Showing posts with label ఇంద్రియ నిగ్రహం. Show all posts
Showing posts with label ఇంద్రియ నిగ్రహం. Show all posts

Monday, 10 March 2014

హిందూ ధర్మం - 33 (మనో నియంత్రణకు మార్గాలు)

ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో, మెనెజ్‌మెంట్ కోర్సుల్లో ఇతరులను మెనెజ్ చేయడం ఎలాగో నేర్పిస్తారు. కానీ భారతీయ సంస్కృతి, తనను తాను అదుపు చేసుకోవడం, తనను తాను మెనెజ్ చేసుకోవడం నేర్పుతుంది. తనను తాను అదుపు చేసుకోలేనివాడు, ప్రపంచాన్ని ఎలా మెనెజ్ చేయగలడని ప్రశ్నిస్తుంది. మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా మనల్ని మనం ఎలా మెనెజ్ చేసుకోవాలో నేర్పిస్తాయి. దేవుంద్రుడిని జయించిండం గొప్ప కాదయ్యా, నీ మనసును గెలవడమే గొప్ప అని ఘోషిస్తాయి. మనసును ఎలా గెలవాలో, మార్గం చూపిస్తాయి.

మనకు (ఆత్మకు), శరీరానికి మధ్య వారధి ఊపిరి. ఊపిరి ఆగిన మరిక్షణం జీవితం ముగిసిపోతుంది. మనసు, దాని ఆలోచన సరళి మనం తీసే ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆవేశానికి, కోపానికి గురైనప్పుడు ఊపిరి వేగం పెరుగుతుంది. ఆనందం, విచారం, సుఖం, దుఃఖం మొదలైన సందర్భాలలో ఊపిరి తీయడంలో మార్పులు సంభవిస్తాయి. అందువల్ల మనసును నిగ్రహించాలంటే ఊపిరిని అదుపు చేయాలి. అదుపు చేయడం అంటే ముక్కు మూసుకోమని కాదు. ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే ప్రాణమును (వాయువును) నియంత్రిచడం. ప్రాణాయామం తెలిసిన గురువు దగ్గరే ఈ విద్య నేర్చుకుని చేయాలి, అంతేకానీ ప్రాణాయామ విషయంలో సొంత ప్రయోగాలు పనికిరావు.

ఇక మనసును, ఇంద్రియాలను అదుపు చేయగల వాటిలో ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేయడం వలన మనసుకు నిలకడ వస్తుంది. ఈ రోజు రకరకాల ధ్యాన ప్రక్రియలను అనేక మంది గురువులు భోషితున్నారు. 20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన గొప్ప గురువు భగవాన్ రమణ మహర్షి. ఆయన ఒకానొక యోగ ప్రక్రియ గురించ్ చెబుతూ, మీ శ్వాసను గమనించండి అన్నారు. ఊపిరిని అదుపు చేయవలసిన అవసరం లేదు. మీరు నిత్యం గాలి తీసుకుని వదిలిపెడుతూనే ఉన్నారు. దాన్ని కేవలం గమనించండి. మహషి చెప్పిన ఈ విధానం వలన మనసు ఆత్మలో ఐక్యం అవుతుంది. బయటి వస్తువులతో సంబంధం కోల్పోతుంది. దీనికి దేశకాల నియమం లేదు.  

మూడవది మనసును అదుపు చేయాలంటే యోగా చేయాలి. యోగాసనాలు మనసును, ఇంద్రియాలను అదుపు చేస్తాయి. శ్రద్ధను పెంచుతుంది. యోగా కూడా ఈ విద్య తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం. అప్పుడే సక్ర్మంగా వస్తుంది, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు నామపజం. మీకు నచ్చిన దేవుడి నామాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ జపిస్తూ ఉండడం వలన మనసు అదుపులోకి వస్తుంది. ఈ పద్దతుల వలన దమము, ఇంద్రియ నిగ్రహము అలవడతాయి. అయితే అన్నిటికంటే ముఖ్యం మన సంకల్పం. ఎన్ని చేసినా ఇంద్రియ నిగ్రహాన్ని, దమాన్ని అలవర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలి.

To be continued...........

Monday, 3 March 2014

హిందూ ధర్మం - 27

మన సంస్కృతిలో జీవితంలో ఒక్కసారి వివాహం అయిందంటే, ఇక మళ్ళీ విడిపోవడం ఉండదు, విడాకులు మనం పెట్టుకున్న పద్ధతి కానీ, ధర్మంలో లేదు. సుఖమయినా, దుఃఖమైన, కష్టమైనా, నష్టమైనా, అన్నీ జీవిత భాగస్వామితోనే. మన దగ్గర వివాహం విషయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సారీరిక సంబంధం కాదు, అది ఆత్మానుబంధం. జన్మజన్మలకు అదే వ్యక్తిని తప్ప, వేరే వ్యక్తిని తన జీవితభాగస్వామిగా ఎవరు కనీసం ఊహించుకోరు కూడా. భారతీయ సంస్కృతిలో ఒక వ్యక్తిక, తాను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న వ్యక్రి (జీవిత భాగస్వామి)తో తప్ప వేరెవరితోనూ శారీరిక సంబంధం (సెక్స్) కలిగి ఉండకూడదు. అట్లాగే వివాహానికి ముందు కూడా అటువంటి సంబంధాలు ఎవరితోనూ ఉండకూడదు. దాన్ని ధర్మం ఒప్పుకోదు. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దాని వల్ల పరబ్రహ్మం యొక్క దర్శనం కలుగుతుంది, జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు. బ్రహ్మచర్యాన్ని సక్రమంగా పటించావారికి దేవతలు కూడా శిరసు వంచి నమస్కరిస్తారు. ధర్మం అట్లాగే చెబుతుంది.

పాశ్చ్యాతుల సంస్కృతి వేరు. వారికి వివాహం అన్న సంస్కారం ఒకటి లేదు. మనలాగా వావివరుసులు తక్కువ. పరదేశస్థులకు ఇద్దరి మధ్య ఉన్నది ఒక ఒప్పదం మాత్రమే. కేవలం శరీర సంబంధం మాత్రమే. అధిక శాతం వారు కలిసి జీవించేది శారీరికమైన సుఖం కోసమే. అది వాళ్ళ విషయం.

మనమే చేస్తున్నాం? గొప్పదైన మన సంస్కృతిని వదిలేసుకుని, వాళ్ళ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాం. మెల్లమెల్లగా మనకూ, వారికి మధ్య తేడాను చెరిపేస్తున్నాం. విచ్చలవీడిగా తిరిగేస్తున్నాం, తొందరపడి తప్పు చేస్తున్నాం. బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడేం తెలియదు, కొంత వయసు పైబడ్డాక అప్పుడు అర్ధమవుతుంది ఏం కోల్పోయామో. కొన్ని ప్రకటనలు చూస్తే, 'మీ జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉండండి. లేనిపక్షంలో, తప్పు చేస్తే సురక్షితంగా చేయండి్' అని ఉంటాయి. ఏంటండి ఇది? ఒకేఒక్క ప్రశ్న వేసుకోండి? అసలు మనం తప్పు చేయడమెందుకు?  ధర్మం అంటుంది మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. క్షణికమైన సుఖ్ల కోసం, ఆవేశపడి, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి, మీ శక్తిని, సమయాన్ని వృధా చేసుకోకండి. అదే ఇంద్రియ నిగ్రహం.

To be continued...........

Sunday, 2 March 2014

హిందూ ధర్మం - 26

మీరు తినే ఆహారం మీ మనసుపై ప్రభావం చూపుతుంది. మీరు రోజూ బాగా మసాల కలిసిన ఆహారం తీసుకున్నా, మాంసాహారం తిన్నా, మత్తు పదార్ధాలు స్వీకరించినా, మీ బుద్ధి మందగిస్తుంది, మీ శరీరం వాటికి బానిస అయిపోతుంది. ఇక సిగిరెట్లు, మద్యపానం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. బయట అమ్మే ఆహారం రోజు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా మనం తినేస్తాం. వాటిని మానేయమంటే ప్రాణం పొయినంతగా బాధ పడిపోతాం. మీకు భౌతికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఏవి హాని చేస్తున్నాయి వాటికి దూరంగా మీ ఇంద్రియాలను ఉంచండి. దాన్నే ఇంద్రియ నిగ్రహం అన్నారు.

మీ నాలుక పిచ్చి తిండ్లకు రుచి మరిగి ఉంటుంది. అలా అని దానికి అవే అందిస్తే, మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కనుక మీ మనసు కోరినా, మెల్లమెల్లగా అటువంటి దురలవాట్లను తగ్గించుకోండి. మీ హానీ చేసే వాటి నుంచి దూరమవ్వండి. క్షణికమైన సుఖం కోసం, మీ శక్తిని వృధా చేయకండి. సిగిరెట్టు తాగడం వలన మీకు తాత్కాలికమైన ప్రశాంతత వస్తుంది, దాన్నే క్షణికమైన సుఖం అన్నారు. అంతమాత్రాన సిగిరెట్టు మంచిదా? కాదు కదా. అది మనలని దానికి బానిసలుగా చేసుకుంటుంది. మద్యపానం కూడా అంతే. ఇది ఫ్యాషన్ అంటూ సమర్దించుకోకండి.

మిమల్ని ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ ఏవి బలహీనపరుస్తాయో, ఏవి పతన చేస్తాయో, వాటికి దూరంగా ఉండడమే ఇంద్రియ నిగ్రహం. ధర్మం అంటే కేవలం దేవుడి గురించి చెప్తుందనుకోకండి. ధర్మం మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. మనం ఎలా బ్రతకాలో చెప్తుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం ధర్మంలో ఒక భాగం.

To be continued...........

Saturday, 1 March 2014

హిందూ ధర్మం - 25

లోకంలో విషయాలను ఇంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుంది. ఇంద్రియాలే మనసుకు ఇన్‌పుట్ అందిస్తాయి. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, తినకూడనివి తినడం, మాట్లాడకూడనివి మాట్లాడటం, మాట్లాడవలసిన అవసరం ఉన్న చోట మౌనంగా ఉండడం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం, చేయకూడనివి చెయ్యటం, చేయాల్సినవి చేయకపోవడమే పాపమంటే. ఇంద్రియాల ద్వారానే మనసుకు ఆహారం అందుతుంది. ఆహారం అంటే ఇక్కడ లోకంలో విషయాల జ్ఞానం అని అర్ధం.

ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాం. ఎవరో అసభ్యకరమైన మాటలు ముచ్చటించుకుంటున్న సమయంలో చెవులు వాటిని వినడానికే ఆసక్తి చూపుతాయి. లేదు అశ్లీలకర సన్నివేశాలు, మనసును రెచ్చగొట్టే సన్నివేశాలు చూడటానికే కళ్ళు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తాయి. ఇవన్నీ పాపపు పనులే కదా. ఇవన్నీ మనసుకు ఇన్‌పుట్‌ను అందిస్తాయి. మీ మనసుకు అందిన  సమాచారాన్ని అనుసరించే, మీ ప్రవర్తన ఉంటుంది. ఇన్‌పుట్‌ను బట్టే ఔట్‌పుట్ కూడా ఉంటుంది కదా. మనం చూసే, వినే, చదివే ప్రతి విషయమూ మన మనసుపై చెరగని ముద్ర వేస్తుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. మన ప్రవర్తన మీద దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

మీకెప్పుడు క్రైంవాచ్ ప్రాగ్రాంలు, హింస ఉండే సన్నివేశాలు చూస్తే, మనలో మనకు తెలియకుండానే నేరపూరిత లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఒక నేరం జరిగినప్పుడు. అది ఏలా జరిగిందో, ఆ సన్నివేశాలను చూపించడం అనవసరం, అసలు అలా చూపించకూడదని, అది సమాజంలో నేరాల సంఖ్యను పెంచుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు సీరియల్స్ కూడా ఇందుకు భిన్నం ఏమి కాదు.

ధర్మం కూడా అదే అంటొంది. మీ మనసుకు మంచి విషయాలనే అందించండి. చెడు విషయాలను, అసభ్యకరమైన, అశ్లీలకరమైన అంశాలను నుంచి మీ ఇంద్రియాలను వెనక్కు తీసుకోండి. అంటే చెడు విషయాలు చూడాలని ఉన్నా, అక్కడి నుంచి మొదట మీ దృష్టిని మళ్ళించండి, చెడ్డ మటలను వినకుండా మీ చెవులను మంచి విషయాలను వినేలా చేసుకోండి. ఇలా ప్రతి విషయంలోనూ, మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి, వెనక్కు లాగండి. అదే ఇంద్రియ నిగ్రహము.

To be continued...........

Friday, 28 February 2014

హిందూ ధర్మం - 24

ఇంద్రియాలకు మనసుకు సంబంధం ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడంలో, అనుభూతి చెందడంలో ఉపయోగపడితే, మిగితా 5 కర్మేంద్రియాల ద్వారా మనిషి ప్రపంచంలోకి సంకేతాలను పంపుతాడు, వివిధ పనులు చేస్తాడు. ఒక వస్తువును మీ కళ్ళతో చూస్తున్నారంటే, మీ నయనేంద్రియం (కన్ను) ద్వారా మీరు చూస్తున్న విషయం, మీ మనసుకు చేరుతుంది. మీరు మంచి పాట వినడం అంటే, మీ కర్ణేంద్రియం (చెవి) ద్వారా, ఆ విషయం మీ మనసుకు చేరుతోందని కదా. అదే మీరు మాట్లాడుతున్నారంటే, మీ వాక్కు ద్వారా మీ మనసు ఈ ప్రపంచంలోకి కొన్ని ఆలోచనలను పంపుతోంది. జ్ఞానేంద్రియాల ద్వారా మనసు విషయాలను గ్రహిస్తే, కర్మేయింద్రియాల ద్వారా ప్రపంచం మీ మనసులో విషయాన్ని హ్రగిస్తుంది. అందుకే జ్ఞానేంద్రియాలు శరీరానికి ప్రవేశ ద్వారాలయితే, కర్మేంద్రియాలు బయటకు వెళ్ళే మార్గాలు అంటారు స్వామి పరమార్ధానంద సరస్వతీ. సులభంగా చెప్పుకుంటే, జ్ఞానేద్రియాల ద్వారా లోపలికి తీసుకుంటున్నారు, కర్మేంద్రియాల ద్వారా బయటకు సంకేతాలను పంపుతున్నారు, కర్మ చేస్తున్నారు.

To be continued...........

Friday, 21 February 2014

హిందూ ధర్మం - 23

మనసును పాప కార్యాల నుంచి, శాస్త్రవిరుద్ధమైన జీవనం నుంచి, నిషిద్ధకర్మల నుంచి వెనక్కు మళ్ళించడం, నిగ్రహించడం, నిరోధించడం దమము. దమం గురించి అర్ధమవ్వాలంటే, ధర్మంలో వెరొక లక్షణమైన ఇంద్రియ నిగ్రహం గురించి తెలిసి ఉండాలి.

4. ఇంద్రియ నిగ్రహం: ఇంద్రియాలను అదుపు చేసుకోవడం. ఇంద్రియాలంటే మనసుకు, బయట ప్రకృతికి/ప్రపంచానికి వారధి వంటివి. మనకు మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. వాటిని రెండుగా విభజించారు.

మొదటి 5 జ్ఞానేంద్రియాలు :
శ్రోత్రం (చెవులు) - వినికిడి కోసం,
త్వక్ (చర్మం) - స్పర్శకు కారణం అయింది
చక్షుః (కళ్ళు) - ప్రపంచాన్ని చూస్తుంది,
రసన (నాలుక) - రుచి చూస్తుంది,
ఘ్రాణ (ముక్కు) - వాసన పీల్చడం ద్వారా మెదడుకు సంకేతాలు పంపిస్తుంది

తరువాతివి కర్మేంద్రియాలు.
వాక్కు (నోరు)- మటలను బయటకు పంపుతుంది,
పాణి (చేతులు) - అనేక పనులు ఉపయోగ పడతాయి,
పాదం (కాళ్ళు) - మనిషి యొక్క కదికల కోసం,
పాయువు (మలద్వారము) - శరిరంలో మలాన్ని విసరిజిస్తుంది (బయటకు పంపుతుంది),
ఉపస్థ (మూత్రద్వారము) - సంతానానికి కారణమవుతుంది

ఈ పదింటిని దశ ఇంద్రియాలంటారు.
వీటి గురించి వివరంగా చెప్పుకుందాం.

To be continued...................