గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేసిన్మిన్ సన్నిధిం కురు || అంటూ పూజా సమయంలో కలశంలోకి పుణ్య నదులను అవాహన చేస్తాం.
భారతీయ సంప్రదాయంలో సరస్వతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి సరస్వతి నదికి గురు గ్రహం/ బృహస్పతి మిధును రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు వస్తాయి. మే 31వ తేది, 2013, వైశాఖ బహుళ సప్తమి, ఉదయం 6 గంటల 49 నిమిషాలకు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 12 రోజుల తర్వాత 11 జూన్‌తో ముగుస్తాయి. ఈ 12 రోజుల కాలం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో నదిలో దైవశక్తులు ఉంటాయి.ఎందరో దేవతలు, ఋషులు ఈ సమయంలో నదిలో స్నానమాచరిస్తారని ప్రతీతి.
No comments:
Post a Comment