Wednesday, 11 February 2015

హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ)

శ్రీ కృష్ణుడు చారిత్రిక వ్యక్తి మాత్రమే కాదు, చరిత్రాత్మకవ్యక్తి కూడా. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశం కొత్త రూపు సంతరించుకుంది. శ్రీ కృష్ణుడు జన్మించేసరికి భారతదేశం అనేక రాజ్యాలుగా, వేర్వేరు రాజుల చేత పరిపాలించబడుతూ ఉండేది. ఎవరిలోనూ ఐకమత్యం లేదు. అటువంటి సమయంలో శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని జరిపించాడు. ఆ యాగాన్ని సాకుగా చూపి, భరతఖండంలో ఉన్న రాజులందరిని ఒకే ఛత్రం క్రిందకు తీసుకువచ్చి, 18 రాష్ట్రాలతో, ఢిల్లీలో ధర్మరాజు ఆద్వర్యంలో కేంద్రప్రభుత్వాన్ని స్థాపించి, దేశాన్ని సంఘటితం చేశాడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కూడా అందించాడు. ఆ ప్రయత్నంలో తన బంధువులను, మిత్రులను, రాజులను కోల్పోయిన లేక్క చేయకుండా ప్రపంచ యుద్ధమైన మహాభారతాన్ని విజయవంతంగా నడిపించి, ధర్మాన్ని గెలిపించాడు. ఇదంతా వ్యాసుడి సంస్కృత మహాభారతంలో చెప్పబడింది. ఆధునిక కాలంలో 1947, తర్వాత స్వతంత్ర భారతంలో 562 రాజ్యాలను ఎంతో చాకచక్యంగా విలీనం చేసినట్లుగా, 5000 ఏళ్ళ క్రితమే శ్రీ కృష్ణుడు భారతదేశాన్ని సంఘటితం చేశాడు.

యుగపురుషుడు, మనదేశం - మన సంస్కృతి గ్రంధకర్త. డా|| వేదవ్యాస, ఐ.ఏ.ఎస్. గారి మాటల్లో చెప్పాలంటే 'మహాభారత యుద్ధం గెలిచిన తర్వాత కూడా పదవీ కాంక్ష లేకుండా, ప్రజారంజకుడు, సత్యధర్మపరాయణుడైన ధర్మరాజుని భారతదేశ సింహాసనం మీద అధిష్ఠింపజేసి, తాను ఏ పదవీ తీసుకోకుండా, ద్వారకకు పోయి, ఎంతో సామాన్యమైన జీవితం గడిపిన మహాపురుషుడు, దేశభక్తుడు త్యాగి, మహారాజనీతి దురంధరుడు శ్రీ కృష్ణుడు'.

ఆయన ఆ రోజు సంఘటితం చేసిన కారణంగానే భారతదేశం ఇప్పటికి కనీసం ఈ కొద్దిభాగమైన మిగిలింది. శ్రీ కృష్ణపరమాత్మ యోగి, తాత్వికుడు, యుగపురుషుడు. ప్రపంచభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఒక దేశంగా ఏకం కాకుంటే భారత్ జీవించలేదని ముందే గ్రహించారు. ఆయన సంకల్పం వల్లనే 800 వందల సంవత్సరాల పరాయిపాలన తర్వాత కూడా భారతీయులందరిలో ఐకమత్యం వర్ధిల్లింది. ఎన్నో భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఉన్నా, మా అందరిది ఒకే ధర్మం, ఒకే దేశమని చెప్పగలుగుతున్నామంటే అది కృష్ణుడి సంకల్ప శక్తి మాత్రమే. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత కురుక్షేత్రానికి మాత్రమే పరిమితం కాలేదు. మొన్నటి స్వాతంత్ర సంగ్రామంలో కూడా అనేకమంది సమరయోధులు భగవద్గీత చేత ప్రభావితం చెంది, దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విడిపించారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ జాతీయగీతంలో జనగణమన అధినాయక జయహే భారత భాగ్యవిధాత అంటారు. ఆయన ఎవరిని ఉద్ద్యేశించి ఆ గీతం రాసిన, అందులో చెప్పిన భారతభాగ్యవిధాత మాత్రం శ్రీ కృష్ణుడే. ఐక్యతలేకపొవడం, ధర్మప్రచారం లోపించడంవలన పశ్చిమాన ఈజిప్ట్ వరకు, తూర్పున భ్రూనై వరకు ఉన్న అఖండభారతం కాలక్రమంలో చిన్న చిన్న ముక్కలైపోయింది, ఆఖరికి కొన్ని రాజకీయ కారణల వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు కూడా ఏర్పడి ఇప్పుడున్న చిన్న ప్రాంతానికి భారత్ పరిమితమైంది. తన భూభాగంలో 90% పైగా కోల్పోయింది.

To be continued .......................

8 comments:

  1. శ్రీకృష్ణుడు చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు!
    అతని చరిత్ర యెక్కడ వుంది ఎకోగణేషా?

    ReplyDelete
    Replies
    1. ద్వారక ప్రత్యక్షసాక్ష్యం కదండీ, ఇంతకముందు చేసిన పోస్టులు కూడా చదవండి, కృష్ణుడి చరిత్ర మహాభారతం, భాగవతంలో ఉన్నది.

      Delete
    2. నిజమే,మీ పోష్టు చదివాను.సందేహం తీరింది!
      దాచేస్తే దాగని సత్యాలు బయటికి వచ్చితీరాలి!

      Delete
    3. ధన్యుడినండి, మీరన్నట్టు నిజాలు ఇప్పటికైనా బయటకు చెప్పాలి

      Delete
  2. నిజాలు బయటకు రావు గురువు గారు
    ఎందుకంటే మన భారతీయులకు మనమే భారతీయులే శత్రవులు
    మనం వేదవిజ్ఞానం బయటకు తేవాలని ప్రయత్నిస్తుంటే ఇంకొందరు జనవిజ్ఞాన వేదికల పేరు తో వెనుకకు లాగుతారు
    మళ్ళీ తిరిగి దేవుడే రావాలి

    ReplyDelete
    Replies
    1. అవునండి, కానీ నిజాలు ఇక బయటకు వస్తాయండి, ఎవరు ఆపలేరు. జనవిజ్ఞానవేదిక కమ్యూనిస్టు పార్టీ విభాగం. భారతీయ కమ్యూనిస్టులు అమెరికా దక్షిణపక్ష వాదులు అనగా క్రైస్తవుల కనుసనల్లో నడుస్తూ, వాళ్ళ అజెండాను మోస్తున్నారు. హిందువులు ఇది గమనించి దూరంగా ఉండాలి.

      Delete
  3. నిజాలు బయటకు రావు గురువు గారు
    ఎందుకంటే మన భారతీయులకు మనమే భారతీయులే శత్రవులు
    మనం వేదవిజ్ఞానం బయటకు తేవాలని ప్రయత్నిస్తుంటే ఇంకొందరు జనవిజ్ఞాన వేదికల పేరు తో వెనుకకు లాగుతారు
    మళ్ళీ తిరిగి దేవుడే రావాలి

    ReplyDelete
    Replies
    1. అవునండి, కానీ నిజాలు ఇక బయటకు వస్తాయండి, ఎవరు ఆపలేరు. జనవిజ్ఞానవేదిక కమ్యూనిస్టు పార్టీ విభాగం. భారతీయ కమ్యూనిస్టులు అమెరికా దక్షిణపక్ష వాదులు అనగా క్రైస్తవుల కనుసనల్లో నడుస్తూ, వాళ్ళ అజెండాను మోస్తున్నారు. హిందువులు ఇది గమనించి దూరంగా ఉండాలి.

      Delete