చాలామంది మహాభారతం కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన ఇతిహాసం అనుకుంటారు. కానీ నిజానికి మహాభారతం ప్రపంచ ఇతిహాసం. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఘటన అది. మహాభారత యుద్ధం అనేది ఒక ప్రపంచయుద్దం. అందులో ప్రపంచసేనలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. ఒకటి కౌరవుల పక్షం, రెండవది పాండవుల పక్షం. ఇలా ప్రపంచం రెండూగా చీలిపోవటానికి, అది భారతదేశం కోసం జరగటానికి కారణం ఒక్కటే.
ద్వాపరయుగాంతం నాటికి భారత్ ఒక ప్రపంచశక్తి. అవును .......... అప్పటికి భారత్ ప్రబల శక్తి. 100 ఏళ్ళ క్రితం అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని అదుపులో పెట్టుకుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచశక్తిగా ప్రపంచాన్ని శాసిస్తోంది. అతి చిన్నదేశమైన బ్రిటన్ ప్రపంచాన్ని పాలించగాలేనిది శాస్త్రం, విజ్ఞానం, సాంకేతికపరిజ్ఞానం, అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లైన భారతదేశం ప్రపంచంలో ప్రబలశక్తిగా లేదని వాదించడం ఎంతవరకు సమంజసం. భారతదేశం వేదభూమి, కర్మ భూమి, జ్ఞానభూమి, యోగభూమి, మోక్షభూమి, తపోభూమి.
1947 లో స్వాతంత్ర్యం వచ్చేవరకు భారత్ ఎప్పుడు ఒక దేశంగా లేదని, అది వివిధరాజుల క్రింద అనేకరాజ్యాలుగా పరిపాలించబడిందని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి, భారతదేశం భిన్నజాతులు, నాగరికతలు, సంస్కృతుల సంఘర్షణతో కూడినదని, అది ఒక దేశంగా ఉండరాదని, ఏ ముక్కకు ఆ ముక్క విడగొట్టి ప్రత్యేక దేశాలు చేయాలని వాదనలు తీసుకువస్తూ దేశవిద్రోహానికి పాల్పడుతున్నారు. కానీ భారత్ ఒక దేశంగా 5,000 ఏళ్ళ క్రితమే ఆవ్హిరభించింది. అంతకముందు కూడా భారత్ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంది. 'జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే' అంటూ ప్రతి రోజు పూజా ప్రారంభంలో సంకల్పం చెప్తారు. భారత్ ఈ సృష్టి ఆది నుంచే ఒక దేశంగా కొనసాగుతోంది. దేశసమైఖ్యత ఈ మట్టిలోనే ఉంది. అయినప్పటికి భరతఖండం ఒక దేశంగా మహాభారతం వరకు పూర్తిగా అవతరించలేదు. రామయణ సమయానికి భరతఖండం ఉన్నా, అది అనేకమంది రాజుల పరిపాలనలో కొనసాగింది. ద్వాపరయుగంలో కూడ ఇదే పరిస్థితి. కానీ మహోన్నతమైన చరిత్ర కలిగిన భరతవర్షం, భరతఖండం ఎప్పటికి ఒకే దేశంగా కొనసాగాలని శ్రీ కృష్ణ పరమాత్మ సంకల్పించారు. ఏం చేశారో తరువాయి భాగంలో తెలుసుకుందాం
To be continued ...................

No comments:
Post a Comment