ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?
ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.
ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.
ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.
ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.
ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.
మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.
ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.
ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50 అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.
మనకు దేవాలయంలో ఉండే విగ్రహాలును చాలా మంది బొమంలంటారు. సంస్కృతంలో విగ్రహానికి అర్ధం విశేషంగా శక్తిని గ్రహించేది అని.ఆలయంలో ఉన్న విగ్రహం క్రింద యంత్రం పెడతారు. మంత్రం ప్రకృతిలో కలిగించే తరంగాల ఆకారం యొక్క సాకార రూపమే యంత్రం. అటువంటి రాగి యంత్రాన్ని విగ్రహం క్రింది భాగంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. క్రింద పంచలోహాలు వేస్తారు. పంచలోహాలు,రాగి యంత్రం భూమిలో ఉన్న విద్యుతయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. పైన పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం/ విమానం కూడా శక్తిని గ్రహిస్తుంది. ఈ రెండు శక్తులను కూడా విగ్రహం గ్రహిస్తుంది.
ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అవి శిలలు మాత్రమే అనుకుంటారు. కాని మన దేవాలయాల్లో ఉన్నవి శిలలు కాదు. హిందువులు రాళ్ళకు పూజలు చేయటంలేదు. ఆ విగ్రహాన్ని వేదమంత్రాలు చదువుతూ వడ్లు, ధాన్యం, పాలు, పెరుగు, గోధుమలు............... ఇలా మన ప్రాణానికి ఆధారమైన ప్రాణశక్తి కలిగిన వస్తువుల మధ్యలో పెడతారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. అదే ప్రాణప్రతిష్ట. అప్పటినుంచి అది విగ్రహం కాదు. దానిలోనికి మహామహిమాన్వితమైన దైవశక్తి వస్తుంది. ఆ సమయం నుంచి ఆ విగ్రహం మన మాటలు వింటుంది, తన కళ్ళోతొ జరిగేవన్ని చూస్తుంది. మనం చెప్పుకునే కష్టాల్లన్నీ కూడా ఆ విగ్రహంలో ఉన్న దైవానికి వినిపిస్తాయి. అక్కడ శక్తి ఉందికనుకే దేవాలయంలో దేవునికి నిత్యం ధూపదీపనైవెధ్యాలు పెడతారు. ఏ ఊరిలో అయితే దేవాలయం మూతపడుతుందో, ఎక్కడైతే గుడిలో దేవునకు నిత్యం నైవెధ్యం ఉండడో ఆ ఊరి కరువుకాటకాలతో, రోగాలతో, మరణాలతో అల్లాడుతుంది.
చాలామంది విగ్రహారాధన తప్పంటారు. అంతటా భగవంతుడున్నాదు, ఆయనకు రూపం లేదు.......... ఇల రకరకాలుగా అంటారు. అది నిజమే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. అన్ని తానై ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, చెట్టు, పుట్ట, మనిషి, నది, అలా సర్వవ్యాపిగా ఉన్నాడు. కాని ఇది అందరు అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి భగవంతుడిని అంతట చూసేంత జ్ఞానం ఉండదు. మరి కష్టాలు వస్తే ఎల చెప్పుకుంటారు? తమ భాధను ఎలా పంచుకుంటారు? తమకు భయం వేసినప్పుడు ఏ రూపాన్ని స్మరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం అంతగా లేనివారు తమకు వచ్చిన భాధను పంచుకోవడం కోసం పరమాత్మ ఒక విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. వారికి భాధ కలగగానే తమకంటూ ఒకడున్నాడన్న భావంతో వెళ్ళి తమ భాధను పరమాత్మతో పంచుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా విగ్రహారాధన తప్పకాదు, మొదట సగుణారాధాన చేస్తుంటే కాలక్రమంలో భగవత్తత్వం అర్దం అవుతుందంటారు. విగ్రహాల్లో మాత్రమే దేవుడు లేడు, అంతటా ఉన్నవాడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి.
దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం. అసలు ప్రదక్షిణం అంటే ఏమిటి?
ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ............ అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
................................
..............................
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన
అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.
ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.
ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.
ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
దేవాలయంలో విగ్రహప్రతిష్ట చేసే సమయంలో విగ్రహం క్రింద పంచలోహాలు వేస్తారు. అలాగే ద్వజస్థభం క్రింద కూడా పంచలోహాలు వేస్తారు. ఇవి భూమిలో ఉన్న విద్యుతయస్కాంత్ శక్తిని ఆకర్షిస్తాయి. సైన్సు ఏమి చెబుతోందంటే? Nulei/ Nucleus చుట్టూ Electrons వృతాకారంలో తిరుగుతుంటాయి. అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది. వీటికి దగ్గరలో కూడా ఇదే విధమైన ప్రక్రియ( Nucleus/ Nulei చుట్టు Electrons తిరగడం) జరుగుతుంటే, ఇవి పరస్పరం ఆకర్షణకు గురవుతాయి. వాటి మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి, అక్కడ ఉన్న Electrons అన్నీ కూడా వృత్తాకారంలో అంటే కుడి నుంచి ఎడమకు తిరగడం వలన అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది.
దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలయంలో ఉన్న మూలవిరాట్టు(ప్రధాన విగ్రహం), ఆయన వాహనం, ద్వజస్థభం మధ్య ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనం కూడా కుడి నుండి ఎడమకు దైవం చుట్టూ తిరిగితే,మన శరీరంలోనికి ఆ విద్యుతయస్కాంత్ శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ప్రదక్షిణంలో మనం కుడి నుండి ఎడమకు తిరుగుతాం. అంటే మన కుడి చేయి వైపు దైవం ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రదక్షిణంలో ఉన్న అంతరార్ధం.
అసలు ప్రదక్షిణ ఏలా చేస్తే మన శరీరానికి శక్తి అందుతుంది? ప్రక్షిణం ఎలా చేయాలని శాస్త్రం చెప్తోంది?
ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ద్వజస్థంభం దగ్గర నమస్కరించి మొదలుపెట్టాలి. ఎలా పడితే అలా వేగంగా తిరగడం కాదు, పచ్చికుండలో నిండుగా నూనె నింపుకుని, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఆ పచ్చి కుండను ఎత్తుకుని, ఆ నూనె క్రింద పడకుండా ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో, అంతే మెల్లగా, నెమ్మదిగా ప్రదక్షిణం చేయాలని శాస్త్రం చెప్తోంది. అలా చేస్తేనే దేవాలయంలో ఏర్పడే విద్యుతయస్కాంత్ క్షేత్రం యొక్క శక్తి మనకు అందుతుంది. రోజూ వేగంగా 100 ప్రదక్షిణలు చేయడం కంటే శాస్త్రానుసారం 3 ప్రదక్షిణలు చేయండి చాలు.
ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.
అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.
ప్రదక్షిన సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.
ఓంకారం చాలా శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయి. ఒక జెర్మన్ శాస్త్రవేత్త ఓంకారం మీద పరిశోధన చేసి, ఓం కారాన్ని కనుక గదిలో కూర్చుని, ఒక విధమైన స్వరంతో కనుక ఉచ్ఛరిస్తే, అక్కడ పుట్టే తరంగాలు, శక్తికి ఆ గది గోడలు బద్దలయిపోతాయని చెప్పారు.
ॐ ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిమంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం.