‘ఆర్యుల దాడి’ని తిప్పికొట్టిన అంబేద్కర్!
http://epaper.andhrabhoomi.net/andhrabhoomi.aspx?id=TS
-హెబ్బార్ నాగేశ్వరరావు03/12/2015 - ఆంధ్రభూమి సంపాదకీయం
రాజ్యాంగం అనగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్ఫురించడం సహజం... రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన చర్చలలో సమైక్య భావం వెల్లివిరిసింది. అయితే అద్వితీయ భారత జాతి ఏకాత్మకతకు భంగం కలిగించే భావాలు కూడ తొంగి చూసా యి. ఇలా తొంగి చూడడం బ్రిటిష్ దురాక్రమణ నాటి వికృత వారసత్వం! విషబీజం మొలకెత్తితే వృక్షంగా మారడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చు, దశాబ్దుల తరువాత లేదా శతాబ్దుల తరవాతనో దాని ప్రభావం కనిపించవచ్చు! అంకురించిన అమృతపు విత్తనం కూడ మహా వృక్షంగా మారడానికి కూడా అంతే సమయం పట్టవచ్చు! విషపు మొక్కలు, సుధామాధుర్య భరిత సుమవనాలు సమాంతరంగా విస్తరిస్తుండడం సమకాలీన చరిత్ర..విభజన విషం విదేశీయ దురాక్రమణ నాటిది, ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన రాజకీయ సాంస్కృతిక బీభత్సకాండ భారత జాతీయ సమైక్య వాహినిలో కలిపి వెళ్లినది! సుధాపరిమళం అనాదిగా భారత జాతీయ సమైక్య వాహినికి సహజ స్వభావం! ఈ సనాతన భూమిపై అనాదిగా ఒకే జాతి-అద్వితీయ జాతి వికసించడం సహజ స్వభావమైన వాస్తవం!
ఈ దేశంలో రెండు లేదా అనేక జాతులు వున్నాయన్నది బ్రిటిష్‌వారు కల్పించిపోయిన వక్రీకరణ...పార్లమెంటులో జరిగిన రాజ్యాంగ చర్చ సందర్భంగా వాస్తవం ప్రస్ఫుటించింది...వక్రీకరణ కూడ ధ్వనించింది! వాస్తవానికి ప్రచారం తక్కువ, వక్రీకరణకు ప్రచారం ఎక్కువ! బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవన ప్రస్థానంలో భారత జాతీయ చారిత్రక వాస్తవాలను అనేకసార్లు స్పష్టం చేసి ఉన్నాడు! ప్రచారం విశ్వవిద్యాలయ, ఉన్నత ప్రాథమిక విద్యాలయ పాఠ్యాంశాలద్వారా వ్వవస్థీకృతవౌతోంది, తద్వారా ప్రభావం విస్తరిస్తోంది! స్వతంత్ర భారతదేశంలోని ఈ పాఠ్యాంశ వ్యవస్థ బ్రిటిష్‌వారు నిర్ధారించిన పద్ధతిలోనే ఇప్పటికీ కొనసాగుతోంది. అందువల్ల జాతీయ అద్వితీయ తత్త్వానికి చెందిన వాస్తవాలకంటె, జాతీయ సమాజంలో వైరుధ్యాలను కల్పించిన వక్రీకరణలకు ప్రచారం ఎక్కువగా వుంది! బ్రిటిష్ వారు కొలంబోనుండి కైలాస పర్వతం వరకు గల, గాంధారం నుంచి బర్మావరకు విస్తరించిన భారత భూభాగంలో అనాదిగా ఒకే జాతి వికసించిందన్న వాస్తవాన్ని చెరిచిపోయారు! భారతదేశంలో ద్రావిడ, ఆర్య వంటి విభిన్న జాతులు-నేషన్స్ ఉన్నాయని ఇవి పరస్పరం కాట్లాడుకున్నాయని చరిత్రను వక్రీకరించి వెళ్లారు! ఈ వక్రీకరణను అంబేద్కర్ మహాశయుడు నిర్ద్వంద్వంగా నిరాకరించాడు...
ద్రావిడ శబ్దం మొత్తం భారత దేశంలోని కొంత ప్రాంతాన్ని నిర్దేశిస్తున్న భౌగోళిక నా మం... జాతి-నేషన్-ని సూచించలేదు. ఆర్య శబ్దం తమకంటె వయసులో పెద్దవారిని సూచించడానికి సంబోధించడానికి భారతీయులు అనాదిగా వాడిన సంబంధ వాచకం! ఇది కూడ జాతి-నేషన్-ను సూచించలేదు. పెద్దవారిని చిన్నవారు ఆర్యా అని, చిన్నవారిని పెద్దవారు వత్సా అని సంబోధించడం అనాది సంప్రదాయం! ఆర్యుడా అని అంటే సంస్కారవంతుడా అని అర్ధం! అం దువల్ల ఆర్యులు ద్రావిడులు అన్న జాతులుగా అద్వితీయ భరత జాతిని విడగొట్టడం చారిత్రక వాస్తవానికి, తార్కిక నిబద్ధతకు విరుద్ధం! ద్రావిడులు కూడా ఆర్యులే! ఆర్యులు కూడ ద్రావిడులే! ఆర్యులు, ద్రావిడులు మాత్రమేకాదు అనేకానేక వైవిధ్యమైన పేర్లున్న మతాలు, భాషలు, ప్రాంతాలు, సంప్రదాయాలు, విజ్ఞాన రీతులు శారీరక, బౌద్ధిక, మానసిక, ఆర్థిక, ధార్మిక, ఆధ్యాత్మిక విన్యాసాలు, ఇంకా ఎన్నో కూడ ఒక్కటే అయిన స్వజాతిలో విభిన్న అంశాలు అంతర్భాగాలు! వైవిధ్యాలు అసంఖ్యాకం, కానీ సంస్కృతి ఒక్కటే, జాతి ఒక్కటే! ఈ అద్వితీయ జాతీయులు అనాదిగా ఈ భారతదేశంలోనే పుట్టి పెరగడం ప్రగతి, సుగతి సాధించడం వాస్తవం! ఈ వాస్తవాన్ని బ్రిటిష్‌వారు చెరచిపోయారు! బ్రిటిష్‌వారి వక్రీకరణను అంబేద్కర్ మహాశయుడు నిర్ద్వంద్వంగా నిరాకరించడం ఎవ్వరూ నిరాకరించలేని నిజం...
తొలి మానవులు భారతదేశంలోనే పుట్టి పెరిగి ప్రపంచ దేశాలకు విస్తరించారన్న వాస్తవానికి భిన్నంగా బ్రిటిష్‌వారు తథాకథిత- సోకాల్డ్-ఆర్య జాతి విదేశాలనుండి ఇక్కడికి చొరబడినట్టు కట్టుకథలను కల్పించారు! ఈ కట్టుకథలను అంబేద్కర్ తిరస్కరించాడు! రాజ్యాంగం పవిత్ర గ్రంథం. ఈ గ్రంథానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ చెప్పిన మాటలు ఇవీ
* ‘‘ఆర్య జాతి అన్నది వేదాలలో లేదు, వేదాలకు తెలియదు..’’
* ‘‘ఆర్య జాతి అనేవారు బయటనుంచి వచ్చి ఈ దేశాన్ని దురాక్రమించినట్టు నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాలు ఏవీ వేదాలలో లేవు. ఆర్య జాతి ‘దాసుల’ను ‘దస్యుల’ను జయించినట్టు కూడా వేదాలలో చెప్పలేదు...’’
* ‘‘దాసులు, దస్యులు అన్నవారినుంచి ఆర్యులు జాతీయత ప్రాతిపదికగా భిన్నమైన వారన్న సాక్ష్యం ఎక్కడా కనిపించడం లేదు’’
* ‘‘దాసులు, దస్యులు అన్న వారికంటె ఆర్యుల రంగు విభిన్నమైనదన్న వాదాన్ని సమర్ధించే వేద వాక్యాలు లేవు’’
అంబేద్కర్ తన పరిశోధన ద్వారా నిగ్గుతేల్చిన ఈనిజాలు అద్వితీయ జాతీయతా సాక్ష్యా లు! ఇలా బ్రిటిష్‌వారు కల్పించిన ఆర్య ద్రావిడ విభేదాలను దాస, దస్య పదజాలాన్ని అంబేద్కర్ తిరస్కరించి ఉన్నాడు! ‘‘ఆర్యులు బయటనుంచి వచ్చి పడినారన్న మీ వాదానికి వేదాలలో ఎక్కడ ఆధారం ఉంది?’’ అని అంబేద్కర్ కంటె ముందు వివేకానంద స్వామి కూడ ప్రశ్నించి ఉన్నాడు! వీరిద్దరి కంటె ముందు, తరువాత కూడ ఆర్యులు, ద్రావిడులు వేరు వేరు జాతులన్న బ్రిటిష్‌వారి వక్రీకరణను భారత జాతీయ చరిత్రకారులు నిరాకరించి ఉన్నారు! ఇటీవల క్రీస్తుశకం 2009 సెప్టెంబర్‌లో సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ- సిసిఎమ్‌బి- శాస్తవ్రేత్తలు కూడ దక్షిణ భారత, ఉత్తర భారత దేశీయుల పూర్వు లు ఒక్క జాతి వారేనని నిర్ధారించి ఉన్నారు! తథాకథిత దళితులు కూడ అనాది భారతజాతి లేదా హైందవ జాతిలో భాగమని భిన్నం కాదని సిసిఎమ్‌బి చేసిన నిర్ధారణ కూడ అనాది వాస్తవం! ఈ చారిత్రక వాస్తవాన్ని అంబేద్కర్ క్రీస్తుశకం 1930లో జరిగిన మొదటి గుండ్రబల్ల-రౌండ్ టేబిల్-వివరించి ఉన్నాడు! దళితులు అన్న పదం సరికాదని శతాబ్దులుగా అస్పృశ్యతకు బలైన జన సముదాయాలు కూడ హిందువులేనని అంబేద్కర్ స్పష్టీకరించి ఉన్నాడు! అందువల్లనే ఇలా శతాబ్దుల పాటు వివక్షకు, అన్యాయానికి బలైన హిందువులను రాజ్యాంగంలో అనుసూచిత కులాలు-షెడ్యూ ల్డ్ కాస్ట్స్-అని పేర్కొన్నారు! అలాగే అనుసూచిత వనవాసీలు-షెడ్యూల్డ్ ట్రయిబ్స్! అనుసూచిత కులాలవారు, వనవాసీలు అనాదిగా హిం దువులన్న జాతీయ వాస్తవాన్ని అంబేద్కర్ ఇలా మరోసారి ధ్రువపరిచాడు! కానీ ఈ వాస్తవానికి భిన్నంగా, ఈ కులాల వారు హిందువులకంటె భిన్నమైన వారన్న భ్రాంతిని కల్పించడానికి లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే యత్నించడం దురదృష్టకరం! ఆర్యులు అన్నవారు ఈ దేశాన్ని దురాక్రమించారన్న బ్రిటిష్ వారి కట్టుకథ కూడ ఖర్గే ప్రసంగంలో ధ్వనించినట్టు ప్రచారవౌతోంది!
మల్లికార్జున ఖర్గే ప్రసంగంలోని వక్రీకరణలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సహసర్ కార్యవాహ-సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే వ్యక్తం చేసిన ప్రతిప్రకియ అంబేద్కర్ నిగ్గుతేల్చిన నిజాలకు అనుగుణంగా ఉంది. ఆర్యులు బయటనుంచి వచ్చారని ఖర్గే అంటున్నారు. ఇది డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయానికి విరుద్ధం. ఆర్యులు అన్న జాతి లేదని, ఆర్యులు బయటివారు కాదని అంబేద్కర్ చెప్పి ఉన్నాడు...అన్నది హోసబలే వ్యక్తం చేసిన ప్రతిస్పందన!
హైదరాబాద్‌లోని సిసిఎమ్‌బి శాస్తవ్రేత్తలు, అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తదితర అంతర్జాతీయ సంస్థలతో కలిసి దేశంలోని పదమూడు ప్రాంతాలలో కొనసాగించిన పరిశోధన ఫలితాలను నేచర్-ప్రకృతి అన్న ఆంగ్లపత్రికలోను ఇతర పత్రికలలోను 2009 సెప్టెంబర్‌లో ప్రచురించారు. తథాకథిత-సోకాల్డ్-అగ్ర కులా ల వారి జీవజన్యు వారసత్వం తథాకథిత దళిత, వనవాసీ జన సముదాయాలవారి జీవజన్యు వారసత్వం కంటె భిన్నం కాదని ఈ పరిశోధనలో స్పష్టమైనట్టు సిసిఎమ్‌బి శాస్తవ్రేత్తలు అప్పుడు ప్రకటించారు! దళితులు మిగిలిన కులాలవారు ఒకటే జన్యు వారసత్వ సంతతికి చెంది ఉన్నారు! దళితులు హిందువులన్న వాస్తవం, దళితులు హిందువులకంటె భిన్న జన్యుసంతతి వారు కాదన్న అంబేద్కర్ నిర్ధారణ ఇలా మరోసారి ధ్రువపడింది! తథాకథిత దళితులు, దళితేతరులు అయిన హిందువులు ఈ దేశంలో అనాదిగా పుట్టిపెరిగిన వారు! తొలి మానవుడు ఈ దేశంలోనే పుట్టాడన్న వేద నిర్ధారణను ఆధునిక శాస్త్రం కూడ ఇలా నిర్ధారించింది! అలాగే దక్షిణ భారతదేశంలోని వారు, ఉత్తర భారతీయులు పరస్పరం భిన్నమైన జాతులు కాదని ఉభయ జన సముదాయాలు ఒకే జాతీయ జన్యు వారసత్వం కలిగి ఉన్నారన్నది కూడ సిసిఎమ్‌బి చేసిన నిర్ధారణ! సిసిఎమ్‌బి నిర్ధారణలు బ్రిటిష్‌వారు ఈ దేశంలోని అనాది జాతిని భిన్నజాతులుగా విడగొట్టడానికి జరిపిన కుట్రను బద్దలు చేసాయి! అందువల్ల ఆర్య, ద్రావిడ జాతులు లేవని అనాదిగా ఈ దేశంలో ఒకే భరత జాతి లేదా హిందు జాతి ఉందని చరిత్రకారులు, భాషా చరిత్రకారులు, మానవ శరీర నిర్మాణ శాస్తవ్రేత్తలు, సామాజిక శాస్తవ్రేత్తలు అంగీకరించాలి. ప్రాథమిక స్థాయినుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యాంశాలలో తగిన మార్పులు చేయాలి! తాము భిన్న జాతుల సంతతివారమని ఒకే జాతికి చెందిన విద్యార్థినీ విద్యార్థులు భావించడం సమైక్యతకు గొడ్డలిపెట్టు! తమ పూర్వులది ఈదేశం కాదని తాము బయటనుంచి వచ్చిన వారమని అనాదిగా స్వజాతీయులైన వారు భ్రమించడం వల్ల ఈ మాతృభూమి పట్ల మమకారం నశించిపోగలదు! మాతృభూమి పట్ల మమకారం లేని జాతికి మనుగడ లేదు!
ఈ మాతృభూమి పట్ల ఈ జాతివారికి మమకారం నశింప చేయాలన్న దుర్భుద్ధితోనే బ్రిటిష్‌వారు భిన్న జాతుల కట్టుకథను కల్పించారు! అలా నశించినట్టయితే బయటనుంచి వచ్చి పడిన తమ పెత్తనం శాశ్వతం కాగలదని బ్రిటిష్ దురాక్రమణదారులు భావించారు. మేము మాత్రమే కాదు మీ పూర్వులు కూడ ఈ దేశానికి బయటనుంచి వచ్చినవారే అన్న విద్రోహ పాఠాన్ని భారతీయులకు నేర్పడానికి బ్రిటిష్ పన్నిన పన్నాగంలో భాగం ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం! అంబేద్కర్ దీన్ని తిరస్కరించాడు, అనాది జాతీయ చరిత్ర దీన్ని తిరస్కరించింది! సమకాలీన సమాజం కూడ ఈ బ్రిటిష్ కుట్రను తిరస్కరించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి. డిసెంబర్ ఆరవ తేదీన అంబేద్కర్ వర్ధంతి. ఇది అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం.

That's why I like ambedkar!
ReplyDeleteofcourse In riddles of rama he too made some errors,But he has a point and he is genuine in accepting his mistakes.very much gentleman than this PANDIT.