Sunday, 10 May 2020

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం - శ్లోకం యొక్క అర్ధం



అగజానన పద్మార్కం గజాననమహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ||

ఈ శ్లోకంలో అనేకదంతం ఏంటి? మరలా ఏకదంతం ఏంటి? అని అనుమానం వస్తుంది కదా. మరి పిల్లలకు ఈ శ్లోకం నేర్పాలంటే దాని అర్ధం తెలుసుకోండి.

అ =లేనిది,
గ=చలనము ( అంటే చలనము లేలిది=పర్వతము=హిమాలయము=దానికిరాజైన హిమవంతుని )
జ= కుమార్తె (అనగా పార్వతీదేవి)
ఆనన= ముఖమను
పద్మ= పద్మమునకు
అర్కం= సూర్యుడైనట్టి( సూర్యుని చూస్తే తామరలు అనగా పద్మములు వికసించును. అంటే ఆ కొడుకును చూస్తే ఆ తల్లికంత ప్రేమ.)
గజ +అనననం =ఏనుగు ముఖము కల్గిన (నిన్ను)
అహస్+నిశం = పగలూ రాత్రి అంటే రోజంతా
అనేకదం= ఎంచ వీలు లేనంత
తం =తమరి, మీయొక్క
భక్తానాం = భక్తులలో
ఏకదం= ఒకడు
తం= తమరిని
ఉపాస్మహే= ప్రార్థించుచున్నాడు

ఈ శ్లోకములో అనేకదంతం అని, ఏకదంతమని చదువరాదు. అనేకదం తంభక్తానాం అని ఎకదం తంఉపాస్మహే అని చదువవలెను.

హిమవంతుని పుత్రికైన పార్వతీ దేవి ముఖ పద్మాన్ని అహర్నిశలు వికసింపజేసే సూర్యుడు గజాననుడు. అట్టి స్వామి యొక్క అనేకమంది భక్తుల్లో ఒకడినైన నేను ఆ స్వామిని ఉపాసిస్తున్నాను. 

విఘ్నేశ్వరుడు తన అమృత హస్తములతో మనలనందరినీ దీవించు గాక . నిరాటంకమైన విజ్ఞానమును మనకుకలుగజేయుగాక . 

సేకరణ : చెఱుకు రామ్మోహన రావు గారు (2011 లో చేసిన రచన)  

No comments:

Post a Comment