Friday, 31 January 2014

హిందూ ధర్మం - 8

ధర్మం చేతనే ఈ విశ్వం నడుస్తున్నది. అనంత విశ్వంలో సూర్యుడు మధ్యలో ఎలా నిలబడ్డాడు అంటే అది అతని ధర్మం కనుక. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం తన ధర్మం. ఇతర గ్రహాలను తనలో ఉండే అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, వాటిని తన చుట్టు తిప్పుకోవడం సూర్యభగవానుడి ధర్మం కనుకనే సూర్యుడు తన అయస్కాంతశక్తితో అంతరిక్షంలోని గ్రహాలను ఆకర్షిస్తున్నాడని, ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పక కొన్ని లక్షల ఏళ్ళకు పూర్వమే వేదం స్పష్టం చేసింది. దీన్ని వైజ్ఞానికంగానూ, వైశేషికంగానూ మనం దర్శించవచ్చు. కానీ వీటన్నిటి వెనుక సూక్ష్మంగా ధర్మం ఉంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తన నిర్దేశిత కక్ష్యలో తిరగడం భూమి ధర్మం.

ఈ సృష్టి అనేక అణువుల సమూహం. సృష్ట్యాదిలో పరమాత్మ సంకల్పం వలన జీవుల కర్మఫలం తీరడం కొరకు అణువులన్నిటి మధ్య ఒక ఆకర్షణ ఏర్పడి, భూగోళంగా, ఇతర గ్రహ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఈ సృష్టి అంతమయ్యేవరకు అవి అలా కలిసి ఉండాలనేది సృష్టి ధర్మం. కనుక అట్లా కలిసి ఉన్నాయి, వాటిని ఒక శక్తి కలిపి ఉంచుతోంది. అట్లాగే సృష్టి  అంతమయ్యే సమయానికి ఈ అణువులన్నీ, వేటికవి విడిపోతాయి. ఎందుకంటే అది వాటి ధర్మం, పరమాత్మ వాటి ధర్మాన్ని అలా నిర్దేశించాడు కాబట్టి. వీటికి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పిన కారణాలను మనవాళ్ళు వైశేషికదర్శనంలో వేలఏళ్ళ క్రితమే చెప్పారు.  కానీ సూక్ష్మంలోకి వెళ్తె, వీటిని నడిపిస్తున్నదని ధర్మమే అని గుర్తించారు.

అన్నిటిని కాల్చడం అగ్ని యొక్క ధర్మంగా పరమాత్మ నిర్దేశించాడు. అది తన ధర్మాన్ని అనుసరిస్తుంది. అన్ని ద్రవపదార్ధాలు ఉన్నా, నీరు మాత్రమే దాహం తీర్చగలదు. పెట్రోల్ బావులు వంద ఉన్నా, గుక్కేడు నీళ్ళు లేకపోతే మనిషి ప్రాణం పోతుంది. దాహం తీర్చడం నీటి యొక్క ధర్మంగా పరమాత్మ పేర్కొన్నాడు కనుక నీరు దాహం తీరుస్తోంది. అట్లాగే గాలి, భూమి కూడా. ప్రోటాన్, ఎలట్రాన్, న్యూట్రాన్‌లో ఉండే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ తత్వాలు వాటి వాటి ధర్మాలు. వాటి మధ్య ఆకర్షణ ఏర్పడడం, విద్యుత్ అయస్కాంతక్షేత్రం ఏర్పడడం ఇవన్నీ, ధర్మాన్ని అనుసరించి జరుగుతున్నవే. ఈ విధంగా ధర్మం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం నడవడానికి మూలమైన సూత్రాలే (basic principles) ధర్మం.

To be continued ............

Wednesday, 29 January 2014

హిందూ ధర్మం - 7

धारणाद्धर्ममित्याहु: धर्मो धारयते प्रजा: |
यस्याद्धारणसंयुक्तं स धर्म इति निश्चय: ||

ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
యత్స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతినిశ్చయః

ధర్మమనే పదానికి వ్యవహారములో అనేక అర్థాలు చెప్పవలసి వస్తుంది. ప్రకరణాన్ని బట్టి అర్థభేదం సంభవిస్తుంది. ఇక్కడ ధర్మానికి, 'లోక వ్యవస్థ దెబ్బ తినకుండా ప్రతివాడు అనుసరించవలసిన సామాన్య నియమము' అన్న అర్థము చెప్పుకొంటే సరిపోతుంది.  ధర్మం అన్నమాట ధారణ అనే పదం నుంచి వచ్చింది. ధర్మో ధారయతే ప్రజాః - ప్రజలచే ధరించబడేది, ఆచరించబడేది ధర్మం. ప్రజలలో ఐక్యభావాన్ని తీసుకువచ్చేది, సమాజాన్ని ఒక్కటిగా ఉంచేది, అందరిని భగవంతుని దగ్గరకు చేర్చేది ధర్మం. అనగా Dharma is that cosmic order which also upholds society అని చెప్పవచ్చు.

ధర్మం అన్న పదానికి అర్దం చెప్పడం చాలా కష్టం. ధర్మం దేశకాలాల్ని, వ్యక్తులను, వృత్తులను వయసును బట్టి మారుతుంది.

ధర్మాన్ని కాపాడండి! ధర్మాన్ని రక్షించండి! అంటూ తరచూ వింటూ ఉంటాం. పూజలు ఎక్కువగా చేస్తే, అదే ధర్మాన్ని రక్షించడం అనుకుంటారు చాలా మంది. కానీ అది చాలా పెద్ద పొరపాటు. ధర్మం కేవలం పూజల గురించి, భక్తి గురించి మాత్రమే చెప్పేది కాదు. ధర్మం జీవన విధానం గురించి, మనిషి యొక్క మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ప్రవర్తన గురించి చెప్తుంది. మనిషి పుట్టుక ముందు నుంచి, మరణం తరువాతి వరకు, మరణానంతరం ఉండే స్థితిలో కూడా ధర్మం ఉంటుంది. ధర్మం ఉంటుంది అనేకంటే జననమరణాలు ధర్మాన్ని అనుసరించే జరుగుతాయి అనడం సరిగ్గా ఉంటుంది. ఈ సృష్టిలో అన్నీ ధర్మాన్ని అనుసరించే జరుగుతున్నాయి. మతం ............అది ఆచరించే వ్యక్తుల వరకు మాత్రమే పరిమితం. కానీ ధర్మం ఈ లోకంలో జీవం ఉన్నవాటికి, జీవం లేనివాటికి, కదిలేవాటికి, కదలనివాటికి, అన్నిటికి అన్వయం అవుతుంది. అన్నిటి యందూ సూక్ష్మరూపంలో ఉండి నడిపిస్తుంది. మానవ మేధస్సుకు అతీతంగా ధర్మం యొక్క పరిధి విస్తరించి ఉంది.

To be continued ............ 

Tuesday, 28 January 2014

హిందూ ధర్మం - 6 (ధర్మం అంటే?)

ధర్మం అనేక అర్ధాలు కలిగిన పదం. ధర్మం అన్న పదం ఒక్క భారతీయసంస్కృతిలోనే ఉంది. హిందూ, జైన, బౌద్ధ, సిక్కు గ్రంధాల్లో ధర్మం అన్న పదం తరచూ కనిపిస్తుంది. ధర్మం అన్న పదానికి చాలా విశాలమైన అర్ధం ఉంది. ఎంత విశాలమైన అర్దం అంటే మూములు మనిషి మనసు ధర్మం యొక్క అర్ధాన్ని అంత సులభంగా అర్దం చేసుకోలేనంతగా. ధర్మానికి ఋగ్ వేదంలో 20 రకాల అర్ధాలను చెప్పారు. ధర్మం పదానికి సమానమైన పదం మరే భాషలోనూ లేదు.

ధర్మం 'ధృ' అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, ధర్మానికి ఆచరించబడేది, పాటించబడేది, సమస్తానికి (సమస్త సృష్టికి) ఆధారభూతమైనది అనే అర్ధాలున్నాయి. అంటే ఏది లేకుంటే ఈ సృష్టి కుప్పకూలిపోతుందో, ఏది లేకపోతే విశ్వం గందరగోళంగా మారిపోతుందో, అది ధర్మం. ఇవే కాక, కర్తవ్యం, విధి, శాసనం, సరైన మార్గం, ఆచారం, న్యాయం వంటి అర్ధాలున్నా, ఇవన్నీ ఒక్కొక్కటిగా ధర్మాన్ని వివరించడంలో అసంపూర్ణాలే. సాధారణంగా చెప్పవలసి వస్తే, ధర్మం అనగా సరైన/ అసలుసిసలైన జీవన విధానం. చాలామంది సనాతనధర్మం ఒక జీవన విధానం అంటారు (Hinduism is a way of life), ధర్మానికి అంతకంటే చెత్త నిర్వచనం ఇంకోటి ఉండదు. ధర్మం ఒక జీవన విధానం అంటే రాక్షసునికి ఒక జీవన విధానం ఉంది, లంచగొండికి ఒక జీవన విధానం ఉంది. జీవన విధానం లేనిది ఎవరికి? అవన్నీ ధర్మాలవుతాయా? ఒక జీవనవిధానం కాదు, జీవించవలసిన విధానం. వేదోక్తమైన జీవన విధానం ధర్మం. దానికి విరుద్ధమైనది అధర్మం.మానవులు ఎలా బ్రతకడం వలన, సృష్టికి ధర్మాలకు అనుగుణంగా, సులభంగా, సుఖంగా జీవనం సాగించగలరో, దేన్ని పాటించడం వలన జననమరణ సంసార చక్రం నుంచి బయటపడగలరో, ఏది మనిషిని దైవత్వానికి, దివ్యత్వానికి తీసుకువెళుతుందో అదే ధర్మం.

ధర్మంలోనే అనేక ధర్మాలు ఉంటాయి, వాటిలో మళ్ళీ ధర్మాలు ఉంటాయి. అందుకే ధర్మం అనే మాటకు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు అర్ధాలు అన్వయం అవుతాయి. ధర్మం అంటే స్థిరమైనది, ఎప్పటికి నశించనది అని కుడా చెప్తారు. ఈ జగత్తు మొత్తం సవ్యంగా నడవడానికి ఆధరభూతమైన దానిని, ఈ సృష్టిని గందరగోళం లేకుండా, సవ్యంగా నడిపించే వ్యవస్థను ధర్మం అన్నారు.

ఈ సృష్టి భిన్నత్వాల సమూహం. రకరకాల వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవన విధానాలు ఉన్నా, సూక్ష్మంలోకి వెళ్తే అన్నిటి యందు ఏకత్వం ఉంది. ఆ ఏకత్వమే చైతన్యం. ధర్మం కూడా అంతే. అన్ని జరుగుతున్నా, అన్ని కారణాలు వెనుక ఒక పెద్ద కారణం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అన్నిటిని నడిపిస్తున్నది అదే. అన్నీ దాన్ని అనుసరించే జరుగుతాయి. అదే ధర్మం.

To be continued ............

Monday, 27 January 2014

హిందూ ధర్మం - 5

ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. బైబిల్, ఖూరాన్‌లను ప్రశ్నించడం వాటి ప్రకారం తప్పు. వాటిలో ఉన్న విషయాలకు విరుద్ధంగా చెప్పకూడదు, అది వాస్తవమైన సరే. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా చెప్తే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంధాలు చదవండి, మీకే అర్ధమవుంది, ఎవరి దృక్పధం విశాలమో, ఎవరి అందరి గురించి ఆలోచించారో స్పష్టమవుతుంది. కానీ ఈ ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని, సత్యాన్ని అనుభూతి (Realisation) చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పదంలో, భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరినీ ఈ భూమి మీదకి పంపడు.  ఎవరో దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అది నమ్మాలి అని ధర్మం చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గం చూపిస్తుంది, భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క ఈ ధర్మానికి మాత్రమే చెల్లింది.

ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని అపరోక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం భోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పలేదు.. అవసరమైతే నిన్ను నువ్వు విచారణ చేసుకో, శాస్త్రగ్రంధాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు.

ఇవన్నీ మనకూ, ఇతర మతాలకు ఉన్న చాలా కొన్ని తేడాలు. ఇక మన ధర్మం గురించి తెలుసుకుందాం.

To be continued ............ 

Sunday, 26 January 2014

హిందూ ధర్మం - 4

వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు, ఆ ఫలాన వ్యక్తి ఉనికి అబద్ధమని తేలితే, ఆ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల విషయంలో స్పష్టమైంది. చరిత్రకారులు ఆయా మతప్రవక్తల విషయంలో నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ఆయా మతస్థులు ఎంతో వేదనకు, అయోమయ్యానికి గురయ్యారు. అందుకు ఉదాహరణ క్రీస్తు-క్రైస్తవం. కానీ ధర్మం ఇందుకు అతీతమైనది. రాముడు, కృష్ణుడు భూమిపై తిరిగిన మాట వాస్తవం. అయినా ఒకవేళ ఎవరైనా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కల్పిత పాత్రలు అన్నా, హిందూ సంస్కృతి ఏమి కోల్పోదు, బలహీనపడదు. దానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది వారి మీద ఆధారపడి లేదు. ఇది మతం కాదు, వారి ఆలోచనల నుంచి ఉద్భవించలేదు. హిందూ ధర్మానికి మూలం సిద్ధాంతాలు కానీ వ్యక్తులు కారు.

మతం కొన్నిటి గురించి మాత్రమే విశేష్లేస్తుంది. ఎందుకంటే మనసు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో విషయాలు ఎన్ని  ఆలోచిస్తాడు? ఎంత దూరం ఆలోచిస్తాడు? ప్రపంచంలో ఉన్న మతాలను గమనిస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. అన్ని మతాలు కేవలం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

కానీ భారతీయ ధర్మం అనేక విషయాలను కూలంకషంగా వివరించింది. ఆరోగ్యం, ఆధ్యాత్మికం, భౌతికం, విజ్ఞానం, పునర్జన్మ, ఖగోళం, అంతరిక్షం, జ్యోతిష్యం, మెటా-ఫిజిక్స్, పర్యావరణం, వ్యవసాయం, దైవికం, వైశేషికం, సాంఖ్యం ........... ఇలా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, మనిషి కనుగొన్నవాటి గురించి, ఇంకా మానవమేధస్సుకు అందని విషయాలను గురించి, నేటి ఆధునిక సైన్సు కంటే గొప్పగా, సూక్ష్మంగా వివరించింది ఒక్క సనాతన హిందూ ధర్మం మాత్రమే. వ్యక్తి యొక్క జీవితం మన ధర్మం చెప్పిందంట్లో కనీసం 1% శాతం తెలుసుకోవడానికి కూడా సరిపోదు. అటువంటిది ఈ ధర్మాన్ని ఒక వ్యక్తి యొక్క ఆలోచనగా ఎలా చెప్పగలం. ఇది మానవమనసుకు అతీతమైన విషయం. అందువల్ల ఇది హిందూత్వం మతం అనిపించుకోదు.

To be continued ........

Saturday, 25 January 2014

హిందూ ధర్మం - 3

ఆయా మతాల ఆవిర్భావ కాలం గురించి చరిత్ర చెబుతున్నది. కానీ హిందూ ధర్మానికి మూలం గురించి చరిత్రకారులు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా, అందుకు తగిన ఆధారాలు చూపించలేరు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి మనదే. ఈ ధర్మం ఆర్యుల దండయాత్రల వల్ల వచ్చిందన్నారు ఆంగ్లేయులు. కానీ ఆర్యులదండయాత్ర అబద్దం అని తేలిపోయింది. ఇది సింధూ నాగరికతలో, 2500-1500 ఏళ్ళ క్రితం ఉధ్భవించిందన్నారు, కానీ సరస్వతీ నది ఆనవాళ్ళు బయటపడడంతో, సింధూ నాగరికత కంటే ముందే ఈ ధర్మం ఉన్నదని సాక్ష్యం దొరికింది. సరస్వతీనాగరికతకు 9000 సంవత్సరాలు. అక్కడితో ఆగలేదు, గుజరాత్ సముద్ర గర్భంలో ఉన్న ద్వారక గురించి ప్రపంచానికి తెలియటంతో ఈ ధర్మం ఇంకా ముందు నుంచి ఉందని వెల్లడైంది. రామసేతువును ఆధారంగా తీసుకుంటే ఇది లక్షల సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన యజ్ఞగుండాలు, శ్రీచక్రాలు దీన్ని మరిన్ని లక్షల ఏళ్ళకు పూర్వం నుంచి ఉన్నదిగా గుర్తిస్తున్నాయి.   అంటే ఈ సంస్కృతి చరిత్రకు అందని సమయం నుంచి, చరిత్రకారుల ఆలోచనలు కూడా వెళ్ళలేని కాలం నుంచి ఉన్నది.

ప్రవక్తలు ఇంతకముందున్న మతం యొక్క భావనలు అనుసరించి, వాటికి అనుకూలంగానో, వ్యక్తిరేకంగానో కొత్త మతాలు స్థాపించారు. పూర్వపు సంస్కృతిని నిరసించారు. అంటే ప్రతి మతానికి మూలం దానికి ముందున్న మతంలో ఉంది. ఉదాహరణకు బుద్ధుడు హిందువు. బౌద్ధానికి మూలం హిందుత్వమే. పాశ్చాత్య మతాల్లో అయితే ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. కానీ హిందూత్వానికి/సనాతన ధర్మానికి పూర్వం ఈ లోకంలో వేరే ఏ ధర్మం కానీ, మతం కానీ లేవు. ఇది వాటిని ఆధారంగా చేసుకుని రాలేదు. ఇదే అన్నిటికి మూలం, ఆధారం కూడా. అన్నీ దీని ఆదర్శాలను, భావాలను అందిపుచ్చుకునే కొత్త మతాలుగా ఏర్పడ్డాయి. అందుకే హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి.

To be continued...........

Friday, 24 January 2014

హిందూ ధర్మం - 2

మతం అంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క మనసు నుంచి పుట్టిన ఒక ఆలోచన. మనసు (మతి) నుంచి పుట్టినది కనుక మతం అన్నారు. 'మీ అభిమతం చెప్పండి' అన్న మాట వింటూ ఉంటాం. మీ అభిమతం చెప్పండి అంటే మీ అభిప్రాయం చెప్పండి అని అర్దం. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా జరిగితే మంచిది అని మనకు అనిపిస్తుంది కదా, అది మన మతం అన్నమాట. క్రైస్తవం, ఇస్లాం, జైనం, భౌద్ధం మొదలైనవన్నీ మతాలు. మతానికి ప్రవక్తలు ఉంటారు, మూలపురుషులు ఉంటారు, మతం ప్రపంచ చరిత్రలో ఒక భాగం. కానీ ధర్మం ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క ఆలోచనా విధానం కాదు.

మతం మనసు నుంచి పుట్టుందనుకున్నాం కదా. ఈ మనసు దేశకాలాలకు (Time and Space), పరిమితులకు (limitations) లోబడి ఉంటుంది. కనుక మనసుకు కలిగే ఆలోచనలు కూడా కాలాతీతం కాలేవు, అపరిమితమై ఉండవు. మతం ఎప్పుడు కాలానికి, చరిత్రకు, పరిమితులకు లోబడి ఉంటుంది.

ఏసు క్రీస్తు క్రైస్తవానికి మూలపురుషుడు. ఏసుక్రీస్తు తన జీవత మధ్యభాగంలో ఇచ్చిన భోధనలతో క్రైస్తవం ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త తన జీవత సగభాగం గడిచిన తరువాత ఇచ్చిన భోధనలతో ఇస్లాం ప్రారంభమైంది. బుద్దుడి భోధనలతో భౌద్ద మతం వచ్చింది. అట్లాగే జైనమతం కూడా. అంటే ఈ మతాలకు మూలపురుషులు ఉన్నారు. వీళ్ళ గురించి చరిత్ర చెబుతుంది. చరిత్ర వీళ్ళ కాలం గురించి ప్రస్తావించింది. ఈ ప్రవక్తలు తమ మతాలను ప్రవచించకముందు, ఆయా మతాలు లేవు. ఒక విషయం గమనిస్తే, ఈ ప్రవక్తలు తమ బాల్యంలో వేరొక సంస్కృతిలో పెరిగినవారే. వారి పూర్వీకులు వేరే ధర్మాలను పాటించారు.

కానీ హిందూ/సనాతన ధర్మం ఏ యొక్క వ్యక్తి వల్ల ప్రారంభించబడలేదు. దీనికి మూలపురుషులు లేరు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పుట్టకముందు ఈ ధర్మం ఉన్నది. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడి జీవితాలు గమనిస్తే, వారు పుట్టకతో హిందువులే. వారి పూర్వతరం వారి నుంచి పరంపరాగతంగా పాటిస్తున్న వస్తున్న ధర్మాన్నే శ్రీ రాముడు పాటించాడు, శ్రీ కృష్ణుడు పాటించాడు. అంతే తప్ప కొత్తగా శ్రీ కృష్ణుడు చెప్పిందేమి లేదు. వీరు హిందూ జీవన వాహినిలో మైలురాళ్ళు మాత్రమే.

To be continued...........

Thursday, 23 January 2014

హిందూ ధర్మం - 1

ఈ ప్రపంచంలో అత్యంత పురాతనకాలం నుంచి జీవిస్తున్న ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ప్రపంచచరిత్రలో ఎన్నో మతాలు పుట్టాయి, ఎన్నో నాశనమయ్యాయి. కొత్తవి ఎన్నో పుడుతున్నాయి, కానీ ఎన్ని మతాలు వచ్చినా, కాలపరీక్షకు (Test of time) తట్టుకుని నిలబడ్డ ఏకైక నాగరికత హిందూ నాగరికత మాత్రమే. దాదాపు 1,200 సంవత్సరాల భయానకమైన పరదేశీయుల పరిపాలన, మత మార్పిడుల తరువాత కూడా, హిందూ ధర్మం ఇంకా అదే వైభవంతో వెలిగిపోతోంది.

ఈ ప్రపచంలో కొన్ని వందలమతాలు ఉన్నా, ఒక్కటే ధర్మం ఉంది. అదే హిందూ ధర్మం/సనాతన ధర్మం. అన్ని మతాలను సత్యం అని నమ్మేది, అన్నిటిని అంగీకరించేది, అన్ని మతాలని గౌరవించేది హిందూ ధర్మం మాత్రమే. అన్ని మాతాలు భగవంతుడిని చేరే వివిధ మార్గాలనీ, అన్ని మతాల వెనుక ఉన్న పరమాత్ముడు ఒక్కడేనని లోకానికి చాటి చెప్పిన ఘనత సనాతన ధర్మానిదే.

మామూలుగా మతాలన్నీ ఒక్కటే అనేమాట వింటూ ఉంటాం. అది పెద్ద పొరపాటు. భారతదేశంలో పుట్టిన మతాలకు, భారతదేశానికి వెలుపల పుట్టిన మతాలకు చాలా తేడా ఉన్నది. అందులోనూ హిందూత్వానికి, ఇతర మతాలకు పెద్ద తేడా ఉంది. అసలు నిజానికి హిందూత్వం మతం కాదు, హిందూత్వం ధర్మం. హిందూ ధర్మం ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు తల్లి. కానీ విదేశీయుల పాలనలో హిందువుల్లో ప్రవేశించిన భావదాస్యం వలన, అన్యమతాల ప్రభావం వలన వైదికధర్మం నుంచి కొంత ప్రక్కకు జరిగాం. కొన్ని ధర్మస్వరూపానికి సరిపోని కొన్ని కొత్త ఆచారాలు చేర్చుకున్నాం, అసలు విషయాలు కొన్నిటిని వదిలేశాం. అన్నిటికి మించి, ధర్మాన్ని మతం స్థాయికి దిగచార్చరు హిందువులు. ఇప్పుడు వాటిని వదిలించుకుని, వైదిక ధర్మాన్ని తిరిగి ఆచరణలో పెట్టవలసిన సమయం వచ్చింది.

హిందూ ధర్మానికి పునాది ఏది? ఈ ధర్మం యొక్క మౌలిక సిద్ధాంతం ఏమిటి? మనం ధర్మం ఏమని సందేశం ఇస్తుంది? అసలు హిందువని ఎవరిని అంటారు? హిందువులు రోజు ఆచరించవలసిన విధులు ఏమిటి? హిందువుల చరిత్రం ఏమిటి?

వంటి అనేక అంశాలను ఆ పరమాత్మ ఆశీస్సులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

To be continued ...................

Wednesday, 22 January 2014

సర్వదేవాతత్మకం ఓంకారం


గణపతి ఓంకారస్వరూపం. ఓంకారం ప్రణవం. 'ఓం'కారం సృష్టికి మూలం. ఈ సృష్టిలోని ప్రతి అణువు నుంచి ఉద్భవించే శబ్దం ఓంకారం. ఓం అనేదే పరమాత్మ నామం. అసలు ఓం కారమే పరబ్రహ్మం. అందుకే గీతలో శ్రీకృష్ణుడు 'ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ' అంటారు.

అకార, ఉకార, మకారలా సమూహంతో ఏర్పడిన ఏకాక్షరం ఓం. ఒక్క ఓం అన్న అక్షరంలోనే అనేకమంది దేవతల పేర్లు ఉన్నాయి.

అ కారం విరాట్, అగ్ని, విశ్వ మొదలైన భగవత్ తత్వాలకు
ఉ కారం హిరణ్యగర్భ, వాయు, తేజస్ తత్వాలకు,
మ కారం ఈశ్వర, ఆదిత్య, ప్రజ్ఞా తత్వాలకు ప్రతీక. అవేకాక, వేదంలో చెప్పబడ్డ భగవన్నామాలకు, దైవతత్వాలకు ఓంకారం మూలం. ఓంకారమే పరమార్ధం.

Sunday, 19 January 2014

కఠోపనిషత్తు శాంతి మంత్రం

ఓం గం గణపతయే నమః

ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై | తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇది కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. గురు శిష్యులు ఇద్దరూ కలిసి విద్యారంభ సమయంలో చదివే మంత్రం ఈ దోషాలు, విఘ్నాలు లేకుండా విద్యాభ్యాసన పూర్తవ్వాలని చేసే ప్రార్ధన. చాలామంది సహనా+భవతు అని చదువుతారు, కానీ అది సహన+అవతు.

సహ నౌ = మన ఇద్దరినీ; అవతు = రక్షించుగాకా; సహనౌ = మన ఇద్దరినీ; భునక్తు = పోషించుగాకా: సహ - కలిసి: వీర్యం = ఊర్జాశక్తితో; కరవావహై = పరిశ్రమిద్దాంగాకా; అధీతం = స్వాధ్యాయం; నౌ = మనకు; తేజస్వి = తేజోవంతం; అస్తు = అగుగాకా; మా విద్విషావహై = ద్వేషించుకొనకుండా ఉందుముగాకా;

గురుశిష్యులైన మన ఇద్దరిని ఆ పరబ్రహ్మ రక్షించుగాకా! ఇద్దరినీ పోషించుగాకా! ఇద్దరమూ ఊర్జాశక్తితో పరిశ్రమిద్దాం గాకా! మన స్వాధ్యాయము (నేర్చుకునే విద్య) ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాకా! ఎన్నడు మనమిద్దరం పరస్పరం ద్వేషించుకొనకుండా ఉండెదము గాకా!

భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధముకు ప్రత్యేకస్థానం ఉంది. గురుశిష్యుల సంబంధం అంటే ఇద్దరూ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంగా ఋషులు చూడలేదు. అది జ్ఞాన్ వ్యాప్తికి సంబంధించిన అంశం. ఈ పరంపర ద్వారా విద్య రక్షింపబడుతుంది. ఒక గురువు నుంచి శిష్యునకు, అతని నుంచి అతని శిష్యునకు జ్ఞానం పరంపరాగతంగా భోదించబడుతుంది. ఇద్దరి మధ్య విద్వేషం లేనప్పుడే, వారి సంబంధం చక్కగా ఉన్నప్పుడే ఈ జ్ఞానం లోకకల్యాణానికి దోహదపడుతుంది. అందుకే విద్యారభంలో గురుశిష్యులు చేసే ప్రార్ధన ఇది.

Sankashtnashana sthothra Video


।। संकट-नाशन-गणेश-स्तोत्रं ।।

।। संकट-नाशन-गणेश-स्तोत्रं ।।

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं ।

भक्तावासं स्मरेन्नित्यं आयुष कामार्थ सिद्धये । । १ । ।

प्रथमं वक्र-तुंडं च एकदंतं द्वितीयकं ।

तृतीयं कृष्ण-पिंगाक्षं गजवक्त्रं चतुर्थकं । । २ । ।

लम्बोदरं पंचमं च षष्टम विकटमेव च ।

सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं । । ३। ।

नवमं भालचंद्रं च दशमं तू विनायकं ।

एकादशं गणपतिं द्वादशं तू गजाननं । । ४ । ।

द्वादशैतानि नामानि त्रिसंध्यं यः पठेन्नरः ।

न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो । । ५। ।

विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं ।

पुत्रार्थी लभते पुत्रान्मोक्षार्थी लभते गतिं । । ६ । ।

जपेत् गणपति-स्तोत्रं षट्भिः मासैः फलं लभेत ।

संवत्सरेण सिद्धिं च लभेत् नात्र संशयः । । ७ । ।

अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् ।

तस्य विद्या भवेत्सर्वा गणेशस्य प्रसादतः । । ८। ।

। । इति श्रीनारदपुराणे संकट-नाशन-गणेश स्तोत्रं । ।

SANKATA HARA GANESHA STOTRAM

SANKATA HARA GANESHA STOTRAM – Sankashtnashana sthothra

Narada Uvacha:

Om Pranamya Sirasa devam Gauri Puthram Vinayakam
Bhaktavasam Smarennithyam Ayuh Kamartha Siddaye ! (1) 

Prathamam Vakrathundam cha Ekadantham Dvithiyakam
Thrithiyam Krishna Pingaaksham Gajavakthram Chathurthakam (2)

Lambodaram Panchamam cha Shashtam Vikatameva cha
Saptamam Vighna Rajam cha Dhoomravarnam thathashtakam (3)

Navamam Phala Chandram cha Dasamam thu Vinayakam
Ekadasam Ganapathim Dwadasam thu Gajananam !! (4)

Dwadasaithani Namaani Thri Sandhyam Yah Pathennarah
Na cha Vighna Bhayam thasya Sarva Siddhi karim Prabho! (5)

Vidyarthi Labhate Vidyam Dhanarthi Labhate Dhanam
Puthrarthi Labhate Putraam Mokshaarthi Labhate Gatim (6)

Japeth Ganapthi Stotram Shadbhirmaasai Phalam Labheth,
Samvatsarena Siddhim cha Labhate Naathra Samsayaha ! (7)

Ashtabhyo Brahmanebhyash cha Likhitwa yah Samarpayeth
Thasya Vidya bhavetsarva Ganeshasya Prasadathaha !! (8)

Ithi Sri Narada Purane Sankashta Nashana Ganapathi Sthothram Sampoornam.

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

ఓం శ్రీ గణేశాయ నమః

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి. 

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |

ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |

విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |
పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః  ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |

|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

ఓం శాంతిః శాంతిః శాంతిః 

Wednesday, 15 January 2014

దేశీ ఆవు ప్రాముఖ్యత

దేశీ ఆవు ప్రాముఖ్యత మరియు భారతీయ వ్యవసాయానికి దాని ఆవశ్యకత :-

With special thanks to Sri Gopi Krishna (https://www.facebook.com/rama.chandra.79677) for posting this valuable information.

"పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం" ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు: సుభాష్ పాలేకర్

ప్రకృతి వ్యవసాయం లో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు.
సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు. శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మంది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు.

ఈ వ్యవసాయంలో మన దేశీయ గోవులది ప్రధాన పాత్ర. దేశీ ఆవుల మూత్రంలో , పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి , కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు . జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజులు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పాల విషయంలో కూడా జెర్సీకి , దేశీ అవుకు చాలా తేడాలున్నాయి. జెర్సీ ఆవు పాలలో " A 1 బీటా కేసిన్ " అనే కాన్సర్ కారక ప్రోటిను ఉంటుంది , దేశీ ఆవు పాలలో " A 2 బీటా కేసిన్ " అనే ఔశద ప్రోటిను ఉంటుందని పరిశోదనలు తెలుపుతున్నాయి. విదేశీయులు మనకు జెర్శీ ఆవులను అంటగట్టి వారు మత్రం మన దేశీ ఆవుల ద్వారా లభించే A 2 పాలను సేవిస్తున్నారు . జెర్సీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ టారస్ ) జన్యు క్రమములో , దేశీ ఆవు ( శాస్త్రీయ నామం :- బాస్ ఇండికస్ ) జన్యు క్రమంలో తేడాలున్న కారణంగానే అది దేశీ ఆవుతో సమానం కాదు . కావున దేశీ ఆవులను కాపాడవలసిన ఆవశ్యకతను ప్రజలకు తెలయజెప్పి , వాటిని పరిరక్షించి దేశాన్ని , రైతులను కాపాడాలనే దృడ సంకల్పంతో శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ ఆందోళనను ముందుకు నడిపిస్తున్నారు. )

బ్రెజిల్ దేశంలో మన దేశీ ఆవుల ద్వారా లభించిన " బ్రాహ్మిణ్ " జాతి ఆవుల ద్వారా రోజుకు 40 లీటర్ల ఆరోగ్యకరమైన A2 పాలను పొందుతున్నారు . మన దేశీ ఆవులు ఎటువంటి కరువు పరిస్థితులనైనా తట్టుకొని జీవిస్తాయి. పాలను పొందడానికి "ఆక్సిటోసిన్" లాంటి హానికారక హార్మోనులను ఎక్కించవలసిన పనిలేదు. రోగ క్రిమి నాశక మందులను ప్రతి నెలా ఇవ్వనవసరం లేదు. శీతలీకరణ పరికరాలను అమర్చవలసిన పనిలేదు . మన దేశి ఆవులను పెంచడం చాల సులభం. దేశీ ఆవులలోని కొన్ని జాతులను సంకరపరిచి ఎక్కువ పాలిచ్చే జాతిని పెంపొందించవచ్చు. ఇలా చేయడం వల్ల మన రైతులు మన దేశీ ఆవుల పెంపకంపై ఆసక్తి చూపి , వాటిని పెంచి లాభం పొందుతారు.

గోమాతను పూజించండి మానవత్వాన్ని కాపాడండి.హిందిలో ఉన్నా ఈ యుట్యూబ్ విడియో చూడండి.
http://www.youtube.com/watch?v=ZzgxspB788s

Thursday, 9 January 2014

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ధనుర్మాసంలో వేసే ముగ్గులకు రంగులెందుకు వేస్తారు?

ఇది చలికాలం. దక్షిణాయనం. సూర్యుడికి భూమికి మధ్య దూరం పెరిగిపొవడం, చలిమంచు వలన భూమి వచ్చే సూర్యకిరణాల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల దేశంలో రోగాలు త్వరగా వ్యాపిస్తాయి. మన శరీరంలో 7 చక్రాలుంటాయి. సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల్లో 7 రకాలరంగులు మన శరీరంలోని 7 చక్రాల (నాడీ కేంద్రాలు) మీద ప్రభావం చూపిస్తాయి.

రంగులు మానవ మనసుపై ప్రభావం చూపిస్తాయని, వివిధ రకాలా మానసిక, శారీరిక రోగాలున్నవారిని కొన్ని రంగులకు ప్రభావితం చేయడం వలన, వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు తీసుకురావచ్చని ఆధునిక వైద్యశాస్త్రం గుర్తిస్తోంది. ఈదే అంశాన్ని మనవాళ్ళూ ఎన్నో యుగాలకు ముందే తెలుసుకుని, ఆచరణలో పెట్టారు. రంగులును ముగ్గులలో వేయడం వలన వాటి మీద పడ్డ సూర్యకిరణాలు పరావర్తనం చెంది మనిషి శరీరం మీద పడతాయి. ఆ కిరణాలను శరీరం గ్రహించడం ద్వారా రోగనిరోధకశక్తి కోల్పోకుండా ఉంటారు. అందుకే ధనుర్మాసంలో నెల రోజులు తప్పకుండా రంగవల్లులు వేస్తారు.

 ఆట్లాగే చలికారణంగా జనంలో బద్ధకం పెరుగుతుంది. జనంలో ప్రకృతి మార్పులవల్ల కలిగే ఈ బద్దకాన్ని తొలగించడానికి మనం ప్రాచీనులు కనిపెట్టిన కలర్ థెరపీ ఈ రంగవల్లులు. మన సంప్రదాయాలేమీ ఊరికినే రాలేదు. వాటి వెనుక బోలెడు ఆరోగ్య సూత్రాలు, శాస్త్రీయకారణాలు ఉన్నాయి.

ధనుర్మాసంలోనే రంగవల్లులు నెలంతా ఎందుకు వేస్తారనే విషయానికి వస్తే చెట్లు ఆకులు రాలి, లోకమంతా చాలా అందవీహినంగా కనిపించే కాలం ఈ ఋతువు ఇది మనసుపై దుష్ప్రభావాన్ని చూపి, డిప్రెషన్‌కు దారితీస్తుందని ఆధునిక మానసిక వైద్యులు చెప్తారు. అందుకే విదేశాల్లో హేమంతఋతువులో కలైడోస్కోప్ (అనేక చిత్రదర్శినీ) చూస్తూ సమయం గడపని అక్కడి వైద్యులు గట్టిగా చెప్తారు.

కానీ మనకు ఆ బాధలేదు, ఋషులు గొప్పవారు. వారిది దూరదృష్టి, కొన్ని వేళ ఏళ్ళ క్రితమే అనేక విషయాలను దర్శించారు. ఒక వ్యక్తికి కాదు, సమస్త లోకానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తారు కనుక అందరిని ఈ కాలంలో రంగవల్లులు వేయమన్నారు ఋషులు. ఆ చిన్న కలైడోస్కోప్ గోట్టంలో కనిపించే రంగులు, భారతదేశంలో ప్రతి చోట నెలంతా కనిపిస్తాయి. అన్ని రంగులను ఒకేసారి చూడటం చేత మనసులో ఒక విధమైన ఉల్లాసం, ఉత్తేజం కలిగుతుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఒక పెద్ద శాస్త్రం. ఇది ఒక రకమైన Colour Theraphy.ఇలా చెప్పుకుంటూ పోతే, ధనుర్మాసం గురించి అనేకానేక విషయాలు, వాటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవచ్చు.            

Sunday, 5 January 2014

రోజు ఇంట్లో దీపారాధనకు పాటించవలసిన నియమాలు ఏంటి?

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.

అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి, అనగా రెండు వత్తులని కలిపి వేయాలి, విడివిడిగా కాదు.. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటికబెల్లం పలుకులు కానీ, ఏదో ఒక పండుగానీ, లేక అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి.

ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా.    

Wednesday, 1 January 2014

Celebration of Bhagavan’s Birthday

'Verses on the Celebration of Bhagavan’s Birthday'

[Bhagavan was born on December 30, 1879. His birthday, however, is observed according to the Tamil calendar in dhanurmasa when the moon is with the star Punarvasu. According to the Western calendar this day falls in the months of December-January. When it was first proposed in 1912, Bhagavan expressed his objection in the form of the following two verses. Even so, his disciples were not deterred and the Jayanti day festival continues to be one of the great annual events at the Ashram]

1. You who wish to celebrate a birthday, inquire first who was born. One’s true birthday is when one enters into the Eternal Being which shines forever without birth or death.

2. Of all days on one’s birthday one should mourn one’s fall (into samsara). To celebrate it as a festival is like adorning and glorifying a corpse. To seek one’s Self and merge in it is wisdom.

Courtesy: Evan Keith