Sunday 9 April 2017

హిందూ ధర్మం - 241 (జ్యోతిష్యం- 21) (కల్పాలు, వాటి పేర్లు)



కల్పం అంటే 4,32,00,00,000 సంవత్సరాలని, ఒక కల్పం బ్రహ్మదేవునకు ఒక రోజని చెప్పుకున్నాం. ఆ కల్పాల పేర్లు స్కాంద పురాణం, మత్స్య పురాణం, మహాభారతం మొదలైన గ్రంథాల్లో 30 పేర్ల వరకు చెప్పబడ్డాయి. అవి

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము / శ్వేత వరాహ కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాల పేర్లున్నాయి.

ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మదేవుని 51 సంవత్సరంలో, మొదటిదైన శ్వేతవరాహ కల్పంలో. అందుకే సంకల్పంలో 'శ్వేతవరాహ కల్పే' అని చెప్తారు. ఈ సమస్త జగత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నడుస్తున్నది కనుక నిత్యం చెప్పే సంకల్పంలో 'శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య' అని చెప్పుకుంటూ, కాలపురుషుడు, కాలస్వరూపుడు, కాలకాలుడైన ఆ శ్రీ మన్నారాయణుని స్మరించుకుంటాము.

అలాగె ప్రతి కల్పంలో బ్రహ్మదేవుడు ఒక మనువును సృష్టి చేస్తాడు. ఆ మనువు ఈ ప్రపంచాన్ని, అందులో జీవరాశిని సృష్టిస్తాడు. ప్రతి మన్వంతరము, ఒక మనువు జీవితకాలం వరకు ఉంటుంది, అనగా ఒక మన్వంతరం వయస్సు 30,67,20,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం నడిచే ఈ జగన్నాటకం ముందుకు సాగడానికి ప్రతి మన్వంతరం తర్వాత బ్రహ్మదేవుడు ఒక కొత్త మనువును సృష్టిస్తాడు. అది వారి పూర్వ పుణ్యాన్ని అనుసరించి ఉంటుంది. పూర్వ కల్పాలు, మన్వంతరాల్లో పుణ్యం చేసుకున్న జీవులు, తపస్సు చేసిన మహాత్ములు ఆ స్థాయికి చేరుకుంటారు. ప్రతి మన్వంతరము ఒక మనువు చేత పాలించబడుతుంది. ప్రతి మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారాన్ని స్వీకరిస్తారు, ఇంద్రపదవికి కొత్త ఇంద్రుడు వస్తాడు, సప్తఋషుల పదవులకు నూతనమైన వారు ఎన్నికవుతారు. బ్రహ్మ దేవుడి కాలమానంలో (31,10,40,00,00,00,000 సంవత్సరాల్లో) 5,04,000 మనువులు, బ్రహ్మదేవుని ఒక ఏడాదిలో 5040 మనువులు, బ్రహ్మదేవుని ఒక నెలలో 420 మనువులు ఉంటారని వేదాలు, ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి.

To be continued ..........

(సేకరణ: వికీపీడియా సౌజన్యంతో) 

No comments:

Post a Comment