Saturday, 23 March 2013

కుండ నీటినే త్రాగుదాం

వేసవి ఇంకా పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్ళిరాగానే ఫ్రిజ్ లో నుండి అప్పుడే తీసిన చల్లచల్లని నీరు త్రాగి దాహం తీర్చుకున్నాం అనుకుంటారు కానీ నిజానికి ప్రిజ్ నీరు దాహాన్ని తీర్చవు, సరికదా దాహాన్ని రెట్టింపు చేస్తాయి. పైగా అవి ఆరోగ్యానికి అసలే మంచివి కాదు, వేడి చేస్తాయి, జలుబు దగ్గుకు కారణమవుతాయి. కఫాన్ని పెంచుతాయి. ఆయుర్వేదం కూడా అతిశీతలీకరణ యంత్రాలలో(ప్రిజ్) ఉంచిన నీరు త్రాగకూడదని గట్టిగా చెప్పింది.

మట్టికుండలకు అతి సూక్ష్మమైన రంధ్రాలుంటాయి. వాటి ద్వార నిత్యం గాలి చొరబడడంతో పాటు కొంత నీరు ఆవిరివతుంది. అందువల్ల కుండనీరు చాలా చల్లగా ఉంటాయి. మట్టి కుండ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దాహం తీర్చడంతో పాటు జలుబు, దగ్గు రాకుండా చూస్తాయి. చలికాలంలో త్రాగినా కూడా జలుబు చేయదు.మరీ చల్లగానూ, మరీ వేడిగానూ కాకుండా ఎంత అవరసరమో, అంత చల్లగా మాత్రమే ఉంటాయి. అందుకే ఎల్లప్పుడు ఆరోగ్యం కోసం కుండ నీరే త్రాగండి.

కుండలు చేయడం ఒక కళ. అది కుమ్మరికే సొంతం. అది అంతరించిపోకూడదు. కళను ప్రోత్సహించడం కోసమైనా కుండలు కొనండి.

ప్రభూత్వాలు కుమ్మరివాళ్ళ గురించి పట్టించుకోవంటూ విమర్శలు చేయడం వల్ల వారికి ఓరిగేదేమి లేదు. అందుకే మన వంతూగా కుండలు కొని ఒక కుమ్మరి కుటుంబంలో వెలుగులు నింపుదాం. మనకున్న సామాజిక బాధ్యతను నిర్వర్తిద్దాం.

కుండ నీటినే త్రాగుదాం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.

జై హింద్

Fridge water damage health.
Buy earthern pots. They are natural.
They are good for health.
Pottery is an art. Encourage it. Help Potters by purchasing a earthern pot.

Jai Hind

No comments:

Post a Comment