1 కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు (17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000) = 1 మహాయుగం (43,20,000 సంవత్సరాలు)
1 మన్వంతరం = 71 మహాయుగాలు (71* 43,20,000 = 30,67,20,000 సంవత్సరాలు)
ప్రతి మన్వంతరానికి ఒక మనువు ఉంటాడు. అతడు దానికి పాలకుడు.
ప్రతి మన్వంతరం తర్వాత ఒక కృతయుగం కాలమానికి సరిపడా సంధికాలం ఉంటుంది. అనగా 17,28,000 సంవత్సరాలు సంధికాలం. ఈ సంధికాలంలో భూమి అనంతమైన జలరాశిలో మునిగి ఉంటుంది. ఇక్కడ జలరాశి అంటే నీరుగా భావించకూడదు. అప్పుడు సృష్టి అంతా శూన్యంతో నిండి ఉంటుందని గ్రహించాల్సి ఉంటుంది.
బ్రహ్మదేవునకు 1 రోజు = 14 మన్వంతరాలు+ 15 చరణాలు అనగా 1,000 మహాయుగాలు.
సూర్య సిద్ధాంతంలో 14 వ అధ్యాయం - మానాధ్యాయంలో కాలాన్ని 9 విధాలుగా విభజించి, దాన్ని మానం అన్నారు. అందులో అతి చిన్నదైన ప్రాణం (4 సెకన్లు) నుంచి అతి పెద్దకాలమానమైన పర (300000.04 సౌర సంవత్సరాలు) వరకు ఉంది.
ఇప్పటికి బ్రహ్మకు 50 ఏళ్ళు గడిచాయి. 50 ఏళ్ళ ముగింపులో గతించిన ఆఖరి కల్పానికి పద్మ కల్పం అని పేరు. ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51 వ సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాము. దీనికి శ్వేత వరహా కల్పం అని పేరు. ఈ మొదటి రోజులో ఇప్పటికే 6 మన్వతరాలు ముగిసి, ఏడవదైన వైవశ్వత మన్వంతరంలో ఉన్నాము. అందులో కూడా 27 మహాయుగాలు గడిచి, 28 వ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గతించి, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము.
ఈ 4,32,000 సంవత్సరాల కలియుగం నాలుగు పాదాలుగా విభజించబడింది. ప్రతి పాదానికి 1,80,000 సంవత్సరాలు. అందులో ప్రథమ పాదంలో ఉన్నాము. ఈ 28 వ కలియుగం క్రీ.పూ.3102 లో ప్రారంభమైంది. ఇప్పటికే బ్రహ్మదేవుడికి 50 ఏళ్ళు గడిచి, రెండవ 50 సంవత్సరాల్లో ఉన్నాం కనుక సంకల్పంలో ద్వితీయ పరార్ధం అని చెప్పుకుంటాము.
శ్రీ రాముడు ఈ మన్వంతరంలోనే 24 వ త్రేతాయుగానికి చెందిన వాడు. శ్రీ కృష్ణుడు 28 వ ద్వాపరయుగానికి చెందినవాడు. గతించిన కాలమానంలో మనకు అతి సమీప కాలంలో వచ్చిన అవతార పురుషుడు శ్రీ కృష్ణుడు ఇలా అనేక అవతరాలు అనేక మహాయుగాలు, వేర్వేరు మన్వంతరాల్లో, కల్పాల్లో వచ్చాయి. వాటి అన్నిటి గురించి మనకు వివరంగా అందించేవి పురాణాలు. .
అందుకే సంకల్పంలో
శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాము.
To be continued ............
No comments:
Post a Comment