Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Tuesday, 31 January 2017
శరణాగతి (1 వ భాగం)
శరణాగతి
(1 వ భాగం)
శరణాగతి అంటే భగవంతుని మీద పూర్తి భారం వేసి, అన్యమైన ఆలోచనలను, ఆందోళలను విడిచిపెట్టడం. శరణాగతి గురించి భగవాన్ రమణ మహర్షి గొప్పగా చెప్పారు. రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి చూపిన రెండు మార్గాల్లో ఒకటి ఆత్మవిచారణ అయితే, రెండవది శరణాగతి. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, నడిపిస్తున్నది, లయం చేస్తున్నది భగవంతుడే. ఇది ఒట్టి మాటలలో చెప్పుకుంటే యాంత్రికంగా ఉంటుంది. దాంతో పాటు ఎన్నో సందేహాలు కూడా కలుగుతాయి. అదే అనుభూతి కలిగినప్పుడు, వివేకం కూడా జనిస్తుంది. అప్పుడు సందేహాలకు తావు ఉండదు. ఆయన ఆజ్ఞతోనే సమస్తమూ జరుగుతోంది, భవిష్యత్తులో ఏది జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. నేను చేస్తున్నాను, నా వల్ల అది జరిగింది, ఇది జరిగింది, నేనలా చేస్తాను అనుకోవడమే అహంకారం. ఎందుకంటే నా, నీ ద్వారా సమస్తమూ చేస్తున్నవాడు భగవానుడే. అన్నీ ఆయన చేస్తున్నాడనే వివేకంతో, అన్నీ ఆయనకే అర్పించి, ఇతర ఆలోచనలు చేయకుండా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడమే శరణాగతి.
దీని గురించి #భగవాన్ రమణులు ఇలా అంటారు. భక్తులలో ఉత్తమ భక్తుడెవరు? స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పించుకుంటాడో, అతడే భక్తశ్రేష్ఠుడు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి కొంచమైనా చోటివ్వక, ఆత్మనిష్ఠాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకోవడం. ఈశ్వరుని మీద ఎంత భారం వేసినా, ఆయన దానిని భరించగలడు. సకల కార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్నప్పుడు, మనం దానికి లోబడి ఉండడం మాని, ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించడం ఎందుకు? రైలు బండి బరువులన్నిటిని మోయగలదని తెలిసియుండి, ప్రయాణీకులైన మనము మన చిన్నమూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక, దానిని నెత్తికెత్తుకుని ఎందుకు కష్టపడాలి?
ఎంత చక్కగా చెప్పారో చూడండి. పైన చెప్పిన ఉపమానంలో ఈ ప్రపంచమే రైలుబండి అనుకుందాము. ఈ ప్రపంచం అనే రైలులో మనము కూడా ప్రయాణికులము. ఒక స్టేషనులో ఎక్కి, ఇంకొక చోట దిగిపోతాము. ఇలా ఎందరో ప్రయాణిస్తున్నారు. అది ఎందరిని ఎక్కించుకున్నా, అందరిని లాగే శక్తి దానికి ఉంది. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఈశ్వరునికి ఉంది. అందుకే కదా విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుః అంటూ ప్రారంభించబడింది. కేవలం ఈ ప్రపంచాన్నే కాదు, సమస్త బ్రహ్మాండాలను అసలే భారం లేకుండా మోస్తున్నవాడు భగవానుడు. ఈ బ్రహ్మండాలన్నిటిలో ఈ విశ్వం చిన్న కణిక. అందులో ఈ ప్రపంచమెంత? అందులో నువ్వెంత? నువ్వు వీటిలోనే ఉన్నప్పుడు నీ భారం కూడా ఆయన మీదే ఉంది. ఈ క్షణంలో కూడా నీ భారం వహిస్తున్నవాడు ఆయనే. రైలు బండి ఎక్కినవాడు, నెత్తి మీద మూటలు దింపి, క్రింద పెట్టి, హాయిగా ప్రయాణాన్ని ఆనందించి, గమ్యం వచ్చినప్పుడు దిగిపోక, ఆ మూటను నెత్తిన పెట్టుకుని, అనవసరంగా కష్టపడటం, గమ్యం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ దిగాలో అంటూ కంగారు పడటం, అనవసరమూ, అవివేకము కూడా. అలాగే ఈ సమస్త ప్రపంచాన్ని నడుపుతున్న ఆ భగవంతుండే నీ భారాన్ని కూడా మోస్తున్నాడనే ఎరుక కలిగి ఉంటూ, జరిగిన వాటి గురించి బాధపడక, జరగబోయే వాటి గురించి చింతించక, వర్తమానంలో, ఈశ్వరునిపై విశ్వాసంతో, ఆనందంగా ఉండడమే #శరణాగతి.
(ఇంకా ఉంది)
Monday, 30 January 2017
భారతీయత గురించి మహాత్మ గాంధీ సూక్తి
I believe that the civilization India has evolved is not to be beaten in the world. Nothing can equal the seeds sown by our ancestry. Rome went; Greece shared the same fate; the might of the Pharaohs was broken; Japan has become westernized; of China nothing can be said; but India is still, somehow or other, sound at the foundation.
- Mahatma Gandhi
(An excerpt from 'Hindu Swaraj' book)
Sunday, 29 January 2017
హిందూ ధర్మం - 235 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)
మనకు, గ్రీకు నాగరికతకు మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. గ్రీకులు మన నుంచి అనేకం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రీకు కథలు సనాతన ధర్మ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రాసుకున్నవే. ట్రోజన్ వార్ అనేది స్కూల్ పాఠ్యపుస్తకాల్లో ఆంగ్లంలో ఉంది. ఆ ట్రాజన్ వార్ మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని గ్రీకులు రాసుకున్న కథ.
- మహాభారతంలో పాండవులు 14 ఏళ్ళు వనవాసానికి వెళతారు. ట్రాజన్ యుద్ధం 14 ఏళ్ళు జరిగింది. మహాభారతం ప్రారంభంలో అర్జునుడు యుద్ధానికి సుముఖంగా ఉండడు.
- ట్రాజన్ యుద్ధంలో కూడా అకిల్లిస్, యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుడి శవం మీద పడి రోదించి, ఆ తర్వాత రోజు జయధ్రథుడిని చంపుతానని శపధం చేస్తాడు. అచిల్లిస్ కూడా తన సోదరుడు పాట్రోకులస్ మృతికి రోదించి, మరుసటి రోజు హెక్టర్ ని చంపుతానని శపధం చేస్తాడు.
- ఘటోత్కచుడు, కౌరవుల సైన్యంపై రాత్రి సమయంలో దాడి చేసి, తీవ్రమైన వినాశనం కలిగిస్తాడు. అగ్నిని ఆయుధంగా వాడి, కౌరవ శిబిరాలను దగ్ధం చేస్తాడు. హెక్టర్ కూడా గ్రీకు సైన్య శిబిరలపై దాడి చేసి, వినాశనం కలిగిస్తాడు. అప్పుడు కూడా అగ్నినే ఆయుధంగా వాడతాడు.
- సంజయుడు యుద్ధాన్ని ధృతరాష్ట్రునకు చెప్తాడు. అలాగే ట్రాజన్ రాజుకు మంత్రి యుద్ధాన్ని వివరిస్తాడు.
- ధృతరాష్ట్రునకు 100 కుమారులు, ట్రాజన్ రాజుకు 68 పుత్రులు, 18 పుత్రికలు.
- అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి పాండవుల శిబిరం వద్దకు వెళ్ళగా, కృపాచార్య, కృతవర్మ, ద్వారాల వద్దనే ఉండిపోతారు. ఆశ్వత్థామ లోపలకు వెళ్ళి, ఉపపాండవులను చంపుతాడు. రక్తపాతం సృష్టిస్తాడు. అలాగే ట్రాజన్ నగరాన్ని గెలవటానికి ట్రాజన్ గుఱ్ఱం అన్నేది కుట్రపూరితమైన చర్య. అది కూడా ఎన్నో విఫల యత్నాల తర్వాత. చివరి రోజు రాత్రి దాని ద్వారా యుద్ధం చేస్తారు. (1)
క్రీ.పూ.300 వ చెందిన మెగస్థీనిస్, శ్రీ కృష్ణ కథలను గ్రీకుకు తీసుకువెళ్ళాడని, ఆయన్ను హెర్క్యులస్ అని పిలిచాడని, అలా కృష్ణుడు హెర్క్యులస్‌గా గ్రీకు సాహిత్యంలో చేరాడని చెప్తారు. మెగస్థీనిస్ భారతదేశమంతా పర్యటించి, అతను చూసినవి, విన్నవి 'ఇండికా' అనే తన గ్రంథంలో రాసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఆయన ఇలా చెప్పుకున్నాడు, శౌరశేనోయి అనే భారతీయ తెగ ప్రత్యేకించి హెర్క్యులస్‌ని పూజించేది, మరియు వారికి రెండు నగరాలున్నాయి, మెథోర, క్లేసిబొర, నౌకయానానికి వీలుగా ఉన్న జొబరెస్ అనే నది.
గ్రీకులకు సంస్కృతం పలకడంలో అస్పష్టత కారణంగా తప్పుగా పేరలను పలికాడని అనేకమంది పండితులు పేర్కొన్నారు. ఎడ్విన్ ఫ్రాన్సిస్ బ్రయంట్ ఏమంటారంటే 'శౌరశేనోయి అనగా కృష్నునికి చెందిన యాదవ వంశపు శూరశేనులు, హెర్కులస్ అనేది హరే కృష్ణకు అపభ్రంశ పదం, మెథోర అనేది శ్రీ కృష్ణ జన్మస్థానమైన మధుర, క్లేసిబొర అనేది కృష్ణ పురం, జోబరెస్ అనేది యమునా నదికి అపభ్రంశం. (2)
To be continued .............
To be continued .............
Sources;
1. http://lonelyphilosopher.com/relation-between-the-greek-epics-and-the-mahabharata/
2. http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna
1. http://lonelyphilosopher.com/relation-between-the-greek-epics-and-the-mahabharata/
2. http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna
Saturday, 28 January 2017
స్వామి శివానంద సూక్తి
Very carefully watch all your thoughts. Suppose you are assailed by gloomy thoughts. You experience depression. Take a small cup of milk or tea. Sit calmly. Close your eyes. Find out the cause for the depression and try to remove the cause. The best method to overcome the gloomy thoughts and the consequent depression, is to think of inspiring thoughts and inspiring things. Remember again, positive overcomes negative. This is a grand effective law of nature.
- Swami Sivananda
Friday, 27 January 2017
ఆందోళన-రహిత జీవనం - స్వామి సచ్చిదానంద భోద
A Worry-free Life
“You might have the entire world at your feet: all the money, all the material things, all the friends, all the name, all the fame, all the crowns. But unless you have peace, you will not have a worry-free life. What is the use of having all these things around you? Be sure you care more for your peace than for these things.
- Swami Satchidananda
Thursday, 26 January 2017
దాశరధి శతకం - 1
1
శ్రీ రఘురామ చారుతులసీ దళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం - దశరధ తనయా! కరుణా సముద్రుడా! నీవు రఘువంశమున పుట్టిన శ్రీ రాముడవు, సొంపైన తులసీ మాలలు ధరించవాడవు. శమ, క్షమా మొదలైన గుణాలచే అలంకరించబడి లోకానికి ఆదర్శమూర్తివైన అభిరాముడవు. మూడు లోకాలచే కీర్తింబడే పరాక్రమ లక్ష్మికి ఆభరణం అయినవాడవు. ఎవ్వరికీ లొంగని కబంధుడనే రాక్షసుని వధించినవాడవు. కేవలం నీ తారక నామ మహిమచే జనులను కల్మషాలనే సముద్రమును దాటించగల శక్తిమంతుడవు. భధ్రాచల వాసుడవు. (నా యందు దయచూపు).
2
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!
భావం - దశరధ తనయా! కరుణా సముద్రుడా! శ్రీ రామ! అమితమైన పరాక్రమముచే పరశురాముని జయించిన వాడా! సద్గుణ సముదాయానికి ఆటపట్టయినవాడా! చక్కని నీల వర్ణం కలిగిన మేఘము వంటి శరీరకాంతి కలవాడా! కకుత్థ్స వంశమనే పాలసముద్రాన్ని ఉప్పొంగించే చంద్రుని వాంటివాడా! రాక్షసుల బలాన్ని నాశనం చేయువాడా! భద్రాచల శ్రీ రామ! నన్ను దయచూడవయ్యా!
3.
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దశరధ తనయా! కరుణా సముద్రుడా! శ్రీ రామ! మాట తప్పక, లెక్కింప శక్యంకాని సత్యవాక్కులనే పలికేవాడా! నీవు తప్ప వేరే ఏ దిక్కు లేదని, నిన్నే శరణు పొందినవారిని రక్షించువాడా! నీ దయనే కాంతివంతమైన ప్రవాహంతో పాపాలను కడిగేవాడా! బ్రమ్హజ్ఞాన సంపన్నులను సంతోషపెట్టువాడా! మూడు లోకాలను పవిత్రం చేసే ఆకాశ గంగను స్వరించినట్టి పాదపద్మాలు కలవాడా! మణుల యొక్క కాంతిచే ప్రకాశించు అలకారములు కలవాడా! భధ్రాచల రామా! (నన్ను కరుణించు).
4.
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
భావం: గర్వంచే విజృభించిన శత్రువులను నాశనము చేయువాడా! పక్షిరాజైన గరతుమంతుడే వాహనంగా కలవాడా! చీకటలను సూర్యుడు చేధించినట్లు, చీటక్ల వలే కమ్ముకున్న ఎన్నో ఆపదల వరసును పటాపంచలు చేసే సూర్య్నివంటి వాడా! జనసమూహంతో నిండిన సభను రంజింపజేయువాడా! కరుణతో నిండిన మనసు కలవాడా! మహాపురుషుల సాంగత్యం కలవాడా! సీతాదేవి హృదయకమలమందే తుమ్మెద వలె నివసించువాడా! దుష్టరాక్షసులనే తామరపువ్వులను నశింపజేసే మదపుటేనుగు వంటి వాడా! మంగళకరమైన రూపం కలవాడా! భద్రాచల శ్రీ రామ! దశరధ తనయ! కరుణాసముద్రుడా! నా యందు దయ చూపు.
5.
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఐశ్వర్యాన్నిచే వాడా! ఋషిపుంగవుల చేత సేవించబడే పాదపద్మాలు కలవాడా! దిగంతముల (దిక్కుల యొక్క అంతము) వరకు కీర్తిని సంపాదించినవాడా! సమస్త చరాచర ప్రపంచాన్ని పాలించి, కాపాడటంలో సంతోషం పొందేవాడా! దుఃఖములనే తీగలను తెగనరికేవాడా! క్షాత్ర ధర్మాన్ని, క్షత్రియ వంశాలనే సముద్రాన్ని ఉప్పొంగించే అమృతమయమైన చంద్రుని వంటి కిరణాలు కలవాడా! నాట్యము, సంగీతం మొదలైన కళల చేత వినోదము పొందువాడా! భధారచల శిఖరంపై కొలువున్న వాడా! దశరధ తనయ! కరుణా సముద్రా! శ్రీ రామచంద్ర! నన్ను బ్రోవు.
6.
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దశరధ తనయా! కరుణాసముద్రా! శ్రీ రామా! పూజింపదగిన శ్రేష్టమైన గుణములు కలవారందరికి (ఆర్యులందరికి) నమస్కరించి, మా గురుదేవులైన రఘునాధ భట్టాచార్యుల వారికి అంజలి ఘటించి, కవి శ్రేష్టులను స్తుతించి, పైవారి అనుగ్రహంతో నేను తలచిన కార్యం సఫలమవ్వాలని నీ పేరున శకతం రాస్తున్నాను. కావున నా భక్తి భావముని గమనించి దీన్ని దయతో స్వీకరించి, నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
7.
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దశరధ తనయా! కరుణాసముద్రమైన శ్రీ రామచంద్రా! ఎంతో ఆశతో సామన్య రేగి పళ్ళను మంచి ముత్యములౌ భావించి కోట్లు పోసి కొన్నట్టు, కావ్య రచన చేసి దుష్టులకు అంకితమిచ్చి మోసపోయాను. ఓ భక్తజన కల్పద్రుమ! నా నాలుకను పవిత్రం చేసి, నా వాక్కుల యందు అమృతం చిందేట్లుగా పద్యం రచించే శక్తి నాకిచ్చి నా ముఖమందు నిలిచి ఉండమని ప్రార్ధిస్తున్నాను.
8.
శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: గొప్పకాంతిచే మనోహరమైన హారము కలవాడా. అవిసె పువ్వు వలె మృధువైన దేహం కలవాడా. భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి వాడా. వికారములను జయించినవాడా. పరతత్త్వంగా విహరించువాడా. మూడు లోకాలయందున్న ప్రాణులను ఉద్ధరించు వాడా. అంతములేని పాపముల సముదాయాన్ని నాశనం చేయువాడా. ఖరుడు మొదలైన రాక్షసులనే అడవిని నరకిన గొడ్డలి వంటి వాడా. భధ్రాచల వాసా, దశరధ తనయ, కరుణాసముద్రా, ప్రభూ శ్రీ రామచంద్ర. నన్ను రక్షించు.
9.
దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపాలనే తీగలను త్రుంచి వేసే కొడవలి వంటివాడవు. ఖరుడు, దూషణుడు అనే పేరుగల రాక్షసులనే అడవిని కాల్చి వేసిన అగ్నిహోత్రుని వంటివాడివి. భూభారాన్ని మోయడమనే కళలో కూడా విచిత్రమైన నేర్పుకలవాడివి. సంసారబంధం నుంచి విడిపించడమే పనిగా పెట్టుకున్నవాడివి. అందంగా ఉండి, వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడివి. ఎంతో గొప్పదైన, పవిత్రమైన చరిత్ర కలవాడివి. నీలమేఘముతో సమానమైన శరీరకాంతి కలవాడివి. భద్రాచల వాసుడవు, దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రాంచంద్రుడ్వు. (నిన్ను ఏమని పొగడాలి తండ్రీ! ఎంతని పొగడగలను).
10.
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం
జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం
దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: గొప్పదైన బంగారంతో నేసిన వస్త్రములు ధరించినవాడవు. జనన-మరణ చక్రమనే అడవిని నరికి వేయగల పదునైన గొడ్డలి యొక్క అంచువంటి వాడవు. సజ్జనులను కాపాడే స్వభావం కలవాడివి. దేవతలచే స్తుతించబడే సద్గుణరాసి గలవాడివి. ధనుర్విద్యలో పండితుడివి. శరత్కాల మేఘము, మల్లెపువ్వులు, శ్రీ గంధము వంటి వాటివలె ఎంతో స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. దశరధ తనయుడవు, కరుణా సముద్రుడవు, శ్రీ రామచంద్రుడవు. నన్ను దయ చూడు స్వామి.
Wednesday, 25 January 2017
సత్య సాయి బాబా సూక్తి
You have no reason to feel proud when you are able to help another, for your skill or wealth or strength or courage or official position that gave you the chance to serve was the gift of God, whether you recognise it or not. You are only offering this God's gift to another God's gift, namely the poor, the illiterate, the weak, the diseased, the grieving, the broken-hearted, who seek your help.
- Sathya Sai Baba
Tuesday, 24 January 2017
Monday, 23 January 2017
సుభాష్ చంద్రబోస్ కు ప్రేరణ ఇచ్చిన ముగ్గురు మహాపురుషులు
సుభాష్ చంద్రబోస్, యువత స్పూర్తిగా తీసుకునే వ్యక్తి. అలాంటి సుభాష్ చంద్రబోస్ కు ఆదర్శం ముగ్గురు మహాపురుషులు. ఒకరు శ్రీ రామకృష్ణ పరమహంస, ఒకరు స్వామి వివేకానంద, ఇంకొకరు శ్రీ అరోబిందో. బోస్ స్వాతంత్ర్యోద్యమంలో అంత తీవ్రమైన పోరాటం చేయడానికి కారణం వీరేనని, 1937 లో యాన్ ఇండియన్ పిలిగ్రిం అనే తన రచనల్లో రాసుకున్నారు. తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన అరోబిందో, తన బాల్య జీవితం మీద చెరగని ముద్ర వేశారు.
నేను అండర్ గ్రాడ్యుయేట్ చదివే రోజుల్లో, అరోబిందో ఘోష్ బెంగాల్లో ప్రాచర్యం పొందిన వ్యక్తి. ఆయన తన జీవితాన్ని రాజకీయాల కోసం త్యాగం చేశారు. ఆయన లేఖలు కరపత్రాలుగా మారి వేగంగా వ్యాపించేవి, ముఖ్యంగా రాజకీయాలు- ఆధ్యత్మికత, రెండింటిలో ఆసక్తి ఉన్నవారికి. నా బృందంలో ఎవరో ఒకరు లేఖలు చదవగా, నేను కుతూహలంతో వినేవాడిని....... ప్రభావవంతంగా జాతి సేవ చేయడానికి ఆధ్యాత్మిక శిక్షణ, సాక్షాత్కారం ఎంతో అవసరమని ఆయన వల్లనే గట్టి నమ్మాము. అప్పట్లో అరవిందుల గురించి ఎన్నో గొప్ప విషయాలు కధలు, కధలుగా ప్రచారమయ్యేవి. రాజకీయాలకు, ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని ఆయన ప్రతిపాదించడం ఎందరో ధార్మికులను దేశం వైపు తిప్పింది ............... నేను లోతైన ఆయన సిద్ధాంతాల పట్ల ప్రభావితమయ్యాను. ఆదిశంకరుల మాయ సిద్ధాంతం నా మాంసంలో గుచ్చుకున్న ముల్లుగా అనిపించేది. దాని అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోలేను, అలా అని వదిలించుకుని, కొత్త సిద్ధాంతాన్ని పట్టుకోలేను. ఏకం, అనేకం మధ్య, భగవంతుడు, సృష్టి మధ్య సయోధ్య గురించి రామకృష్ణులు, స్వామి వివేకానందుడు భోదించినవి నన్ను ప్రభావితం చేసినా దాన్ని నుంచి బయటపడే ప్రయ్తనంలో సఫలుడను కూడా కాలేకపోయాను. దీని నుంచి విముక్తి పొందటంలో అరవిందులు నాకు సాయం చేశారు. భగవద్గీత భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగమని చెప్పింది. అవిగాక హఠయోగం, రాజయోగం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీటి మీద వివేకానందుడు ప్రసంగించినా, అరోబిందో చక్కని సమన్వయం చూపారు. దానికి యోగ సమన్వయం అని పేరు పెట్టారు ...........' అంటూ సుభాష్ చంద్రబోస్ ఎన్నో విషయాలు రాసుకున్నారు.
ఆంగ్లేయులపై పోరాటం సలపడానికి, దేశాన్ని, సంస్కృతిని పునరుజ్జీవనం చేయడానికి భౌతిక, మానసిక శక్తులే కాదు ఆధ్యాత్మిక/ ఆత్మ శక్తి కూడా అవసరమని భావించిన బోస్, తన జీవితంలో ఆధ్యాత్మిక సాధన కూడా చేశారు.
Source- https://auromere.wordpress.com/2012/05/12/subhas-chandra-bose-on-sri-aurobindo/
Sunday, 22 January 2017
Saturday, 21 January 2017
స్వామి శివానంద సూక్తి
It should be as easy to expel an obnoxious thought from your mind as it is to shake a stone out of your shoe; and, till a man can do that, it is just nonsense to talk about his ascendancy and conquest over nature. He is a mere slave and prey to the bat-winged phantoms that flit through the corridor of his brain.
- Swami Sivananda
Friday, 20 January 2017
ఒకటే సారం- స్వామి సచ్చిదానంద
The Same Essence
“A real spiritual experience means to see the unity in diversity. We have had enough fights and problems. If you realize this, you can begin right in your own home. Love your family, your pets, your plants. Do not treat them as something different from yourself. They all have the same essence, the same spirit. If we want to show the unity in diversity, that is where we can begin.
“God bless you. Om Shanti, Shanti, Shanti.”
Thursday, 19 January 2017
Wednesday, 18 January 2017
Tuesday, 17 January 2017
శ్రీ రామకృష్ణ పరమహంస సూక్తి
Only two kinds of people can attain knowledge of the Self: those who are not encumbered at all with learning, that is to say, whose minds are not over-crowded with thoughts borrowed from others; and those who, after studying all the scriptures and sciences, have come to realise that they know nothing.
- Sri Ramakrishna Paramahamsa
Sunday, 15 January 2017
హిందూ ధర్మం - 234 (జ్యోతిష్యం - 16)
వారి మీద మన ప్రభావం అధికంగా ఉండేది. మనకు వారానికి 7 రోజులు, వారు అదే తీసుకున్నారు. మనకు సంవత్సరానికి 12 నెలలు. కలియుగంలో అది చైత్రం నుంచి మొదలవుతుంది, ఫాల్గుణంతో ముగుస్తుంది. వారు కూడా 12 నెలల లెక్క తీసుకున్నారు. అందులో ఆ నెలలకు కాలక్రమంలో ఆగస్టస్ మొదలైన రాజులు పేర్లు పెట్టినప్పటికీ, సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉన్న నెలల పేర్లకు అర్దం మాత్రం మారలేదు. ప్రస్తుత గ్రిగేరియన్ క్యాలెండర్‌కు పూర్వం, జూలియన్ క్యాలెండర్ ఉండేది, దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ ఉండేది. వారు వీటికి ఏ ప్రాతిపదికన పేర్లు పెట్టారంటే సెప్టెంబరు అంటే 7 నెల (సప్త =సెప్టే) అని అర్దం. అక్టోబరు అంటే 8 వ నెల (అష్ట = అక్టో), నవంబరు 9 వ నెల (నవ = నవ), డిసెంబరు 10 వ నెల (దశ = డిసెం). ఇంతకీ ఇవి ఎవరికి? హిందువులకు. హిందువులకు చైత్రంతో సంవత్సరం ప్రారభమవుతుంది. అంటే మార్చి - ఏప్రిల్ మధ్య. అక్కడి నుంచి క్రమంగా లెక్కించుకుంటూ వస్తే, మనకు 7, 8, 9, 10 నెలలని మనము ఏది అంటూన్నామో, వారూ దాన్నే స్వీకరించారు. ఇంతకంటే ఋజువేమీ కావాలి? వారు మన దగ్గరి నుంచి జ్యోతిష్యం, కాలగణనం తీసుకున్నారని చెప్పడానికి.
మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు సంక్రాంతి జనవరి నెల 14, 15 తేదీల్లో వస్తోంది. వివేకానంద స్వామి జన్మించింది మకర సంక్రాంతి రోజున, జనవరి 12, 1863 లో. అంటే అప్పట్లో సంక్రాంతి జనవరి 12. భూమి అయనగతి (Axial precession) కారణంగా sidereal zodiac అసలు స్థితిలో ప్రతి 72 ఏళ్ళకు 1 డిగ్రీ మార్పు వస్తుంది. అందువలన మకర సంక్రాంతి ప్రతి కొనేళ్ళకు (నిర్ణీత సమయానికి) ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీనికి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్పే శీతాకాల అయనాంతం (వింటర్ సొలిస్టిక్) కు సంబంధం ఉంది. ఇలా వెనక్కు లెక్కించుకుంటూ పోతే, చరిత్రలో ఒకానొక సమయంలో మకర సంక్రాంతి, వింటర్ సొలిస్టిక్ ఒకటే రోజున జరిగిన సందర్భం ఉంది.
The actual position of winter solstice in the sidereal zodiac changes gradually due to the Axial precession of the Earth, shifting westwards by approximately 1 degree in every 72 years. Hence, if Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, it would have been so around 300 CE, the heyday of Indian mathematics and astronomy
ఇది ముఖ్యంగా గ్రీకు సామ్రాజ్యం వర్దిల్లిన కాలంలో, అంతకు ముందు మహాభారత కాలంలో కూడా ఉండి ఉండవచ్చు. ఇలా లెక్కించుకుంటూ పోతే, పరాశర మహర్షి సమాజంలో మానవ దేహంతో సాధారణంగా తిరిగిన రోజుల్లో డిసెంబరు 25 న మకర సంక్రాంతి జరుపుకుందీ ప్రపంచం. మహాభారత యుద్ధం కేవలం సైనికులనే కాదు, మహర్షులను, వేద పండితులను, బ్రాహ్మణులను సైతం బలి తీసుకుందని, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధర్మ ప్రచారకులు లేక ధర్మ ప్రచారం సన్నగిల్లిందని అన్నారు మహర్షి దయానంద సరస్వతీ. తిరిగి భారతీయులు క్రీస్తు పూర్వం నాటికే గ్రీకులుతో వ్యాపర సంబంధాలు కలిగి ఉండి, అక్కడ కాలనీలు ఏర్పరుచుకోవడంతో మళ్ళీ అక్కడికి ధర్మ పవనాలు వీచాయి. అలా గ్రీకులు కూడా మన దేవతలనే తీసుకుని పూజించారు. భారతీయులు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. దానినే గ్రీకులు స్వీకరించారు. అప్పుడు మకర సంక్రాంతి జరిగింది డిసెంబరు 25 న. వారు కూడా దాన్ని సెలవు దినంగా, పవిత్ర దినంగా భావించి సుర్యారాధన చేశారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం కుప్పకూలి రోమన్ సామ్రాజ్యం నిర్మితమైంది. వారు కూడా ఈ ఆచారాన్ని విడువలేదు. పైగా డిసెంబరు 17 నుంచి 25 వరకు సెలవు రోజు పాటించి, వారం పాటు పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత క్రైస్తవం పుట్టింది. అది రోమన్, గ్రీకు నాగరికతలను, తనలో కొంత కలుపుకుని, కలుపుకోవడానికి విరుద్ధంగా ఉన్నవాటిని అవతల పారేసింది. గ్రీకు, రోమన్ నాగరికతలను పురావస్తు శాలలకు పరిమితం చేసింది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు అద్భుతంగా చెప్తారు. Digestion అనే concept ను సృష్టించి, దీన్ని విశదీకరించారు. అలాంటి సందర్భంలో రోమన్లు సూర్యుని కోసం నిర్వహించే పండుగలో Sun కు బదులుగా Son (As per Christian belief, Jesus is the son of God)ను తీసుకువచ్చింది. నిజానికి జీసెస్ పుట్టింది మార్చి, ఏప్రియల్ కాలంలో. ఆయన డిసెంబరు 25 న పుట్టినట్లు చరిత్రలో కానీ, బైబిల్ లో కానీ ఏ విధమైన ఆధారం లేదు. నిజానికి క్రిస్టమస్ పేగన్ల పండుగ. విగ్రహారాధన, చెట్లను, నదులను, జంతువులను పూజించడం బైబిల్ అంగీకరించదు. క్రిస్టమస్ ట్రీ అనేది కూడా స్థానికి జాతులు (హిందువులు!?) పూజించే వృక్షం. అక్కడి వారిని మతమార్పిడి చేసి, ఆ మతాన్ని నాశనం చేయడం కోసం, క్రైస్తవం, అక్కడి స్థానిక తెగల వారి ఆచారాలను కాపీ కొట్టింది. మా దగ్గర కూడా చెట్లను పూజిస్తారు, సరిగ్గా డిసెంబరు 25 నే మేము పండుగ చేసుకుంటాము అంటూ ............ ఇప్పుడు భారతదేశంలో వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోలిన ఏసు సుప్రభాతం, ఆలయాన్ని పోలిన చర్చి నిర్మాణం, అందులో ధ్వజస్థంభం, సన్యాసులను పోలిన వస్త్రధారణ, క్రైస్తవులు కూడా ఏసు మాల ధారణ, వేదాలు, ఉపనిషత్తులు ఏసు ......... ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్లే అక్కడ చేశారు. వాళ్ళు మనలని కాపీ కొట్టడం కాదు, అనుకరించి, మీ దగ్గర ఉన్నవే మా దగ్గరా ఉన్నాయి, కనుక మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం (మన ఆత్మ సిద్ధాతాన్ని అనుకరించలేరు, మూలాలను కాపీ చేస్తే క్రైస్తవమే అంతరిస్తుంది). ఇప్పుడు మనం అంటాం కదా, నదులన్నీ సముద్రంలోనే కలవాలి, మతాలన్నీ హిందూత్వంలోనే కలవాలి అని. బహుసా వాళ్ళు కూడా అప్పుడు అలా అనుకున్నారో లేదో కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవులు అమలు పరిచి ఎన్నో మతాలను నాశనం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి.
విషయంలోకి వస్తే, అలా గ్రీకు, రోమన్లు జరుపుకునే మకర సంక్రాంతి నేటి క్రిస్టమస్ అయ్యింది.
To be continued ...............
Saturday, 14 January 2017
15-01-2017, ఆదివారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
15-01-2017, ఆదివారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
పుష్య మాసంలో వచ్చింది కనుక దీనికి లంబోదర సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
15 జనవరి 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.56 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html
పుష్య మాసంలో వచ్చింది కనుక దీనికి లంబోదర సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
15 జనవరి 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.56 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html
స్వామి శివానంద సూక్తి
Do not allow the mind to run into the old grooves and to have its own ways and habits. Be on the careful watch. If a pebble in our boot torments us, we expel it. We take off the boot and shake it out. Once the matter is fairly understood, it is just as easy to expel an intruding and obnoxious thought from the mind. About this there ought to be no doubt, no two opinions. The thing is obvious, clear and unmistakable.
- Swami Sivananda
Friday, 13 January 2017
పని చేయడంలో ఆనందం - స్వామి సచ్చిదానంద
The Joy of Doing
When you do everything for the sake of doing, for the joy of doing, as a dedicated act for the benefit of humanity, not just for your benefit, you retain your joy. Don’t ever think you get joy by doing. No. The joy is in you always. But by keeping the heart pure through loving and giving, you retain the awareness of that joy.
- Swami Satchidananda
Thursday, 12 January 2017
మహర్షి మహేశ్ యోగి జయంతి
మహర్షి మహేశ్ యోగి. ఈ పేరు సగటు భారతీయునికి తెలియకపోవచ్చు, కానీ ప్రపంచ వ్యాప్తంగా వీరికున్న ఆదరణ అంతాఇంతా కాదు. సనాతన ధర్మాన్ని, ధ్యానాన్ని, వేదాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన మహనీయలలో ఒకరు మహర్షి మహేశ్ యోగి. 1918 లో జనవరి 12 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. వీరి పూర్వ నామం మహేశ్ ప్రసాద్ వర్మ. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం పూర్తి చేసి, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన జ్యోతిర్మఠం పీఠాధిపతి వద్ద శిష్యరికం చేశారు. బాల బ్రహ్మచారిగా చేరి, స్వామి వారికి అత్యంత ఆప్తుడయ్యారు. ఆయన ఆంతరింగిక కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆత్మానుభూతి పొందారు. వేదాలపై అనర్గళంగా ప్రసంగాలిచ్చారు.
బ్రాహ్మణేతరుడు కావడంతో బ్రహ్మానంద సరస్వతీ గారి తర్వాత జ్యోతిర్మఠానికి ఉత్తరాధికారి కాలేకపోయారు. అయినప్పటికి బ్రహ్మచారి మహేశ్‌కు స్వామి బ్రహ్మానంద గొప్ప బాధ్యతనే అప్పగించారు. విశ్వవ్యాప్తంగా సంచారం చేసి, ధ్యానాన్ని అందరికి నేర్పమని, అందరిలోకి తీసుకువెళ్ళమని ఆదేశించారు. బ్రహ్మానందులు 1953 లో మహాసమాధి చెందగా, మహేశ్ యోగి ఉత్తరకాశీకి పయనించారు. 1955 లో ఉత్తరకాశిని విడిచి జనం మధ్యకు వచ్చి భావాతీత ధ్యాన ప్రక్రియ (Transcendental Deep Meditation Technique) అనే పద్దతిని బోధ చేయడం ప్రారంభించారు. ఇది స్వామి బ్రహ్మానందుల ద్వారా తెలుసుకొన్నదేనని చెప్తారు. ఆ తర్వాత ఆ పద్ధతికి భావాతీత ధ్యానం (Transcendental Meditation) అనే పేరు స్థిరపడింది. 1958 లో తొలిసారిగా విదేశాల్లో పర్యటించారు. బర్మా, థాయిల్యాండ్, మలేషియా, సింగపూర్, హాంకాంగ్ మొదలైన దేశాలు పర్యటించి, 1959 లో హవాయి ద్వీపాలకు వెళ్ళారు. 'ఆయన వద్ద డబ్బు లేదు, ఆయనేదీ అడగడు. ఆయన సామానంతా ఒక చేతిలో పట్టుకోవచ్చు. మహర్షి మహేశ్ యోగి ప్రపంచ పర్యటనలో ఉన్నారు. ఈ ప్రపంచం నుంచి విచారాన్ని, అసంతృప్తిని నిర్మూలించే సందేశాం ఆయన మోసుతున్నారని చెప్తారు' అని అక్కడి పత్రికలు ప్రచురించాయి. 1959 లో భావాతీత ధ్యానం మీద హోనోలులు, సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, బోస్టన్, న్యూ యార్క్, లండన్ లో ప్రసింగైంచడమే కాక అక్కడ అనేకమందికి ఈ ధ్యాన ప్రక్రియ నేర్పించి, వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక అనుభూతులను కలిగించారు. అప్పటికే వారికి పాశ్చాత్య దేశాల్లో ఎంతో ఆదరణ లభించింది. వారి పుస్తకాలు 15 భాషల్లోకి అనువాదం అయ్యాయి.
1966 లో వీరు ఆరంభించిన విద్యార్ధి అంతర్జాతీయ ధ్యాన సంస్థ 4 ఏళ్ళల్లో వేయికి పైగా శాఖలతో విస్తరించింది. హార్వర్డ్, యేల్, బర్కలీ వంటి విశ్వవిద్యాలయాల్లో సైతం ఈ ధ్యాన ప్రక్రియ కేంద్రలు ఆరంభమయ్యాయి. 1969 లో స్విట్జర్‌ల్యాండ్ లో కొత్త విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆరభించారు. అక్కడ సృజనాత్మక మేథోవిజ్ఞానంపై ఒక కోర్సును ఆరంభించగా, అమెరికాలోని 25 విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును తమ కళాశాలలో ఆరంభించాయి. 1971 నాటికి 13 సార్లు విశ్వసందర్శనలో భాగంగా 50 కి పైగా దేశాల్లో పర్యటించి, 3600 శిక్షణా కేంద్రాలను విశ్వవ్యాప్తంగా ఆరంభించి, భావాతీత ధ్యాన శిక్షణను ఉధృతం చేశారు. 1973 లొ ఇల్లినాయిస్ రాష్ట్రంలో పాఠశాలల్లో ఈ ప్రక్రియ పాఠ్యాంశంగా చేరుస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. 1974 లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని, ఆ తర్వాత మహర్షి వేద విజ్ఞాన విశ్వపీఠాన్ని, 1990 లో మహర్షి యూరోపియన్ రీసెర్చి యూనివర్సిటి ని స్థాపించారు. 22 భాషలలో, 144 దేశాల్లో భారతీయా ఆధ్యాత్మికతను చాటే వేద విజన్ అనే టివి చానెల్ ను ప్రారంభించిన ఘతన వీరిదే. చివరకు ఫిబ్రవరి 5, 2008 న మౌన దీక్షలో శివైక్యం చెందారు.
ఇలా ఎన్నో దేశాల్లో పర్యటించి, తాను వెళ్ళిన ప్రతి చోటా సనాతన ధర్మ సువాసనలను వెదజల్లుతూ, అంతర్జాతీయ స్థాయి వైదిక విశ్వవిద్యాలయాలను స్థాపిస్తూ, హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మహర్షి మహేశ్ యోగిని మనం నిత్యం స్మరించాలి. నేడు మహర్షి మహేశ్ యోగి జయంతి.
భక్తి పత్రిక మరియు వికీపీడియా నుంచి సేకరణ
Wednesday, 11 January 2017
స్వామి వివేకానంద సూక్తి
My faith is in the younger generation, the modern generation, out of them will come my workers. They will work out the whole problem, like lions. I have formulated the idea and have given my life to it. If I do not achieve success, some better one will come after me to work it out, and I shall be content to struggle.
- Swami Vivekananda
Tuesday, 10 January 2017
జ్ఞానార్జన స్త్రీల హక్కు- స్వామి వివేకానంద సూక్తి
In what scriptures do you find statements that women are not competent for knowledge and devotion? In the period of degradation, when the priests made the other castes incompetent for the study of the Vedas, they deprived the women also of all their rights. Otherwise you will find that in the Vedic or Upanishadic age Maitreyi, Gargi, and others ladies of revered memory have taken the places of rishis through their skill in discussing about Brahman. In an assembly of a thousand Brahmanas who were all erudite in the Vedas, Gargi boldly challenged Yajnabalka in a discussion about Brahman. Since such ideal women were entitled to spiritual knowledge, why shall not the women have the same privilege now? What has happened once can certainly happen again. History repeats itself.
- Swami Vivekananda
Monday, 9 January 2017
Sunday, 8 January 2017
Saturday, 7 January 2017
స్వామి శివానంద సూక్తి
Drive away from your mind all unnecessary, useless and obnoxious thoughts. Useless thoughts impede your spiritual growth; obnoxious thoughts are stumbling blocks to spiritual advancement.
You are away from God when you entertain useless thoughts. Substitute thoughts of God. Entertain only thoughts that are helpful and useful. Useful thoughts are the stepping-stones to spiritual growth and progress.
- Swami Sivananda
Friday, 6 January 2017
Thursday, 5 January 2017
Wednesday, 4 January 2017
Tuesday, 3 January 2017
Monday, 2 January 2017
కంచి పరమాచార్య సూక్తి
Our affection for our wife, children and others is in fact affection for ourselves. According to the Upanisadic teaching of Yajnavalkaya, it is for our own inner contentment that we love others. We perform puja to the Lord purportedly because of our devotion for him and we do social service presumably because of our love of mankind. But in truth the reason is we like ourselves and find happiness in such acts. For the sake of such happiness we do not mind encountering difficulties or making sacrifices.
- Kanchi Paramacharya Swami
Sunday, 1 January 2017
సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి
Establish a relationship with God everyday. Keep chanting a prayer all the time. There is nothing like a prayer time at all. Prayer time is an exclusive time for concentrating dhyana or pooja or offering something to God. Otherwise, the chanting must go on. It will go on during the sleeping time without your knowledge.
Satguru Sivananda Murty Garu
Subscribe to:
Posts (Atom)