ఇంతకీ మోదీ మనకు ఏం చేశాడు ?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు బిజెపి దేశం కోసం ఏం చేసిందో తెలుసుకోవడం చాలా అవసరం ఏమో. మోదీ-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాల్లోనే దాదాపు 32 వేల ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చి, వాటి లైసెన్స్ రద్దు చేసిందని మీకు తెలుసా?
నిజానికి సేవ ముసుగులో ఎన్నో ఎన్జీవోలు మన దేశంలో పని చేస్తూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాయి. అయితే అవి చేసేది సేవ కాదు, మత మార్పిడి. కొన్ని సందర్భాల్లో ఈ మత మార్పిడి ఎంత ప్రమాదకరంగా ఉందంటే- అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా ఆ ఎన్జీవోలు స్థానిక ప్రజానీకాన్ని ఉసిగొల్పుతున్నాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ- తమిళనాడులో ఉన్న అణు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలు. ఆ ఆందోళనలను పసిగట్టిన స్వామినాధన్ గురుమూర్తిగారు అక్కడ ఉన్న స్థానిక చర్చిని రద్దు చేయమని సలహా ఇచ్చారు. అక్కడ చర్చి వచ్చిన తర్వాతే ఆ ఆందోళనలు మొదలయ్యాయి.
మేఘాలయాలో కాశీ పర్వతాలని ఉన్నాయి. ఈ పర్వతాల్లో యూరేనియం దొరుకుతుందని, ఆ యూరేనియం భారతదేశ అవసరాలకు వాడుకుంటే, ఇతర దేశాల మీద ఆధారపడకుండా భారతదేశం అణు రంగంలో స్వయం ప్రతిపత్తి సాధిస్తుందని తెలిసిన కొన్ని విదేశాలు, అక్కడ ఎన్జీవోలు మతమార్పిడులకు పాల్పడి, కొనిన్ బోధనల ద్వారా ఉద్యమం లేవనెత్తాయి. ఫలితంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధి ఆగిపోయింది.
అలాగే గిరిజనులకు వైద్య సేవలు చేస్తామంటూ చత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో పనిచేసే కొన్ని ఎన్జీవోలు, మావోయిస్టులకు, నక్సలైట్లకు సాయం చేస్తున్నట్టు కూడా బయటపడింది. ఈ విధంగా సేవ ముసుగులో అనేక ఎన్జీవోలు విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని దేశంలో, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇటువంటివి జరగరాదని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్జీవోల నుంచి వారి సేవా వివరాలు అడిగింది. ఏవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ఆరా తీసింది. FEMA, FERA చట్టాలను ఉపయోగించింది. దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అనేక ఎన్జీవోలు, దాదాపు 20 వేల ఎన్జీవోల లైసెన్స్లను రద్దు చేసింది.
నిజానికి ఈ ఎన్జీవోలు మావోయిస్టులకు, మతమార్పిడి మూకలకు, భారతదేశ వ్యతిరేక సాహిత్యాన్ని రాసే దేశద్రోహులను ప్రోత్సహిస్తున్నాయి, ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఇందులో విదేశాల నుంచి డబ్బులు పొందుతూ లెక్కలు చూపని హిందూ సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ఎక్కడ పక్షవాతం చూపించలేదు. కాకపోతే దేశవిద్రోహ కార్యక్రమాలకు పాల్పడే ఎన్జీవోలే కనుక వాటికి గట్టి దెబ్బ తగిలింది.
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి నిధులు రావడం ఆగిపోయింది. ఫలితంగా వారిలో అసహనం పెరిగింది. మీకు గుర్తు ఉండే ఉంటుంది, మోడీ ప్రభుత్వం వచ్చిన తొలి రెండేళ్లలో మనదేశంలో అసహనం (Intolerance) పెరుగుతోంది అంటూ కొన్ని ఉద్యమాలు వచ్చాయి. కొందరు తమకు వచ్చిన అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు, విదేశాలకు వెళ్ళిపోతామని ప్రకటనలు చేశారు. నిజానికి మన దేశంలో అప్పుడు హిందుత్వవాదులు అసహనం పెరగడం కాదు, తమకు రావలసిన నిధులు అందకపోవడంతో ఈ దేశంలో ఉన్న ఎందరో 'మేధావులకు', మిషనరీలకు కడుపు మండింది. నిజానికి ఇక్కడ మనం ప్రభుత్వాన్ని గట్టిగా మెచ్చుకోవాలి ఎందుకంటారా? చట్టపరమైన వివరాలు ఇవ్వనందుకు, ప్రపంచంలోనే అతి పెద్ద సేవా సంస్థల్లో ఒకటైన ఫోర్డ్ ఫౌండేషన్ వారి కార్యకలాపాలను కూడా భారతదేశంలో స్తంభింపజేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తాఖీదులు ఇచ్చింది. దీని మీద అమెరికా ప్రభుత్వం మోదీని ఎంతో ఒత్తిడికి గురిచేసినా, చాలా కాలం మన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. CIA లాంటి సంస్థలు కూడా మోదీ ప్రభుత్వం యొక్క పట్టుదలను చూసి భయపడ్డాయి. ఇవన్నీ వార్తల్లో వచ్చిన అంశాలే. ప్రభుత్వం ఇంత గట్టిగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక మన దేశంలో అసహనం పెరిగింది ఉద్యమాలు చేశారు. నిజానికి ఒక గట్టి కేంద్ర ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం ఉంది కాబట్టే ఈ విధంగా చేయడం సాధ్యమైంది.
ఇలాంటి సాహసోపేత నిర్ణయం ఇంతవరకు మన దేశంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఆ విధంగా చూసినప్పుడు మోదీ భారతదేశానికి మేలు చేసే విధంగా తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని, హిందూ సమాజం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఇలాంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడమే కాదు ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఇలా మతమార్పిడులు చేస్తున్న వారిని పాల్పడుతున్నవారు మీద కఠినంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి మనం అండగా నిలబడకపోతే, ఇంకెవరు నిలబడతారు? అలాంటి వారికి మనం మద్దతు పలకకపోతే, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటారా ఆలోచించి చెప్పండి. #NamoAgain
ReplyDeleteచాలా బాగా వ్రాసారు.
Unfortunately Indian media never brings forward the right spirit of BJP's action
Agendas of media makes one to raise eyebrow why and in what interest they are acting that way
జిలేబి
ఒక్క వైజాగ్ లో 23 వేల గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళల్లో చేస్తున్నది ఏమిటి ? బ్రాహ్మణోద్ధరణా ?
ReplyDeleteనీహారిక గారి కామెంట్ 👇
Delete"నీహారిక 22 March 2019 at 09:55
ఒక్క వైజాగ్ లో 23 వేల గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళల్లో చేస్తున్నది ఏమిటి ? బ్రాహ్మణోద్ధరణా ?"
========================
నా స్పందన 👇
23 వేల గుళ్ళా 😳 ? వైజాగ్ నగరంలోనా, వైజాగ్ జిల్లా మొత్తానికా? అయినా ఒక గుడిని నమ్ముకుని కొన్ని బ్రాహ్మణేతర కుటుంబాలు కూడా బతుకుతాయి, సో వారందరినీ కూడా "ఉద్ధరించి"నట్లే.
(నేను వైజాగ్ నగరంలో ఐదేళ్ళు ఉన్నాను. అన్ని వేల గుళ్ళతో నగరం కిటకిటలాడిపోయినట్లనిపించలేదే 🤔. వైజాగ్ వాస్తవ్యులు, బ్లాగరూ అయిన వోలేటి వారేమంటారో?)
@ వి న రా,
Deleteప్రభుత్వ గణాంకాలప్రకారం రెండు మిలియన్ల గుళ్ళు ఇండియాలో ఉన్నాయట(హిందువులవే అనుకుందాం) జనాభా లెక్కలో చూస్తే షుమారుగా ప్రతి వెయ్యి మందికి ఒక గుడి అనుకున్నా విశాఖ జిల్లా కి 4000 గుళ్ళు ఉండొచ్చు....ప్రభుత్వ లెక్కల్లోకి రాని కూచమ్మ, పోచమ్మా,ఎల్లమ్మ,మల్లమ్మ గుళ్ళు కూడా కలిపితే 23 వేల గుళ్ళు అవుతాయి.
మా కాలనీలో ఒక కిలోమీటరు పరిధిలో 10 గుళ్ళు ఉన్నాయి.ఆ లెక్కన చూసుకున్నా 23 వేలు తక్కువే అవుతాయి.
విశాఖలో మన్యం ప్రజలు ఎక్కువ భక్తీ ఎక్కువే,
విశాఖలో ఒక ఇల్లు కట్టుకుని దానిప్రక్కనే గుడి కట్టుకున్నవాళ్ళనీ చూసాను. ఆ ఇల్లు బ్రాహ్మణులదే అని అనను. గుడి అనేది అక్కడ వ్యాపారం మాత్రమే అని మాత్రం చెప్పగలను. వారికి బ్రాహ్మణ పూజారి అవసరమే కానీ వ్యాపారంలో బ్రాహ్మణ పూజారి భాగస్వామి అయి ఉండరు అని అనుకుంటున్నాను.
ఏ గుడిని తీసుకున్నా బ్రాహ్మణులు అవసరమే కానీ వారు వ్యాపారంలో భాగస్వాములు కానపుడు గుళ్ళ వ్యాపారాల్లో గానీ గుళ్ళ వ్యవహారాల్లో గానీ వారి ప్రమేయం లేనపుడు హిందూత్వాన్ని తామే ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకోవచ్చు కానీ బీజేపీ హిందూత్వాన్ని కాపాడుతుందని ఎలా చెపుతారని అడుగుతున్నా వి న రా ?
2011 సెన్సస్ లెక్కల ప్రకారం భారత్ జనాభా 1,210,193,422 అయితే విశాఖ పట్నం జిల్లా 4,288,113.
Deleteదేశం మొత్తం మీద రెండు మిలియన్ గుళ్ళు ఉన్నాయని & విశాఖ జిల్లాలో అదే గుడి/జనాభా నిష్పత్తి ఉందని అనుకుంటే 7,087 సంఖ్య వస్తుంది. ఇది నీహారిక గారు చెప్పిన 23,000లో కేవలం 30.8%.
ప్రతి వెయ్యి మందికి ఒక గుడి అనుకున్నా విశాఖ జిల్లా కి 4000 గుళ్ళు ఉండొచ్చు....
Deleteప్రభుత్వ లెక్కల్లోకి రాని కూచమ్మ, పోచమ్మా,ఎల్లమ్మ,మల్లమ్మ గుళ్ళు కూడా కలిపితే 23 వేల గుళ్ళు అవుతాయి.
Note these points your honour..
విశాఖలో మన్యం ప్రజలు ఎక్కువ భక్తీ ఎక్కువే
DeleteWe cannot compare apples and oranges.
4,000 కాదు 7,087. పోనీ అనుకున్నా ఈ సంఖ్య 23,000 కావడానికి చేసిన extrapolation ఆధారాలు తెలీదు.
DeleteWith due respect, the numbers, sources & statistical methods are all highly suspect and amount to little more than random guesswork.
ఎన్నికలు అనగానే బ్రాహ్మణులంతా కట్టగట్టుకుని మోడీని సపోర్ట్ చేయడానికి వచ్చేస్తారు. హిందూత్వాన్ని కేసీఆర్ కూడా కాపాడగలడు.
ReplyDeleteమోడీ NGOలను మూపించడం తప్ప ఇంకేం చెయ్యలేదు. మరి ఈసారి గెలిపిస్తే, ఇంకా మిగిలినీవి మూపిస్తాడు. దేశానికిమాత్రం చేసేదేం ఉండదు. అంతేకదా?
ReplyDeleteఆంధ్రా తెలంగాణా అని తేడా లేకుండా తెలుగువారందరూ బీజేపీ కి ఓటువేయకూడదు. నేను కాంగ్రెస్ అభిమానిని అయినా కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పను. విడిపోదలుచుకున్నపుడు గౌరవంగా విడిపోవాలి. విడిపోయాక ఎవరి ఆస్థులు వారే తీసుకున్నాక కట్టుబట్టలతో నిలబడ్డవారిని సపోర్ట్ చేయకపోయినా పరవాలేదు కానీ నమ్మించి మోసం చేయడం ఎంత దారుణం ? నమ్మడమే తప్పు అంటే ఎలా ? మన రాష్ట్రంలో ఎవరు ఇమాన్‌దార్ అయితే వారికి ఓటు వేయండి. అవినీతిపరుల చౌకీదార్ లకు ఓటు వేయకండి.
ReplyDeleteఎవరు చేయాల్సిన పని వారు చేసినప్పుడే దేశం అభివృద్ది చెందుతుంది. చౌకీదార్ కి చౌకీదార్ పనే ఇవ్వాలి తప్ప ప్రధానమంత్రి పదవి ఇవ్వకూడదు.
Deleteనీహారిక గారూ, తెలుగు వారు *మాత్రమే* బీజేపీకి ఓటు వేయకూడదు & మిగిలిన భారతీయులు అందరూ బీజేపీకే ఓటు వేయాలా? మీకు ఆ పార్టీ ఇష్టం కాదంటే అది మీ ఇష్టం కానీ ఈ భాష తాలూకా పట్టింపు ఏమిటో నాకు అర్ధం కావడం లేదు.
Deleteజనాభా లెక్క ప్రకారం 1000 మందికి ఒక గుడి అయితే విశాఖలో 200 వందల మందికి ఒక గుడి అంటున్నాను. ఇది నేను చెప్పింది కాదు విశాఖలో ఉన్న ఒక వ్యాపారి చెప్పిన మాట !
Deleteభాష తాలూకా కాదు.... 24 నయా పైసలు కూడా కేంద్రం ఇవ్వలేదు అని కేసీఆర్ గారు అన్నారు కదా అందుకే తెలంగాణా వారిని కూడా కలిపాను. మీ బాస వేరు మీ గోస వేరు కదా మర్చిపోయాను. ఆంధ్రా వారు మాత్రమే అని చదువుకొనగలరు.
గుళ్ల లెక్క పొసగడం లేదు. 1:1,000 నిష్పత్తిలో దేశం మొత్తంలో 1,210,193 ఉండాలి. మీరేమో రెండు మిలియన్లు అన్నారు. Something is not jelling, anyway accuracy is not expected from sources like "some random businessman".
Delete*కేంద్రం* (బీజేపీ కాదు) తెలంగాణకు *మాత్రమే* నిధులు ఇవ్వలేదని కెసిఆర్ అన్నట్టు లేదు. His allegation (may or may not be factual) is that the present funds distribution mechanism is rigged against states. This (if true) is not specific to UPA or NDA and applies to *all* states.
https://en.m.wikipedia.org/wiki/List_of_Hindu_temples_in_India
Deletehttps://www.google.com/amp/s/m.timesofindia.com/city/hyderabad/centre-did-not-give-a-rupee-more-than-telanganas-share-kcr/amp_articleshow/67618213.cms
DeleteCensus is for details of human beings only. Census does *not* count things like trees, water bodies, structures etc. The Wikipedia article you cite does not provide *any* source for the claim.
Deleteజనాభా అంటే ఇంగ్లీష్ లో human beings అనే అంటారు మరి చెట్టూ, చేమా, భూమీ ఆకాసం అని అనరు...మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి.
Deleteజనాభా ప్రాతిపదికగా 1000 మందికి ఒక గుడి అని ప్రభుత్వ లెక్కల్లో ఉంది అని గూగులమ్మి చెప్పింది. మీరు కాదు అంటున్నారు. నేను 200 మందికి ఒక గుడి ఉంది అంటున్నాను. కావాలంటే లెక్కపెట్టుకోండి. అడవుల్లో గుళ్ళు తక్కువ....జనం ఉన్నచోటే గుళ్ళు ఉంటాయి కాబట్టి ఆట్టే అడవుల్లో తిరగబోకండి.
Deleteనీహారిక గారూ, జనాభా అంటేనే మనుషులు అని మీరే అంటున్నారు. మీరు చూపించిన వికీపీడియా వ్యాసంలో *జనాభా* లెక్కలలో *గుళ్ళు* లెక్క పెట్టారని ఉంది.
Deleteసదరు వ్యాసంలో ఆ వాక్యానికి original source చెప్పలేదు. సెన్సస్ వెబ్ సైటులో గుళ్ల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.
ఇక మీ వ్యాఖ్యలో రెండో inconsistency కి వద్దాం. మీరు చెప్పే ఒక లెక్క (1:1,000) ప్రకారం అనగా 120 కోట్ల జనాభాకు 12 లక్షల గుళ్ళు ఉండాలి కానీ మీరే చూపించే ఇంకో సూత్రం (వికీపీడియా) లెక్క 20 లక్షలు.
Consistency & reliability are crucial in statistics.
ఆవు వ్యాసం లాగా ఎంత సాగదీస్తారు ? రెండు మిలియన్లు అనే వ్రాసారు. ఇంకా ఎక్కువే అని నేను అంటున్నాను. ఇంకా నయం భక్తులు ఎంతమంది అని అడిగారు కాదు.ఇంతకీ కేసీఆర్ గురించి ఇచ్చిన లింక్ నిజమా కాదా ?
Deleteకేసీఆర్ చేసిన రెండు యాగాల ఖర్చులు ఎవరు ఇచ్చారు ?
Deleteకేసీఆర్ ఇచ్చిన ముక్కుపుడక ఖర్చు ఎవరు ఇచ్చారు ?
తెలంగాణావాళ్ళు ఇచ్చిన ముక్కుపుడక దుర్గమ్మ పెట్టుకుందా ?
బ్రతుకమ్మ భర్త ఎవరు ?
కుంభ మేళా ఖర్చు ఎంత ?
వీటన్నిటికీ ఆధారాలు మీకు దొరుకుతాయా ?
పొంతన లేని గణాంకాలకు తోడు సంబంధం లేని ప్రశ్నలు!
Deleteమీరో విషయం గమనించారా ఈ బ్లాగ్ రచయత వ్రాసిన 32 వేల లైసెన్సు రద్దు చేసిన ఎంజీఓల గురించి మీరు ఆధారాలు చూపమని అడగలేదు. వినరా వారు విజయడంకా మ్రోగిస్తున్నారు. హేవిటో అంతా జిలేబీ మాయ !
Delete32 వేల లైసెన్సులు ఉన్నపుడు 23 వేల గుళ్ళు ఉండవా ? మీకే క్లారిటీ లేదు.
Deleteమోదీ మాతృసంస్థ RSS కదా!దాని వ్యవస్థాపకుణ్ణి పబ్లిక్ డయాస్ మీద ఎన్నిసార్లు ప్రస్తావించాడు/తల్చుకున్నాడు?అసలు ఆనాడే, అంటే స్వతంత్రం కోసం పోరాడే దశలోనే కాంగ్రెసు హిందువుల ప్రయోజనాల్ని కాపాడలేదని ఆవిర్భవించిన సంస్థ నుంచి వచ్చిన మోదీ మాతృసంస్థకు చెందిన హెడ్గెవార్, గోల్వాల్కర్ లాంటివారిని వదిలేసి కాంగ్రెసుకు చెందిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిర్మించి అంత భక్తిని ఎందుకు పర్దర్శించాడు?హెడ్గెవార్ పేరుని పబ్లిక్ డయాస్ మీద తలిస్తే స్పాన్సరర్/ఫైనాన్షియర్ గ్రూపులు మొట్టికాయలేస్తాయనా!
ReplyDeleteమోదీయే కాదు, అద్వానీ, వాజపేయి సైతం ఏనాడూ హెడ్గెవార్, గోల్వాల్కర్ లాంటివారిని పబ్లి డయాస్ మీద పొగడలేదు - why this deception kolaveri?
శ్రీ శ్రీ రవిశంకర్ గారికి నిధులు ఎక్కడనుంచి వస్తున్నాయో మోడీ ఆరా తీసారా ? స్వామీజీ లకు బాబాలకు నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో ఆరాతీసారా ? వాళ్ళని వదిలేసి మిషనరీలను మాత్రమే నిషేదిస్తే అసహనం పెరగదా ?
ReplyDeleteమీరు ఈ పోష్టు మౌలికమైన ఉద్దేశ్యాన్నే విస్మరిస్తున్నారు. అభివృద్ధి, మూకదాడుల మీద చర్యలు, బాబాలు బాబీల చిల్లర చేష్టలు, ఇతర్ల్ని చంపడానికి వాల్లకి వొచ్చే Donations, అంధ్రులకి చేయవలసిన న్యాయం .. etc etc ఒదిలేసి.... ఇతర మతాలమీద పడ్డాడు కాబట్టే మోడీకి ఓటెయ్యండి.
Delete