భాలచంద్రుడు
చంద్రునికి వేసిన శిక్షను తగ్గిస్తూ ఇంకా ఉదార హృదయంతో అతనికి గౌరవాన్ని ప్రసాదించాడు. నెలవంకను తన కిరీటంపై ధరించాడు కూడా.
శంకరుని మాదిరిగానే, అమ్మవారికి, గణపతికి ఇట్లా నెలవంకను ధరించడం ఉంది,
దీనివల్ల గణపతి, భాలచంద్రుడయ్యాడు. ఇతని 16 నామాలలో ఇది యొకటి. చాలామంది దీనిని బాలచంద్రుడని అనుకుంటారు. అనగా చిన్న చంద్రుడని అది 'బా కాదు. 'భా. భాలయనగా నుదురు. ఫాలయని కూడా అనవచ్చు. ఇట్లా ఉచ్చరిస్తే నుదుటి పై కొంత జుట్టున్న భాగం తోస్తుంది, శిల్పాలలో ఈశ్వరునికి జటాజూటంపై ఎడమవైపున ప్రక్కగా చంద్రరేఖ కన్పిస్తుంది. తిన్నగా కాదు. కనుక పరమేశ్వరుడు ఫాలచంద్రుడే. భాలచంద్రుడనే పదానికి అతికినట్లుంటాడు గణపతి.
చంద్రునకు, ఈశ్వరునకు తిన్నగా సంబంధం లేదు. చంద్రుణ్ణి క్షమించడం శివుని కథలో ప్రధానం కాదు. చంద్రుడు తన భార్యల పట్ల వివక్షత చూపించాడు కనుక శిక్షింపబడ్డాడు, క్షమాపణ కోరాదు, క్షమింపబడ్డాడు కూడా.
కాని గణపతిని ప్రత్యక్షంగా అవమానించాడు చంద్రుడు, కనుక ఇతడు చంద్రుణ్ణి క్షమించడం లోనే విశేషం దాగియుంది.
ఆర్యా,
ReplyDelete'భాలచంద్రుడు' అన్నారు. వివరణగా భాల యనగా నుదురు అన్నారు. అయ్యా అక్కడ భా కాదు ఫా అని ఉండాలి. 'ఫాలము' అనగా నుదురు కాని భాలము కాదు. అందుచేత 'ఫాలచంద్రుడు' అని దయచేసి సరిచేయగలరు.
ధన్యవాదాలు.