భారతదేశంలో, హిందూ ధర్మంలో పుట్టి సనాతనధర్మాన్ని ధార్మిక కోణంలోకాక, కమ్యూనిష్టు, బ్రిటిష్ కోణంలో, ద్వైతకోణంలో చూసే వారంతా కూడా Outsiderలే. ఇక్కడ ద్వైత కోణం అంటే ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత సిద్ధాంతాలు కాదు, సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, జననమరణాలు, స్వర్గ నరకాలనే ద్వందభావాలు. దేవుడు ఉంటే, దెయ్యం ఉంటుంది, లేదా దెయ్యం ఉంటే, దైవం ఉంటుందన్న భావజాలం. నిజానికి ఈ భావజాలం హైందవేతర మతాలకు సంబంధించినది. ఈ ధర్మంలో సుఖదుఃఖాలు, జననమరణాలే కాక వాటికి అతీతమైన స్థితి కూడా ఉంది. అది యోగం ద్వారా సిద్ధిస్తుంది. దాని పై అవగాహన లేకుండా ధర్మానికి వ్యాఖ్యానాలు చేసేవారు, ధర్మాన్ని విమర్శిస్తూ రచనలు చేసేవారంతా Outsiderలే. రాజకీయ కారణాల కోసం కొందరు తాము హిందువులమని చెప్పుకోవచ్చు. ఇంకొందరు ఇంకొంచం ముందడుగు వేసి, తాము హిందువులైనందుకు గర్విస్తున్నామని చెప్పచ్చు. కానీ ధర్మాన్ని ధార్మికేతర కోణంలో చూస్తున్నందున వీరంతా Outsiderలే. వీరు అంతరంగమేమిటో దేవుడికే తెలియాలి. వీరు అత్యంత ప్రమాదకరం. అదే సమయంలో పుట్టుకతో హిందువు కాకపోయినా, ఈ ధర్మాన్ని స్వీకరించి, దాన్ని యాధతధంగా పాటించి, సిద్ధి పొందిన విదేశీయులను Insiders అనవచ్చు. దానికి ఉదాహరణ డేవిడ్ ప్రాలే గారు. ఇప్పుడు వారి నామం పండిత వామదేవ శాస్త్రి. జన్మతః హైందవేతరుడైనా, హైందవాన్ని స్వీకరించి, ఇందులో సిద్ధి పొంది, ధార్మిక కోణంలో అనేక రచనలు చేశారు, ధార్మిక దృష్టితో, ధర్మంపై వ్యాఖ్యానం చేశారు.
విషయంలోకి వస్తే ఈ మాక్స్ ముల్లర్ Outsider. అతనికి ధర్మం పట్ల ఏ విధమైన అవగాహనలేదు. వేదానికి భాష్యం రాయమని పని అప్పగించిన ఆంగ్లేయులు కూడా Outsiderలే. వీరి ఇద్దరి ఉద్ద్యేశం ధర్మాన్ని నాశనం చేయడమే. ఆ భావనతోనే మాక్స్ ముల్లర్ రచన సాగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాక్స్ ముల్లర్ సంస్కృతాన్ని కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అధ్యయనం చేశాడు. వేదాలను అర్దం చేసుకోవాలంటే వాటితో పాటు వేదాంగాలను కూడా సరిగ్గా అర్దం చేసుకుని ఉండాలి. అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం, శమదమాలు, బ్రహ్మచర్యం, సత్యం, శౌచం ఇత్యాది గుణాలు అలవర్చుకుని ఉండాలి. కానీ మాక్స్ ముల్లర్ ఇవేమి చేయలేదు. ఇంతకముందు మనం చెప్పుకున్న 6 రకములైన అర్దాలే కాక, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అర్దాలను వేదానికి చెప్తారు. ఈ 3 విధములైన అర్దాలు కలిగంది కాబట్టే వేదానికి 'త్రయి' అనే పేరు కూడా ఉంది. ఇంతకముందు మనం చెప్పుకున్నాం, వేదంలో ఉండేది చాలా పైస్థాయి పదజాలం (High-end terminology) అని. దానికి అర్దాలు కూడా అలాగే ఉంటాయి. అదే సమయంలో ప్రకరణము- సమయం అనే కోణం కూడా ఉంటుందని ఉదాహరణతో వివరించుకున్నాం. కానీ మాక్స్ ముల్లర్ ఇవేమీ పట్టించుకోలేదు. ఉన్నతమైన అర్ధాలు కలిగిన వైదికపదాలకు సామన్య సంస్కృత పదాలకు, వాడుకలో ఉన్న సంస్కృత పదాలకు ఉండే అర్దాలను అన్వయం చేసి, భాష్యం అందించాడు. ఇదే పెద్ద తప్పు. అదీగాక దీని వెనుక వారికున్న ఉద్ద్యేశం కూడా కుట్ర పూరితమైనది. అది భారతదేశాన్ని క్రైస్తవంలోకి మార్చడమే.
ఈ.బి. పుస్సే(E.B.Pussey) మాక్స్ ముల్లర్‌కి రాసిన లేఖలో 'భారతదేశాన్ని మతమార్పిడి చేసే ప్రయత్నాలకు ఉపయుక్తంగా మీరు చేసిన కార్యం నూతన శకానికి నాంది పలికింది. ఈ విషయంలో మీకు పని అప్పగించినందుకు గానూ ఆక్స్‌ఫోర్డ్ మీకు కృతజ్ఞతతో ఉంటుంది. మీరు చేసిన కార్యం మతమార్పిడుల విషయంలో ప్రాధమిక మరియు శాశ్వత ప్రాముఖ్యతను కలిగి, మన పనిని సులభతరం చేసింది, మరియు పూర్వపు అబద్దపు మతాన్ని మీరిచ్చిన ఉదాహరణలతో పోల్చి చూచుటకు మాకిది అవకాశాన్ని కలిగించినందుకు సంతోషంగా ఉంది' అని అన్నారు.
To be continued ..............

మన బంగారం మంచిదయితే అగసాలిని అనటం దేనికి? అని ఒక సామెత ఉన్నది. మన వారిలోనే సనాతనధర్మం పట్ల అవగాహనా నిష్ఠా కనుక ఉన్నట్లైతే ఈ మాక్స్ ముల్లర్ అల్లరిపాలై ఉండే వాడు. కాకపోబట్టే మనవాళ్ళే ఆ మహానుభావుణ్ణి నెత్తిన పెట్టుకొన్నారు. విదేశీయులు అరకొర జ్ఞానంతో ఏది చెప్పినా అది మనవాళ్ళకు అమృతప్రాయం ఇపోవటానికి కారణం మనవాళ్ళకు ఉన్న బానిసబుధ్ధి మాత్రమే. మాక్స్ ముల్లర్ అవకతవక పాండిత్యంతో దురర్థాలు తీసి వ్యాఖ్యానించిన ఒక వేద ఋక్కు గురించి అరవిందులు ఒక పూర్తి పుస్తకమే వ్రాసారు సరైన భాష్యాన్ని అందిస్తూ. ఐనా ఈ లోతుపాతులూ వేదవేదాంగాలూ వాటి అర్థాలూ అంతరార్థాలూ మనకెందుకు మనకు చెత్త సినిమాలు చాలు, పనికిమాలిన పోలిటిక్సు చాలు, వెంగళి టీవీ సీరియల్సు చాలు. ఇలాంటీ జాతిని భగవంతుడు వచ్చి బాగుచేసినా ఆయన అవతారం కాస్తా వెనక్కు మళ్ళగానే మళ్ళా కుక్కతోక వంకర అన్నట్లే ప్రవర్తిస్తారు. అన్నట్లు మా పూర్వీకులు గొప్ప ఋషులూ అంటూ మా తాతలు నేతులు తాగారట అన్న చందాన గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు వినే వాళ్ళూ దొరికితే!
ReplyDeleteఏం పుస్తకమండీ అది? వేద రహస్యమేనా?
Delete