వేదాల్లో సైన్సు ఉందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్దం. వేదంలో సైన్సు ఉంది. ఆ మాటకు వస్తే, సూర్యుడు వెలుగునిస్తాడా అనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అజ్ఞానంగా ఉంటుందో, వేదంలో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయా? అనడం కూడా అలాగే ఉంటుంది. వేదం విశ్వంలో ఉన్న అన్ని అంశాల గురించి వివరించింది. ఆయా వేదాల్లో ఏ ఏ రకాల సైన్సు విభాగాలు ఉన్నాయో, గత భాగాల్లో చెప్పుకున్నాం. అయితే, అవే కాక వేదాల్లో చెప్పబడ్డ మరికొన్ని వైజ్ఞానిక అంశాలు కూడా చెప్పుకుందాం.
-----------------------------------------------------------------------------------------------
కాకపొతే ముందుగా Satyanarahari Mallisetty గారు అధర్వణ వేదం గురించి అందించిన అమూల్యమైన ఈ సమాచారం అందరూ తెలుసుకోదగింది.
అధర్వణ వేదం ఐరోపా ఖండ వాసులు ఏనాడో మన దేశం నుంచి తీసుకొని పోయారు. ఈ వేదం మన దేశం అంతరించడానికి చాల కారణాలు ఉన్నా అందులో ముఖ్య కారణం మాత్రం మోక్షం లేదా ముక్తి సాధనం లేదా ఒక జీవున్ని విశ్వా సంసారం నుంచి బయట పడవేసే, ముక్తి, తాత్విక చింతన ఇందులో కొంచం తక్కువ. ఆ కారణంగా ఇది ఒకప్పుడు మనదేశంలో భాగమైన ఆఫ్గానిస్తాన్ (ఆఫ్ఘనిస్థాన్‌ని గాంధారదేశమని పిలిచేవారు. ఒకప్పుడు గాంధార దేశం కూడా భారతావని లో భాగమే) నుంచి గుండా టర్కీ ద్వారా ఐరోపా ఖండంలో ప్రవేశించి అక్కడ వచ్చి రాని సంస్కృత పండితుల చేతులలో పడింది. ఆ రోజుల్లో వాళ్ళ పాలకుల దృష్టిని ఆకర్షించిన ముఖ్య అంశం "చింతామణి", వాళ్ళ భాష లో చెప్పాలంటే "ఫిలోసోఫెర్ స్టోన్". దాని ద్వారా ఏదైనా ఒక వస్తువుని బంగారంగా మార్చ వచ్చు అని పిచ్చిగా నమ్మే వాళ్ళు. దానిని తయారు చేయమని వాళ్ళ పాలకులు ఆయా దేశాల మేధావులని ఆదేశించే వాళ్ళు అలా అధర్వణవేదాన్ని క్షుణ్ణంగా అధ్యయం చేసి ఆధునిక భౌతిక, రసాయన శాస్త్రం అభివృద్ధి చేశారు. కొన్ని కొన్ని సత్యాలు తెలుసుకొంటూ వచ్చారు. తెలుసు కొన్నసత్యాలు ఆధారం చేసుకొని ఒక్కో పరికరం, లేదా యంత్రం అభివృద్ధి చేసుకొంటూ వచ్చారు. అణువులు , ఎలేక్ట్రోన్లు, కేంద్రక వంటి సూక్ష్మ సత్యాలు అవగాహన చేసుకొనే కొలది కంప్యూటర్, సాఫ్ట్‌వేర్, సెల్ ఫోన్ వంటి పరికరాలు, యంత్ర తంత్రాలు వృద్ధి జరిగాయి. యంత్ర , తంత్ర , మంత్రాలూ కర్మ- ప్రతి కర్మలకు కారణం అవుతాయి. ఇవి జీవున్ని బానిసని చేస్తాయి. ఎన్నటికి మోక్షాన్ని ఇవ్వవు. మన భారతీయులు మోక్ష కాములు కనుక ఈ అధర్వణ శాస్త్రం జోలికి వీలైనంత తక్కువ పోయారు. ఈ నాటికి జెర్మన్లు ఎందుకు సంస్కృతం అభ్యసిస్తున్నారు అంటే అది మన సంస్కృతం మీద వాళ్లకు గౌరవం కాదు, ఆ అధర్వణ వేదంలో చెప్పబడ్డ సూక్ష్మ రహస్యాలు గ్రహించాడానికే. ఈ అధర్వణ శాస్త్రాన్ని "సాయనాచార్యుడు" అనే ఆయన ఎందుకు దీనిని మాయలు మర్మాలు చేసే శాస్త్రం అని అన్నాడు అంటే ఈ అధర్వణ శాస్త్రంలో వచ్చే యంత్ర, తంత్ర, మంత్రం, కుతంత్రాలు అన్నియును కూడా ప్రకృతి మాయ భ్రాంతిలో ఉండే వ్యక్తుల పైనే పని చేస్తుంది. ప్రకృతి మాయని దాటినా వాళ్ళు (యోగులు) పైన ఈ శాస్త్ర ఫలిత పరికరాలు ఏది పని చేయవు.
-------------------------------------------------------------------------------------------------------------------
ఈ విషయాన్ని బలపరిచేది, భారతీయులకు తెలియంది అయిన మరొక విషయాన్ని చెప్పుకోవాలి.
ఇదేకాక జీ.పుల్లారెడ్డిగారి అభినందన సంచిక 'మధుకోశం' లో ప్రచురించబడిన ఈ విషయం చూడండి.
ఇందిరాగాంధీగారు ప్రధానమంత్రిగా ఉన్నా కాలంలో భారతదేశం నుంచి పశ్చిమ జెర్మనీకి ఒకరు రాయబారిగా వెళ్ళారు. అక్కడి అధికారులు ఈ రాయబారికి తమ కార్యాలయాలను చూపుతూ, అక్కడ ఉన్న ఒక భారతీయుడి చిత్రపటం చూపించి, ఈయన ఎవరో మీకు తెలుసా? అని అడిగారు. తనకు తెలియదని భారతరాయబారి సమాధానం ఇచ్చారు. అప్పుడు జెర్మన్ అధికారులే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చెప్పి, అతనికి తమ దేశంలో అంతటి ప్రాముఖ్యం రావడానికి గల కారణం కూడా చెప్పారు. ఆ వ్యక్తి పేరు దండిబొట్ల విశ్వనాధశాస్త్రి. రాజమండ్రి వాస్తవ్యులు. సంస్కృత భాషలో మహాపండితులు. యజుర్వేదానికి కర్మకాండ పరంగా, తాంత్రిక విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, నాలుగు విధాలుగా అర్దం చెప్పగలిగిన మహామేధావి. 1938 లో జెర్మన్ గూఢాఛారులు భారత్‌కు వచ్చి, ఆయన్ను జెర్మనీ తీసుకొనిపోయారు. వేదశాస్త్రములలో ఉన్న వైజ్ఞానిక విషయాలు వీరి నుంచి జెర్మన్ శాస్త్రవేత్తలు గ్రహించి, యుద్ధకాలంలో ఆయుధ నిర్మాణానికి వాటిని వినియోగించుకున్నారు. దానికి కృతజ్ఞతగా విశ్వనాధశాస్త్రిగారి చిత్రపటాన్ని తమ విదేశాంగ కార్యాలయంలో పెట్టుకున్నారట.
-------------------------------------------------------------------------------------------------------
అందుకే ఇప్పటికి జెర్మన్లకు హిందూ విజ్ఞానశాస్తమన్నా, పురాణాలన్నా, వేదాలన్నా అమితమైన ఆసక్తి. రామసేతువు మీద అమెరికా కుటిల బుద్ధితో తప్పుడు నివేదిక ఇస్తే, రామసేతువు మీద జెర్మనీ కూడా పరీక్షలు నిర్వహించి, దాని అసలు వయసును లెక్కగట్టింది. తమ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాషను ప్రత్యేకంగా నేర్పిస్తోంది. సంస్కృతం వచ్చిన పండితులను అక్కడికి తీసుకెళ్ళి, గ్రంధాలను అనువదించే పనిలో పడింది. అలా అనువాదం చేసినందుకు వారికి అధికమొత్తంలో ధనం ఇస్తుంది. ఆంగ్లేయులు మనకు చేసిన ద్రోహాల్లో పెద్ద ద్రోహం ఇదే. 16 వ శతాబ్దంలోనే యూరోప్‌లో సంస్కృత భాషాధ్యయనం మొదలైంది. 17 వ శతాబ్దం నుంచి చాలా గ్రంధాలను ఎత్తుకెళ్ళడం మొదలుపెట్టారు. 19 వ శాతాబ్దం నాటికి ఇక్కడున్న గ్రంధాలను మొత్తం ఎత్తుకెళ్ళి, ఇక్కడ వేల ఏళ్ళ నుంచి నిర్వహింపబడుతున్న విశ్వవిద్యాలయాలను పూర్తిగా నాశనం చేశారు. కొన్ని తప్పులు ఉన్నప్పటికి, వారి వద్ద కూడా వేదానికి అనువాదాలు ఉన్నాయి. వేదాలను ఎత్తుకెళ్ళడమే కాకుండా వాటిని పరిశోధించి రాసిన గ్రంధాల మీద 'పేటెంట్' హక్కులు తీసుకున్నారు. అంతేకాదు, ఒకానొక జెర్మన్ కంపెనీ 'వేద' అనే పదం మీద, మరొక కంపెనీ 'వాస్తు' అనే పదం మీద పేటెంట్ తీసుకున్నాయి. ఇప్పటికైనా హిందువులు జాగృతమవ్వాలి. తమ ధర్మాన్ని, ధార్మిక గ్రంధాలను కాపాడుకోవాలి.
To be continued ..............................

No comments:
Post a Comment