వేదాంగమైన జ్యోతిష్యం ప్రకారం ఈ సృష్టి 197.5 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారమభమైంది. శ్రీ మద్భాగవతం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వేదాంగ జ్యోతిష్యం ప్రకారం 2017 నాటికి ఈ సృష్టి ప్రారమభమై 197, 29, 49, 117 సంవత్సరాలు గడిచాయి. నిజానికి 20 వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు పాశ్చాత్య ప్రపంచం, ముఖ్యంగా క్రైస్తవ, యూదు, మహమ్మదీయ మొదలైన అబ్రహం మతాల వారు ఇదే నమ్మేవారు. క్రైస్తవ ప్రభావం అధికంగా ఉన్న ఐరోపా (యూరోప్) లోని శాస్త్రవేత్తలకు సైతం ఈ సృష్టి కొన్ని వేల ఏళ్ళ క్రితం నాటిదని అంగీకరించేందుకు మనస్కరించలేదు.
ప్రముఖ మత పరిశోధకుడు, పండితుడైన హూస్టన్ స్మిత్ (మే 31, 1919 – డిసెంబర్ 30, 2016) అంటారు: " సనాతన ధర్మంలో అవ్యక్తం దేన్ని మినహాయించదు, అవ్యక్తం దేన్నీ మినహాయించకపోవటమే అనంతం- అనతమే భారతీయ ఆత్మ."
ఎల్లలు/ సరిహద్దులు లేని దాన్ని లేదా అంతటిని భారతదేశం తన ముఖం తిప్పి స్పష్టంగా చూసింది.................
పాశ్చాత్యం విశ్వం వయస్సు 6,000 ఏళ్ళు కావచ్చునని ఆలోచిస్తుండగా- గంగానదిలో ఇసుకు రేణువుల మాదిరిగా అనతమైన కల్పాలను, నక్షత్రవీధులను భారతదేశం దర్శించింది. ఈ విశ్వం ఎంత విశాలమైందంటే, ఆధునిక ఖగోళశాస్త్రం ఎటువంటి అలజడిలేకుండా అందులోకి జారిపోతుంది.
“The invisible excludes nothing, the invisible that excludes nothing is the infinite – the soul of India is the infinite.”
“Philosophers tell us that the Indians were the first ones to conceive of a true infinite from which nothing is excluded. The West shied away from this notion. The West likes form, boundaries that distinguish and demarcate. The trouble is that boundaries also imprison – they restrict and confine.”
“India saw this clearly and turned her face to that which has no boundary or whatever.” “India anchored her soul in the infinite seeing the things of the world as masks of the infinite assumes – there can be no end to these masks, of course. If they express a true infinity.” And It is here that India’s mind boggling variety links up to her infinite soul.”
“India includes so much because her soul being infinite excludes nothing.” It goes without saying that the universe that India saw emerging from the infinite was stupendous.”
While the West was still thinking, perhaps, of 6,000 years old universe – India was already envisioning ages and eons and galaxies as numerous as the sands of the Ganges. The Universe so vast that modern astronomy slips into its folds without a ripple.” - Huston Smith (source: The Mystic's Journey - India and the Infinite: The Soul of a People – By Huston Smith).
=======================
వేదాన్ని తొలుతుగా భగవంతుడు అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం చెప్తోందని దయానందులు పేర్కొన్నారు. ఈ నలుగురు ఋషులే మిగితా ఋషులకు చెప్పారు. ఆ తర్వాత వారు తమ పిల్లలకు, వారు వారి పిల్లలకు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం ప్రకారం ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి కుల, వర్ణ, మత, జాతి, భాషలకు అతీతంగా ఋషుల సంతానం. జీవుల పూర్వ పుణ్యాలను, వారి తపోనిష్ఠను, ధర్మనిష్ఠను, కర్మఫలాలను అనుసరించి ఋషులను, సామాన్య మానవులను సృష్టింపజేశాడు భగవంతుడు. ఈ ఋషులనే ప్రజాపతులు అంటారు, వీరే మానవజాతికి మూలపురుషులు. ప్రజాపతులకు భార్యలు ఉన్నారు. వీరిని అనేకమందిని సృష్టినిచిన బ్రహ్మ మానవజాతిని కొనసాగించమని, సంతానం ద్వారా లోకంలో ధర్మం వర్ధిల్లేలా చూడమని ఆజ్ఞాపించాడు. బ్రహ్మ ఆజ్ఞానుసారం ఋషులు మానవజాతిని పునరుత్పత్తి చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మానవులంతా ఋషుల సంతానమే అంటుంది హైందవ ధర్మం. ఈ మధ్య ఏసు క్రీస్తును ప్రజాపతి అంటూ మతమార్పిడి కోసం పన్నాగం పన్నుతున్నారు. ప్రజాపతులకు, ఏసుకు చాలా తేడా ఉందని గ్రహించాలి. ఏసుకు పెళ్ళి అయ్యిందని క్రైస్తవులు ఒప్పుకోరు, బైబిల్ లో ఏముంది అన్నది తర్వాతి సంగతి. ప్రజాపతులు యజ్ఞాన్ని, వైదిక దేవతలను అంగీకరించారు. ఏసు అంగీకరించట్లు క్రైస్తవులు ఒప్పుకుంటారా?...
ఈ సిద్ధాంతం కూడా భారతదేశంలో పుట్టిన మతాలను ఇతర మతాల నుంచి వేరు చేస్తుంది. జైన, బౌద్ధ మొదలైన మతాలు, హిందు ధర్మం, చైనాలో హిందు ధర్మం ఆధారంగా వచ్చిన మాతాలను తప్పించి పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న మిగితా మతాలను అబ్రహామిక్ మతాలంటారు. వాళ్ళకి మూల పురుషుడు అబ్రహం అని చెప్తారు. దేవుడు ఆదాము, ఈవ్ అనే ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించి, వారిని ఒక సుందరమైన ఉద్యానవనంలోకి ప్రవేశపెడతాడు. అందులో ఉన్న ఫలాలను స్వీకరించమని, ప్రకృతి అందాలను ఆస్వాదించమని చెప్తాడు కానీ ఒక వృక్షాన్ని చూపించి, దానికున్న ఫలాన్ని మాత్రం తినవద్దని, అది మంచి, చెడుల విచక్షణ జ్ఞానం కలిగించే ఫలమనీ, అది ముట్టుకుంటే మరణిస్తారని చెప్తాడు. ఇంతలో అక్కడికి సైతాన్ రావడం, ఈవ్, ఆదాము ఆ ఫలాన్ని తినడం జరుగుతుంది. ఫలితంగా వారికి లింగ విచక్షణ జ్ఞానం వస్తుందట. వారి మధ్య ఆకర్షణ మొదలవుతుంది, కామోద్రేకానికి దారి తీస్తుంది. ఈ విషయం దేవుడికి తెలిసి, వారిని శపిస్తాడు. పైగావారు చేసిన పాపానికి, వారి నుంచి పుట్టే సమస్త మానవజాతికి పాపం చుట్టుకుంటుందని అంటాడు. దాన్ని క్రైస్తవం Original sin అంటుంది. తర్వాత ఆదాము, ఈవ్‌ల నుంచే మొత్తం మానవజాతి ఉద్భవించిందని, వారు చేసిన పాపం కారణంగా, పుట్టినవాళ్ళందరూ పాపులేననీ ఆయా మతగ్రంధాలు చెప్తాయి. అందుకే ఇతర మతగురువులు జనులను ఉద్దేశ్యించి పాపుల్లారా! అంటూ సంబోధిస్తారు. ఆయా మతగ్రంధాల ప్రకారం పుట్టినప్రతి వాడే పాపియే. అందుకే ఈ రోజుకీ మతమార్పిడి చేసే సమయంలో కూడా మీరంతా పాపులు, మా ప్రవక్త రక్షకుడు. అతడే సరైనవాడు, అతన్ని మాత్రమే పూజించండి అని వారంటారు.
To be continued ......
No comments:
Post a Comment