ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. కైలాసనాథ పరంపర నందినాథ సంప్రదాయానికి చెందిన గురువు, శైవాగమ పండితులు, జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి వారు చెప్పిన ఆ విశేషాలు తెలుసుకోండి.
1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం - బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం - కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ - కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.
నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.
1. అతలం - అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.7.
7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.
కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.
To be continued .........

భారతీయ ఖగోళశాస్త్రంలోని సూర్యకేంద్రక సిద్ధాంతానికీ పురాణాలలోని విశ్వరచనా సిద్ధాంతానికీ ఒక వైరుధ్యం కనబడుతున్నది నాకు!విశ్వరచనా సిద్ధాంతంలో అనంత కోటి విశ్వాలలో ప్రతి విశ్వానికీ మన విశ్వాన్ని పోలిన నిర్మాణమే ఉంటుందని చెబుతారు.దాని ప్రకారం విశ్వాండం యొక్క నిలువు అక్షం అడుగున కరణోదక సాగరం పైన శయన భంగిమలో నారాయణుడు ఉంటాడు,అక్షానికి నిలువునా విరాట్ పురుషుని శరెర భాగాలుగా ఈ పధ్నాలుగు లోకాలూ ఉంతాయి,అక్షం పైన స్వతస్సిద్ధమైన కైలాసపీఠం మీద కొలువుదీరి పరమశివుడూ ఉంటాడు - కదా!
ReplyDeleteవిరాట్ పురుషుని దేహభాగాలుగా ఉన్న పధ్నాలుగు లోకాలలో సూర్యచంద్రులు పరిబ్రమించుతూ ఇతర గ్రహతారక అసముదాయాలు ఉండే నభోలోకం లేక భువర్లోకం వేరే పొరగా నాభి స్థానంలోనూ భూమి దాని కింది అంతరువులో ఉన్న కటిభాగంలో అమరిన భూలోకంలోనూ ఉంటుంది.అంటే విశ్వరచన సిద్ధాంతం ప్రకారం ఒక విశ్వాని కంతటికీ ఒక భూమొయే ఉంటుంది.ఈ భూమిబీ దీని పైన నివసించే జీవజాత్య్ల్నీ మిగిలిన అన్ని లోకాలూ ప్రభావితం చహెస్తాయి.
సూర్య చంద్రాదులు కూదా భొమి ఉన్న పొరకి పైపొరలో విశ్వం యొక్క అక్షం చుట్టూ వలయాకారంలో తిరుగుతూ భూమి యొక్క దివారాత్రాలను శాసిస్తారు - ఇంతవరకు వైరుధ్యం ఏమీ లేదు, కదా!మరి,భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుటూ తిరగడం వల్లనే అహోరాత్రాలు ఏర్పడతాయని ఖగోళ శాత్రజ్ఞులు చెప్పడం విశ్వరచన సిద్ధాంతంతో పొసగడం లేదు.విశ్వరచన ప్రకారం భూమి కూడా విశ్వాండం యొక అక్షం దగ్గిర తన చుటూ తను తిరగడం లాంటివి చేయకుండా స్థిరంగా ఉండి సూర్యుడూ చంద్రుడూ భూమి ఉన్న నతరుకు పైన్ అక్షం చుట్టొ తిరగడం వల్లనే ఒక సగంలో పగలూ మరో సగంలో రాత్రి ఏర్పడం హేతుబద్ధంగా ఉంటుంది.ఎ రెంటికీ మధ్య సమన్వయం ఎట్లా సాధ్యం?స్పూర్యుడు అక్షం చుట్టూ వలయాకారంలో తిరుగుతూ భూమి కూడా తన చుట్టూ తాను తిరిగితే భూమి మీద ఒక ప్రాంతం ఎప్పుడూ వెలుగులోనే ఉండిపోవాలి - కాదంటారా!
ఒకసారి పరిశీలించి చెప్తానండి.
Deleteఒక విశేషం గమనించాలి మనం!పాశ్చాత్యుల సిద్ధాంతం ప్రకారం భూమి సూర్యుడి చుట్టూ ఒక దీర్ఘవృతాకారపు కక్ష్యలో తిరుగుతూ ఉన్నప్పటికీ మన్మ్ భూమి నుంచి చూసే నక్షత్ర మండలాలు,ముఖ్యంగా మాసాలనీ రాశులనీ నిర్ణయించే 28,12 సమూహాలు ఒక స్థిరమైన సంబంధంతోనే కనిపిస్తున్నాయి,అవునా కాదా?ఇది యెలా సాధ్యం?అవి కూడా భూమితో పాటూ సమానమైన వేగంతో సూర్యుడి చుట్టూ తిరిగితేనే కదా అది సాధ్యపడేది!మళ్ళీ ఈ సూర్యుడు పాలపుంతలో చివరి భాగంలో అతుక్కుని పాలపుంత తన అక్షం చుట్టూ తిరిగే కదలికలో ఒక భాగంగా కదులుతున్నాడు - అంతా గందరగోళంగా ఉంది.
ReplyDeleteఒక వృత్తాకారపు కష్యలో తిరగడం అవ్ల్ల భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరంలో తేడా లేకపోవటం సాధ్యమే,కానీ సూర్యుడి చిట్టూ వృత్తాకార్పు కష్యలో తిరుగుతున్న ఈ భూమికీ ప్రతి నక్షత్రానికీ ఎప్పుడూ ఓకే దూరం ఉండటం ఎట్లా సాధ్యం?
సృష్టిరచన ప్రకారం అయితే భూమి ఉన్న 3డి ప్లేన్ కన్న పైన ఉన్న 3డ్ ప్లేన్ గ్రహతారకల్ని ధరిస్తున్నది.అవి ఒక పళ్ళెంలా ఉండి అక్షం చుట్టూ తిరుగుతూ భూమి స్థిరంగా ఉంటుంది.దీని ప్రకారం భూమికీ సూర్యుడికీ,భూమికీ నక్షత్రాలకీ ఎప్పుడూ ఒకేఅ రకమైన సంబంధం ఉండటం సరిపోతుంది!
I am fascinated by this link as this man also has similar thoughts and showing proofs
ReplyDeleteThank you sir.........
Deleteమన ప్రాచీన ఖగోళ,గణిత,జ్యోతిష శాస్త్రాలలో కూడా ఆర్యభట్టు ఒక్కడే సూర్యుడి చుట్టూ భూమి తిరగడం గురించి చెప్పినట్టు గమనించాను మీ బ్లాగులో ఆ టాపిక్ గురించి ఉన్న పోష్టులని చదివినప్పుడు.మరోసారి చదివితే క్లారిటీ వస్తుందేమో!మిగ్లిన అన్ని సిద్ధాంతాలలోనొ గణిత సూత్రాలనూ విశ్లేషణల్నీ చేసేటప్పుడు సూర్యగమనం,చంద్రగమనాల్ని బట్టి చేసినట్టు చెబుతున్నారు.
ReplyDeleteనేను అనవస్రంగా కంగారుపడినట్టు అనిపిస్తునది నాకు:-)
సద్గురు శివానంద మూర్తి గారు వేదోక్త విశ్వరూపం అని ఒక పుస్తకం రాశారండి. అందులో చూస్తే మీ సందేహాలు తీరుతాయేమో. ఆ పుస్తకం గురించి కొంత సమాచారం 1-2 రోజుల్లో పోస్ట్ చేస్తాను.
Delete