కాస్త బిజీగా ఉండి చెప్పడం మరిచాను. వైశాఖ అమావాస్య నాడు శని జయంతి జరుపుతారు. శనైశ్చరునికి సంబంధించిన ఈ తిధిని శని అమావాస్య అని కూడా అంటారు.
ఛాయ దేవికి, సూర్యభగవానుడు పుత్రుడు, నవగ్రహాల్లో ముఖ్యమైనవారు, వారాలలో శనివారానికి అధిదేవత, శ్రీ శనైశ్చరుడు. శని జయంతిని వటసావిత్రి వ్రతం రోజునే జరుపుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి, శని దర్శనం చేసుకుని, శనైశ్చరుని ఆశీర్వాదం పొందుతారు. పూర్వజన్మ కర్మకు శని ఫలితం ఇస్తాడు. అది పాపకర్మ అయితే కష్టాలు పెడతాడు, పుణ్యకర్మ అయితే సుఖాలు ఇస్తాడు. జీవుల పూర్వకర్మలకు ఫలితాన్నిస్తూ, నిక్ష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, అందరికి న్యాయం చేస్తాడు శని దేవుడు. శని పెట్టే కష్టాలు మానవుడిని ఆధ్యాత్మికత దిశగా నడిపిస్తాయి.
శనిని ధ్యానించడం వలన ప్రాణభయం తొలగుతుంది, ప్రమాదాలు నివరించబడతాయి. పెద్దలకు, తల్లిదండ్రులకు సేవ చేయడం, వాహనం అధికంగా వాడకుండా, ఎక్కువగా నడవడం; ధర్మం వద్దని చెప్పిన పనులు చేయకుండా ఉండటం, ధర్మం విధించిన పనులను నిష్కామంగా చేయడం, ఆంజనేయస్వామి వారిని, పరమశివుడిని, శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించడం వలన, శనికి తైలాభిషేకం చేయడం, భొజనానికి ముందు కాకులకు అన్నం పెట్టి, ఆ తర్వాత భుజించడం వంటి పనుల వలన శనైశ్చరుని అనుగ్రహం కలుగుతుంది.
ఈనాడు (25-05-2017, Thursday)(వైశాఖ అమావాస్య) శనిని కాసేపు ధ్యానించి ఆయన అనుగ్రహం పొందుదాం.
ఓం శనైశ్చరాయ నమః
మంచి పోస్ట్. చాలా బాగా వ్రాసారు...Good
ReplyDeleteమీకు నచ్చిన latest Telugu Dubbed Movies చూసి ఆనందించండి.