భద్రతతో కూడిన లావాదేవీల కోసం BHIM App వాడండి
మనలో చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం వంటి UPI Apps వాడుతున్నారు. అవి కాక SBI yOnO వంటి UPI ఆధారిత బ్యాంక్ యాప్స్ కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు. అయితే చాలా సార్లు అవి సరిగ్గా పని చేయడంలేదని ఫిర్యాదు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం పంపిన డబ్బులు అవతలివారికి చేరక, మన ఖాతా నుంచి Debit అయ్యి మనల్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలేవీ లేకుండా పని చేసే ఏకైక UPI యాప్ BHIM (భీం). దీన్ని 30 డిసెంబరు 2016 న మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు. మిగితా యాప్స్ ప్రైవేటు సంస్థలవైతే, ఈ భీం మాత్రం పూర్తిగా ప్రభుత్వానిది. మనం ఏ ఇతర పేమెంట్ యాప్ ఉపయోగిస్తున్నా, ఆయా లావాదేవీలన్ని భీం సర్వర్ ద్వారా మాత్రమే జరుగుతాయి. నేను భీం యాప్ ను 2018 నుంచి ఉపయోగిస్తున్నాను. ఇప్పటి వరకు దాంతో ఏనాడు సర్వర్ సమస్య అని గాని, లేదా ఖాతా నుంచి డబ్బు debit అయ్యి, అవతలి వారికి చేరకుండా మధ్యలో సమస్య ఉత్పన్నం కావడం కానీ జరగలేదు. ఇప్పుడు భీం మరింత మెరుగుపడింది. మొన్న జనవరిలో BHIM 2.0 కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా చాలా ఆఫర్లున్నాయి.
అన్నిటికంటే ముఖ్యమైనది... ఇది పూర్తిగా స్వదేశీ యాప్. దీనిలో విదేశీ వాట ఇసుమంతా కూడా లేదు. ప్రభుత్వ యాప్ అయినా, ప్రవేటు యాప్స్ కంటే చాలా బాగుంటుంది. మన లావాదేవీలన్నీ భద్రంగా ఉంటాయి. కనుక ఇతర పేమెంట్ యాప్స్ వాడటకంటే, త్వరగా దీనికి మారిపోండి. గూగుల్ ప్లే స్టోర్ లో BHIM app అని కొట్టి వెతకండి. ఇది ఎంత బాగుందనేది ఆ తర్వాత మీరే చెబుతారు.
మరిన్ని వివరాలకు https://www.bhimupi.org.in/ సందర్శించండి.
No comments:
Post a Comment