ఒకరు నన్ను అడిగిన ప్రశ్న.
నాశనమయ్యే ఈ శరీరంలో నాశనంకాని ఆత్మ ఎలా ఉంటుంది?
స్వామి పరిపూర్ణానంద సరస్వతీ -
పాలు ఉపయేగపడేవేె, కాని ఒక్క రోజుకు మించితె పాడైపోతాయి.
పాలలొ మజ్జిగ చుక్క వేస్తె పెరుగు అవుతుంది.
పెరుగు మరొకరోజువరకు ఉపయోగపడతుంది.
కాని పెరగు వేరొకరోజుకి పాడైపోతుంది.
పెరుగును మదిస్తే వెన్న అవుతుంది.
వెన్న మరొకరోజు వరకే ఉంటుంది.
తరువాయి అదికూడా పాడైపోతుంది.
ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.
ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు.
ఒక్కరోజులొ పాడైపోయే పాలలో ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.
అలాగే అశాశ్వతమైన ఈశరీరమునందు శాశ్వితమైన ఆత్మ ఉంటుంది.
మానవశరీరము పాలు
సంకీర్తన మజ్జిగ
సేవ వెన్న
సాధన నెయ్యి.
మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తె
ఆత్మ పవిత్రత పొందుతుంది.
No comments:
Post a Comment