మాక్స్ ముల్లర్ మొదలైన పండితులు వేద భాష్యానికి చేసిన అవకతవకలు ఎటువంటి వంటే మాక్స్ ముల్లర్ ఒక్క వేద ఋక్కుకు ఇచ్చిన దురర్ధాన్ని ఖండిస్తూ అరవిందులువారు ఒక పుస్తకమే రాసారట. ఐరోపా 'పండితులకు' వేదంలో చరిత్ర కనిపించింది. కానీ స్వామి దయానందులు (ఆర్యసమాజం) వేదంలో చరిత్ర ఉందని అంగీకరించలేదు. గ్రిఫ్ఫిత్, మాక్స్‌ముల్లర్, మోనియర్ విల్లియంస్, మెక్‌డొన్నెల్, బ్లూంఫీల్డ్ ఇత్యాది పాశ్చ్యాతుల భాష్యాలను ఖండించారు. దీని గురించి ఋగ్వేద భాష్య భూమికలో విస్తృతంగా ప్రస్తావించారు. వారి ప్రభావంతో, ఆర్యసమాజానికి చెందిన దేవీచంద్ గారు కూడా యజుర్వేద భాష్యంలో ఇటువంటి అనేక విషయాలను శాస్త్ర ప్రామాణికంగా ఖండిచారు.
వారి మాటల్లోనే 'సాధారణ సంస్కృతంలో 'ల'కార త్రయం భూతకాలాన్ని (గడిచిన కాలాన్ని) సూచిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేకులు వేదంలో చరిత్ర ఉందని నిర్ధారించారు. కానీ ఇది తప్పు. కష్కుడు చెప్పిందేమిటంటే వేదంలో 'ల'కార త్రయం కనిపిస్తే, అది త్రికాలాలకు (భూత, వర్తమాన, భవిష్యత్) సంబందించినదై ఉంటుంది. అది ప్రత్యయం అవుతుంది. అందువల్ల వాటిని కేవలం భూతకాలానికే పరిమితం చేయడం తప్పు. అదే విధంగా వైదిక పదాలు ధాతువులే కానీ, వ్యక్తులు, సంప్రదాయల పేర్లు కావు. ఎప్పుడైతే పండితులు ముఖ్య వేదాంగాలైన నిరుక్తం, వ్యాకరణాలను విడిచిపెట్టారో అప్పుడే వేదంలో చరిత్ర ఉన్నట్టుగా భావించడం మొదలుపెట్టారు.
పతంజలి మహర్షి మాహాభాష్యంలో కష్కుడి వివరణ గురించి వ్యాఖ్యానం చేస్తూ, వేదంలో లకార త్రయాన్ని భూతకాలానికి పరిమితం చేసి అర్దం చెప్పడం, వ్యాకరణ శాస్త్రానికి వ్యతిరేకం. పాణిని వ్యాకరణాన్ని ప్రామాణికంగా తీసుకున్నంతవరకు వైదిక పదజాలానికి చరిత్రను అంతగట్టడం వేదవ్యాక్యాలను నిందించడమే అవుతుంది అన్నారు.
వైదిక పద ధాతువుల ప్రాముఖ్యతను అర్దం చేసుకోవడంలో విఫలమై, వాటిని చారిత్రిక వ్యక్తుల పేరులుగా అనువదించారు. వాటి అసలు ప్రాముఖ్యతను నేను చెప్తాను.
1. సీతా - వేదంలో సీతా అనే పదం శ్రీ రామచంద్రుని భార్యను సూచించదు. పొలంలో నాగలితో దున్నడాన్ని సూచిస్తుంది.
2. బాబర - అనేది రాజు లేక వ్యక్తి పేరు కాదు. ఉరుములు వంటి గట్టి శబ్దాలు చేస్తూ ప్రవహించే గాలిని సూచిస్తుంది.
3. సూదాస్ - అనేది రాజు పేరు కాదు. 'సూదః కళ్యాణదానః| నిరుక్తం 2-25' చక్కటి దానాలు చేస్తూ ఉండేవాడని అర్దం.
4. పైజ్వాన్ అనేది రాజు నామాన్ని సూచించదు. నిరుక్తం 2-24 ఆధారంగా ఏ వ్యక్తైతే సదా అనాలోచితంగా ఉంటూ తొందరపడి వేగంగా పనులు చేసేవాడు పైజ్వాన్.
5.దేవాస్ - రాజు నామం కాదు. వేద విద్యనభ్యసించిన పండితుడు, ఎవరి ఆధ్వర్యంలోనైతే యాగం జరుగుతుందో అతడు.
6. అగు - అనగా చారిత్రాత్మిక వ్యక్తి కాదు. వేద జ్ఞానం, వైదిక పదజాలం తెలియని వ్యక్తి అని అర్దం.
To be continued ..........................
No comments:
Post a Comment