నన్ను కలవడానికి వచ్చిన ఓ యువకుడు నన్నిలా ప్రశ్నించాడు. 'సద్గురూ! నాకు ఇండియాలోనే ఉండాలన్నది ఆశ. కానీ, ఇక్కడకన్నా పది రెట్లు జీతం ఎక్కువని మా అన్నయ్య అమెరికా వెళ్ళిపోయాడు. నాలాంటి యువకులకు ఇండియాలో భవిష్యత్తు లేదా?" అని.
ఈ ప్రశ్నే చాలా వేడుకగా ఉంది.
ఎండాకాలంలో శంకరన్ పిళ్ళై మకాము గ్రామానికి మార్చాడు. ఏరు పారేచోటు ఎండి ఇసుక దారిగా మారిపోయింది. అక్కడ ఒక గుడిసె వేసుకుని భార్యబిడ్డలతో కాపురం పెట్టాడు. వానాకాలం వచ్చింది. ఏరు పొంగి పారింది. అన్నిటినీ పెకలించుకు పోతున్న వరదనీరు శంకరన్ పిళ్ళై గుడిసెను కూడా వదల్లేదు. వరద పొంగు తగ్గింది. శంకరన్ పిళ్ళై ఒక్కొక్కటిగా ఏరడం మొదలు పెట్టాడు. మళ్ళీ అక్కడే గుడిసె వేశాడు.
మామూలు జీవితానికి అతనికి దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆ లోపు మళ్ళీ వానాకాలం వచ్చింది . మళ్ళీ వరద.గుడిసె తునాతునకలైపోయింది. అంతా నీటిలో కొట్టుకుపోయింది. శంకరన్ పిళ్ళై ఎంతో ప్రయాసపడి చాలా నెలలకు మళ్ళీ అదేచోటు గుడిసె వేశాడు. మళ్ళీ వరద వచ్చినపుడు గుడిసె పాడైపోయింది.
శంకరన్ పిళ్ళై ఒక జ్యోతిష్యు ణ్ణి కలిసి తన జాతకాన్ని చూపించాడు. "అయ్యా! నా గుడిసె ఎన్నే ళ్ళిలా ఏరులో కొట్టుకపోతుందో చెప్పగలరా?" అని అడిగాడు.
ఏరు పారేదారిలో గుడిసె వెయ్య కూడదనే జ్ఞ్యానం ఉండి ఉంటే, శంకరన్ పిళ్ళై జోస్యుడని వెతకాల్సిన పనేలేదు కదా? శంకరన్ పిళ్ళైలాగే మీరూ నన్ను భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఎం చేయాలని ఆలోచించడానికి, మీ బాధ్యత స్వీకరించడానికి మీరు తయారుగా లేరు. అయితే, 50 ఎళ్ళ తర్వాత దేశం ఏమవుతుంది అని జోస్యం అడుగుతున్నారు. అంతేకదా!
మీలాంటి బాధ్య తారాహిత్యులు వున్నంతవరకు, మీలాంటివారుండే దేశం ఏమవుతుంది? ఎలా ఎదుగుతుంది? చీకటిని తొలగించడానికి దీపం వెలిగించకుండా 'చీకటి ఎప్పుడు పోతుంది? వెలుగు ఎప్పుడు వస్తుంది?' అని ఎవరికైనా చేయి చూపిస్తూ కుర్చోవడాన్ని తెలివిటేతలంటారా? ఏం జరుగుతోందని మిగిలిన గ్రహాల్ని చూసి లెక్క వేయడాన్ని వదిలేసి, మీరు జీవిస్తున్న గ్రహాన్ని కాస్త బాధ్యతాయుతంగా చుడండి.
ఈ భూమిలో వీధుల్ని మార్చినవాళ్ళంతా ఆయా కాలాల్లో ఉన్నవాటినీ, అవసరమైనవాటినీ గమనించి ఎంతో ప్రేమగా తమ బాధ్యతల్ని నెరవేర్చారు. 50 ఏళ్ళు లేదా 500 ఏళ్ళు లేదా 5000 ఎళ్ళ తర్వాత ఎవరైనా దీన్ని చేయకపోతారా అని వాళ్ళు ఎదురు చూడలేదు.
- సద్గురు జగ్గీవాసుదేవ్
sent by Ashwin kumar Dulluri
No comments:
Post a Comment