Saturday, 25 January 2014

హిందూ ధర్మం - 3

ఆయా మతాల ఆవిర్భావ కాలం గురించి చరిత్ర చెబుతున్నది. కానీ హిందూ ధర్మానికి మూలం గురించి చరిత్రకారులు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా, అందుకు తగిన ఆధారాలు చూపించలేరు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి మనదే. ఈ ధర్మం ఆర్యుల దండయాత్రల వల్ల వచ్చిందన్నారు ఆంగ్లేయులు. కానీ ఆర్యులదండయాత్ర అబద్దం అని తేలిపోయింది. ఇది సింధూ నాగరికతలో, 2500-1500 ఏళ్ళ క్రితం ఉధ్భవించిందన్నారు, కానీ సరస్వతీ నది ఆనవాళ్ళు బయటపడడంతో, సింధూ నాగరికత కంటే ముందే ఈ ధర్మం ఉన్నదని సాక్ష్యం దొరికింది. సరస్వతీనాగరికతకు 9000 సంవత్సరాలు. అక్కడితో ఆగలేదు, గుజరాత్ సముద్ర గర్భంలో ఉన్న ద్వారక గురించి ప్రపంచానికి తెలియటంతో ఈ ధర్మం ఇంకా ముందు నుంచి ఉందని వెల్లడైంది. రామసేతువును ఆధారంగా తీసుకుంటే ఇది లక్షల సంవత్సరాలకు పూర్వం నుంచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన యజ్ఞగుండాలు, శ్రీచక్రాలు దీన్ని మరిన్ని లక్షల ఏళ్ళకు పూర్వం నుంచి ఉన్నదిగా గుర్తిస్తున్నాయి.   అంటే ఈ సంస్కృతి చరిత్రకు అందని సమయం నుంచి, చరిత్రకారుల ఆలోచనలు కూడా వెళ్ళలేని కాలం నుంచి ఉన్నది.

ప్రవక్తలు ఇంతకముందున్న మతం యొక్క భావనలు అనుసరించి, వాటికి అనుకూలంగానో, వ్యక్తిరేకంగానో కొత్త మతాలు స్థాపించారు. పూర్వపు సంస్కృతిని నిరసించారు. అంటే ప్రతి మతానికి మూలం దానికి ముందున్న మతంలో ఉంది. ఉదాహరణకు బుద్ధుడు హిందువు. బౌద్ధానికి మూలం హిందుత్వమే. పాశ్చాత్య మతాల్లో అయితే ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది. కానీ హిందూత్వానికి/సనాతన ధర్మానికి పూర్వం ఈ లోకంలో వేరే ఏ ధర్మం కానీ, మతం కానీ లేవు. ఇది వాటిని ఆధారంగా చేసుకుని రాలేదు. ఇదే అన్నిటికి మూలం, ఆధారం కూడా. అన్నీ దీని ఆదర్శాలను, భావాలను అందిపుచ్చుకునే కొత్త మతాలుగా ఏర్పడ్డాయి. అందుకే హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి.

To be continued...........

No comments:

Post a Comment