ఈ రోజు ( 31 అక్టోబరు) భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషిగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్గారి జయంతి.
ఆంగ్లేయుల నుంచి భారత్‌కు స్వాతంత్ర్యం తెచ్చుకున్నా, భారతదేశం మొత్తం ఐక్యంగా లేదు. స్వాంతత్రానంతరమూ కూడా మన దేశంలో 565 సంస్థానలు / స్వతంత్రరాజ్యాలు ఉన్నాయి. చాకచక్యంగా దౌత్యం నడిపి వాటినన్నిటిని సంవత్సర సమయంలోనే, భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్ గారిది. పాకిస్థాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని భారత పతాకం ఎగురవేసి, లక్ష్వద్వీప్ దీవులను భారత్‌లో విలీనం చేశారు. పాకిస్థాన్ గుజరాత్‌లోని జునాగర్హ్, కాశ్మీర్, హైద్రాబాద్‌ల పై పేచి పెడితే, జునాగర్హ్‌లో రెఫరెండం నిర్వహించి, జూనాగర్హ్‌ను భారత్‌లో విలీనం చేశారు.
హైద్రాబాద్ సంస్థానంలో ముస్లింలు 10% ఉంటే హిందూ జనాభ 90% ఉండేది. అటువంటి హైద్రాబాద్‌ను నిజాం నవాబు పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి చేసిన ప్రయత్నాలను చిత్తు చేశారు. రజాకార్ల పేరుతో హిందువులను ఊచకోత కోస్తూంటే చూడలేక హైద్రాబాద్‌పై సైనిక చర్య జరిపి, హైద్రాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఇందుకోసం ఆయన అనేక నిందలు పడవలసి వచ్చింది.
ఆ కాలంలో హైద్రాబాద్‌లో కాంగ్రెస్ కంటే కన్యూనిస్ట్‌ల బలం అధికంగా ఉండేది. హైద్రాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తే అక్కడ కమ్యూనిస్టులు బలపడతారని, కాకుండా అదే స్థితిలో కొన్నాళ్ళు ఉంచేస్తే, నిజాం సర్కార్ కమ్యూనిస్టులను నాశనం చేస్తుందని, ఆ తరువాత మెల్లిగా హైద్రాబాదును భారత్‌లో విలీనం చేసే ప్రయత్నం చేయడం వలన కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందవచ్చని నెహ్రూ భావించారు. హైద్రాబాద్‌ను భారత్‌లో కలుపుదామని పటేల్ ప్రతిపాదించగా, పటేల్ మతతత్వవాది అని నెహ్రూ విమర్శించారు. కానీ ఉక్కు మనిషి సర్దార్ వీటికి బెదరలేదు. హైద్రాబద్ ప్రజల దీనబ్రతులకు స్వాతంత్ర్యం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుని, నెహ్రూ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తన అధికారశక్తితో హైద్రాబాద్ రాజ్యం చుట్టూ సనికులను దింపి, 5 రోజుల్లో నిజాం హైద్రాబాద్‌ను భారత్‌కు అప్పగించేలా చేశారు. నిజాం హైద్రాబద్‌ను భారత్‌లో కలిపారన్న వార్త రేడియోలో విన్న హైద్రాబద్ జనం సంబరాలు చేసుకున్నారు.
నిజానికి కాశ్మీర్ సమస్యనే కాదు, కాశ్మీర్ రాజు కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. అప్పుడు పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమైంది, భారత్ పాకిస్థాన్‌ను మట్టి కరిపిస్తుందని నెహ్రూ వద్ద సమాచారం ఉన్నా, నెహ్రూ తాను గొప్పగా దౌత్యం నిర్వహిస్తానని చెప్పుకోవడానికి ఐక్యరాజసమితి వద్దకు కాశ్మీర్ సమస్యను తీసుకువెళ్ళారు. కాశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తానని సర్దార్ చెప్పినా, నెహ్రూకున్న వ్యక్తిగత కారణాల రీత్యా అందుకు అంగీకరించలేదు. అప్పటినుంచి కాశ్మీర్ ఇప్పటివరకు రగులుతూనే ఉన్నది.
భారతదేశ తోలి ప్రధాని కావలసిన వ్యక్తి. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి(congress presidency) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష పదవితో పాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేయాలని తీర్మానించారు. గాంధీ 16 రాష్ట్రాల ప్రతినిధులను పిలిచి సరైన వ్యక్తిని ఎన్నుకోమని చెప్పారు. 16లో 13 రాష్ట్రాల ప్రతినిధులు వల్లభాయి పటేల్ పేరును ప్రతిపాదించారు. గాంధీ నెహ్రూకు ఈ విషయం చెప్పి,సర్దార్ ను ప్రధాన మంత్రిని చేయాలన్న విషయం పై మీ అభిప్రాయం చెప్పండి అనగా,ఆయన తల దించుకోని మౌనంగా ఉన్నారు. నెహ్రూ కు ప్రధాని కావలన్న అలోచన ఉంది అని అర్దం చేసుకున్న గాంధీ సర్దార్ కు చిన్న కాగితం మీద ఏదో వ్రాసి ఇవ్వగా ఆయన ప్రధాన మంత్రి పదవికి పోటినుండి తప్పుకున్నారు. గాంధీ చెప్పిన మాటకు కట్టుబడి తన ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్.