Wednesday 22 May 2013

సనాతన హిందూ సంప్రదాయం - జీవవైవిధ్యం

జీవవైవిధ్యం - సనాతన హిందూ సంప్రదాయం .

'భౌతిక దృష్టి'తో శివ కుటుంబాన్ని చూస్తే శివుడి మెడలో పాములు, వాహనం నంది(ఎద్దు), అమ్మవారి వా
హనం సింహం. ఎద్దు, సింహం పరస్పరం విరుద్ధమైనవి. వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు, ఆయన వాహనం ఎలుక. పరస్పరం విరుద్ధమైనవి. సుబ్రహ్మణ్యుడు సర్పం(పాము), ఆయన వాహనం నెమలి, పాముకు నెమలికి పడదు. శివుడేమో కొండల్లోనూ, గుట్టల్లోనూ ఉంటాడు అంటే ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక. ఇక కాకి, కుక్క(కాలభైరవుడు) రుద్రగణాలకు సంబంధించిన వారు. పరస్పరం విరుద్ధమైన/ వైరం కలిగిన ఇన్ని రకాల జీవులు ఒక చోట ఉండడం జీవ వైవిధ్యం అయితే, అన్నిటితో  కలిసి జీవించడం అనేది శివ పరివారం ఇచ్చిన సందేశం.

విష్ణువు శేషుడి మీద శయనించి ఉంటాడు. ఆయన వాహనం గరుత్మంతుడు(గరుడ పక్షి). పాముకు, గద్దకు మహావైరం. ఇక దశావతారాలలో మత్శ్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలు. ఇక్కడా జీవ వైవిధ్యం. లక్ష్మీ దేవీని 'ఓం ప్రకృతై నమః' అని కొలుస్తాము, అమ్మవారు ప్రకృతి స్వరూపం. శ్రీ లక్ష్మీనారయణులు ఇచ్చిన సందేశంలో అన్ని జీవులతో కలిసి జీవించడమే.

ఇక మనం నదులను, పాములను, పుట్టలను, సముద్రాలను, పక్షులు, పశువులను, చెట్లను.......... ఒక్కటేమిటి అన్నిటిని పూజిస్తాం. పూజించడం కాదు అన్నిటిలో దైవం ఉందన్నది యధార్ధం. అందుకే పూజిస్తాం. సృష్టిలో ప్రతిదానిలోనూ దైవాన్ని చూసి వాటిని మనకంటే ఒక మెట్టు ఎక్కువగా భావించి ఆరాధించడం మన పూర్వీకులు మనకు నేర్పారు. ప్రతిచోటా తోటి జీవాలను ఆరాధించడం, రక్షించడం కనపడుతుంది.

'వసుదైక కుటుంబం'- ఈ భూమి అంతా ఒకే కుటుంబం అనిప్రపంచంలో తొలి జీవవైవిధ్య రక్షణకు సంబంధిచిన సందేశం ఇచ్చిందే మన హిందూ సంస్కృతే. కానీ మనమే మర్చిపోయాం. ఎవరో వచ్చి జీవ వైవిధ్యాన్ని రక్షించండి అంటే కూడా మనకు గుర్తురానంతగా మర్చిపోయాం. నిజానికి మనం మర్చిపోయామా? లేక మారిపోయామా? అన్నదే సమాధానం లేని ప్రశ్న.    

No comments:

Post a Comment