धारणाद्धर्ममित्याहु: धर्मो धारयते प्रजा: |
यस्याद्धारणसंयुक्तं स धर्म इति निश्चय: ||
ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
యత్స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతినిశ్చయః
ధర్మమనే పదానికి వ్యవహారములో అనేక అర్థాలు చెప్పవలసి వస్తుంది. ప్రకరణాన్ని బట్టి అర్థభేదం సంభవిస్తుంది. ఇక్కడ ధర్మానికి, 'లోక వ్యవస్థ దెబ్బ తినకుండా ప్రతివాడు అనుసరించవలసిన సామాన్య నియమము' అన్న అర్థము చెప్పుకొంటే సరిపోతుంది. ధర్మం అన్నమాట ధారణ అనే పదం నుంచి వచ్చింది. ధర్మో ధారయతే ప్రజాః - ప్రజలచే ధరించబడేది, ఆచరించబడేది ధర్మం. ప్రజలలో ఐక్యభావాన్ని తీసుకువచ్చేది, సమాజాన్ని ఒక్కటిగా ఉంచేది, అందరిని భగవంతుని దగ్గరకు చేర్చేది ధర్మం. అనగా Dharma is that cosmic order which also upholds society అని చెప్పవచ్చు.
ధర్మం అన్న పదానికి అర్దం చెప్పడం చాలా కష్టం. ధర్మం దేశకాలాల్ని, వ్యక్తులను, వృత్తులను వయసును బట్టి మారుతుంది.
ధర్మాన్ని కాపాడండి! ధర్మాన్ని రక్షించండి! అంటూ తరచూ వింటూ ఉంటాం. పూజలు ఎక్కువగా చేస్తే, అదే ధర్మాన్ని రక్షించడం అనుకుంటారు చాలా మంది. కానీ అది చాలా పెద్ద పొరపాటు. ధర్మం కేవలం పూజల గురించి, భక్తి గురించి మాత్రమే చెప్పేది కాదు. ధర్మం జీవన విధానం గురించి, మనిషి యొక్క మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ప్రవర్తన గురించి చెప్తుంది. మనిషి పుట్టుక ముందు నుంచి, మరణం తరువాతి వరకు, మరణానంతరం ఉండే స్థితిలో కూడా ధర్మం ఉంటుంది. ధర్మం ఉంటుంది అనేకంటే జననమరణాలు ధర్మాన్ని అనుసరించే జరుగుతాయి అనడం సరిగ్గా ఉంటుంది. ఈ సృష్టిలో అన్నీ ధర్మాన్ని అనుసరించే జరుగుతున్నాయి. మతం ............అది ఆచరించే వ్యక్తుల వరకు మాత్రమే పరిమితం. కానీ ధర్మం ఈ లోకంలో జీవం ఉన్నవాటికి, జీవం లేనివాటికి, కదిలేవాటికి, కదలనివాటికి, అన్నిటికి అన్వయం అవుతుంది. అన్నిటి యందూ సూక్ష్మరూపంలో ఉండి నడిపిస్తుంది. మానవ మేధస్సుకు అతీతంగా ధర్మం యొక్క పరిధి విస్తరించి ఉంది.
To be continued ............

No comments:
Post a Comment