Friday, 28 March 2014

29-03-2014, 8:30 PM - 9:30 PM : ఎర్త్ అవర్ (Earth Hour)

రోజురోజుకు పెరుగుతున్నా కాలుష్యం, విద్యుత్ ఉపకరణాలు, కర్మాగారాల నుంచి విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాల కారణంగా భూవాతావరణం వేడెక్కుతోంది.

భూమి ఎన్నడు లేనంతగా మండిపోతోంది. దీనే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటున్నారు శాస్త్రవేత్తలు. గత 15,000 సంవత్సరాలలో భూమి ఉష్ణోగ్రత 3.5°సెల్సియస్ మాత్రమే పెరిగింది, కానీ త గత 76-80 సంవత్సరాలలో ఒక్కసారి 15°సెల్సియస్ పెరిగింది.

వచ్చే 45 సంవత్సరాల్లో ఇది ఇప్పుడు ఉన్నదానికంటే 7°లేక 8°సెల్సియస్  పెరగవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది?

ధృవపు ప్రాంతల్లో ఉన్న మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టం పెరిగి సముద్రం జనావాసాల్లోకి చొచ్చుకువస్తుంది, అకారణంగా తుఫాన్లు సంభవిస్తాయి, కరువు ఏర్పడుతుంది, ఋతుపవనాలు సకాలంలో రావు, కొత వ్యాధులు పుట్టుకోస్తాయి. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆఖరికి జీవం యొక్క మనుగడకే ముప్పు వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి జీవం మొత్తం నశించిపోతుంది.



భూమాతకు పొంచుకొస్తున్న ఈ ముప్పును గురించి అందరికి అవగాహన తీసుకురావాలి, జీవనశైలిలో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులతో కొంతవరకైన కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి జనం ముందుకు రావాలి.

ఇది జరగాలంటే ముంచుకొస్త్తున్న ముప్పు గురించి అందరికి తెలియాలి. అందుకోసం ప్రతి ఏటా మార్చి నెల చివరి శనివారం రోజు రాత్రి ప్రపంచ వ్యాప్తంగా 8.30 నుంచి 9.30 వరకు ప్రజలు స్వచ్చంధంగా విద్యుత్ ఉపకరణాల వాడకం ఆపేయాలని, ఎర్త్ అవర్ పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వరల్డ్ వైడ్ ఫండ్ అనే స్వచ్చంధ సంస్త.

152 దేశాల ప్రజలు స్వచ్చందంగా ఈ ఎర్త్ అవర్ లో పాల్గొంటున్నారు.

ఈ గంట సమయంలో జనం విద్యుత్ వాడకం నిలిపివేయడం వలన పొదుపు చేయబడిన విద్యుత్‌కు సమానమైన డబ్బును ప్రభుత్వాలు వరల్డ్ వైడ్ ఫండ్ సంస్థకు అందజేస్తాయి. ఈ డబ్బును అంతరించిపోతున్న జంతువులను కాపడటానికి ఉపయోగిస్తారు. ఒక గంట సేపు విద్యుత్ ఆపేయడం వలన అద్భుతాలేమి జరగకపోవచ్చు, కానీ ఆ గంట గురించి జరిగే చర్చ జనంలో చైతన్యం, అవగాహన తీసుకువస్తుంది.

ఈ ఎర్త్ అవర్ (Earth Hour) అనేది స్వచ్చంధ కార్యక్రమం. ఎవరి ఇంట్లో, వాళ్ళు స్వచ్చంధంగా ఒక గంట విద్యుత్ వాడకానికి స్వస్తి చెప్పాల్సి ఉంటుంది. మన కోసం కాదు, మన పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం. రేపు రాత్రి ఎర్త్ అవర్ పాటిద్దాం.      

Thursday, 27 March 2014

హిందూ ధర్మం - 40 (శౌచం)

శౌచం కలిగి ఉండడమంటే అది కేవలం బాహ్యమైన శౌచం అవ్వకూడదు. రోజు స్నానం చేయడం వలన శౌచం రక్షించబడుతుంది అంటే అది అవివేకమే. ధర్మం ఎప్పుడు కేవలం బాహ్యమైన కర్మల గురించి చెప్పదు. శౌచం మానసిక శౌచం అవ్వాలి. గంగానదిలో స్నానం చేయడం మంచిదే. అలా అని మనసు నిండా కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలతో నిండిన వ్యక్తి, స్వార్ధపరుడు గంగలో మునిగినా, మానస సరోవరంలో మునిగినా అతను శుద్ధిని పొందాడని చెప్పలేం! శౌచం ఆంతరంగికమై ఉండాలి. అంతఃకరణ (మనసు, బుద్ధి మొదలైనవి) శుద్ధి గురించే ధర్మం ప్రధానంగా చెప్తుంది. శౌచం అంటే మనసుయందు కూడా పవిత్రభావనలు కలిగి ఉండడం.

మడి కట్టుకుని పూజ చేస్తాం. మడి వెనుకున్న అర్ద్దం కూడా శౌచమే. మడి అంటే విప్పిన బట్టలను, ఇతర వస్తువులను తాకకుండా ఆ కాసేపు బాహ్యంగా పవిత్రంగా ఉండడం ఒక్కటే కాదు. మనసులో ఇతర ఆలోచనలను నిగ్రహంచడం మడిలో ప్రధానం. ఆ సమయంలో మనసులో భగవత్ ధ్యానం చేయడం, స్తోత్రాలు చదవడం చేయాలి. ఆ విధంగా చేసిన వంటనే నివేదనకు పనికివస్తుంది. మనం తినే ఆహారం మనసుపై ప్రభావం చూపిస్తుంది. మనం వంట చేసే సమయంలో ఏం ఆలోచిస్తామో అదే మన ఆహారంలో చేతి, శరీరంలోకి చేరుతుంది. వంట చేస్తున్న సమయంలో హింసను ప్రేరేపించే సన్నివేశాలు, మటలు గుర్తుకు తెచ్చుకోవడం వలన, చికాకుతొ చేయడం వలన అది తినేవారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి అది విషంగా మారుతుంది కూడా. అందుకే వంటను మడితో చేసి, దేవునికి నివేదన చేసి భుజించమన్నారు. మంచి భావనలతో చేసిన వంట, మనసును మంచిదారిలో నడిపిస్తుంది. అదే పరమాత్మను స్మరిస్తూ చేస్తే, పరమాత్ముడు మరణంలేనివాడు కనుక, ఆ ప్రభావతో తినేవారికి అమృత తత్వం ప్రాపతిస్తుంది. అదే మడిలోని ప్రధానం ఉద్ద్యేశం కూడా. శౌచం యొక్క ప్రధానం ఉద్ద్యేశం ఇదే. అంతఃకరణ శుద్ధిలేని బాహ్యమైన ఆచారం వృధా అనే చెప్పాలి.

మనం నడుస్తున్నా, కూర్చున్నా, ఎల్లప్పుడు పవిత్ర భావనలతో ఉండడమే శౌచం. ఒకరిని చూసి కుళ్ళుకోకపొవడం, ఇతరుల అభివృద్ధిని చూసి ఏడువకపోవడం, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడకపోవడం కూడా శౌచం క్రిందికే వస్తాయి.

To be continued..........  

Wednesday, 26 March 2014

హిందూ ధర్మం - 39 (శౌచం)

శౌచం - శౌచం అంటే పరిశుభ్రత కలిగి ఉండడం, మానసికంగా, శారీరికంగా పవిత్రంగా జీవించడం. శౌచం అనేది విశుద్ధతను కలిగించే ఒక ప్రక్రియ.బయటకు కనిపించే మన శరీరాన్ని విశుద్ధ జలంలో స్నానమాచరించి మలాన్ని తొలగించుకోవడం శారీరిక శౌచం. స్నానం పవిత్రమైనది మరియు ఆయుర్ధాన్ని పెంచేది, శ్రమమూలంగా ఏర్పడిన స్వేదమలాన్ని పోగొట్టేది, శరీర బలాన్ని కలిగించేది, ఓజస్సును ఇచ్చేది. మన వాక్కుకు/మాటలకు శౌచం సత్యం వల్ల ఏర్పడుతుంది. అదే వాక్కుకు స్నానం/శౌచం. అబద్దాలు పలకడం వలన వాక్కు అపవిత్రం అవుతుంది. వ్యాకరణం మొదలైన శాస్త్రాలవల్ల శబ్దానికి శుద్ధి కలుగుతుంది. ఏది ఎలా పలకాలో తెలుస్తుంది. అందువల్ల వ్యాకరణం శబ్దానికి శౌచానిస్తుంది. శుభ్రత కలిగిన ప్రదేశంలో వండిన ఆహారాన్నే స్వీకరించాలి. శుద్ధమైన ఆహారం మనసును శుద్ధి చేస్తుంది. శుద్ధి చెందిన మనసు అదుపులోకి వచ్చి, పరమాత్మ సేవకు ఉపకరమిస్తుంది. ఎక్కడపడితే అక్కడ వండిన ఆహార పదార్ధాలను స్వీకరించకపోవడం ఆహారం శౌచం. సంపాదించిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు, దానాలకు, సేవకు ఉపయోగించడం సంపాదనకు శౌచానిస్తుంది. అలా కాకుండ స్వార్ధంతో జీవించడం వలన సంపాదన అపవిత్రం అవుతుంది.

మన మనస్సుకు గురువు యొక్క ఉపదేశం, మంచి ప్రవచనం వినడం వలన మంచి ఆలోచనలతో శుద్ధి కలుగుతుంది. మంచి గ్రంధాలు చదవడం వలన, సత్సంగం వలన మనసు మంచిదారిలో పయనిస్తుంది. మనస్సుకు ఇవే స్నానం. విపరీతమైన ప్రేమ, భరించలేని ద్వేషం, పక్షపాతం కలిగి ఉండడం, జరిగిన విషయం మీద అవగాహన లేకుండా సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం, అనవసరంగా ఒకరిని నిందించడం, అన్యాయం, అధర్మం మొదలైన వాటినుంచి దూరంగా ఉండడం మానసిక శౌచం క్రిందకే వస్తుంది.

To be continued.......... 

Tuesday, 25 March 2014

హిందూ ధర్మం - 38 (అస్తేయం-5)

వేదం చెప్పినదానికి విరుద్ధంగా చెప్పడం, జనాన్ని తప్పు త్రోవ పట్టించడం, నమ్మించి మోసగించడం, వెన్నుపోటు పొడవడం వంటివి స్తేయం క్రిందికి వస్తాయి. వీటికి దూరంగా బ్రతకడం అస్తేయం.

ఇక అస్తేయం అన్నది కూడా త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అంటే మనసులో కూడా మనది కానీ వస్తువులను దక్కించుకోవాలని కానీ, పొందాలనీ కానీ, అనుభవించాలని కానీ అనుకోకూడదు. అట్లాగే మాటల్లో కూడా. నాకు అది వచ్చి ఉంటే బాగుండేదండీ, వాడికి అంత ఆస్తి ఎందుకు, నాకు అందులో కాస్త ఇవచ్చు కదా, ఇలా మనం మనవి కాని వాటి గురించి బోలెడు మాటలు మాట్లాడుతాం. అవన్నీ మాట్లాడకపోవడం అస్తేయం. ఇక చేతల్లో. మనం దాని గురించి ముందే చెప్పుకున్నాం. ఒకరిని మోసగించాలనుకోవడం, ఒక వస్తువును దొంగిలించాలన్న ఆలోచన మనసులో చేసినా, అది దొంగతనం క్రిందకే వస్తుంది. కేవలమ బాహ్యప్రవర్తనే కాదు, ఆలోచనలు కూడా అదుపులు చేసుకోవాలని ధర్మం చెప్తుంది.

ఒకరికి సంబంధిచిన వస్తువు మీకు కావాలనీ మీ మనసు కోరగానే దాన్ని నిలువరించండి. నువ్వు చేస్తున్నది తప్పు. ఇతరుల వస్తువులను ఆశిచకూడదు, అది పాపం, అవసరమైతే మనం సంపాదించుకోవాలి అని చెప్పండి. ఈ అస్తేయం అన్న గుణం హిందువులకు ఉన్నది కనుక చరిత్రలో హిందూదేశం ఏనడు ఇతర దేశాలపై దండయాత్ర చేయలేదు, ఒకరి సంపదను కొల్లగొట్టలేదు.

తదుపరి లక్షణం శౌచం.

To be continued..........

Monday, 24 March 2014

హిందూ ధర్మం - 37 (అస్తేయం - 4)

అస్తేయం గురించి మరికొంత చెప్పుకుందాం. ఈ శరీరం మన పూర్వీకులు నుంచి తీసుకున్న అప్పు అయితే, ఈ ప్రకృతి మన పిల్లల నుంచి తీసుకున్న అప్పు అన్నాడు ఒక మహానుభావుడు. మనం చెడు తిండ్లకు, ధూమపానం, మద్యపానంకు అలవాటు పడి, ఆరోగ్యాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటే, అది మన తరువాత వచ్చే మన పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మనం ఏం చేస్తున్నాం? రాబోయే తరానికి కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే హక్కు ఉన్నది, మనం లేనిపోని అలవాట్లకు బానిసలమై వారి హక్కులను కాలరాస్తున్నాం. మనకు వారి హక్కులను కాలరాసే అధికారం ఎక్కడిది? అస్తేయం అంటే రాబోయే తరాలవారి హక్కులకు విఘాతం కలుగకుండా జీవించడం, లేనిపోని రోగాలను మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వకపోవడం.

పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్య్త తల్లిదండ్రులది అంటుంది వేదం. అది మగపిల్లవాడైనా, ఆడపిల్లైనా వేదం అందులో మినహాయింపు ఏమీ ఇవ్వలేదు. ఆడపిల్లవి, నీకు చదువు ఎందుకు, ఇంతవరకు చదివింది చాలు, ఇక ఇంట్లో కూర్చో అని చెప్పి, ఆమెను నిలువరించడం, ఆమె చదువుకునే హక్కును మీ చేతుల్లోకి తీసుకోవడం, కాలరాయడం స్తేయం. దానికి విరుద్ధంగా ఉండడం అస్తేయం.

కొందరు రోడ్డు మీద నడుస్తూ సిగిరెట్టు కాలుస్తారు, అక్కడున్న గాలిని కలుషితం చేసి, తద్వారా ఇతరల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. మీకు ఇతరుల ఆరోగ్యాలను, జీవితాలను నాశనం చేసే అధికారం మీకు లేదు. మీరు వారు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మీది కానీ దాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అంటే అస్తేయాన్ని విడిచిపెడుతున్నారు అంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడైనా చాలా లోతుగా చెప్తుంది, ధర్మానికి పరిమితి, పరిధి అన్నవి ఉండవు. ధర్మం స్పృశించని విషయం అంటూ ఉండదు.

To be continued..........

Sunday, 23 March 2014

సెక్యులర్ మడిబట్ట జాగ్రత్త!

Courtesy : http://www.andhrabhoomi.net/content/secular-madi-batta-jegratha

ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడి జనాభాలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ సాంస్కృతిక మూలాలను ఇండోనేసియన్లు మరచిపోరు. ఏవగించుకోరు.
అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు ‘గరుడ’
(ప్రస్తుతం మూతపడ్డ) డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు ‘జటాయు’.
ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!
రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!!
గరుత్మంతుడు, జటాయువు, కృష్ణుడు, గణేశుడు హైందవ మత సంబంధంగల పేర్లు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాలకిందటే దాదాపుగా అంతరించిపోయి, ఐదింట నాలుగొంతుల జనాభా ఇస్లాం మతాన్ని తరతరాలుగా ఆచరిస్తుండగా... తమదికాని, ... అందునా విగ్రహారాధకుల మతం తాలూకు పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టటమేమిటి? ప్రభుత్వ కరెన్సీపై అన్యమతానికి చెందిన దేవతామూర్తిని ముద్రించటమేమిటి?... అన్న అభ్యంతరం ఇండోనీసియన్లకు లేదు. తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి మహా ఇష్టం.
కొద్దినెలల కిందటి ముచ్చటే చూడండి. ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు.
పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ భారత్‌లో కలనైనా ఊహించగలమా?
కర్మంచాలక అదే సరస్వతీదేవి విగ్రహాన్ని అమెరికాకు కాక ఇండియా సర్కారుకు ఇండోనేసియా బహూకరించిందనుకోండి! ఏమయ్యేది? విగ్రహం ఎంత ముచ్చటగా ఉంటేనేమి? అది ఒక మతానికి సంబంధించినది కదా? ఆ మతం ఎంత ప్రాచీనమైనది అయితే మాత్రమేమి? మా దేశంలో నూటికి 80 మంది ఇప్పటికీ అనుసరిస్తున్నదే అయితే నేమి? ఫలానా మతానికి చెందిన దేవతా ప్రతిమను ముట్టుకుంటే మా సెక్యులర్ మడి మైలపడుతుంది. కాబట్టి వద్దే వద్దని ఘనత వహించిన భారత సర్కారు ఆ కానుకను తిరుగు టపాలో వెనక్కి పంపించేది. సమయానికి సెక్యులర్ మతి తిన్నగా పనిచేయక మన్మోహన్ సర్దార్జీగారో, మరో పెద్దతలకాయో ఆ విగ్రహాన్ని స్వీకరించి ఉంటేనా...?! దేశంలోని సెక్యులర్, లిబరల్, లెఫ్టిస్టు, అనార్కిస్టు తక్కుంగల మేధావిగణం యావత్తూ రేచుకుక్కల్లా మీదపడి పీకిపెట్టేది. జాతి ఎంచుకున్న సెక్యులర్ జీవన విధానానికి, రాజ్యాంగ వౌలిక స్ఫూర్తికి, మానవతా విలువలకు జరిగిన ఆ మహాపచారం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ ‘ది హిందూ’ పత్రిక ఘాటైన సంపాదకీయం రాసేది. వీరనారి అరుంధతీరాయ్ డిటోడిటోగా ‘ఔట్‌లుక్’ వీక్లీనిండా చెడామడా చెలరేగేది. పాఠశాలల్లో, పబ్లిక్ కార్యక్రమాల్లో సరస్వతీ ప్రార్థన చేయటమే సెక్యులర్ వ్యతిరేక దురాగతమని జాతీయ ఏకాభిప్రాయం ఎంచక్కా నెలకొని ఉన్న పవిత్ర భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వమే బరితెగించి ఏకంగా సరస్వతీ విగ్రహానే్న అందుకోవటాన్ని రాజ్యాంగ వ్యతిరేక దుశ్చర్యగా ప్రకటించమంటూ వీర సెక్యులరిస్టులు ఏ ఉన్నత న్యాయస్థానంలోనో అర్జంటుగా ప్రజాహిత వ్యాజ్యం వేసేవారు.
-ఇప్పుడు బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో లక్షణమైన ‘పిల్’ పడ్డట్టు!
పనిలేనివాడు దావావేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది - అంటారా?
తాజా నాణెం కేసులో ఏమయింది?
బృహదీశ్వరాలయం బొమ్మతో మూడేళ్ల కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూ మతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టటానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా ‘యునెస్కో’ గుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్ద గుడికి వెయ్యేళ్లు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీస్ కాజీ, అబూ సరుూద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వంమీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బి.డి. అహమ్మద్‌గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రత విధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్లు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేశారు. పాతికేళ్లకు ఇది, వందేళ్లకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగచిరాకు పడ్డారు. శభాష్!
న్యాయం, ధర్మం సర్వం ఎరిగిన ఉన్నత న్యాయస్థానం వారి ఉపదేశమే ఈ రీతిన ఉన్నప్పుడు ప్రాచీన కళలను, సంస్కృతిని రూపుమాపడమే సెక్యులర్ సర్కారు స్పెషల్ డ్యూటీగా పెట్టుకుని, ఓటు బ్యాంకుల కోసం ఎంత చేటుపనికైనా ఉరకలేయడంలో వింతేముంది? శ్రీనగర్ దాల్ సరస్సు దాపున ఉండే జగత్ప్రసిద్ధి చెందిన ‘శంకరాచార్య హిల్’ను ‘తఖ్త్-ఎ-సులేమాన్’గా పేరుమార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయ యజమానుల పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను ‘పరిరక్షణ’ పేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే ‘సెక్యులర్’ శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్లు కుట్టేసుకున్నారు.
ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి సెక్యులరిజం నేర్పింది. ప్రపంచాన్ని చూసి భారతదేశం సెక్యులరిజాన్ని నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

Saturday, 22 March 2014

రాజ్యాధికారమే లక్ష్యంగా మతమార్పిడులు

రెండు వందల ఏళ్ళ తీవ్రప్రయత్నం తరువాత కుడా హిందూ ధర్మం నాశనం కాకపోవడాన్ని క్రైస్తవ మిషనరీలు అంగీకరించలేకపోయాయి. స్వతంత్రం వచ్చినా, ఇంకా భారత్‌ను మతం మర్చాలనీ, తమకు బానిస చేసుకోవాలనీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  భారతదేశంలో జరిగే మత మార్పిడుల వెనుక విదేశీ హస్తం ఉంది. అది ఎలాగంటారా? దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడుల వెనుక పెద్ద పధకమే ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంటు స్థానంలో తమ మతస్థులు కనీసం 30-35% తగ్గకుండా ఉండేలా మరమార్పిడులు చేస్తున్నారు. అంతకుమించినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మతమార్పిడి జరిగిన తరువాత వారికి ఇచ్చే భోధనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎక్కువగా హిందూ సంస్కృతికి, భారతదేశ సమగ్రతకు వ్యతిరేకంగానే ఉంటాయి. అది తెలియని అమాయకజనం అవే నిజమని నమ్ముతారు.

మన దేశంలో ఓటుబ్యాంకు రాజకీయాలు మనకు తెలిసిందే. దానికి తోడు హిందువుల్లో ఐక్యత ఉండదు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ తమకు సంబంధించిన ఒక రాజకీయపార్టికి గంపగుత్తగా ఓటు చేసినట్టు హిందువులు ఓటు వేయరు. పైగా రాజకీయనాయకులే హిందువులను కులం, ప్రాతం పేరున విడిదీస్తారు. కనుక ఎన్నికల సమయంలో ఈ 30% ఓట్లు రాజకీయ పార్టీల జయాపజయాలకు కీలకంగా మారతాయి. మతపెద్ద ఎవరికి ఓటు వేయమంటే వారికే ఓటు వేసేలా ఆయా మతస్థులను తయారు చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ 30-35% ఉన్న జనాన్ని ఆకర్షించడానికి వారికి అనుగుణంగా పనిచేసే రాజకియ నాయకులను నిలబెడతారు.

ఉదాహరణకు ఒక నియోజవర్గంలో, 100 భారతీయుల్లో 70 మంది హిందువులు, వేరే మతస్థులు 30 మంది ఉన్నారనుకుందాం. 70 మంది హిందువులు ఐక్యత లేని కారణంగా 7 రాజకీయపార్టీలకు ఓటు వేస్తారు. ఫలితంగా ఓట్లు చీలిపోతాయి. మిగితా 30 మంది ఒకే పార్టికి తమ ఓటు వేసి, తమ మతానికి సంబంధించిన అభ్యర్ధిని గెలిపించుకుంటారు. రానున్న కొద్ది కాలంలో దేశమంతా ఇదే జరగాలని విదేశీయులు ఆశిస్తున్నారు. ఈ గెలిచిన అభ్యర్ధులు కూడా దేశానికి మేలు చేసే విధంగా నడుచుకోరు, వారికి ముందే బోధనలతో బ్రెయిన్ వాష్ చేసిన కారణంగా మానసికంగా బలహీనపడి, విదేశీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటారు, వారికి బానిసలవుతారు. ఇలా ఎప్పుడైతే మన దేశపు సార్వభౌమాధికారం ఇతర దేశాలవారి పాదాల దగ్గర పడుతుందో, అప్పుడు ఒక 20 సంవత్సరాలలో దేశం విదేశాలకు బానిస అయిపోతుంది. పార్లమెంటులోకి విదేశియులు ప్రవేశిస్తే, చట్టాలు మారిపోతాయి, క్రమక్రమంగా భారతదేశం బలహీనపడుతుంది. ఒకసారి విదేశీయులు వెనుక ఉండి నడిపిస్తున్న ఇతర మతస్థుల చేతుల్లోకి అధికారం వెళ్ళిదంటే హిందూ సంస్కృతి, భారతదేశం అస్థిత్వం కోల్పోతుంది. ఒకప్పుడు దక్షిణ కొరియా బౌద్ధమతస్థులు అధికంగా ఉన్న దేశం. కానీ దాని మీద క్రైస్తవ మిషనరీలు దృష్టి పెట్టి, దాన్ని క్రైస్తవ మెజారటి దేశంగా మార్చేశాయి. ఇప్పుడు అవే మిషనరీలు భారతదేశం మీద దృష్టి పెట్టాయి. మనం మేల్కొనకపోతే హిందువులు స్వదేశంలో మైనారటిలు అవుతారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇటువంటి అనేక విషయాలను Rajiv Malhotra గారు Breaking India అనే తన పుస్తకంలో వివరిచారు. కనీసం ఇప్పటికైనా హిందువులంతా ఐక్యంగా ఉండాలి, భారతదేశాన్ని రక్షించుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలి. విదేశీయుల చేతిలో మోసపోకుండా మన సోదరులు, భారతీయులైన ఇతర మతస్థులను కాపాడుకోవాలి. హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలి. మన ఉమ్మడి హక్కులను రక్షించుకోవాలి.   

Thursday, 13 March 2014

హిందూ ధర్మం - 36 (అస్తేయం - 3)

ప్రకృతి వనరులు అంటే గనులు, బొగ్గు, వజ్రాలు లాంటివే అనుకోకండి. నీరు, గాలి కూడా ప్రకృతి వనరులే. నీటి నుంచి, బొగ్గు నుంచి ఉత్పతి చేస్తున్న విద్యుత్తు కూడా ప్రకృతి వనరే. మరి మనం నీటిని పొదుపుగా వాడుతున్నామా? ఆ నీటి నుంచి ఉత్పతి అయిన విద్యుత్తును పొదుపుగా ఉపయోగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచినండి. మాకు బిల్లు కట్టే స్థోమత ఉండండి, అందుకే మాకు విద్యుత్ పొదుపు చేయవలసిన అవసరం లేదనంటారు ఒకాయన. దానికి మన సంస్కృతి ఒక్కటే జవాబు చెప్తుంది.

మీరు ఈ ప్రకృతి వనరులకు డబ్బు చెల్లించలేరు. అవి అమూల్యమైనవి. మీరు డబ్బు చెల్లిస్తున్నది దాని ఉత్పత్తి చేస్తున్న కంపినీలకే. అదు ఉత్పత్తి, సర్ఫరా చేయడానికి అవుతున్న ఖర్చుకు మాత్రమే మీరు మూల్యం చెల్లిస్తున్నారు, అంతే. కానీ నిజానికి మీరు కానీ, ఆ కంపేనిలు కానీ ప్రకృతి వనరులకు యజమానులు కారు, అవి ఎప్పటికి మీవి కావు. మీకు వాటిని మీ అవసరానికి మాత్రమే అవకాశం మాత్రమే ఉన్నది. ఆహారం విషయంలో కూడా అంతే. మీకు అవసరమంతమేరకు తినే అవకాశమే ఇచ్చాడు కానీ ఆహారాన్ని వృధా చేసే అధికారం భగవంతుడు ఇవ్వలేదు.

ప్రకృతి వనరుల విషయం వచ్చింది కనుక ఒక విషయం గుర్తు చేసుకోవాలి. భూగర్భజలాలు ప్రకృతి సంపద, వాటిని మనిషి తనకు అవసరమైనంతవరకు వాడుకోవచ్చు. కానీ వాటిని వాడుకుంటున్నందుకు ప్రతిగా ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి పంపించాలి. ఇక్కడ అస్తేయ ధర్మం అన్వయం అవుతుంది. ఎందుకంటే మీకు జరుగుతున్న మేలుకు ప్రతిగా మీరు కూడా మేలు చేసే అవకాశం ఉంది, అలా ఉండీ మీరు ప్రత్యుపకారం చేయకుండా భగవంతుని ఆస్తి అయిన భూగర్భజలాలను వాడుకోవడం దొంగతనమే అవుతుంది.

మనం దేవుడి పేరును అడ్డం పెట్టుకుని ప్రకృతిని కలుషితం చేసినా దాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా కాదు, ఇలా కాదు అంటూ మనలని మనం సమర్ధిచుకునే ప్రయత్నం చేస్తున్నామే తప్ప, పైవాడిని మాత్రం ఒప్పించలేం. ఈ సృష్టిలో మానవులకు జీవించే అధికారం ఎంత ఉందో, ఇతర జీవాలకు అంతే అధికారం ఉంది. మనం వాటి ఆవాసాలను, ఉనికిని నాశనం చేయడమంటే వాటి అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడమే. ఈ సృష్టికి అధికారి అయిన ఈశ్వరుడి నుండి మీరు బలవంతంగా అధికారం లాక్కుంటున్నారు, ఆయన సర్వాధికారాన్ని వెక్కిరిస్తున్నారు, ఆయన ఇచ్చిన స్వేచ్చను దాటిపోతున్నారు, ఆయన చెప్పిన పరిమితులను ఉల్లంఘిస్తున్నారు. అది స్తేయం. అంటే అధర్మం. అలా కాకుండా ఆయన చెప్పినట్టుగా జీవించడం, మీకు ఏ వస్తువు అంతవరకు అవసరమో, అంత వరకే వాడుకోవడం, దేన్నీ కలుషితం చేయకపోవడం, మీ పైధిని గుర్తించి అంతవరకే పరిమితం కావడం అస్తేయం. అదే ధర్మం.

To be continued...........

Originally published :  13-March-2014
Edited 1st Time: 04-March-2015

Wednesday, 12 March 2014

హిందూ ధర్మం - 35 (అస్తేయం -2)

యజమాని విధించిన పరిధిని దాటి వస్తువులను వాడుకోవడం స్తేయం. ఎంతవరకు వాడుకునే స్వేచ్చ ఇచ్చారో అంతవరకే జాగ్రత్తగా వాడుకోవడం అస్తేయం.

ఈ సృష్టి ఆదిలో పరమాత్మ మనకు యజ్ఞం అనే ఒక ప్రకియను అందించి, మీరు యజ్ఞం చేసి దేవతలను (ప్రకృతిని) సంతృప్తి పరచండి, సంతృప్తి పడ్డ దేవతలు వర్షాలు కురిపిస్తారు, తద్వారా ఆహారం పండుతుంది, మీరు పండించిన ఆహారం స్వీకరించే ముందు అది దేవతలకు యజ్ఞంలో హవిస్సుగా సమర్పించి, ఆ తర్వాతే భుజించండి. అలా ఎవరు భుజించరో, వారు పాపాన్ని తింటున్నట్టే, వారు దొంగలు అన్నాడు గీతలో.

అందువల్ల ఈ ప్రకృతి వనరులను త్యాగబుద్ధితో వాడండి. అంటే ఇష్టం వచ్చినట్టు వాడి నాశనం చేయకండి, వృధా చేయకండి అంటుంది ఈశావాస్యోపనిషద్ .  హిందూ ధర్మానికి ఇతర మతాలకు ఇక్కడే పెద్ద తేడా ఉంది. హిందూ ధర్మం ప్రకృతిపై మనిషికి విశేష అధికారాన్ని అంగీకరించదు. ఈ సృష్టి మొత్తం భగవంతుని సొత్తు. ఆయన ఎంతవరకు అనుమతించాడో, అంతవరకే దీన్ని వాడుకోవాలి. ఇతర మతాల్లో అలా కాదు. ఈ ప్రకృతి, జంతువులు, పక్షులు, భూగోళం, ఖనిజాలు ఇవన్నీ మనిషి అనుభవించడానికి, దోచుకోవడానికి ఉన్నవే. అవి మనిషికి సర్వాధికారాన్ని కట్టబెట్టాయి. అందుకే ఆంగ్లేయులు ప్రపంచం మీద పడి దోచుకున్నారు, అమెరికాను, అఫ్రికాను, భారత్‌ను, ఇతర దేశాలను నాశనం చేశారు.

ఈ రోజుకు ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధిలో ఇది కనిపిస్తోంది. అభివృద్ధి అంటే అర్దం ప్రకృతి వనరులను పూర్తిగా ఖాళీ చేయడమే, ప్రకృతిని, జీవజాలాన్ని నాశనం చేయడమే, ఇష్టం వచ్చినట్టు భూమిని దోచుకోవడమే. ఇది పశ్చిమ దేశాలవారి భావజాలం. మనకూ అంటించిపోయారు. కానీ వేదం ఇందుకు వ్యతిరేకం. వేదం ఎప్పుడు ఈ జగత్తునకు అధికారి ఈశ్వరుడే. దీనిపై దోపిడి ..... పాపం అంటుంది. కానీ మనం ఎంతమేర ఆచరిస్తున్నాం?

To be continued...........

Originally published : 12-March 2014
Re edited 1st time : 04-March 2015

Tuesday, 11 March 2014

హిందూ ధర్మం - 34 (అస్తేయం -1)

ధర్మం యొక్క తదుపరి లక్షణం అస్తేయం.

దొంగతనం చేయడం, దోచుకోవడం, వస్తువు యొక్క యజమాని అనుమతి లేకుండా ఆ వస్తువును అనుభవించడం, మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, నమ్మకద్రోహం చేయడం, అబద్ధాలను బోధించడం, వేదానికి విరుద్ధంగా బోధించడం స్తేయం, అది అధర్మం. దానికి విరుద్ధమనది అస్తేయం, అది ధర్మం అంటారు ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీ. అంటే నిజాయతీగా ఉండడం, మనది కానీ వస్తువును దాని యజమాని అనుమతి లేకుండా అనుభవించకపోవడం, వేదం చెప్పిందే బోధించడం మొదలైనవి.

ఒకరికి సంబంధించిన వస్తువులను వారి అనుమతి లేకుండా ఉపయోగించడం, అనుభవించడం, ఇతరుల వస్తువులను మనవిగా ప్రచారం చేసుకోవడం స్తేయం. దానికి విరుద్ధమైంది అస్తేయం. స్తేయం అంటే దొంగతనం. ఒక వ్యక్తికి రావలసిన కీర్తిని, ఒక వ్యక్తి పొందాల్సిన గౌరవాన్ని ఆ వ్యక్తికి దక్కకుండా చేసి, తద్వారా మనం ఆ సుఖాలను, పేరున అనుభవించడం పాపం, అది దొంగతనం క్రిందకు వస్తుంది, దాన్నేస్తేయం అంటారు.

ఉదాహరణ చెప్పుకుంటే ఒకరు కొన్ని విషయాలు వెళ్ళడిస్తే, వారి పేరు బయటకు రాకుండా, మొత్తం సమాచారాన్ని కొందరు తమ పేరున పుస్తకాల్లో ముద్రించుకుంటారు. కనీసం ఇది వీరి ద్వారా తెలిసింది అని కూడా చెప్పరు. ఇది దొంగతనం క్రిందకు వస్తుంది, దశపాపాల్లో ఒకటైన చౌర్యం అనే పాపం చుట్టుకుంటుంది. ఈ కాలానికి తగ్గ ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు బ్లాగులు, పేస్‌బుక్‌లో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి అనేక రకాల సమాచారాలు షేర్ చేస్తారు, దాన్నీ కాపీ, పేస్ట్ చేసినా, ఎక్కడి నుంచి కాపి చేసారో, వెళ్ళడించడానికి ఇష్టపడరు, క్రింద  Courtesy అని ఇవ్వరు. ఇలా చేయడం స్తేయం అనగా దొంగతనం, అటువంటి లక్షణం ఉండకూడదు అంటున్నది ధర్మం.

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ఉంటారు. అందరికి ఆస్థిలో సమానంగా వాటా వస్తుందంటే ఒప్పుకోరు, తమకే ఎక్కువ కావాలని, ఇతరులకు దక్కకుండా కుట్రలు చేస్తారు, ఆస్తి మొత్తం తామే అనుభవిద్దాం అనుకుంటారు. రకరకాల కుట్రలు చేస్తారు.కొందరైతే తల్లిదండ్రులను అస్సలు చూడరు, కానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలంటారు. అది దొంగతనంతో సమానం. తల్లిదండ్రులను చూడనివాడికి ఆస్తి అడిగే హక్కు ఎక్కడిది. అది పాపం. అదే అధర్మం. అటువంటి లక్షణం ఉండకూడదు అంటారు మనుమహర్షి.తద్విరుద్ధంగా ఉండడం అస్తేయం.

To be continued...........

Originally published: 11-March-2014
Edited 1st time: 04-March-2015

Monday, 10 March 2014

హిందూ ధర్మం - 33 (మనో నియంత్రణకు మార్గాలు)

ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో, మెనెజ్‌మెంట్ కోర్సుల్లో ఇతరులను మెనెజ్ చేయడం ఎలాగో నేర్పిస్తారు. కానీ భారతీయ సంస్కృతి, తనను తాను అదుపు చేసుకోవడం, తనను తాను మెనెజ్ చేసుకోవడం నేర్పుతుంది. తనను తాను అదుపు చేసుకోలేనివాడు, ప్రపంచాన్ని ఎలా మెనెజ్ చేయగలడని ప్రశ్నిస్తుంది. మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా మనల్ని మనం ఎలా మెనెజ్ చేసుకోవాలో నేర్పిస్తాయి. దేవుంద్రుడిని జయించిండం గొప్ప కాదయ్యా, నీ మనసును గెలవడమే గొప్ప అని ఘోషిస్తాయి. మనసును ఎలా గెలవాలో, మార్గం చూపిస్తాయి.

మనకు (ఆత్మకు), శరీరానికి మధ్య వారధి ఊపిరి. ఊపిరి ఆగిన మరిక్షణం జీవితం ముగిసిపోతుంది. మనసు, దాని ఆలోచన సరళి మనం తీసే ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆవేశానికి, కోపానికి గురైనప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంది. ఆనందం, విచారం, సుఖం, దుఃఖం మొదలైన సందర్భాలలో ఊపిరి తీయడంలో మార్పులు సంభవిస్తాయి. అందువల్ల మనసును నిగ్రహించాలంటే ఊపిరిని అదుపు చేయాలి. అదుపు చేయడం అంటే ముక్కు మూసుకోమని కాదు. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ప్రాణమును (వాయువును) నియంత్రిచడం. ప్రాణాయామం తెలిసిన గురువు దగ్గరే ఈ విద్య నేర్చుకుని చేయాలి, అంతేకానీ ప్రాణాయామ విషయంలో సొంత ప్రయోగాలు పనికిరావు.

ఇక మనసును, ఇంద్రియాలను అదుపు చేయగల వాటిలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం వలన మనసుకు నిలకడ వస్తుంది. ఈ రోజు రకరకాల ధ్యాన ప్రక్రియలను అనేక మంది గురువులు భోషితున్నారు. 20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన గొప్ప గురువు భగవాన్ రమణ మహర్షి. ఆయన ఒకానొక యోగ ప్రక్రియ గురించ్ చెబుతూ, మీ శ్వాసను గమనించండి అన్నారు. ఊపిరిని అదుపు చేయవలసిన అవసరం లేదు. మీరు నిత్యం గాలి తీసుకుని వదిలిపెడుతూనే ఉన్నారు. దాన్ని కేవలం గమనించండి. మహషి చెప్పిన ఈ విధానం వలన మనసు ఆత్మలో ఐక్యం అవుతుంది. బయటి వస్తువులతో సంబంధం కోల్పోతుంది. దీనికి దేశకాల నియమం లేదు.  

మూడవది మనసును అదుపు చేయాలంటే యోగా చేయాలి. యోగాసనాలు మనసును, ఇంద్రియాలను అదుపు చేస్తాయి. శ్రద్ధను పెంచుతుంది. యోగా కూడా ఈ విద్య తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం. అప్పుడే సక్ర్మంగా వస్తుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు నామపజం. మీకు నచ్చిన దేవుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ జపిస్తూ ఉండడం వలన మనసు అదుపులోకి వస్తుంది. ఈ పద్దతుల వలన దమము, ఇంద్రియ నిగ్రహము అలవడతాయి. అయితే అన్నిటికంటే ముఖ్యం మన సంకల్పం. ఎన్ని చేసినా ఇంద్రియ నిగ్రహాన్ని, దమాన్ని అలవర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి.

To be continued...........

Surrender to Him - Ramana Maharshi

Surrender to Him and abide by His Will, whether He appears or disappears; await His pleasure. If you ask Him to do as you like it is not surrender but command to God. 

~ Sri Ramana Maharshi

Bhagavan continues: "You cannot have Him obey you and yet think you have surrendered. He knows what is best and when and how to do it. His is the burden. You have no longer any cares. All your cares are His. Such is surrender. That is bhakti." This essential passage is from Gems from Bhagavan ...

Sunday, 9 March 2014

మత మార్పిడులను అరికట్టాలి.

భారతదేశానికి హిందూ ధర్మానికి తేడా లేదు. భారతదేశనికి ఏదైనా గర్వకారణంగా చెప్పుకుంటే, దాని మూలం హిందూసంస్కృతిలోనే ఉంటుంది. హిందూ సంస్కృతిని పక్కనపెట్టి భారతదేశ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఒక్క విషయం కూడా చెప్పలేరు. సున్నాను కనుక్కుని ఆర్యబట్టుడైనా, ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞుడు శుశ్రుతుడైనా, మనం గొప్పగా చెప్పుకుంటున్న వారంతా హిందు విద్యావిధానంలో విద్యాభ్యాసం చేయడం వల్లనే, వేదవేదాంగాలను చదవడం వల్లనే అన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు. భారతదేశ వైభవమంతా హిందూ ధర్మంలోనే ఉంది.

హిందూధర్మాన్ని, తమ మాతృభూమి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం 800 ఏళ్ళుగా పొరాటం చేసిన ఘనత హిందువులకే దక్కుతుంది. మనం దేశం మీద పడ్డ అరబ్బులు ఎన్నో గ్రంధాలు తగలబెట్టినా, ఆంగ్లేయులు ఎన్ని ఆరచకాలకు పాల్పడినా హిందూ సమాజం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎంత మంది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, భారతదేశం ఏనాడు సంపూర్ణంగా విదేశియుల చేతిలోకి వెళ్ళలేదు. క్రైస్తవులైన ఆంగ్లేయులు అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్న రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి, దోపిడికి పాల్పడ్డారు, తమ మతప్రచారం చేసుకున్నారు. ఆప్రికా వెళ్ళారు, అక్కడ కూడా అదే పరిస్థితి. 'మొదటవారు వచ్చినప్పుడు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వారి చేతిలో బైబిలు ఉంది, రండి! కలిసి ప్రార్ధన చేద్దాం అన్నారు, అందరం కలిసి ప్రార్ధన చేశాం, కళ్ళు తెరిచి చూసేసరికి భూములు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళాయి, బైబులు మా చేతిలోకి వచ్చింది' అని ఆప్రికా వాళ్ళే చెప్పుకున్నారు. మన దేశంలోనూ అదే జరిగింది. అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి, వాటిని లాక్కుని, వారిని పీడించి, పేదలను చేసి, స్కాటిష్ మిషనరీ దళిత అన్ని పదాన్ని ప్రయోగించి, తమ చేత మోసగింపబడ్డవారిని దళితులనీ, వారి పేదరికానికి, దరిద్రానికి కారణం వారి మస్థులైన అగ్రవర్ణ హిందివులేననీ, హిందువుల్లో భేదాభిప్రాయాలను సృష్టించే ప్రయత్నం చేశారు. బూటకపు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని లేవదీసి, భారతీయుల్ని ఆత్మనూన్యతకు గురిచేసి, మతమార్పిడి చేసేందుకు కుట్రపన్నారు. అయినా అన్నిటిని తట్టుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

కానీ అప్పటికి సంతృపి చెందని విదేశీశక్తులు, దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, హిందు ధర్మాన్ని నాశనం చేయడానికి, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోడానికి, రాజ్యాధికారం పొంది భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఊతం మత మార్పిడిలే. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని మతమార్పిడి చేయాలని మిషనరీలు బహిరంగంగా టార్గెట్ పెట్టుకున్నాయి.

భారతీయులు, హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. దేశంలో జరుగుతున్న అక్రమ మతమార్పిడులను అడ్డుకోవాలి. ఇతర మతస్థుల మతాచరణను గౌరవిస్తూనే, వారినే ఆదరిస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తోటి హిందువులను రక్షించాలి. హిందువులు, జైనులు, సిక్కులు ఐక్యమవ్వాలి. భారతీయులైన మన ముస్లింలను, మన క్రైస్తవులను విదేశీ కుట్రల్లో పావులు కాకుండా కాపాడుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలంటే ప్రతి హిందువు హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల వారిని ఆదరించాలి.

హిందూ ధర్మం శాశ్వతంగా వర్ధిల్లాలి.

జై శ్రీ రాం
జై హిందూ

Saturday, 8 March 2014

హిందూ ధర్మం - 32

మనో నిగ్రహం గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసు్‌దేవ్ చెప్పిన కధ ఇది. (సాక్షిలో ప్రచురింపబడింది.)

చాలాకాలం కిందట, ఒకాయన లోకాతీత శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు,’ అని సలహా ఇచ్చాడు.

ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు. హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, ‘మీరెక్కడి నుంచి వచ్చారు?’ అని ఎవరూ అడగరు. అది మిమ్మల్ని పట్టించుకోకపోవటం కాదు. వారి జీవితం మొత్తం ‘నేను ఎవరు?’ అనే విషయం తెలుసుకోవడం గురించే. అందువల్ల కొత్తగా వచ్చినవారిని అలా ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదనేది వారి ఉద్దేశం. అందుకే అక్కడెవ్వరూ ఆయనతో మాట్లాడలేదు. ఎవ్వరూ ఆయన్ని తినమని కూడా అడగలేదు. భోజనం టైమ్‌లో ఒక గంట మోగుతుంది. కావలసినవారు భోంచేయొచ్చు. మీరు భోజనం చేయకపోతే గనక, దానికి కూడా అక్కడ ఎంతో ఆదరణ! బౌద్ధ ధర్మంలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆయన మరింత ఇబ్బందిపడ్డాడు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు... ఇక ఆకలి తట్టుకోలేక వెళ్లి భోజనం చేసేశాడు. మొత్తానికి అక్కడే ఉన్నాడు. మూడు వారాలు గడిచాయి. చివరకు ఒక ముసలి సన్యాసి ఆయన్ని పిలిచాడు.

‘‘నీకు ఈ అతీంద్రియ శక్తులతో ఏం పని? అవి వద్దు కానీ నీకు ధ్యానం నేర్పుతా. దానితో నీవొక సఫలమైన జీవనం గడపగలవు’’ అన్నాడు.
కానీ మనవాడు ‘‘కాదు, నాకు అతీంద్రియ శక్తులే కావాలి’’ అన్నాడు.

గత్యంతరం లేక, ‘‘సరే! రేపు తెల్లవారుఝామున నాలుగ్గంటలకు చన్నీళ్ల స్నానం చేసి రమ్మ’’న్నాడు.
టిబెట్‌లో ఉష్ణోగ్రతలెప్పుడూ మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. అయినా మనవాడు చన్నీటి స్నానం చేసి ఆయన ముందుకు వెళ్లి కూర్చున్నాడు.

ఆ సన్యాసి, ‘‘నీకు మూడు రహస్య మంత్రాలు నేర్పుతాను; బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ మూడు మంత్రాలనూ మూడుసార్లు ఉచ్ఛరిస్తే గనక అతీంద్రియ శక్తులన్నీ నీవే. కానీ మంత్రాలు జపించేటప్పుడు నువ్వు కోతుల్ని మాత్రం తలుచుకోకూడదు’’ అన్నాడు.

మనవాడు సంతోషంతో గంతులేసుకుంటూ బయటకు వచ్చాడు. ‘ఈ తెలివితక్కువ సన్యాసి నాకు రహస్యాలన్నీ చెప్పేశాడు. గురుదక్షిణ కూడా అడగలేదు. కేవలం కోతులను గుర్తుపెట్టుకోవద్దని మాత్రం చెప్పాడు. వాటితో నాకేం పని? అసలు వాటిని చూసి కూడా ఎన్నో యేళ్లయింది’ అనుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

తెల్లవారి, చన్నీటి స్నానం చేసి కూర్చున్నాక... బుద్ధం - కోతి! మళ్లీ చన్నీటి స్నానం చేసి వచ్చి, బుద్ధం - కోతి! బుద్ధం- మళ్లీ కోతి! ఆయన సాంతం - ‘బు’ అనకముందే మనసులోకి కోతులు వచ్చేస్తున్నాయి. ఒకవారం తీవ్ర సాధన తరువాత ఏ స్థితికి వచ్చాడంటే, ఆయన ఏమీ ఆలోచించకముందే మనసంతా ఎప్పుడూ కోతులే! ఈ అవస్థ పడలేక తిరిగి టిబెట్ వెళ్లి, ఆ బౌద్ధ సన్యాసితో, ‘‘నాకు అతీంద్రియ శక్తులేమీ అక్కర్లేదు. ముందు నా బుర్రలోంచి ఈ కోతుల్ని తీసేయండి’’ అని వేడుకున్నాడు.

చెప్పొచ్చేదేమిటంటే మనసు ఇలాగే ఉంటుంది. ‘ఏదైనా వద్దు’ అన్న మరుక్షణం నుంచీ ఇక మనసు అదే పనిచేస్తుంది. అందువల్ల మీరు మథనపడవద్దు. మీరు చూసినది మీ మనసులో వెనక ఎక్కడో ఉంది. దాన్ని అలా ఉండనిచ్చి, ఈ క్షణాన మీరు ఏం చేయాల్సివుందో అది చేయండి. మీరు ఒక ఆలోచనలో పూర్తిగా మునిగిపోతే, మిగిలినవన్నీ వాటంతటవే మాయమైపోతాయి. అలాకాకుండా ముందు ఫలానాదాన్ని తొలగించాలని పంతంతో కూర్చుంటే, అది ఎప్పటికీ జరగదు. జరగకపోగా దాన్ని వదిలించుకోవడమే మీ పూర్తిస్థాయి వ్యాపకం అయిపోతుంది!

- సద్గురు జగ్గీ వాసుదేవ్

- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=61113&Categoryid=10&subcatid=34#sthash.lmTxhAim.dpuf

Friday, 7 March 2014

హిందూ ధర్మం - 31

మనలో చాలామంది మాములుగా రోడ్డు మీద నడుస్తున్న సమయంలో ఒక సన్నివేశం చూసే ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి తమ పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వస్తాడు. కుక్క బాగా బలిష్టంగా ఉంటుంది, దానికి గట్టి గొలుసు కట్టేస్తాడు, చేతిలో కర్ర పట్టుకుంటాడు, అయినా కుక్క వీడి మాట వినదు. అది ఎటు పరిగెడితే, వీడు అటే పరిగెడతాడు. నిజానికి వీడు కుక్కను తిసుకుని వాకింగ్‌కు రావడం కాదు, కుక్కనే వీడిని తీసుకుని వాకింగ్‌కు వచ్చింది.

వేరొకడు బలహీనంగా ఉన్నా, బలిష్టమైన తన కుక్కతో వాకింగ్‌కు వస్తాడు. ఆ కుక్క రూపం చూస్తునే, భయంతో పరుగులు తీసేలా బండలా ఉంటుంది. దానికి గొలుసు కట్టడు, చేతిలో కర్ర ఉండదు, దాన్ని అదుపు చేయాలన్న ఆందోళన ఉండదు. అది వాడి వెనుకే నడుస్తుంది. ఎవరిని ఏమి అనదు.

ఈ రెండు పరిస్థుతుల్లో మొదటి పరిస్థితి ఇంద్రియాల మీద అదుపు లేనివాడి పరిస్థితికి ఏ మాత్రం భిన్నమైంది కాదు. రెండవవాడి పరిస్థితి ఇంద్రియ నిగ్రహం, దమము ఉన్నవడి స్థితి. మనసు మనకంటే శక్తివంతమైంది ఏం కాదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. మనం దాన్ని అదుపు చేయచ్చు, చేయాలి కూడా. అది కోరిందల్లా ఇచ్చి, దానికి పూర్తి స్వాతంత్రయాన్ని ఇస్తే, అది మనలని ఆడిస్తుంది.

చాలా మంది అనుకుంటారు, ఈ ఒక్కసారి మనసు కోరింది ఇచ్చేద్దాం, మరోసరి నిగ్రహించుకుందాం అని. అది అసాధ్యం. మీరు ఎన్ని కోరికలు తీర్చుకుంటే, మనసు అన్ని కోరికలు మళ్ళీ కోరుతుంది. అందువల్ల మనసును అదుపు చేయాలి.

కానీ మనసును అదుపులోకి తెచ్చుకోవడం అంత సులువేమి కాదు, మనసు మనం చెప్పిన మాట వినదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా మనసు పట్టు సాధించడానికి పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

To be continued........... 

Thursday, 6 March 2014

హిందూ ధర్మం - 30

ఉదాహరణకు ఒక విదార్ధికి పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఆందోళన మొదలైందనుకుందాం. ఆ క్షణమే అతని మనసులోకి ప్రకృతిలో ఇంతకముందు అనేక మంది విద్యార్ధులు ఆందోళన పడినప్పుడు ఉత్పన్నమైన తరంగాలు అతడిని బంధిస్తాయి. వెంటనే అతని ఆందోళన ఇంకా పెరుగుతుంది. అది తీవ్రమైనప్పుడు, అతడి మనసు అదుపుతప్పి, చదివింది గుర్తురాన్నివకుండా చేసి, పరీక్షలో ఫెయిల్ అయ్యేలా చెయ్యచ్చు.రోగి విషయంలోనూ అంతే.

మన గురించి మనం అల్పంగా, నీచంగా భావించడమే పాపం. నేను ఎందుకు పనికిరాను, నేను బలహీనుడిని, నాకు ఏమీ రావు అని అనుకోవడం, ఆత్మనూన్యతకు లొనవడమే పాపం. అటువంటి ఆలోచనలను నిరోధించడమే దమము.

పాపం అన్నది చేయనవసరంలేదు, మనసులో భావించినా చాలు, పాపం చేసినట్టే అంటుంది ధర్మం.

When the mind is vacant, evil thoughts enter. Evil thinking is the beginning point of adultery. Through a lustful look only, you have already committed adultery. Mental actions are real actions. God judges a man by his motives. Worldly people judge a man by his external physical actions ......................- Swami Sivananda. 

స్వామి శివానందగారు ఈ విధంగా అంటారు. "ఖాళీ మనసులోకి చెడు ఆలోచనలు ప్రవేశిస్తాయి. చెడు ఆలోచనలు చేయడమే పాపానికి మొదటిమెట్టు. తీవ్రమైన కామపూరిత దృష్టితో చూసిననతమాత్రమునే నీవు వ్యభిచారానికి పాల్పడ్డావు. మానసిక చర్యలే నిజమైన చర్యలు. మానవుడి ఉద్దేశాలను బట్టి అతడు ఏలాంటివాడనేది దేవుడు నిర్ణయిస్తాడు. ప్రాపంచిక ప్రజలు మనిషిని అతడి బాయ చర్యల ద్వారా నిర్ధారిస్తారు ..................................."

ఉదాహరణకు ఒకరి గురించి చెడుగా మాట్లాడటం, ఒకరిపై నిందలు వేయడం నేరం, పాపం. మీరు ఒకరి గురించి చెడుగా మాట్లాడవలసిన అవరసంలేదు, వాళ్ళ గురించి మీ మనసులో చెడుగా భావించినా, అది కూడా పాపమే అంటుంది ధర్మం. ఎందుకంటే ఆలోచనలే ప్రవర్తనకు ఆధారం. మీరు ఏ విధంగా ఆలోచిస్తారో, అదే విధంగా ప్రవర్తిస్తారు. వెళ్ళకూడని ప్రదేశాలకు బాహ్యంగా వెళ్ళకున్నా, మనసులో వెళ్ళినట్టు భావన చేస్తే, అక్కడ కూడా పాపం పడుతుంది. మంచికి కూడా ఇది అన్వయం అవుతుంది. మీరు దేవాలయానికి నడుచుకుంటూ వెళ్ళలేకపోయినా, మనసులో దేవాలయానికి వెళ్ళినట్టు భావన చేస్తే, అప్పుడు కూడా పుణ్యం పడుతుంది.

To be continued...........

Published: 06-March-2014
1st Edit: 13-April-2015

Wednesday, 5 March 2014

హిందూ ధర్మం - 29

కాంతి అంతరిక్షంలో ఒక వస్తువును చేరుటకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తుందో, అదే విధంగా మనసును నుంచి ఉద్భవించిన ఆలోచనా తరంగాలు కూడా ఆ ఫ్రిక్వెన్సీకి చెందిన వేరే మనసును చేరే వరకు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణిస్తాయి. ఈ ప్రకృతి అంతా మంచి, చెడు ఆలోచనా తరంగాలతో నిండి పోయి ఉంది. మనసు కూడా రేడియో వంటిది. రేడియోని ఒక నిర్డేశిత ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసినప్పుడు అది ఏ విధంగానైతే గాలి ఉన్నా ఆ ఫ్రీక్వెన్సి తరంగాలనే గ్రహిస్తుందో, అదే విధంగా మనసు కూడా ప్రకృతిలో స్థిరమైన ఉన్న ఆయా ఆలోచనా తరంగాలను గ్రహిస్తుంది. దాని అనుసరించే వ్యక్తి యొక్క ప్రవర్తన ఉంటుంది.

ప్రతి ఒక్కరి మనసు నుంచి ఉద్భవించిన ఆలోచన వేరే వస్తువును చేరే వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడు ప్రకృతిలో ఉన్న ఈ ఆలోచన తరంగాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక వేళ ఎవరైనా ఒక వ్యక్తి, చెడు ఆలోచన చేస్తే చాలు, అతని మనసును అతను ఆ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసి పెడుతున్నాడన్నమాట. అటువంటి ఆలోచన కలిగిన మరుక్షణమే అంతా వ్యాపించి ఉన్న చెడు ఆలోచనా తరంగాలు అతడిని చుట్టుముట్టి అతని మనసులోకి చొచ్చుకుపోవడానికి పోరాటం చేస్తాయి. అందుకే చెడ్డవ్యక్తి రోజు రోజుకు మరింత దుర్మార్గుడిగా మారిపోతాడు. అతని చర్యలు మరింత శక్తివంతం అవుతాయి. పెద్ద వినాశకారిగా తయారవుతాడు. అదే తరహాలో మంచివ్యక్తి జీవితం కూడా ఉంటుంది. అతని మనసు ఎప్పుడూ మంచి ఆలోచనా తరంగాలను గ్రహించడానికే సిద్ధంగా ఉంటుంది, కనుక అతను మరింత మంచివాడిగా మారుతాడు.

రెండవ విషయం మనం చెడుగా ఆలోచిస్తే, మన ఆలోచనలు కూడా ప్రకృతిలో కొన్ని వందల ఏళ్ళవరకు నిలిచిపోతాయి. వేరే వ్యక్తి అటువంటి ఆలోచనలు చేసినప్పుడు వడి మనౌస్ను ఆవహించి, వాడిని తప్పు దారి పట్టిస్తాయి. అంటే మనం చెడు, అసభ్య, అశ్లీల, ఆత్మనూన్యత భావంతో, బాధతో, విచారంతో చేసే ప్రతి ఆలోచనలు కొన్ని వందల మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం మనకు హానీ చేసుకోవడమే కాక లోకానికి పెద్ద అపకారం చేస్తున్నాం. మనం మంచి ఆలోచనలు చేస్తే, మంచి యొక్క శక్తి సమాజంలో పెరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం మన ఆలోచనలే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అందుకే ధర్మం మీ మనసును నిగ్రహించండి, చెడుగా ఆలోచించకండి, అంటూ, దమాన్ని అలవాటు చేసుకోమంటుంది.

To be continued...........

Tuesday, 4 March 2014

హిందూ ధర్మం - 28

ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా మనసు చూస్తోంది. మీరు పాపం చేయాలన్నా, పుణ్యం చేయాలన్నా, దానికి ఆధారం మనసే. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఇక్కడున్న మనసు మరొక క్షణంలో వేరొక చోట ఉంటుంది. మనసుది చంచల స్వభావం అంటే ఒక చోట కుదురుగా ఉండదు. #దమము అంటే మనసును పాప కార్యాల నుంచి, అధర్మం నుంచి నిగ్రహించడం, అంటే కంట్రోల్ చేయడం, ట్రెయిన్ చేయడం. అసలు మనసును ట్రయిన్ చేయడమెందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

స్వామి వివేకానందులు ఇలా చెప్తారు. మనం చేసిన ప్రతి పనికి మనం ప్రతి ఫలం ఏ విధంగా అనుభవిస్తామో, అదే విధంగా మనం చేస్తున్న ఆలోచనలు కూడ మన మీద, సమాజం మీదా ప్రభావం చూపిస్తాయి, తిరిగి ప్రతిచర్య (Reaction) గ్రహిస్తాయి. మనం గమనిస్తే, ఒక వ్యక్తి చెడు పనులకు అలవాటు పడితే, రోజురోజుకు మరింత చెడ్డవాడిగా మారిపోతున్నాడు, అతను మంచి పనులు చేయడం మొదలుపెడితే, మరింత మంచివాడిగా మారిపోతున్నాడు. ఎందుకు?

నేను ఒక పని చేస్తున్నామంటే, నా మనసు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. దాని నుండి కొన్నిvibrations  ఉద్భవిస్తాయి. ప్రపంచంలో నా మానసిక స్థితికి సమానమైన స్థితిలో వేరే ఏ ఇతర వ్యక్తులు మనసులు ఉంటాయో, వారి ఆలోచనలతో నా మనసు ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గదిలో అనేక సంగీత వాయిద్యాలను ఒకే రకంగా ట్యూన్ చేసి పెట్టి, అందులో ఏ ఒక్క సంగీత వాయిద్యాన్నైనా ఒక ప్రత్యేక రాగంతో మ్రోగిస్తే, మిగితా అన్ని సంగీత పరికరాలు ఎవరు మ్రోగించకుండానే, అదే విధమైన రాగంతో శబ్దం చేస్తాయి. దీని గురించి ఫిజికల్ సైన్సు చెబుతుంది.

అదే విధంగా ఒకే స్థితిలో ఉన్న వివిధ మనసులు, ఒకే ఆలోచనతో సమానంగా ప్రభావితం అవుతాయి. నేను ఒక చెడుపని చేస్తుంటే, నా మనసులో కొన్ని తరంగాలు(vibrations) ఏర్పడతాయి, అవి ప్రపంచంలో నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై ప్రభావం చూపుతుంది. దాంతో వారు కూడా చెడు పనులు అధికంగా చేస్తారు. నేను మంచి పని చేస్తే, నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై దాని ప్రభావం పడి, వారు కూడా మంచి పనులు చేస్తారు. అట్లాగే వారి మానసిక స్థితి మన మనసుపై అదే విధమైన ప్రభావం చూపిస్తుంది. అంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన మనసు మంచి Vibrationsను గ్రహించి, మనం మంచివారిగా మారుతాం. అదే చెడుగా ఉంటే, చెడ్డవారిగా మారుతాం. అందుకే మన ఋషులు మనసును చెడు ఆలోచనల నుంచి నిగ్రహించండి అన్నారు.

To be continued...........

Monday, 3 March 2014

హిందూ ధర్మం - 27

మన సంస్కృతిలో జీవితంలో ఒక్కసారి వివాహం అయిందంటే, ఇక మళ్ళీ విడిపోవడం ఉండదు, విడాకులు మనం పెట్టుకున్న పద్ధతి కానీ, ధర్మంలో లేదు. సుఖమయినా, దుఃఖమైన, కష్టమైనా, నష్టమైనా, అన్నీ జీవిత భాగస్వామితోనే. మన దగ్గర వివాహం విషయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సారీరిక సంబంధం కాదు, అది ఆత్మానుబంధం. జన్మజన్మలకు అదే వ్యక్తిని తప్ప, వేరే వ్యక్తిని తన జీవితభాగస్వామిగా ఎవరు కనీసం ఊహించుకోరు కూడా. భారతీయ సంస్కృతిలో ఒక వ్యక్తిక, తాను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న వ్యక్రి (జీవిత భాగస్వామి)తో తప్ప వేరెవరితోనూ శారీరిక సంబంధం (సెక్స్) కలిగి ఉండకూడదు. అట్లాగే వివాహానికి ముందు కూడా అటువంటి సంబంధాలు ఎవరితోనూ ఉండకూడదు. దాన్ని ధర్మం ఒప్పుకోదు. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దాని వల్ల పరబ్రహ్మం యొక్క దర్శనం కలుగుతుంది, జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు. బ్రహ్మచర్యాన్ని సక్రమంగా పటించావారికి దేవతలు కూడా శిరసు వంచి నమస్కరిస్తారు. ధర్మం అట్లాగే చెబుతుంది.

పాశ్చ్యాతుల సంస్కృతి వేరు. వారికి వివాహం అన్న సంస్కారం ఒకటి లేదు. మనలాగా వావివరుసులు తక్కువ. పరదేశస్థులకు ఇద్దరి మధ్య ఉన్నది ఒక ఒప్పదం మాత్రమే. కేవలం శరీర సంబంధం మాత్రమే. అధిక శాతం వారు కలిసి జీవించేది శారీరికమైన సుఖం కోసమే. అది వాళ్ళ విషయం.

మనమే చేస్తున్నాం? గొప్పదైన మన సంస్కృతిని వదిలేసుకుని, వాళ్ళ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాం. మెల్లమెల్లగా మనకూ, వారికి మధ్య తేడాను చెరిపేస్తున్నాం. విచ్చలవీడిగా తిరిగేస్తున్నాం, తొందరపడి తప్పు చేస్తున్నాం. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడేం తెలియదు, కొంత వయసు పైబడ్డాక అప్పుడు అర్ధమవుతుంది ఏం కోల్పోయామో. కొన్ని ప్రకటనలు చూస్తే, 'మీ జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉండండి. లేనిపక్షంలో, తప్పు చేస్తే సురక్షితంగా చేయండి్' అని ఉంటాయి. ఏంటండి ఇది? ఒకేఒక్క ప్రశ్న వేసుకోండి? అసలు మనం తప్పు చేయడమెందుకు?  ధర్మం అంటుంది మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. క్షణికమైన సుఖ్ల కోసం, ఆవేశపడి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. అదే ఇంద్రియ నిగ్రహం.

To be continued...........

Sunday, 2 March 2014

హిందూ ధర్మం - 26

మీరు తినే ఆహారం మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీరు రోజూ బాగా మసాల కలిసిన ఆహారం తీసుకున్నా, మాంసాహారం తిన్నా, మత్తు పదార్ధాలు స్వీకరించినా, మీ బుద్ధి మందగిస్తుంది, మీ శరీరం వాటికి బానిస అయిపోతుంది. ఇక సిగిరెట్లు, మద్యపానం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. బయట అమ్మే ఆహారం రోజు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా మనం తినేస్తాం. వాటిని మానేయమంటే ప్రాణం పొయినంతగా బాధ పడిపోతాం. మీకు భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఏవి హాని చేస్తున్నాయి వాటికి దూరంగా మీ ఇంద్రియాలను ఉంచండి. దాన్నే ఇంద్రియ నిగ్రహం అన్నారు.

మీ నాలుక పిచ్చి తిండ్లకు రుచి మరిగి ఉంటుంది. అలా అని దానికి అవే అందిస్తే, మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కనుక మీ మనసు కోరినా, మెల్లమెల్లగా అటువంటి దురలవాట్లను తగ్గించుకోండి. మీ హానీ చేసే వాటి నుంచి దూరమవ్వండి. క్షణికమైన సుఖం కోసం, మీ శక్తిని వృధా చేయకండి. సిగిరెట్టు తాగడం వలన మీకు తాత్కాలికమైన ప్రశాంతత వస్తుంది, దాన్నే క్షణికమైన సుఖం అన్నారు. అంతమాత్రాన సిగిరెట్టు మంచిదా? కాదు కదా. అది మనలని దానికి బానిసలుగా చేసుకుంటుంది. మద్యపానం కూడా అంతే. ఇది ఫ్యాషన్ అంటూ సమర్దించుకోకండి.

మిమల్ని ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ ఏవి బలహీనపరుస్తాయో, ఏవి పతన చేస్తాయో, వాటికి దూరంగా ఉండడమే ఇంద్రియ నిగ్రహం. ధర్మం అంటే కేవలం దేవుడి గురించి చెప్తుందనుకోకండి. ధర్మం మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. మనం ఎలా బ్రతకాలో చెప్తుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం ధర్మంలో ఒక భాగం.

To be continued...........

Saturday, 1 March 2014

హిందూ ధర్మం - 25

లోకంలో విషయాలను ఇంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుంది. ఇంద్రియాలే మనసుకు ఇన్‌పుట్ అందిస్తాయి. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, తినకూడనివి తినడం, మాట్లాడకూడనివి మాట్లాడటం, మాట్లాడవలసిన అవసరం ఉన్న చోట మౌనంగా ఉండడం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం, చేయకూడనివి చెయ్యటం, చేయాల్సినవి చేయకపోవడమే పాపమంటే. ఇంద్రియాల ద్వారానే మనసుకు ఆహారం అందుతుంది. ఆహారం అంటే ఇక్కడ లోకంలో విషయాల జ్ఞానం అని అర్ధం.

ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాం. ఎవరో అసభ్యకరమైన మాటలు ముచ్చటించుకుంటున్న సమయంలో చెవులు వాటిని వినడానికే ఆసక్తి చూపుతాయి. లేదు అశ్లీలకర సన్నివేశాలు, మనసును రెచ్చగొట్టే సన్నివేశాలు చూడటానికే కళ్ళు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తాయి. ఇవన్నీ పాపపు పనులే కదా. ఇవన్నీ మనసుకు ఇన్‌పుట్‌ను అందిస్తాయి. మీ మనసుకు అందిన  సమాచారాన్ని అనుసరించే, మీ ప్రవర్తన ఉంటుంది. ఇన్‌పుట్‌ను బట్టే ఔట్‌పుట్ కూడా ఉంటుంది కదా. మనం చూసే, వినే, చదివే ప్రతి విషయమూ మన మనసుపై చెరగని ముద్ర వేస్తుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. మన ప్రవర్తన మీద దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

మీకెప్పుడు క్రైంవాచ్ ప్రాగ్రాంలు, హింస ఉండే సన్నివేశాలు చూస్తే, మనలో మనకు తెలియకుండానే నేరపూరిత లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఒక నేరం జరిగినప్పుడు. అది ఏలా జరిగిందో, ఆ సన్నివేశాలను చూపించడం అనవసరం, అసలు అలా చూపించకూడదని, అది సమాజంలో నేరాల సంఖ్యను పెంచుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు సీరియల్స్ కూడా ఇందుకు భిన్నం ఏమి కాదు.

ధర్మం కూడా అదే అంటొంది. మీ మనసుకు మంచి విషయాలనే అందించండి. చెడు విషయాలను, అసభ్యకరమైన, అశ్లీలకరమైన అంశాలను నుంచి మీ ఇంద్రియాలను వెనక్కు తీసుకోండి. అంటే చెడు విషయాలు చూడాలని ఉన్నా, అక్కడి నుంచి మొదట మీ దృష్టిని మళ్ళించండి, చెడ్డ మటలను వినకుండా మీ చెవులను మంచి విషయాలను వినేలా చేసుకోండి. ఇలా ప్రతి విషయంలోనూ, మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి, వెనక్కు లాగండి. అదే ఇంద్రియ నిగ్రహము.

To be continued...........