Sunday, 11 February 2018

హిందూ ధర్మం - 259 (Forbidden Archaeology - 5)



1852 లో, సైంటిఫిక్ అమెరికన్ చెప్పిందేమిటంటే బోస్టన్ నగరానికి దగ్గరలో గట్టి రాయి క్రింద 5 మీటర్ల లోతులో అందమైన లోహపు పాత్ర దొరికింది. ఆధునిక భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారం, ఈ ప్రాంతంలో ఉన్న రాయి వయస్సు 500 మిల్లియన్ అంటే 50 కోట్ల సంవత్సరాలు. గత 20 ఏళ్ళలో నేను కనుగొన్న పురాతన వస్తువుల్లో కొన్ని వృత్తాకరపు గోళాలు ఒకటి. అవి Ottosdalin,  Western Transvaal, South Africa లో గనుల్లో పనిచేసేవారు కనుగొన్నారు. ఆ వస్తువులు ఒకటి లేదా రెండు సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్నాయి. వాటి గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిలో విషువద్రేఖ (అక్షరేఖ)(equators) చుట్టూ సమాంతర రేఖలు ఉన్నాయి. The Mysterious Origins of Man అనే టి.వి. కార్యక్రమంలో ప్రసారం చేసే ముందే నివేదక కోసం వీటిని లోహశాస్త్రజ్ఞులకు ఇవ్వగా, అవి ఏ విధంగా కూడా సహజంగా భూమిలో ఏర్పడినవని చెప్పడానికి వారికి ఏ ఆధారము కనిపించడంలేదని, అది ఎంతో ప్రజ్ఞతో కూడిన కార్యమని తేల్చి చెప్పారు. ఈ గోళాలు ఏ ఖనిజాల్లో అయితే దొరికాయో ఆ ఖనిజాల వయస్సు 200 కోట్ల సంవత్సరాలు. ఇలా మానవ అస్థిత్వం అతి పురాతనమని చెప్పడానికి నేను కొన్ని ఆధారాలు మాత్రమే ఈ ప్రసంగంలో చూపాను. నేను ఇంకా ఎన్నో చెప్పచ్చు, ఎందుకంటే గత 150 సంవత్సరాల సైంటిఫిక్ సాహిత్యంలో ఇలాంటి విషయాలు కొన్ని వందలు ఉన్నాయి.

ఇది చెప్పి నేను ముగిస్తాను. డార్వినిస్టులు చెప్పినదాని ప్రాకారం మానవ అస్థిత్వం మొదలై 1,00,000 (లక్ష) ఏళ్ళు మాత్రమేనని చెప్తారు. కానీ అది నిజం కాదని మనం ఇవి చూసి సునాయాసంగా చెప్పచ్చు. 1 లక్ష సంవత్సరాల నుంచి 200 కోట్ల సంవత్సరాలు అని నిరూపించే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అంతకుమించి వయస్సు ఉన్న ఆధారాలు నేను కనొగొనలేకపోయాను. కానీ ఇది వైదిక సాహిత్యంతో ఆసక్తికరంగా సరిపడడం వలన నేను చెప్పేదేమిటంటే పురాతన సంస్కృత రచనలు చెప్పినట్లు మానవులు ఈ భూమి మీద 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నారు. ఇదంతా మనకు ఏమి సూచిస్తోంది? మానవుల ఉనికి గురించి మనకు ప్రత్యామ్నాయ సిద్ధంతాలు రావాలి. మరియు ఇదే నేను నా తరువాతి పుస్తకమైన మానవ క్రమక్షీణత/ అపవృద్ధి (Human Devolution) లో చెప్పదలుచున్నాను. ఇందులో మనం అధునిక సైన్సు చెప్పినట్లు కోతుల నుంచి రాలేదని, కానీ ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యం నుంచి ఉద్భవించామని విన్నవిస్తాను.

- Forbidden Archaeology లో మైకిల్ క్రీమో 

ఈ 5 భాగాలను చదివిన తరువాత మీరే తేల్చుకోవచ్చు. ఏది నిజమో? భారతదేశంలో వేళ ఏళ్ళ నుంచి మానవులు, మహనీయులు సంచరించారో లేదో. అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో వాస్తవాలు మరుగున పడకుండా ఉండాలంటే, కలిగిన మన యువ భారతీయులు, ఇటువంటి పరిశోధనా రంగంలోకి రావాలి. వేదాంగమైన జ్యోతిష్యం మనకు అందిస్తున్న లెక్కల ప్రకారం 2018 నాటికి ఈ సృష్టి ఏర్పడి 197,29,49, 118 సంవత్సరాలు. ఈ అంశం మీద మరొక్క టపాలో గత భాగాల్లో మరిచిన అంశాలను చెప్పుకుని, జ్యోతిష్యం అనే అంకాన్ని ముగిద్దాము.

 To be continued....... 

No comments:

Post a Comment