ఈ నెల 15వ తేదీ చైనా దళాలు భారతభూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాయి. కాశ్మీర్ లోని తూర్పు లడఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీ లో 10 కిలోమీటర్ల లోపలికి రావడమే కాకుండా గుడారాలు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు, ఆశ్చర్యకరమైన విషయం అంతకంటే కాదు. చైనా తరుచూ అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబాడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను తమ దేశంలో భాగంగా చూపించుకుంటూ మ్యాప్ లు విడుదలచేసింది. గత 2 సంవత్సరాల్లో కొన్ని వందలసార్లు భారతభూభాగంలోకి అక్రమంగా చొరబడింది. చైనా తన మనుష్యుల ద్వారా భారతదేశంలో చీలికలు తీసుకురావడానికి, భారతదేశాన్ని ముక్కలు చేయడానికి అనేక పధకాలు రచించింది. కొన్నిటిని అమలుపరుస్తోంది.
ఒకసారైతే ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్తే తమ అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ ఎదురు ప్రశ్న వేసింది. చాలాకాలం క్రితమే చైనా భారతదేశ సరిహద్దు దగ్గర రోడ్లు నిర్మించి, గుఢారాలు ఏర్పాటు చేసింది. యుద్ధట్యాంకర్లను మొహరించింది. యుద్ధానికి సిద్ధమన్న సంకేతాలను పంపింది.
పాకిస్థాన్ తో సంబంధాలు పెట్టుకుంది. ఆయుధాలను సమకూర్చడంలో పాకిస్థాన్ కు సహాయం అందిస్తోంది. శ్రీ లంక, బంగ్లాదేశ్ లో ఓడ రేవుల నిర్మాణానికి సహాయపడింది. మయన్మార్ తో వ్యాపారసంబంధాలు అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. హిందూ మహసముద్రంలో చమురును వెలికితీస్తామన్న నెపంతో హిందూమహా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోంది. భారత్ ను అష్టదిగ్బంధనం చేసి, తన మిత్ర దేశాలతో కలిసి మూకుమ్మడి దాడి చేయాలనేది కమ్యునిస్ట్ చైనా పధకం.
నదుల మళ్ళింపుకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాల మీద కూడా చైనా సంతకం చేయలేదు. బ్రహ్మపుత్ర నది మీద పెద్ద డ్యాం నిర్మించి బ్రహ్మపుత్ర నది దారినే మళ్ళించే కుటిల పధకం వేసి అమలు చేస్తోంది చైనా. దీని వల్ల భారత లోని ఈశాన్యరాష్ట్రాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.
చైనా ఉత్పత్తులకు భారత్ పెద్ద మార్కెట్. చైనాకు భారత్ నుంచి చాలా ఆదాయం వస్తోంది. అందువల్ల ఇప్పటికిప్పుడు చైనా భారత్ మీద దాడి చేసి, తన ఆదాయానికి గండి కొట్టుకోదు. కానీ ఎప్పటికైనా చైనా మనకు శత్రువనే విషయం గుర్తుంచుకోవాలి.
మన కేంద్రప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో చైనా కుటిలవైఖరిని, అకరమ చొరబాట్లను ఎండగట్టాలి. కానీ ఇంతవరకు ఇది జరగనే లేదు. ప్రపంచంలో చైనా సనియం చాలా పెద్దది. చైనా సైన్యానికున్న అత్యాధునిక ఆయుధాలు భారత్ వద్ద లేవు. పైగా చైనా రక్షణశాఖ బడ్జెట్ మనకంటే కేటాఇంపులకంటే చాలా ఎక్కువ. మన సైన్యంలో ఉన్న ఖాళీలను మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు భారత్ చైనాతో యుద్ధం చేసి విజయం సాధించడం కష్టమైన పని.
ప్రభుత్వాలు ఏమి చేయలేకపోవచ్చు కానీ భారతీయులగా మన కొన్ని చేయగలం. ప్రతి భారతీయుడు చైనా ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలి. చైనాలో తయారైన చిన్నచిన్న లైట్ల దగ్గరినుండి, సెల్ ఫోన్లు, టి.వి.లు అన్నిటిని భారతీయులు స్వచ్ఛందంగా బహిష్కరించాలి. ఇంట్లో ఉన్న చైనా సామాన్లు పడేయమని అర్ధం కాదు, కొత్తగా చైనా సామానులు కొనకండి.
చైనా టిబెట్ ను ఆక్రమించుకుంది. దాన్ని భారత్ అధికారికంగా చైనా లో భాగంగా గుర్తించింది. కానీ చైనా ఇంతవరకు కాశ్మీర్ ను భారతభూభాగంగా గుర్తించలేదు. అక్కడితో ఆగకుండా ఈశాన్యరాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేసేందుకు కుట్రల్ చేస్తోంది. టిబెట్ లో చైనా నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతోంది. దానికి మనం కూడా మన గొంతు కలపాలి. చైనాను రాజకీయంగా దెబ్బకొట్టాలి. మనకు ఆ అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర మీద కడుతున్న డ్యాం టిబెట్ లోనే ఉంది. దానికితోడు భారత్ కు టిబెటే సరిహద్దు. టిబెట్ విడిపోతే చైనా సగానికి చీలిపోతుంది. భారత్ ను ఆకర్మించుకున్న ప్రదేశాలు భారత్ కు తిరిగివస్తాయి.
మనం దేశభకి కలిగినవారిని, ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడనివారిని, నిజాయతీపరులను ఎన్నుకోవాలి. అప్పుడే దేశం భద్రంగా ఉంటుంది.
జై హింద్
No comments:
Post a Comment