Showing posts with label భానుసప్తమి. Show all posts
Showing posts with label భానుసప్తమి. Show all posts

Saturday, 26 January 2019

సకలశుభాల కొరకు ఆదివారం పాటించాల్సిన నియమాలు.



27 జనవరి, 2019, ఆదివారం, భానుసప్తమి. 

ఆదివారం, సప్తమి తిథి కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. 

సాధారణంగా #ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. వాటిలో ప్రధానంగా 
1. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం
2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకపోవటం. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి.
3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
5. బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి #సూర్యభగవానుడు. ఆయన కటాక్షం ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు #ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు. 

- ఈ #భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒకానొక పర్వదినమున, గొప్ప #యోగము. ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. 
- పెద్దలు ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.

- ఆదివారం నాడు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదికాలు ముగించనివారు, ఆహార నియమాలు పాటించని వారికి 7 జన్మల పాటు రోగాలు వస్తాయని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

భావం - తినకూడని పదార్ధాలు, మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్యమాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు.

- ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు, ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన. 
- ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం #సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్ఠం. #సుర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కామ్యసిద్ధిని ఇస్తాయి.

ఓం శ్రీ సూర్యనారాయణ నాయ నమః