్ష, రాక్షస, నాగ గణాలచే అర్చింపబడు విష్ణువునే నేనూ అర్చిస్తాను.


Monday 20 November 2023

శ్రీ గరుడ పురాణము (10)

 


ఇవికాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీమహా విష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతిచరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు." (అధ్యాయం - 1)


గరుడ పురాణ వక్తృ - శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన, 

గరుడునికి పురాణసంహిత వరదానం


శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని వుందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమపౌరాణికుడైన సూతమహర్షి ఇలా ప్రవచించసాగాడు.


"బదరికాశ్రమంలో ఒకకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో వుండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండి పోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను.


'గురుదేవా! మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులనీ నాకు బోధించండి. మీరింతసేపూ ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారనీ కూడ నాకు అవగతమైనది అని అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో 'నాయనలారా' నాకు ధ్యానంలో గోచరించేది శ్రీమహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడమహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.


ఒకమారు నారదుడు, దక్షప్రజాపతి, భృగుమహర్షి, నేనూ సత్యలోకానికి వెళ్ళాము. ఆదిబ్రాహ్మణుడు, గురువులకే గురువు, సృష్టికర్తయైన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవ దేవేశ! సర్వ వేదసారము, సర్వజ్ఞాన సారమూ మీరే! మాకు సారతత్త్వాన్ని అనుగ్రహించండి' అని ప్రార్థించాం.


'సర్వశాస్త్రసారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకూ, శివునికీ, అన్యదేవతలకూ దీనిని వినిపించాడు, అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు.


Sunday 19 November 2023

శ్రీ గరుడ పురాణము (9)

 


ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలో నున్న పృథ్వినుండి దుగ్ధమునువలె అన్నాదికములనూ ఔషధరాశులను పిండి, పితికి మానవ జాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమయింది.


భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినపుడు విష్ణువొక బ్రహ్మండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వతమనువును ప్రాతినిథ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు.


కూర్మావతారం మహావిష్ణువుయొక్క పదకొండవ అవతారం. క్షీరసాగర మథనవేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం వైద్యశాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం, దేవతలను తన్ని అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి, మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది.


పదునాల్గవదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారినుండి ప్రహ్లాదునీ, సకల లోకాలనూ రక్షించాడు. పదిహేనవదైన వామనావతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవఱకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలనూ దేవేంద్రుని న్యాయ, సక్రమ, వైదిక పాలనలోనికి తెచ్చాడు.


(*అవతరణమనగా దిగుట. కాబట్టి 'వామనావతరణ' పద ప్రయోగం దోషం కాదు.)


పదహారవదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి, పరిష్కరించి, బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీమహావిష్ణువు దానవసంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరాముడను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క పందొమ్మిదవ, ఇరువదవ అవతారాలు బలరామ, శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారిచేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూ భారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా 'బుద్ధ' నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం. ఇరవైరెండవ అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినపుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణునింట 'కల్కి' అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు.


Saturday 18 November 2023

శ్రీ గరుడ పురాణము (8)

 


ఈ గరుడ మహాపురాణము సారభూతము. విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు, తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యపమహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు.

దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణరహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు.

మునులారా! ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా* (సనక, సనందన సనత్కుమార, సనత్సుజాతులు కౌమారసర్గులు) అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితి కారకుడైనాడు. మూడవ అవతారం ఋషి. నారదుడను పేరుతో జన్మించి 'సాత్వతతంత్ర' (నారద పాంచరాత్ర) బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది 'నరనారాయణ' అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షకోసం కఠోరతపస్సు చేశాడు. దేవతలూ దానవులూ కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. అయిదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసి పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు.

ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్నివందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్కమహారాజుకీ, ప్రహ్లాదునికీ బ్రహ్మ విద్యను పదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వాయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి, అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు. ఎనిమిదవ అవతారం బుషభదేవుడు. కేశవుడే నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి, నియమాల నేర్పఱచి సర్వాశ్రమాలచేత నమస్కరింపబడేటంత శ్రేష్ఠంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధముచేశాడు.

Friday 17 November 2023

శ్రీ గరుడ పురాణము (7)

 


అక్కడ లోకకళ్యాణం కోసం వేలాదిమునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది వెయ్యేళ్ళ పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే తెంచిన వారిజ్ఞానం నిమిషనిమిషానికి పెరిగి పోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం?


ఒకనాడక్కడికి సర్వశాస్త్రపారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంత చిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థ యాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంత దర్శియైన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనకమహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకొని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెఱచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు.


తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్ధించాడు: 'హే సూతదేవా! మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకీ శ్రేష్టుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు నెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవ దేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడౌతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర వుంటే ఎలా వుంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతీ! వీటినీ, అవసరమైన చోట అన్య విషయాలనూ బోధించి మమ్ము ధన్యులను, జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి."


ఒక్క నిముషంపాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులుతెఱచి చెప్పసాగాడు. సూతమహర్షి :


"శౌనకదేవా! ఇతర మునీంద్రులారా! మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేనూ ధన్యుడనౌతాను.


Thursday 16 November 2023

శ్రీ గరుడ పురాణము (6)

 

గరుడ పురాణం


ఆచారకాండ


శ్రీకృష్ణచంద్ర పరబ్రహ్మణేనమః


విష్ణుభగవానుని మహిమ అవతార వర్ణనం


భారతీయము, వైదికమునగు సాంప్రదాయంలో 'జయ' శబ్దానికి గల ఆధ్యాత్మి కార్ధము పురాణమని, మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడంగాని చదవడంగాని మొదలు పెట్టినా ముందీశ్లోకాలుండాలి.


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం | 

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ |


నారాయణునికీ, తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికీ, చదువుల తల్లి సరస్వతీ దేవికీ, వాఙ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయ గ్రంథమును ప్రారంభించాలి.


అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం 

శివమమలమనాదిం భూత దేహాది హీనం | 

సకల కరణ హీనం సర్వభూత స్థితం తం 

హరిమమల మమాయం సర్వగం వంద ఏకం ॥

నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం |

దేవీం సరస్వతీం చైవ మనోవాక్కర్మభిః సదా॥


(ఆచార...1 /1,2)


పుట్టుకగాని ముసలితనముగాని లేని కల్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞాన స్వరూపుడు, విశుద్ధచారిత్రుడు, అనాదియైన వాడు, పాంచభౌతికశరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానముకలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడునగు శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీ హరికీ, శివునికీ, బ్రహ్మకీ, గణేశునికీ, సరస్వతీ దేవికీ సర్వదా నమస్కరిస్తుంటాను.


ఇది పురాణ లేఖకుని వచనము.


ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము.


(' నైమిశారణ్యమనే మాట సరైనది కాదు.


* సంస్కృత వ్యాకరణంలో 'ఆదివృద్ధి' అని ఒక ప్రక్రియ వుంది. దీనిని బట్టి పదం మొదటిలో వుండే 'ఇ' 'ఆ పదానికి సంబంధించిన' అనే అర్థంలో 'ఐ' గా మారుతుంది.


శివ - శైవ, విష్ణు - వైష్ణవ, నిమిష - నైమిష)


Wednesday 15 November 2023

శ్రీ గరుడ పురాణము (5)

 


ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలిబద్ద, వందినీ, హృదయాసక్తాది ముద్రలనెలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో వుంది. (1-11)


భీష్ముడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికుపదేశించిన విష్ణుసహస్రనామం గరుడపురాణంలో కనిపిస్తుంది. (1-14). మన దురదృష్టం వల్ల ఈ మహా మంత్రం కూడా విష్ణు పంజరస్తోత్రం (1-13), మృత్యుంజయ మంత్ర జప మహిమ (1-16) వంటి మహా విషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది. ఓంజుంసః అనే మూడక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయమంత్రం. ఇతరత్ర దుర్లభమైన అమ్మృతేశ్వరారాధన, షడంగ పూజా విధానం కలవు. ప్రాణేశ్వరీ విద్యా వుంది. విషానికి మంత్రః-ఔషధ విరుగుడు, గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి.


నిజానికి గరుడపురాణం ఒక మంత్రశాస్త్రం. అరుదైన మంత్రాల మంజూష పంచముఖ శివుని పూజా విధానం, త్రిపురేశ్వరీ సాధన, విషదూరక మంత్రలు కలవు. గోపాల మంత్రం దానితో బాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాలదేవతారాధన విధి చెప్పబడింది. ఇలా వందలకొద్దీ మంత్రాలు, బీజాక్షరాలు, హయగ్రీవ మూలమంత్రం - పూజనావిధి. గాయత్రిమంత్రోపాసన, ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్ధపాదం (1-35) వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, శాలగ్రామ, రత్నశాస్త్రాలు మున్నగు ఎన్నో విషయాలు గరుడపురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి. గారుడి విద్య గరుడపురాణానికి ప్రత్యేకం.


గరుడపురాణం వైష్ణవ పురాణమేయైనా ఇందులో శివరాత్రి మాహాత్మ్యముంది. (1-24) ఎవరికోగాని తెలియని శివుని అవతారాలున్నాయి. అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం, సర్వకామప్రద విద్య, విష్ణు ధర్మాఖ్య విద్య గరుడపురాణంలో ఉపదేశింపబడ్డాయి. వీటిని ఉపాసించువారికి అపజయముండదు. గారుడీ విద్య (1-197) సకల శుభకారకము.


ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వమే వుంది. మదనకేళిలో ఎంతమందినైనా సంతృప్తిపరచగలిగే మందులు (తయారీ, వినియోగ, అనుపాన విధానాలతో సహా) ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అదృశ్య రూపానికీ, ప్రకృతిని స్వల్పంగా జయించడానికి, నిత్యయవ్వనానికీ, పునర్వివాహానికి - ఇలా స్త్రీ, పురుషులు మనసారా కోరుకొనే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకొనే సాధనాలెన్నో వున్నాయి.


దీనిని పురాణంగా పల్లెటూళ్ళలోగాని, పట్టణాలలో చెప్పి రక్తి కట్టించడం కష్టమనే ఒక దురభిప్రాయం ఈ పురాణ రావలసినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల ఈ పురాణమొకటుందనే విషయాన్నే ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినపుడు వ్యాసమహర్షి వ్రాసిన పురాణం కనుమరుగైపోతుందనే భయంతో ప్రేతఖండాన్ని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపరకర్మ జరిగే రోజులలో పఠించాలని విధించి వుండవచ్చు. కాలక్రమాన గరుడపురాణం గురించి ఎవరైనా "ఇది నాకు పూర్తిగా కావాలి" అని అడిగినా అలసత్వం కొద్దీగాని, దుర్వినియోగమవుతుందనే భయం కొద్దిగాని సంస్కృతంలో వున్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకొనిరాకపోయి వుండవచ్చు. అందుకే తెలుగులో సంపూర్ణ గరుడపురాణం కనబడుట లేదు. చివరికి ఈనాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం వున్నవాడు దేనికీ భయపడడు అనే ఋషి వాక్యాన్ని సార్థకం చేస్తూ ఒక పబ్లిషర్, ఒక అనువాదకుడు ఈ మహత్తరమైన పురాణాన్ని తెలుగువారికి అందింపచేసే ప్రయత్నం జరిగింది.


ఆశీర్వదించండి. నా ఊహ పొరపాటైతే, మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. 


డా|| యిళ్ళాయి నారాయణరావు 

అనువాదకుడు


Tuesday 14 November 2023

శ్రీ గరుడ పురాణము (4)

 


ఇది నా ఊహ మాత్రమే....


డా॥ యళ్ళాయి నారాయణరావు


గరుడ పురాణమును ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణ శ్రవణము చాలా ప్రశస్తము. ఇంట్లో ఆ గ్రంథముండకూడదని మాత్రము కాదు.... అని ఆంధ్ర పౌరాణికులకు ఆరాధ్య దైవం. పౌరాణిక సార్వభౌమ, పురాణోపన్యాస కేసరి, తెలుగువాడికి తెలిసిన ఏకైకక అభినవసూతమహర్షి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు తన స్వంత లెటర్ హెడ్పై 1-7-2006 న పేర్కొంటూ పలువురి సంశయాలకు తెరదించారు.


ఇక ఏ పురాణానికి ఇలాటి ప్రమాణ పత్రాన్నివ్వవలసి రాలేదే! మిగతా భాషల పౌరాణికసత్తములెవరికీ కూడా ఈ గరుడ పురాణానికి ఇటువంటి వివరణ పత్రమునివ్వవలసి రాలేదేందుకని?


ఎందుకంటే ఒక్క తెలుగువారి ఇళ్ళల్లోనే గరుడ పురాణం చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు. ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అన్నారని అనేసుకోవడమే. ఇలా ఎందుకు జరిగింది? వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో కోపం వల్లనో ఆయన కూర్చిన గ్రంథాన్ని అప్రతిష్టపాలు చేశారనుకోలేము కదా! ఎందుకంటే ఆయన మనకు దైవసమానుడే. మన మత గ్రంథాలలో సింహభాగం ఆయన ప్రసాదాలే.


ప్రేతఖండం వుంది కాబట్టి 'ఆ' పన్నెండు రోజుల్లో తప్ప ఇంకెప్పుడూ ఈ పురాణాన్ని చదవకూడదు అని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరపబడిన మిగతా విషయాలను పట్టించుకోరేమి? మొత్తం పురాణంలో 320 అధ్యాయాలుంటే ఈ 'అందరినీ భయపెట్టిన' ప్రేతఖండం లేదా ప్రేతకాండ 50 అధ్యాయాలలోనే వుంది కదా! మరి మిగతా 270 అధ్యాయాలలో నున్న మహా విషయాన్నెందుకు చదవకూడదు? అసలు ఆ అధ్యాయాలలో ఏముంది?


సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థమాహాత్మ్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, విష్ణుదేవుని మాయామయ, సహజ లీలల విస్తార వర్ణనం ఇవన్నీ ఈ పురాణంలో వున్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడపురాణమంటే ప్రేతఖండమొక్కటే అనే అపపప్రథను ప్రజల హృదయాలలో ముద్రించారు.


శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా 'ఖం ఠం ఫం షం గదాయై నమః' వంటి అరుదైన బీజ యుక్త గుప్తమంత్రాలున్నాయి. (1-7) 'హ్రా గుణింతంలో షడంగన్యాసముంది. విశేషమేమిటంటే గరుడపురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మున్నగువారి అవసరమున్నట్లు చెప్పబడలేదు.


న్యాసానికీ, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలూ బీజక్షరాలతో సహా వున్నాయి. అజ్ఞానాన్నీ, అనైశ్వర్యాన్నీ కూడా పూజించగలిగే సంస్కారమిందులో వుంది.


Monday 13 November 2023

శ్రీ గరుడ పురాణము (3)

 


ఇది వైష్ణవ పురాణమే గాని ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమై పోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివునిగూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంధ, విశాఖ, దుర్గ సప్తమాతృకల పూజావిధానము బోధింపబడినది. బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవత పూజలెలా చేయాలో ఇందు పొందు పరుపబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వరస్వామి అర్చన గరుడపురాణంలో ప్రతిపాదింపబడింది.


తత్త్వమసి, అహంబ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మమున్నగు బ్రహ్మపదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి.


గరుత్మంతుని పేరనే ఒక పురాణముండాలని విష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా వుండాలి కదా! అది చాలా వఱకు పురాణంలోనే చెప్పబడింది. ఏవో రెండు మూడు విషయాలను మాత్రం యిక్కడ ప్రస్తావిస్తాను.


హిందూమతానికి మహాశ్రయం కోవెళ్ళు. అటు వున్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో వుండేవేవీ శివ కోవెలలో నుండవు. (ఒక్క క్షేత్రపాలకులైన త్రిమూర్తులు తప్ప) కాని గరుడుడు అన్ని కోవెళ్ళలోనూ వుంటాడు. శివాలయాలలోనే అధికంగా కనిపించే నవగ్రహ మంటపం గరుడచిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయేనని పెద్దలంటారు. కలియుగంలో హిందూమతానికి పరమాశ్రయమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరనొక కొండయే వుంది. (గరుడాద్రి). గరుడధ్వజం పరమపుణ్యప్రదం. సాగరమధ్యంలో, ఆకాశదేశాన ప్రయాణిస్తున్నవారికి గరుడధ్వజమొక ప్రాణాధారం. అంతవఱకెందుకు స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సంబారానిదే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి. ఇది యాత్రికులకు తెలుస్తుంది. ఆ రోజే ఆకాశంలో గరుడపక్షులు గిరికీలు, ఆకాశంలో సప్తవర్ణాలు గోచరిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుంది. ఇదీ గరుత్మంతుని మాహాత్మ్యం. ఇందుకే వైష్ణవులంతా ఆయనను 'గరుడాళ్వారు' అని మిక్కిలి భక్తితో కొలుస్తారు. అందుకే మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలచాడు.


కాబట్టే ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం. అక్షర జ్ఞానమున్నవారందరికీ ఆవశ్య పఠనీయం.


Sunday 12 November 2023

శ్రీ గరుడ పురాణము (2)

 


శ్రీకృష్ణ గరుడ సంవాదరూపంలోనున్న బ్రహ్మలేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైతసిద్ధాంతి బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిదంపూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి - తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసునీ ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర కేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి.


గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు:


మిగతా పురాణాల్లో ఎలాగూ వున్నాయి కదా అనో యేమోగాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనబఱుపబడినట్లు తోస్తుంది. పూర్వఖండంలోని 240 అధ్యాయాలున్నా ఈ పంచ లక్షణాలు 14 అధ్యాయాలల్లోనే కనిపిస్తాయి. 4,5 అధ్యాయాల్లో సర్గ, ప్రతిసర్గలూ, ఆరవ అధ్యాయాలో దేవతల, ఋషుల వంశాలూ, 87-90, అధ్యాయాల్లో రాజవంశాలూ అదీ మరీ సంక్షిప్తంగా, 54-58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్ట్యంతమూ చర్చింపబడ్డాయి. మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే.


గరుడపురాణం వైష్ణవ పురాణమే. విష్ణు సహస్రనామం మరొకటి (అంటే భారంతంలో భీష్ముడు చెప్పింది కాక) ఇందులో కనిపిస్తుంది. విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది. పాంచరాత్ర సూత్రాలనూ వైష్ణవ సంప్రదాయాన్నీ అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి నాలుగు వ్యూహాలే వుండగా ఇందులో తొమ్మిది వ్యూహాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలయిదే వుండగా గరుడ పురాణంలో తొమ్మిది పేర్కొనబడ్డాయి.


(1-12, 13,14)


సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది. ఆయన యొక్క పన్నెండు అవతారాలొకచోటా, ఇరవై రెండు అవతారాలు మరొకచోటా వర్ణింపబడ్డాయి. ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని పదునాల్గు నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణ కీర్తన స్మరణాది భక్తి మార్గాలను, ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది.


Saturday 11 November 2023

శ్రీ గరుడ పురాణము (1)

 


శ్రీకృష్ణ చంద్రపరబ్రహ్మణే నమః


గరుడ పురాణం


పురాణ పరిచయం


గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో 'పురాణం పంచలక్షణం' అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది :


సర్గో ఽస్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ 

వంశో వంశానుచరితం సంఖ్యాహేతు రపాశ్రయః॥

దశభిర్ల క్షణెర్వుక్తం పురాణం తద్విదో విదుః ।

కేచిత్పంచ విధం బ్రహ్మన్ మహదల్ప వ్యవస్థయా ॥ (భాగవతం: 12,7-9,10)


నిజానికి, ప్రతి పురాణంలోనూ, సర్గ ప్రతిసర్గవంశమన్వంతర వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే వుంటాయి. ఇక 'గరుడ పురాణం'లో 'భాగవత' కారులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి.


ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి.


ఆచారకాండ (కర్మకాండ)

ప్రేతకాండ (ధర్మకాండ)

బ్రహ్మ కాండ (మోక్షకాండ)


మొదటి కాండను పూర్వఖండమనీ చివరి రెండు కాండలనూ కలిపి ఉత్తర ఖండమనీ వ్యవహరిస్తారు. ఈ కాండలోక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడ పోలిక లేదు.


ఆచారకాండ - 240 అధ్యాయాలు

ప్రేతకాండ - 50 అధ్యాయాలు

బ్రహ్మకాండ - 30 అధ్యాయాలు


ఇక ఆచారకాండలోని ఆధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్త్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. 


ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల – అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలూ, నరకానికి మార్గమూ, ప్రేత జీవనమూ, నారకీయ శిక్షలూ, స్వప్న శకునాలూ, అపరకర్మకాండాదులూ మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింప బడింది. ప్రేతాలు చెప్పిన స్వీయకథలూ ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది.


Friday 10 November 2023

శ్రీదత్త పురాణము (312)

అంగపూజ


1. శ్రీదత్తాత్రేయాయ నమః - పాదౌ పూజయామి

యోగగమ్యాయ నమః - జంఘే పూజయామి

శ్వేతాంబరాయ నమః - కటిం పూజయామి

పద్మనాభాయ నమః - నాభిం పూజయామి

5. ధ్యాననిష్ఠాయ నమః - హృదయం పూజయామి 

చందనలిస్తమూర్తయేనమః - స్తనౌ పూజయామి

సహస్రబాహవే నమః - బాహూపూజయామి 

అక్షమాలినే నమః - కంఠం పూజయామి

10. అనుగ్రహరూపాయ నమః - ముఖం పూజయామి

యోగీశాయ నమః - నాసికాం పూజయామి 

అమృత వర్షిణే నమః - నేత్రే పూజయామి

ధర్మపరాయణాయ నమః - శోత్రేపూజయామి  

ప్రణతార్తిహరాయ నమః - లలాటం పూజయామి 

15. అనసూయాత్మజాయ నమః - శిరః పూజయామి 

జ్ఞానవిజ్ఞానయమూర్తయే నమః -  సర్వాంగాని పూజయామి.


సర్వం సంపూర్ణం

ఓం శాంతిః శాంతిః శాంతిః 


Thursday 9 November 2023

శ్రీదత్త పురాణము (311)

 ఆలర్యకృతదత్తస్తుతి


నమో నమః కారణనిగ్రహాయ స్వరూపతుచ్ఛీకృత విగ్రహాయ । 

విజ్ఞానధామ్నే సురసిద్ధసాధ్య నిషేవితాంఘ్రఽనుగృహాణ భక్తాన్ || 

అణోరణిమ్నే మహతో మహిమ్నే విశాలదేహాయ చ సూక్ష్మ వక్తయే | 

దిగంబరాయాస్తు నమో మదీయం విచిత్రనివ్యాంబరధారిణే చ ||

యోగీశవంద్యాయ సురాయ హంత్రే మహానుభావాయ నమః పరస్మై | 

వృద్ధాయ బాలాయ వయస్తమాయ కాంతాసమాలింగిత విగ్రహాయ ||


ధ్యాయంతి యద్భవభియో మునయస్సమాధౌ 

తత్త్యం సదా జితమరున్మనసో విరాగాః । 

తద్వైభవాన్ సదసతః పరమాత్మదైవం 

యస్మిన్నిమగ్నమనసో న విదుర్ద్వితీయమ్ ||

యద్ర్బహ్మ పరమం దివ్యం విజ్ఞానఘనమవ్యయమ్ । 

సత్వం సాక్షాత్పరంజ్యోతిర్నిత్యసిద్ధం సనాతనమ్ ॥


నమస్తే సర్వదేవాయ నమస్తే పురుషోత్తమ | 

నమో గిరాం విదూరాయ చేతసో నిర్గుణాత్మనే ॥ 

నారాయణ నమస్తేఽస్తు తే | 

సర్వస్మై సర్వబీజాయ వాచ్యవాచక వక్తయే ॥ 

నమః ప్రణతపాలాయ శరణాగతవత్సల | 

నమస్తే పూర్ణబోధాయ యోగీశాయ నమో నమః ॥


విశ్వంభర నమస్తేఽస్తు నమో నాగారికేతన | 

అజ్ఞానాజగరగ్రస్తం విశ్వముద్ధర గోపతే || 

శ్రీపతే భూపతే దేవ శాస్త్రయోనే నమోఽస్తు తే | 

నమో వేదాంతవేద్యాయ మానాతిగి నమోఽస్తు తే ॥ 

అజ్ఞాన తిమిరాంధస్య జనస్యామూఢచేతసః |  

జ్ఞానచక్షుః ప్రదాయాస్తు నమస్తే యోగభాస్కర ||

బ్రహ్మవంశప్రసూతాయ మునయే మౌనశాలినే | 

అనసూయాసుతాయాస్తు నమస్తే మునిసూనవే ||


నమః స్వేచ్ఛావిహారాయ వర్ణాశ్రమ వివర్జిత | 

ద్విజలింగాయ దేవాయ నమో లింగాయ యోగినే || 

బ్రహ్మబ్రాహ్మణపాలాయ నమస్తే కైటభార్దన | 

వైకుంఠోత్కుంఠితాశేష విధ్వంసక నాశన ॥ 

మురారాతే నమస్తేఽస్తు నమస్తే కేశిసూదన | 

కంసవిధ్వంసినే చేదం నమః కృష్ణాయ చాసకృత్ ||

త్వత్ప్రసాదాతృతార్ధోఽహం దేవదేవ జగత్పతే | 

యదాదిష్టం త్వయా తత్త్వం తదభ్యస్తం కరోమ్యహమ్ ||


Wednesday 8 November 2023

శ్రీదత్త పురాణము (310)

 దత్తాత్రేయ హృదయం


1. విశ్వేశ్వరో నీలకంతో మహాదేవో మహేశ్వరః 

హరిః కృష్ణా వాసుదేవో మాధవో మధుసూదనః 

జనకశ్చ శతానందో వేదవేద్య పితామహః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


2. పంచాననో మహాదేవో గౌరిమానస భాస్కరః 

బ్రహ్మానందో సభాసీనో సురలోక వరప్రదః 

వేదాననో వేదారూపా సురలోక వరప్రదః 

త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


3. కర్పూర గౌరవర్ణాంగో, శైలజామనరంజకః 

శ్యామాభః శ్రీనివాసోయో, భక్త వాంఛిత దాయకః 

పీతరక్తాంగ వర్ణాయోగాయత్ర్యాత్మ ప్రలాపకః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


4. త్రిపంచనయనో రుద్రో మహాభైరవ అంతకః 

ద్విదళాక్షో మహాకాయో కేశవో మాధవో హరిః 

అష్టాక్తో వేద సారజ్ఞో శ్రీసుతో యజ్ఞ కారణః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


5. దిగ్బాహూ మందితో దేహోమృడానీ ప్రాణ వల్లభః 

సముక్తి కృత్కార్తికేయో హృషీ కేశస్సురేశ్వరః 

పసుపాణిః తపశ్శాంతో బ్రహ్మోభ్యోమఘ భూషణః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


6. గంగాధరో మహేశానో శైలజా ప్రియ సంభవః 

గోపీ హృదయంజో యోశ్రీపతిర్భవ భంజకః 

వాగ్దేవః కామ శాంతోయో సావిత్రి వాగ్విలాసకః 

త్రిమూర్తిరూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


7. నాగప్రియో భూతనాధో జగత్సంహార కారకః 

భువనేశో భయాత్రాతా మాధవో భూతపాలకః 

విధాతా రజరూపశ్చ బ్రాహ్మణో జగ కారకః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


8. కృద్ధ క్రూర పిశాచేశో శాంభావః శుద్ధమానసః 

శాంతో దాంతో మహాధీరో గోవింద సత్వసాగరః 

అర్ధనార్థో మహాభోగో రజరూపో మహర్షికః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


9. చర్మాంభరధరో దేవో లీలా తాండవ కేశలః 

పీతాంబర పరీధానో మాయా చక్రాంతరాత్మ విత్ 

కర్మాంగ విప్రభూషోయో జగత్కారిణి కార్యధృత్ 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


10. కపాల మాలాంసు ధరో భస్మ భూష శుభప్రదః 

శ్రీవత్సః ప్రీతికరోయో వామనః పురుషోత్తమః 

యజ్ఞ సూత్రోత్తరీ భూమి వేదమార్గ ప్రభాకరః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయో గురుం నమః


11. త్రిశూల పాణి సర్వజ్ఞో జ్ఞానేంద్రియ ప్రియంకరః 

గదాపాణిశ్చ చార్వాంగో విశ్వత్రాతా జగత్పతిః 

కమండలం ధరో దేవో విధాతా విఘ్ననాశనః 

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయోగురుం నమః


12. శిలాద సూను వరదః చండాంశో చండ విక్రమః 

అరుణో విరజో దాతా భక్త మానస బోధకః 

పద్మాసనో పద్మవేత్త హంసమానస పంజరః

త్రిమూర్తి రూపో భగవాన్ దత్తాత్రేయోగురుం నమః


Tuesday 7 November 2023

శ్రీదత్త పురాణము (309)

 శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రము


ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్ర సంతుష్టాయ, మహాభయ నివారణాయ, మహాజ్ఞానప్రదాయ, చిదానందాత్మనే, బాలోవృత్త పిశాచ వేషాయ మహాయోగినే ఆవధూతాయ, అనసూయానంద వర్ధనాయ అత్రిపుత్రాయ, సర్వకామ ఫలప్రదాయ, ఓం భవబంధ విమోచనాయ హ్రీం సకల విభూతిప్రదాయ, క్రోం సాధ్యాకర్షణాయ, ఐం వాక్ర్పదాయ క్లీం జగత్రయ వశీకరణాయ, సౌఃసర్వమనః క్షోభణాయ, శ్రీం మహాసంపత్ప్రదాయ, గ్లౌం భూమండలాధి సత్యప్రదాయ, ద్రాం మహాచిరంజీవినే, వషట్ వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ, హుం విద్వేషయ, విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఠః ఠః స్తంభయ స్తంభయ ఖేం ఖేం మారయ మారయ సమస్సం పన్నాయ స్వాహా, పోషయ పోషయ పరమంత్ర, పరయంత్ర పరతంత్రాణి ఛింది ఛింది, గ్రహన్నివారయన్నివారయ, దుఃఖం హరవార దారిద్ర్యం విద్రావయ విద్రావయ, దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ, సర్వయంత్ర సర్వమంత్ర సర్వవల్లవ స్వరూపాయ ఓం నమశ్శివాయ సిద్ధాయస్వాహా!


Monday 6 November 2023

శ్రీదత్త పురాణము (308)

 దత్త పంజర స్తోత్రము


ఓం నమోభగవతే దత్తాత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంఠవాసాయ, శంఖ చక్రగదా త్రిశూలధారిణే వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞాన్యబ్రహ్మ మహావాక్యాయ, సకల లోకైకసన్నుతాయ, సచ్చిదానందాయ, సకల లోకుంచారణాయ, సకల దేవతా వశీకరణాయ, సకల రాజ వశీకరణాయ, సకలభోగ వశీకరణాయ, లక్ష్మీఐశ్వర్య సంపత్కరాయ, మమమాతృపితృ సహోదరపుత్ర పౌత్రాభివృద్ధి కరాయ, గుడోదకకలశ పూజాయ, అష్టదళపద్మ పీఠాయ, బిందుమధ్యే లక్ష్మీ నివాసాయ, ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం అష్టదళ బంధనాయ, హ్రీం హ్రీం హ్రీం హ్రీం చతుష్కోణ బంధనాయ, హ్రాం హ్రాం హ్రాం హ్రాం చతుర్ ద్వార బంధనాయ, ఋగ్ యజర్ సామా ధర్వణ ప్రణవ సమేతాయ, ఉదాత్తమదాత్త స్వరిత ప్రచయాయ, గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ దేవతాయ సకల సంపత్కరాయ, పరమంత్ర, పరయంత్ర పరతంత్ర ఉచ్చాటనాయ, ఆత్మయంత్ర ఆత్మమంత్ర ఆత్మతంత్ర సంరక్షణాయ, సదోదిత సకలమత స్థాపితాయ, సద్గురు దత్తాత్రేయాయ హూంఫట్ స్వాహా


Sunday 5 November 2023

శ్రీదత్త పురాణము (307)

 55. మేఘాడంబరశ్యామల దత్త 


56. శ్రీపాద శ్రీవల్లభ దత్త


57. దూరీకృతసురపతిభయ దత్త


58. గురుశు శ్రూషారతప్రియ దత్త


59. విష్ణుద్విజవరసన్నుత దత్త


60. కార్తవీర్యముక్తి ప్రద దత్త


61. పింగళనాగసుపూజిత దత్త


62. నిర్మల నిశ్చయ నిష్క్రియ దత్త


63. జౌదుంబరతలకేతన దత్త


64. శుద్దప్రేమసువేతన దత్త


65. డాంభిక నాస్తికనినివృత దత్త


66. సాధుబృందసంవందిత దత్త


67. పాపపుణ్యపరి వర్జిత దత్త


68. నిత్యానందసమందిత దత్త 


69. మితమాధూకరభోజన దత్త


70. వేదైకాక్షరపూజన దత్త


71. వాదవివాద తిరోహిత దత్త


72. సుఖసంవాద ప్రకాశిత దత్త


73. రాజరాజసంపూజిత దత్త


74. హీనదీన సంపూజిత దత్త


75. సన్యాశాశ్రమ బహుమత దత్త


76. నైష్ఠికవాద్య బహుమత దత్త 


77. సురనర మునిగణప్రార్థిత దత్త


78. బాహుషట్కనుపమాన్విత దత్త


79. ముఖశశిజితరజనీకర దత్త


80. రవివినుతారక భాస్కర దత్త


81. త్ర్యాధయమండితవరనుత దత్త


82. నానారూపభూషిత దత్త


83. ఆత్రేయానందప్రద దత్త


84. మంత్రతంత్రసువిశారద దత్త


85. వైదికధర్మ ప్రచారక దత్త


86. నాస్తికవాదవిదూషక దత్త


87. పాదపద్మజితపంకజ దత్త


88. అనిలాశ్వారూడాత్రిజ దత్త


89. పంచమకారసుదూరణ దత్త


90. విధ్వంసితసంస్మతినగ దత్త


91. వాగర్ధ ప్రతిపాదక దత్త


92. సత్యార్థ ప్రవిబోధక దత్త


93. పండిత గుణిజనమండిత దత్త


94. దుర్జనదుర్మదదండిత దత్త


95. విషయ విదగ్ధవిదూషిత దత్త


96. సజ్జనహరిజనసంస్తుత దత్త


97. నానాకర్మ ప్రభంజన దత్త


98. నిర్మలనిత్యనిరంజన దత్త


99. పాషండా ప్రియ ఖండిత దత్త


100. సిద్ధర్మాచరణావృత దత్త 


101. ఖేచర భూచరమార్గద దత్త


102. బ్రహ్మక్షత్రవిద్ శూద్రవ దత్త


103. బ్రహ్మచారిగృహివనస్థ దత్త


104. దేశికావరసంపూజిత దత్త


105. నారదతుంబురకీర్తిద దత్త


106. సాధుబృందపరికీర్తిత దత్త 


107. బ్రహ్మానందపరిప్లుత దత్త


108. కైవల్యామృతపానత దత్త


Saturday 4 November 2023

శ్రీదత్త పురాణము (306)

శ్రీ దత్తభజనం


1. శ్రీ అనసూయానందన దత్త


2. భక్తకామకల్పద్రుమదత్త


3. విఘ్నాంభుధి శతభాస్కర దత్త


4. ధూల్యాంకితతను ధూసర దత్త


5. సురవరముని కిన్నెరనుత దత్త


6. యజ్ఞయాగజపతోషిత దత్త


7. దండకమండలశోభిత దత్త


8. భుక్తిముక్తిసౌఖ్యప్రద దత్త


9. సంసారాంబుధిపారణ దత్త


10. కలికల్మషసువిచారణ దత్త


11. భాగీరద్వవాహన దత్త


12. కొల్హాపురభిక్షాటన దత్త


13. గిరివరసాసుకృతాలయ దత్త


14. మాతాపురశయనాలయ దత్త


15. సురవరము నిపరదేశిక దత్త


16. సర్వసుధర్మవినాయక దత్త


17. గీతారాగనృత్య ప్రియ దత్త


18. సర్వకర్మసాక్ష్య క్రియ దత్త


19. సధర్మపాలనరతనుత దత్త


20. బాహ్యాడంబరవర్జిత దత్త


21. భూత ప్రేత ద్రావక దత్త


22. నిత్యసత్య ప్రచారక దత్త


23. కర్పటకందాధారక దత్త


24. విద్యావారిధి మౌక్తిక దత్త


25. జారణ మారణ మారణ దత్త


26. ఉచ్చాటన సంన్నాశన దత్త 


27. గ్రహపీడనివి నివారణ దత్త


28. ఆదివ్యాధివిదారణ దత్త


29. దారిద్ర్యార్ణ విమోచన దత్త


30. ఆనందాభ్యున్మజ్జన దత్త


31. జర్జరవంధ్యాసుత ప్రద దత్త 


32. దీన“రంగ”శాంతిప్రద దత్త


33. దాహభూమిశ్వక్రీడన దత్త


34. నూతనభస్మ విభూషిత దత్త


35. అవధూతాభిద సంస్తుత దత్త


36. నిగమాగమసారస్వతదత్త


37. దయాదానదమశిక్షక దత్త


38. విశ్వంభరసుదిగంబర దత్త 


39. లాభాలాభసమప్రియ దత్త


40. చెలకుచేల సమప్రియ దత్త


41. బాలోన్మత్తపిశాచక దత్త


42. రేవాతీరపరిక్రమ దత్త


43. పరమహంసపరివ్రాజిక దత్త 


44. సదాసర్వదా నిర్మల దత్త


45. నగ్నోన్మత్తక్షపణక దత్త


46. ఆత్మశాస్త్రసువిశారద దత్త


47. ఆశాపాశవినిర్గతదత్త


48. ధృతోచ్చిత్తనిరామయ దత్త


49. కర్మబాహ్యకర్మ ప్రియ దత్త


50. ధర్మబాహ్య ధర్మప్రియ దత్త 


51. కర్మాకర్మవివర్జిత దత్త


52. ధర్మాధర్మవివర్జిత దత్త


53. మానామానాకంపిత దత్త


54. రాగద్వేషవర్జిత దత్త


Friday 3 November 2023

శ్రీదత్త పురాణము (305)

 


శ్రీ దత్తాత్రేయ భజనాష్టకం

(శ్రీ శంకరభగవత్పాద పూజ్య విరచితం) 


1. ఇందుకోటి భాస్కరం ఆదిదేవమీశ్వరం 

కామమూర్తి సుందరంచ షడ్గునైక మందిరం 

భక్త మాన సాసనం సదాను శాంత వాసవం 

దత్తమత్రినందనం త్రిలోక పావనం భజే॥


2. నారదాది యోగిబృంద వందితం క్షమాలయ 

రత్న పాదుకావి రాజ తాంఘ్ర పంకజ ద్వయం 

పద్మ పద్మ లోచనం శరత్సుధాకరాసనం 

దత్తమత్రినందనంత్రిలోక పావనం భజే॥


3. శంఖ చక్ర శూల మాలికా కమండలం 

పాని భిర్బధాన మంత్ర దీన బంధువత్సలం 

దివ్య మాల్య భూషణాంబరధరం దయాఘనం 

దత్తమత్రి నందనం త్రిలోక పావనం భజ్యే


4. స ద్విభూతి భూషితం జటాధరం దిగంబరం 

సుప్రసన్న మానసం పరాత్పరం మహేశ్వరం 

కర్మపాశ ఖండపం సమస్త లోక మండనం 

దత్త మత్రినందనం కృతాంత ఘాతినంభజే


5. బ్రహ్మ విష్ణు శంకరాద్యనేక నామరూపిణం 

స్వేచ్ఛయైన విశ్వసర్గ పాలనాంత కారణం 

బాలకావధూత మత్త వత్సిశాచ వేషణం 

దత్తమత్రి నందనం సుచిస్మితా ననంభజే


6. స్మర్తుగామినం విభుం జగద్గురుం సురోత్తమం 

జ్ఞానదం మునీంద్ర సిద్ధ యోగిభోగ సత్తమం 

పాపతాప నాశనం రుజస్త మోహ తాశనం 

దత్తమత్రి నందనం సుకీర్తి దాయకంభజే


7. యోగిమౌళి భూషణం భవాబ్ధి మూలశోషణం 

శుద్ధ భావ తోషణం హృదాంధకార మోషణం 

పూర్ణ మేక మక్షయం నిర్గుణం సనాతనం 

దత్తమత్రి నందనం హరం జనార్ధనంభజే


8. సర్వవేదదాయకం జితప్రసూవసాయకం 

భుక్తి ముక్తిదాయకం సమస్త సిద్ధిదాయకం 

భీతిభంజనంద చిత్తరంజనం నిరంజనం 

దత్తమత్రి నందనం విశ్వసాక్షిణం భజే


ఫలశ్రుతి:


పుణ్యకీర్తి వర్ధకంచ సర్వకార్య సాధకం 

పాప తాప శోక మోహ దైన్యతోభ నాశనం 

శ్రీ మదత్రి నందనాష్టకం జనాః పఠంతియే 

తేకృతార్ధతా మవాస్యయాంతి దత్త రూపతాం. 


Thursday 2 November 2023

శ్రీదత్త పురాణము (304)




సిద్ధ మంగళ స్తోత్రము


శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీనరసింహరాజా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||


శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ||


మాతా సుమతీ  వాత్సల్యామృత  పరిపోషిత  జయ శ్రీపాదా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


సత్యఋషీశ్వర దుహితానందన  బాపనార్యనుత శ్రీ చరణా|


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


సవిత్రకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


దో చౌపాతీ  దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీ చరణా | 


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


పుణ్యరూపిణీ రాజమాంబసుత  గర్భపుణ్యఫల సంజాతా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||


పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా |


జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ ||

Wednesday 1 November 2023

శ్రీదత్త పురాణము (303)

 


శ్రీ గురుపాదుకాష్టకం


1. శ్రీ సమంచిత మద్వయం పరమ ప్రకాశమగోచరం 

భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యను కల్మషమ్ 

నిర్మలం నిగమాంత మన్యయ మప్రతర్క్య మబోధకమ్ 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాంశ


2. నాదబిందు కళాత్మకం దశనాద భేదవినోదకం 

మంత్రరాజవిరాజితం విజమండలాంతర్భాసితం 

పంచవర్ణ మఖండ మద్భుత మాది కారణమచ్యుతం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం॥


3. హంసచారు మఖండ నాదమనేక వర్ణమ రూపకం

శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం 

చక్రరాజ మనాహతోద్భవ మేఘవర్ణ మితః పరం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం


4. బుద్ధి రూపమ బుద్ది కంత్రితైక కూట నివాసినం 

నిశ్చలం నిరత ప్రకాశమనేకరూప మరూపకం 

పశ్చిమాంతర ఖేలనం నిజశుద్ధ సంయమిగోచరం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం।


5. స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం 

విశ్వతేజస ప్రాజ్ఞచేతన మంతరాత్మ నిజస్థితిం 

సర్వకారణ మీశ్వరం నిటలాంతరాళ విహారిణం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం॥


6. పంచ పంచ హృషీక దేహమనోచతుష్క పురస్కరం 

పంచకోశ జగత్రయాది సమస్తధర్మ విలక్షణం 

పంచకోశ సకామసద్గుణ మీశశబ్దమ చేతనం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదకాం॥


7. పంచముద్ర సలక్ష్యదర్శన భావమాత్మ స్వరూపిణం 

విద్యుదాది ధగ ధగిత సవేదశాస్త్ర వినోదకం 

భిన్నమార్గ సవర్తనం సదసద్విలాస మనామయం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం।


8. పంచవర్ణ సుఖం సమస్త ఋషి విచారణ కారణం 

చంద్ర సూర్య చిదగ్ని మండల మండితాంఘనం ఫనచిన్మయం 

చిత్కలా పరిపూర్ణ మాంతర చిత్సమాధి లక్షణం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం॥


9. తప్త కాంచన దివ్యమాన మహానురూప మరూపకమ్ 

చంద్రకాంతర తారకైక సముజ్యలం పరమస్మరం 

నీల నీరద మధ్యసంస్థిత విద్యుదాది విభూషితం 

ప్రాతరేవహి మానసాంతర్భావయే గురుపాదుకాం॥