Wednesday, 27 March 2013

ధ్విజ గణపతి

|| ఓం గం గణపతయే నమః ||

ధ్విజ గణపతి 32 గణపతులలో 6వ అవతారం.

పుట్టిన ప్రతి వ్యక్తికి 16 సంస్కారాలను శాస్త్రం విధించింది. అవి మనిషిని ఉన్నతుడిని చేస్తాయి. అందులో ముఖ్యమైనది ఉపనయనం(ఇది అందరు చేసుకొవలసినది, ఏ కులానికి నిషిద్ధం కాదు). ఉపనయనం సంస్కారం జరిగిన వారిని ధ్విజులు అంటారు, అంటే మళ్ళీ జన్మించినవారని అర్ధం.

ధ్విజ గణపతి బ్రహ్మదేవునితో సమానమైనవాడు. ఈయనుకు కూడా బ్రహ్మ దేవుడివలే 4 ముఖాలుంటాయి. ఎడమ చేతిలో దండం, తాళపత్ర గ్రంధాలు, కుడిచేతులో కమండలం, జపమాల ఉంటాయి. బ్రహ్మజ్ఞాన సూచకంగా నుడిటిపై మూడవనేత్రం ఉంటుంది. చంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశిస్తుంటాడు ధ్విజ గణపతి.

అశ్విని నక్షత్రంలో జన్మించినవారు ఈ ధ్విజ గణపతిని ఆరాధించాలి. మహారాష్ట్రలోని పాలీ లో ఉన్న బల్లాలేశ్వర క్షేత్రంలో ధ్విజ గణపతి ప్రాధనంగా అర్చింపబడుతున్నాడు.

శ్లోకం :
యః పుస్తకాక్ష గుణదండకమడల శ్రీః
నిర్వర్త్యమాన కరభూషణమిందు వర్ణం
స్తంభేరమానన చతుర్భుజ శోభమానం
త్వాం సంస్మరేతి ద్విజగణాధిపతిం స ధన్యః

ధ్విజ గణపతిని ధ్యానిస్తే మేధసంపన్నులవుతారు, ఆర్థిక కష్టాలు తొలిగి, సంపద చేకూరుతుంది, ప్రపంచంలో తమదైన శైలిలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి.

|| ఓం గం గణపతయే నమః ||


|| Om Gam Ganapataye Namaha ||

Dwija Ganapati or Dvija Ganapathi is the 6th of Lord Ganesha's 32 forms. Regarded as the Twice Born, Dwija Ganapathi is depicted to be equivalent to Lord Brahma.

Dwija Ganapati is represented with four heads and four hand in moon-white like in color. Dvija Ganapathi holds Japa beads mala (rudraksha), a water vessel (kamandalam), a staff (Dandam) and an old leaves scripture pustaka (ancient books made from leaves).

Ashvini Nakshatra is related to Dwija Ganesh. Worshipping this form of God Ganesh is believed to help in reduce debt problems and make materialistic gains. Dvija Ganapati can be worshipped in to attain good name and fame in the world. And will increase the memory of the worshipper.

Dwija Ganapati Temples in India :

Ballaleshwar Temple in Pali, Maharashtra is one of the main Ganesha Temples where Dvija Ganapati can be worshipped. Ballaleshwar Vinayak Temple is one of the eight Astavinayaka temples in Maharashtra. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district, Karnataka has 32 forms of Ganapati sculptures.

Dvija Ganapati Mantra :

“Yah Pustakakshaguna Danda Kamandalu
Shrividyothaman, Karabhooshanaminduvarnam,
Stambera Maanana Chatushtaya Shobhamaanam
Tvam Yah Smaredwija Ganadhipate Sa Dhanyah!”

|| Om Gam Ganapataye Namaha ||

No comments:

Post a Comment