Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Thursday, 31 January 2019
Wednesday, 30 January 2019
Tuesday, 29 January 2019
Monday, 28 January 2019
Sunday, 27 January 2019
Saturday, 26 January 2019
సకలశుభాల కొరకు ఆదివారం పాటించాల్సిన నియమాలు.
27 జనవరి, 2019, ఆదివారం, భానుసప్తమి.
ఆదివారం, సప్తమి తిథి కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.
సాధారణంగా #ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా
1. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం
2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకపోవటం. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి.
3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
5. బ్రహ్మచర్యం పాటించాలి.
నవగ్రహాలకు అధిపతి #సూర్యభగవానుడు. ఆయన కటాక్షం ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు #ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.
- ఈ #భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒకానొక పర్వదినమున, గొప్ప #యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.
- పెద్దలు ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.
- ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదికాలు ముగించనివారు, ఆహార నియమాలు పాటించని వారికి 7 జన్మల పాటు రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
భావం - తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్యమాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు.
- ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు, ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన.
- ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం #సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్ఠం. #సుర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కామ్యసిద్ధిని ఇస్తాయి.
ఓం శ్రీ సూర్యనారాయణ నాయ నమః
Friday, 25 January 2019
Wednesday, 23 January 2019
24 జనవరి 2019, గురువారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
24 జనవరి 2019, గురువారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
పుష్య మాసంలో వచ్చిన దీనికి లంబోదర సంకష్టహర చవితి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
24 జనవరి 2019, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.33 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html
Monday, 21 January 2019
Sunday, 20 January 2019
హిందూ ధర్మం - 276 (కర్మసిద్ధాంతం- 16)
సంస్కారాల మీద సంయమం
సంస్కారాన్ని నిద్రావ్స్థలో ఉన్న శక్తి అని కూడా అంటారు. ఎప్పుడైతే వృత్తులు లేదా ఆలోచనలన్నీ సమసిపోతాయి, అప్పుడు మనస్సు అనే రూపం సంస్కారాలతో కలిసి ఉంటుంది. దీన్నే వేదాంత పరిభాషలో 'అంతఃకరణ మాత్రము' అంటారు.
అన్ని సంస్కారాలు మనసులో కలిసే ఉంటాయి. వృత్తులు క్రమంగా అణిగి, వాటి యొక్క జాడలలను మనసులో నిలిపుతాయి. ఈ జాడలే సంస్కారాలు. ఈ సంస్కారాల నుంచే జ్ఞాపకాలని పుడతాయి. మీకు యోగదృష్టి ఉంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిలో ఈ వృత్తులు మనసు అనే సరస్సు నుంచి ఎలా పైకి లేస్తున్నాయి, అవి తిరిగి ఎలా కిందకి అణిగిపోతున్నాయి, సంస్కారం ఎలా ఏర్పడుతోంది అనేది మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. అది మీరు చూసి ఆశ్చర్యచకితులవుతారు. సంస్కారాల మీద సమ్యమము అనేది నిద్రాణమై ఉన్న శక్తుల గురిన్చి ప్రత్యక్ష జ్ఞానం కలిగిస్తుంది. అతని సంస్కారాల యొక్క ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఒక యోగి తన గత జన్మ గురించి తెలుసుకుంటాడు. అలాంటి జ్ఞానాన్ని పంచడం ఏ విశ్వవిద్యాలయాలకు కూడా సాధ్యం కాదు. యోగి మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని అర్హత కలిగిన శిష్యులకు ఇవ్వగలడు.
మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు
ఏ విధంగానైతే చెడు సంస్కారాలు ఉంటాయో అలాగే మంచి సంస్కారాలూ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి రోగంతో బాధపడుతూ కనిపిస్తే, మీ హృదయంలో దయ అనేది ఉద్భవిస్తుంది. గత జన్మలో మీరు చేసిన దయతో చేసిన ప్రతి పని సంస్కారంగా మారి ఉంటుది. అవన్నీ మనస్సులో పైకి వచ్చి, ఆ శక్తి ద్వారా మీరు అతనికి సేవ చేస్తారు, సాయం చేస్తారు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నా లేదా అలమటిస్తునా, ఇంతకముందు మీరు సేవా దృక్పథంతో చేసిన ప్రతి కర్మ నీ మనస్సు యొక్క చేతనలోకి ప్రవేశించి మీరు అతనికి సహాయం చేసేలా చేస్తుంది, తద్వారా మీరు సాయం చేస్తారు. ఒక మంచి సంస్కారం లేదా పుణ్య కర్మ మీరు చేస్తున్నప్పుడు, దానికి తద్విరుద్ధమైన వేరొక కూడా చెడు సంస్కారం కూడా బయలుదేరుతుంది. అది కూడా దాని పని చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు మీ మనస్సుని భగవంతుని మీద లగ్నం చేయాలని అనుకున్నప్పుడు, అంతఃశుద్ధి గురించి ఆలోచించినప్పుడు, ఆ క్షణంలోనే చెడు ఆలోచనలు, సంస్కారాలన్నీ ఒక్క ఉదుటన మీ మీదకు దాడి చేస్తాయి. మంచి సంస్కారాలు కూడా ఏకమై చెడు సంస్కారాలను పారద్రోలేందుకు మీకు సహాయ పడతాయి. స్వామి అద్వైతానందజీ వారి తండ్రి చండీమాతకు గొప్ప భక్తుడు. ఆయన అంతిమ సమయంలో సుప్తచేతనావస్థలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన బాల్యంలో నేర్చుకున్న చండి స్తోత్రాలు మనస్సులోకి ప్రవేశించాయి. వేంటనే వాటిని చదవడం మొదలు పెట్టారు. ఇది సత్సంకారాలు ఏకమై సరైన సమయంలో బయటకు రావడానికి నిదర్శనం.
మీరు జన్మించినప్పుడు మీ మనస్సు అనేది పూలబాట లాంటిది కాదు. అందులో ఎన్నో సంస్కారాలు, ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు మొదలైనవి ఉన్నాయి. ఒక పిల్లవాడు పుట్టినప్పుడు అతని గత జన్మ అనుభవాలన్నీ మానసికమైన సంస్కారాలుగా, ఆలోచనలుగా, మానసిక శక్తిగా రూపాంతరం చెంది ఉంటాయి. అనుభవాల ద్వారా మనిషి వాటిని గ్రహిస్తాడు. భౌతిక ప్రపంచంలో కలిగే అనుభవాలను అతని బుద్ధి లోకి నిక్షిప్తమైపోయాయి. ఇంద్రియాల ద్వారా ఈ విశ్వం నుంచి తీసుకున్న సంస్కారాల ద్వారా మనసు ఏర్పడుతుంది. ఈ ప్రపంచం యొక్క సంపూర్ణమైన అనుభూతి పొందేవరకు, అది ఎన్నో శరీరాలను తీసుకుంటుంది. అంటే ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించే వరకు/ తెలుసుకునేవరకు, దాని గురించి జ్ఞానం పొందేవరకు, మనస్సు ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని సంస్కారాలు సహజసిద్ధంగా ఉంటాయి, అనగా పుట్టుకతో వస్తాయి. ఇవన్నీ అతని చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. చిత్తమే ప్రారబ్దానికి కేంద్ర స్థానము. భౌతిక ప్రపంచంలో అతను మరిన్నో సంస్కారాలను లేదా అనుభవాలను తన కర్మల ద్వారా పోగు చేసుకుంటాడు. ఇవి ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలకు తోడై భవిష్యత్తులో తనకు సంచిత కర్మలుగా మారుతాయి.
ఇంకా ఉంది.....
Saturday, 19 January 2019
Friday, 18 January 2019
Thursday, 17 January 2019
Wednesday, 16 January 2019
Tuesday, 15 January 2019
Saturday, 5 January 2019
Friday, 4 January 2019
Thursday, 3 January 2019
Wednesday, 2 January 2019
Tuesday, 1 January 2019
Subscribe to:
Posts (Atom)