Wednesday 3 April 2013

విగ్రహరాధన

ॐ విగ్రహరాధన సహేతుకమేనా? అని కొంత మంది వాదిస్తూ వుంటారు ॐ

దానిని చిన్న కధ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనగనగా ఒక రాజ్యం వుండేది. అది ముస్లిం రాజ్యం. రాజు, మంత్రి, పరివారం అంతా ముస్లిములే. ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. ఆ రాజ్యం లో ఒక సన్యాసి(యతి )వుండేవాడు. తన శిష్యులతో కలిసి, వున్న కొద్ది మంది హిందువులకు విగ్రహారాధన గురించి చెప్పేవాడు. 

అది చూసి కొంత మంది భటులు ఆ యతి ని రాజు దగ్గరకు తీసుకు వెళ్తారు. రాజా! ఈ యతి ప్రజలను విగ్రహారాధన చేయమంటున్నాడు అని చెప్తారు. అప్పుడు ఆ రాజు " ఏమయ్యా రాళ్ళను, రప్పలను పూజించమని చెప్తున్నావట ఏమి " అని మనకు తెలియని తన భాష లో హుంకరించాడు.

అప్పుడు ఆ యతి " అవును చెప్పాను, కావాలంటే నిరూపిస్తా " అన్నాడు.
సరే అన్నాడు రాజు.

అయితే నాకు ఒక చిత్రకారుడు కావాలి, ప్రవేశపెట్టండి అన్నాడు యతి. రాజు చిత్రకారున్ని పిలిపించాడు.

యతి ఆ చిత్ర కారుడితో రాజు పటం చెక్కించాడు. బ్రహ్మాండంగా వచ్చింది ఆ చిత్రం. అప్పుడు యతి తనను రాజు దగ్గరకు తీసుకువచ్చిన భటున్ని పిలిచి ఈ చిత్రం మీద గాండ్రించి ఉమ్ము వేయి అన్నాడు.

అయ్యబాబోయ్! రాజు గారి బొమ్మ పై ఉమ్మా...... నేను వేయలేను అన్నాడు. అప్పుడు ఆ యతి రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఇది బొమ్మ మాత్రమే, పర్వాలేదు వేసేయ్ అన్నాడు. భటుడు నేను వేయలేను అన్నాడు.

అప్పుడు ఆ యతి, చూసారా రాజా. ఒక రాజ్యాన్ని పరిపాలించే మీ బొమ్మ మీదే వాడికి అంత భక్తి ఉన్నప్పుడు విగ్రహారాధన తప్పెలా అవుతుంది. మీ ప్రతి రూపాన్ని వాడు ఆ చిత్రంలో చూసినట్టే, మేము కూడా పరంజ్యోతి స్వరూపుడైన పరమాత్మను విగ్రహంలో చూసుకుంటున్నాం అన్నాడు. అప్పుడు రాజు విగ్రహారాధన సత్యం సత్యం పునః సత్యం అని ప్రకటించాడు.

1 comment:

  1. ప్రతి జీవిలో జీవాత్మ, దేహం వుంటాయి. హిందూ ధర్మం ప్రకారం జీవుడు శివుడైతే, దేహం ప్రకృతి. శివుడు లేని దేహం శవం. ఈ దేహాన్ని విగ్రహం అని కూడా అంటాం. ఎదుటి వ్యక్తిని చూసేటప్పుడు శివుడిని చూడాలి. అల కాకుండా విగ్రహం చూస్తే శవాన్ని చూసినట్టే. (ఉదా: పసిపాపని చూస్తే బిడ్డ అనిపిస్తుంది. యవ్వనవతి ని చూస్తే మనసు పొంగుతున్ది. అదే తెరిస్సా ని చూస్తే అమ్మ అనిపిస్తుంది. ఇదే మన చుపులోని తేడ.) దీన్ని వుద్దేశించె ఖురాన్లొ విగ్రహారాధన పనికి రాదు అని చెప్పి వుండవచ్చు.

    ReplyDelete