సద్గురు శివానంద మూర్తి చూపిన మార్గం సదా అనుసరణీయం
సంస్మరణ సభలో సుపథ ఫౌండే షన్ ఎండి డాక్టర్ హనుమంతరావు
'పూర్వ పురాణంలో విషయాలను యోగ దర్శనం చేసి , ఖచ్చితత్వం తెల్సుకుని , లోటు పాట్లు సవరించి ,ప్రస్తుత శతాబ్దానికి అనుగుణంగా ఆధునిక భాషలో చెప్పగలిగే మహనీయులు కావాలి . అటువంటి వన్నీ తెల్సిన సద్గువురులు శ్రీ శివానంద మూర్తి . ఆ మహనీయులు చూపిన మార్గం సదా అనుసరణీయం ' అని సుపథ ఫౌండే షన్ ఎండి డాక్టర్ వి హనుమంతరావు అన్నారు . శివానంద మూర్తి జూన్ 10న శివ సాయుజ్యం పొందిన నేపధ్యంలో రాజమండ్రి దానవాయిపేట వాడ్రేవు బిల్డింగ్స్ లో సోమవారం రాత్రి శివానంద సత్సంగం ఆధ్వర్యాన శివానందమూర్తి సంస్మరణ సభ నిర్వహించారు. శ్రీ వాడ్రేవు మల్లపరాజు స్వాగతం పలికారు. డాక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా సద్గురు శివానంద మూర్తి తో ఉన్న అనుబంధాన్ని , ఆయన చెప్పిన విషయాలను , చూపిన మార్గం గురించి విపులంగా వివరించారు.
భారతీయతలోనే భక్తి ఉందని, అందుచేత భక్తి ప్రచారం కాకుండా ధర్మ ప్రచారం చేయాలని, ఎందుకంటే భీష్ముడు కూడా ధర్మం తప్పాడని సద్గురు శివానంద మూర్తి సవివరంగా చెప్పేవారని డాక్టర్ హనుమంతరావు అన్నారు.' గురువు అంటే ఆధాత్మిక విషయాలు తెలిసిన వాడే కాదని , భారతీయ చరిత్ర జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెల్సి వుండాలని, చరిత్ర జ్ఞానం లేకుంటే ప్రమాదమని కూడా సద్గురు శివానంద మూర్తి అనేవారు అందుకే భారతీయ చరిత్ర కు సంభందించిన ఎన్నో చారిత్రిక ప్రదేశాలను చూపించి , వాటి గొప్పతనాన్ని సద్గురు శివానంద వివరించేవారు. వృద్ధ జాగేశ్వర్ దగ్గరకు తీసుకెళ్ళి శివ పరివారం గా దర్శన మిచ్చే పర్వత శ్రేణిని చూపించారు. ఆయన దర్శించినట్లు భారతీయ చరిత్రను ఎవరూ చూడలేరు. ఆనాటి వైశాలి ప్రాంతాన్ని, అభిషేక పుష్కరిణి అనే వందల ఎకరాల చెర్వు ని ఆయన చూపించారు . వాటి విశిష్టత వివరించారు . అవి ఇప్పటికీ వున్నాయి . కానీ మన చరిత్ర పుస్తకాల్లో వుండవు. అగస్యుడు ఇంకా జీవించి ఉన్నాడని , 5వేల సంవత్సరాల నాటి మహా భారత గ్రంధాన్ని పదిలంగా కాపాడిన వాడు అగస్యుడే నని వివరించేవారు. ఇలాంటి ఎన్నో అపురూప విషయాలు వివరిస్తూ , ప్రాచీన గుర్తులు దర్శింప చేసారు సద్గురు శివానంద మూర్తి. భారతీయ పూర్వ చరిత్ర , 18పురాణాలు చదివితే ఉత్తర జన్మలో ముక్తి వస్తుందనేవారు' అని డాక్టర్ హనుమంతరావు వివరించారు.
సద్గురు శివానంద మూర్తి రాజమండ్రిలోనే పుట్టడం వలన కాకపోయినా ఆయనకు రాజమండ్రి అంటే ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా గోదావరి అంటే మరీ ఇష్టమని డాక్టర్ హనుమంతరావు చెప్పారు . 'ఇక్కడ ఇవ్వండి ఎక్కడా రాదు అంతటి గొప్పది గోదావరి.. గోదావరి నీళ్ళు తాగేతే వారిలో జీవ ధాతువులు వుంటాయి గోదావరి వేద పురుషులకు నిలయం 'అనేవారని గుర్తుచేసుకున్నారు.' భగవద్గీతలో కర్మలు చేయాలని శ్రీకృష్ణుడు చెప్పాడని అయితే ధర్మం తెల్సుకుని కర్మలు ఆచరించాలని దాని అర్ధం. గమ్యం కన్నా మార్గం ఆనందం. , సాధన ముఖ్యం. దానం వలన పుణ్యం వస్తే , త్యాగం వలన ముక్తి వస్తుంది. మన కోసం కాకుండా మనది కాని దానికోసం పనిచేసే తత్త్వం అలవరచుకోవాలి. అలాంటి భక్తే దేశభక్తి. దానివలన దేశానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముక్తిని పొందడానికి చేసే పనులవలన కేవలం ఆ వ్యక్త్రికే ప్రయోజనం అదే ముక్తిని పొందే స్థాయికి వెళ్లి వెనక్కి వస్తే , దానివలన ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది' ఇలా ఎన్నో అపురూప విషయాలు సద్గురు శివానంద విశ్లేషించే వారని డాక్టర్ హనుమంతరావు వివరించారు. సద్గురు శివానంద మూర్తి రాసిన ఎన్నో కీలక విషయాలను సుపద పుస్తకంలో ప్రచురిస్తూ ఉంటామని ఆయన చెప్పారు.
సద్గురు శివానంద మూర్తి చూపిన మార్గాన్ని అనునిత్యం మననం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ టివి నారాయణ రావు అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈనాటి సమాజం ఏది కోరుతోందో, ఎలా వుండాలని అనుకుంటోందో బాగా తెల్సిన సద్గురువు శివానంద మూర్తి అని ఆయన విశ్లేషించారు . ఆయన చూపిన ప్రేమ ఆప్యాయత మరెవరికి సాధ్యం కాదన్నారు. ' ధర్మంగా సంపాదంచిన దానితో ఆనందంగా జీవించాలి. అది వైరాగ్యానికి దారితీసి , ముక్తిని ప్రసాదిస్తుంది. అదే అధర్మంగా సంపాదిస్తి , పాపం వస్తుంది. అది పతనానికి దారి తీస్తుంది 'అని సద్గురు శివానంద మూర్తి చెప్పేవారని డాక్టర్ నారాయణ రావు చెప్పారు. శ్రీ కొత్తపల్లి అప్పాజీ మాట్లాడుతూ శివానంద మూర్తి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు. 'నీ వలన ఏ ఇద్దరూ విడిపోకూడదు . నీ వలన ఏ కార్యక్రమం ఆగిపోకూడదు . ప్రోత్సహించ గలిగితే ప్రోత్సహించు , లేకుంటే పక్కకు తప్పుకో ' అని సద్గురు శివానంద మూర్తి చెప్పిన విషయాలు సత్యమని ఆయన పేర్కొన్నారు. శ్రీ వాడ్రేవు వేణుగోపాల రావు దంపతులు , శ్రీ ఫణి నాగేశ్వరరావు దంపతులు , శ్రీ దినవహి వెంకట హనుమంతరావు దంపతులు , ప్రసాద్ కామర్సు , శ్రీమతి వాడ్రేవు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పలువురు శ్రీ సద్గురు శివానంద మూర్తి చిత్ర పటానికి అంజలి ఘటించారు .
Source: Raghavarao Rajahmundry

No comments:
Post a Comment