ఓం
జనవరి-1 కొత్త సంవత్సరం కానే కాదు భారతీయులకు.
జనవరి 1 వ తేదీన ప్రపంచమంతా కొత్త సంవత్సరం జరుపుకుంటుంది.భారత్ లో కూడా దాదాపు అన్ని వర్గాలు,వయసుల వారు వేడుకలు జరుపుకుంటారు.కేకులు కోస్తారు,విందులు వినోదాలలో మునిగిపోతారు.డిసెంబరు 31న అయితే మరీనూ.శివరాత్రికైన జాగరణ చేయనివారు ఉంటారు కాని,31 డిసెంబరు రాత్రి మాత్రం తప్పకుండా మెలుకువగా ఉంటారు.
మనం ఒక విషయం మర్చిపోతున్నాం.జనవరి 1 మనకు అంటే భారతీయులకు కొత్త సంవత్సరం కాదు.దీన్ని ఆధారంగా చేసుకుని మన సంస్కృతిలో కొత్తగా ఏమి మొదలుకావు.భారతీయులకు కొత్త సంవత్సరం అంటే తేదీలలో మార్పు వలన వచ్చేది అసలే కాదు.మనకు ఒక కొత్త సంవత్సరం జరుపుకునే రోజు ఉంది.అది యుగాది(ఇవాళ మనం ఉగాదిగా పిలుస్తున్నాం).
మన పండగలు ఏదో పబ్బం గడుపుకోవటానికి రాలేదు.ఈ సమస్త విశ్వంలో నిరంతరం జరిగే అనేక సంఘటనలు,నక్షత్రాలు,గ్రహాల నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత్ కిరణాలు,వాటి వలన మానవుని పై ఉండే ప్రభావాలను చాలా సూక్ష్మంగా,సరైన విధానంలో లెక్కించి మనం(భారతీయులం,హిందువులం) తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలను నిర్ణయిస్తాం.వాటి భ్రమణంలో జరిగే మార్పులను బట్టే మన పండగల తేదీలు మారుతుంటాయి.ఒక సెకనులో 360వ వంతు(1/360 th part of the second) సమయాన్ని,అంత తక్కువ సమయంలో ఈ సమస్త విశ్వంలో జరిగే అనేకానేక మార్పులను పరిశీలించి,మానవుల మీద వాటి ప్రభావాలను ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాకుండా,కేవలం మానవ మేధస్సుతోనే లెక్కించి,వివరించిన ఘనత మన మహర్షులకే చెల్లింది.మనం వాళ్ళ వారసులం.మన సంస్కృతి అంత గొప్పది.
ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆచరించే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్.అది బ్రిటిష్ వారు ప్రపంచం మీద రుద్దారు.అది scientificగా చూసిన తప్పుల తడకే. వేరే దిక్కులేక ప్రపంచం దీనిని అనుసరిస్తోంది.
ఇప్పుడింతా ఎందుకంటే ఈ జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకోవడం వలన మనకు ఓరిగేదేమి లేదు,డబ్బు ఖర్చు తప్ప.మనకంటూ ఒక సంస్కృతి ఉంది.దాన్ని మరువకండి.
మీరంటారేమొ?.........మేము enjoy చేస్తుంటే వద్దనే హక్కు మీకు ఎవరిచ్చారని.మేము మిమ్మలని enjoy చెయ్యొద్దని చెప్పటంలేదు.మీరు ఏమి చేస్తారో మీ ఇష్టం.కాని ఇది మనది కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి.అంతేకాదు,మీరు చేస్తున్నenjoyment కేవలం తాత్కాలికమైనది.ఇది మీకు సంతృప్తినిచ్చినా అది అశాశ్వతమైన సంతృప్తినిస్తుంది.మీలో ఇంకా ఇంకా enjoy చేయాలన్న కోరికను కలిగిస్తుంది.చివరకు ఆశాంతిని మిగిల్చుతుంది.మీకు కలిగే ఆనందం కేవలం బాహ్యమైనదే.ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతకకండి."చిదానంద రూపః శివోహం శివోహం"-మీలో ఉన్న మీరే(ఆత్మ) నిజమైన,శాశ్వతమైన,ఆనంద రూపం,శివ స్వరూపం అన్న విషయాన్ని గుర్తించండి,అనుభవంలోనికి తెచ్చుకోండి.అప్పుడు కలిగేది పరమానందం,ఆత్మానందం.అదే శాశ్వతమైనది.ఇదే నిజం,సత్యం,యదార్ధం.
No comments:
Post a Comment