Friday, 16 September 2016

భాద్రపద పూర్ణిమ - గణపతి ఆరాధన

ఈ రోజు భాద్రపద పూర్ణిమ.

ఆకాశంలో ఎగిరే మూడు నగరాలను నిర్మించుకున్న త్రిపురాసురులు, తమ 3 నగరాలు ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడే తమకు మృత్యువు రావాలని వరం పొందుతారు. త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన శివుడు ఎన్నాళ్ళు యుద్ధం చేసినా, వారిని వధించలేకపోతాడు. అప్పుడు దీనికి కారణం ఆలోచిస్తాడు శివుడు. అంతలో పార్వతీ దేవి వచ్చి, అసురులతో యుద్ధానికి ముందు గణపతిని ఆరాధించలేదని, అందుకే ఇలా విఘ్నాలు ఎదర్వుతున్నాయని చెప్తుంది. ఒకప్పుడు శివుడే అన్ని కార్యాలకు ముందు విఘ్నాధిపతి అయిన గణపతిని ఆరాధించాలని శాసనం చేశాడని, ఇప్పుడు తానే మరిచాడని గుర్తు చేస్తుంది. అప్పుడు శివుడు గణపతిని ఆరాధిస్తాడు. #గణపతి సంతసించి ప్రత్యక్షమై తనను సహస్రనామాలతో అర్చించమని అడుగుతాడు. తన సహస్రనామాలను తానే స్వయంగా శివుడికి ఉపదేశిస్తాడు. అలా శివుడు గణపతిని అర్చించి త్రిపురాసురులను వధిస్తాడు.

శివుడు గణపతిని పూజించిన రోజు భాద్రపద పూర్ణిమ. కనుక ఈ రోజు తప్పకుండా గణపతిని ఆరాధించడం వలన సకల శుభాలను పొందగలమని పురాణ వచనం.

ఓం శ్రీ గణేశాయ నమః   

No comments:

Post a Comment