ఓం శ్రీ హనుమతే నమః
వైశాఖ కృష్ణపక్ష/బహుళ దశమి(ఈ ఏడాది మే 13, బుధవారం) హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో చైత్ర పూర్ణిమకు జరుపుతారు. అట్లాగే చైత్రపూర్ణిమ రోజున ప్రారంభమైన హనుమాన్ మండల దీక్ష వైశాఖ బహుళ దశమితో ముగుస్తుంది.
కలియుగంలో సులువగా ప్రసన్నమయ్యే దేవాత రూపాలలో శ్రీ ఆంజనేయస్వామి వారు ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాదేవికి, కేసరికి పరమశివుడి అంశగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు. ఈనాటికి హిమాలయపర్వతాల్లో కైలాసమానససరోవరం దగ్గర రామనామ జపం చేస్తూ సశరీరంతో ఉన్నారు.
హనుమంతుడి స్మరణచేత బుద్ధి, బలం, యశస్సు(కీర్తి), దైర్యం, నిర్భయత్వం(భయం లేకపోవడం), వాక్‌పటుత్వం కలుగుతాయి. సమస్తరోగాలు తొలగిపోతాయి. జడత్వం నాశనమవుతుంది. జ్ఞానం కలుగుతుంది. భూతప్రేత పిశాచాలు హనుమన్ స్మరణతోనే పారిపోతాయి. హనుమాన్ ఉపాసనతో జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీ రామదూతం శిరసానమామి.
హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
ఓం శ్రీ హనుమతే నమః
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

No comments:
Post a Comment