Monday, 23 November 2015

హిందూ ధర్మం - 184 (మాక్స్ ముల్లర్ కుట్ర - 3)

మాక్స్ ముల్లరే కాదు, ఆనాటికాలంలో వేదానికి భాష్యం రాసిన అనేకమంది యూరోపియన్లు ప్రధాన ఉద్దేశ్యం వేదాన్ని తక్కువ చేసి చూపడం, హిందువులను తటస్థీకరించి, క్రమంగా మతమార్పిడి చేయడం, సనాతనధర్మాన్ని ఆటవిక సమాజపు అలవాట్లుగా చిత్రీకరించడం. వీరి ఆలోచనలకు బీజం వారి మతంలోనే ఉంది. హైందవేతర మతాలు, ముఖ్యంగా అబ్రహామిక్ మతాలన్నీ 'తన మార్గం మాత్రమే సత్యం, అన్యమైనవన్నీ అసత్యం, అవి అనాగరికం, వాటిని పాటించేవారు ఎంతమంచి వారైనా, వారు నరకానికే వెళతారు' అనే ప్రధానమైన సిద్ధాంతం కలిగి ఉంటాయి. ప్రపంచం మీద విరుచుకుపడిన ఐరోపా (యూరోపియన్) వారు, ఏ దేశంకెళ్ళినా, అక్కడున్న స్థానిక సంస్కృతిని, అలవాట్లను నాశనం చేశారు. అది కుదరనప్పుడు మొత్తం జాతినే ఊచకోత కోశారు. కేవలం మతప్రచారం కోసం, దోపిడి కోసం. అమెరికా మీద పడ్డప్పుడు కుడా వారు చేసింది అదే. అక్కడున్న ప్రజలను అనాగరికులని, ఆటవికులని, వారు ప్రకృతిని పూజిస్తారని చెప్పి, ఆ జాతిని సమూలంగా తుడిచిపెట్టారు. ప్రకృతిని పూజించడంలో తప్పేముందనేది ఓ పెద్ద ప్రశ్న?!

అదే ప్రణాళిక ఇక్కడ అమలు చేద్దామంటే పూర్తిగా కుదరలేదు. ఇక్కడ జాతిని సమూలంగా నాశనం చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అందుకే ముందు హిందువులను పక్కదారి పట్టించాలని భావించారు. అందులో భాగమే వెలుపలివారు (Outsiders) సనాతనధర్మం మీద వ్యాఖ్యానాలు, భాష్యాలు రాయడం. ఒకవేళ హిందువులు కనుక తమ మతసిద్ధాంతాలను ప్రపంచానికి చెప్పుకుంటే, ఆ సమయంలో ఐరోపాలో మొదలైనా ఉద్యమాలు, విద్యావ్యాప్తి, పరివర్తన కారణంగా, ఐరోపావారు కూడా విశాలమైన భావాలు గల ఈ ధర్మాన్ని స్వీకరిస్తారు. తమ మతానికి ముప్పు వాటిల్లుతుంది. రెండవది, భారతీయులని తమకు శాశ్వత బానిసలను చేసుకోవాలన్నా, మతమార్పిడి చేయాలన్నా, ముందు భారతీయులకు హిందూ ధర్మం పట్ల ఏహ్యభావం కలగాలి. దీనికంటే క్రైస్తవమే ఉన్నతమైందిగా అనిపించాలి. అది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకే మాక్స్ ముల్లర్ మొదలైన ఐరోపావారు హిందువులను తమ మతం పట్ల తటస్థీరించాలని (Neutralise) చూశారు. అందుకోసమే వేదం జాతులు సంఘర్షణ, పోరు గురించి చెప్తుందని, అందులో పిచ్చి రాతలున్నాయని, జంతుబలులు, నరబలులున్నాయని చెప్పుకోచ్చారు. ముఖ్యంగా అది అనేకమంది దేవతలను పూజించమని చెప్తుందని, ఆ దేవతలు కూడా నిజమైన శక్తులు కావని, ఆదిమానవుడు వర్షం పడినప్పుడు తనకు తెలియని ఏదో శక్తి కారణంగా వర్షం పడుతోందని, వరదలు సంభవిస్తున్నాయని, పిడిగులు పడుతున్నాయని భావించాడని, ఆ భయంతోనే వాటిని పూజించడం మొదలుపెట్టారని, కాలక్రమంలో ఆ భయాలకు ఒక రూపం అంటగట్టి దేవతారూపాలుగా పూజిస్తున్నారని విస్తృతమైన ప్రచారం చేశారు. అబ్రహామికేతర మతాలన్నిటిని పేగెన్ (pagan) మతాలన్నారు. తమ మత ప్రవక్త పుట్టకముందు నుంచి ఉన్న మతాలన్నీ ఇలాంటివేనని, తమ ప్రవక్త మత్రమే దైవదూత అని, ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే స్వర్గం వస్తుందని ప్రచారం చేశారు.

నిజానికి ఇది ఏ హైందవుడికి ఆమోదయోగ్యం కాదు. హైందవం నమ్మకాల మీద ఆధారపడిన సంస్కృతి కాదు. ఇక్కడ దైవాన్ని దర్శించినవారు అనేకులున్నారు, దైవసాక్షాత్కారాని (God realization) కి అనేకమైన మార్గాలను హైందవం మాత్రమే చూపించింది. అసలు ఈ Realization అనేది ఇక్కడ మాత్రమే ఉన్న అంశం. ఆ మార్గంలో నడిచినవారందరూ గమ్యాన్ని చేరారు. తమ తర్వాతి వారికి మార్గదర్శనం చేశారు. ఇది హైందవుల చరిత్ర. మరేమతంలోను దైవాన్ని చూసినవారు లేరు, దైవసాక్షాత్కారానికి మార్గంలేదు. అక్కడ నమ్మడం (belief) ప్రధానం, ఇక్కడ నమ్మినదాన్ని దర్శించడం, సాక్షాత్కరించుకోవడం ప్రధానం.

అయితే ఇలా వెలువడ్డ వ్యాఖ్యానాలను మనవాళ్ళు పూర్వపక్షం చేయడం మర్చిపోయారు. అప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యవల్ల వీటిని యధాతధంగా స్వీకరించారు. ఇక్కడో విషయం గుర్తించాలి. మాక్స్ ముల్లరే కానీ, మరెవరైనా కానీ, వారిది దురుద్దేశమే అయినా, వారు వేదాల్లో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని అంగీకరించారు. ఎందుకంటే వేదంలో ఏమిలేదు అని కనుక చెప్తే, అది భారతీయుల తిరస్కరణకు గురవుతుంది, తిరుగుబాటుకు కారణమవుతుంది. అందుకని వాటిలో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని చెప్తూనే, తమ రచనలు చదివిన బలమైన హిందువులను తటస్థ (neutral) పరిస్తే, క్రమంగావారు హైందవం పట్ల నాస్తికులుగా మారతారు. అటుతర్వాత వారిని తమ మతంలోకి మార్చుకోవచ్చనేది ప్రణాళిక. Neutralising is the first step towards conversion. అంటే Positive attitude ని తీసివేయడం అన్నమాట.

మూడవది, ఈ వేదం విదేశీయులదని చెప్పి, హిందువుల్లో ఉండే వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెట్టి, తమలో తమకే ద్వేషం పెంచి, అంతర్యుద్ధం సృష్టించాలని, క్రమంగా హిందూజాతి బలహీనపడుతుంది, అప్పుడు తమ పని సులవుతుందని భావించారు.

ఆ ఉద్దేశ్యంతో వేదభాష్యం రాసిన ఐరోపావరిని అనేకమంది హిందువులు స్వీకరించినా, దీన్ని పూర్వపక్షం చేసి, ఈ కుట్రదారుల కుతంత్రాలను బయటపెట్టినవారిలో ముఖ్యులు శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద్ సరస్వతీ. వేదానికి అంటగట్టిన విదేశిభావజాలాన్ని, నాస్తికవాదాన్ని పూర్తిగా వదలగొట్టడానికి వీరు ఎంతో ప్రయత్నం చేశారు.

To be continued ....................

3 comments:

  1. మీ ఈ ప్రయత్నం చాలా ప్రశంసనీయం. కొనసాగించండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ, శివార్పణం

      Delete
  2. Now there is so dangerous thing is happening in Tamilnadu.most of the christian organizations are aearing sffron and caallling themselves svaamigal!more heineous thing is they are arguing that vedas are really speaking about yehuva and jeses?The real covets are converted brahmins,they are the rela persons started this trend to get higher echelons in their new religion.Giving access to the brahmins done by reverence by other communities and they are twisting their superiority in knowledge like this,how could we reespect such brahmins?Now there is a need to decentralize the knowledge for all the persons in all hindu communities,those who had respect on these scriptures.

    ReplyDelete