మనలో చాలామంది మాములుగా రోడ్డు మీద నడుస్తున్న సమయంలో ఒక సన్నివేశం చూసే ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి తమ పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వస్తాడు. కుక్క బాగా బలిష్టంగా ఉంటుంది, దానికి గట్టి గొలుసు కట్టేస్తాడు, చేతిలో కర్ర పట్టుకుంటాడు, అయినా కుక్క వీడి మాట వినదు. అది ఎటు పరిగెడితే, వీడు అటే పరిగెడతాడు. నిజానికి వీడు కుక్కను తిసుకుని వాకింగ్‌కు రావడం కాదు, కుక్కనే వీడిని తీసుకుని వాకింగ్‌కు వచ్చింది.
వేరొకడు బలహీనంగా ఉన్నా, బలిష్టమైన తన కుక్కతో వాకింగ్‌కు వస్తాడు. ఆ కుక్క రూపం చూస్తునే, భయంతో పరుగులు తీసేలా బండలా ఉంటుంది. దానికి గొలుసు కట్టడు, చేతిలో కర్ర ఉండదు, దాన్ని అదుపు చేయాలన్న ఆందోళన ఉండదు. అది వాడి వెనుకే నడుస్తుంది. ఎవరిని ఏమి అనదు.
ఈ రెండు పరిస్థుతుల్లో మొదటి పరిస్థితి ఇంద్రియాల మీద అదుపు లేనివాడి పరిస్థితికి ఏ మాత్రం భిన్నమైంది కాదు. రెండవవాడి పరిస్థితి ఇంద్రియ నిగ్రహం, దమము ఉన్నవడి స్థితి. మనసు మనకంటే శక్తివంతమైంది ఏం కాదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. మనం దాన్ని అదుపు చేయచ్చు, చేయాలి కూడా. అది కోరిందల్లా ఇచ్చి, దానికి పూర్తి స్వాతంత్రయాన్ని ఇస్తే, అది మనలని ఆడిస్తుంది.
చాలా మంది అనుకుంటారు, ఈ ఒక్కసారి మనసు కోరింది ఇచ్చేద్దాం, మరోసరి నిగ్రహించుకుందాం అని. అది అసాధ్యం. మీరు ఎన్ని కోరికలు తీర్చుకుంటే, మనసు అన్ని కోరికలు మళ్ళీ కోరుతుంది. అందువల్ల మనసును అదుపు చేయాలి.
కానీ మనసును అదుపులోకి తెచ్చుకోవడం అంత సులువేమి కాదు, మనసు మనం చెప్పిన మాట వినదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మనసు పట్టు సాధించడానికి పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
To be continued...........

No comments:
Post a Comment