నేను బేరం చేయకుండా ఏదీ కొననండి. నేను బాగా బేరం చేస్తాను అంటూ కొంతమంది తమ గురించి బాగా గొప్పలు చెప్పుకుంటారు. అయితే ఎంతసేపు ఈ బేరాలన్నీ 10 రూపాయల కొత్తిమీర కట్ట కోసం, లేకపోతే తాటి ముజల కోసమో! అబ్బో ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్టే వస్తుంది. రూపాయికి కొత్తమీర కట్టలు ఒకటే ఇస్తావా, రెండెందుకు ఇవ్వవూ, నాలుగు ఇవ్వచ్చు కదా అంటారు. దాదాపు అందరూ అంతే అనుకోండి. అదే పెద్ద ఎద్ద షాపింగ్ మాల్స్ కు వెళితే, నోరెత్తరు. బడాకంపెనీలు ఎంత చెబితె అంత చెల్లిస్తాము. ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ అంతే. మీరు త్రాగే ఒక కూల్‌డ్రింక్ ఉత్పత్తి చేయడానికి మహా అయితే 2 నుంచి 3 రూపాయలవుతుంది. కానీ దాన్ని వాడు 15 రూపాయలకు అమ్ముతాడు. దాన్లో ఎంత లాభం ఉందో చూడండి. వాడికి బడా వ్యాపారం, అనేక రాష్ట్రాలు, దేశాల్లో ఉంటుంది. అలా ఎన్ని వేల కోట్లు గడిస్తున్నాడు? అదే వీధిపక్కన కూరగాయలమ్మేవాడు, ఒక రైతు, చిన్న వ్యాపరి, టైలర్లు, చెప్పులు కుటేవారు, కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషనులు, పెయింటర్లు, కొంతమంది టూరిస్ట్ గైడ్లు, ఢోలీ వాలాలు (కొండప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కలేనివారిని మోసుకెళ్ళేవారు), కుండలు, మట్టి ప్రమిదలు లేదా ఎదైనా బొమ్మలు అమ్ముకునేవాడికి వచ్చే #లాభం ఎంత? మహా ఐతే ఆ పూట భోజనానికి సరిపోయినంత. అంతకుమించి వారికేమి వస్తుంది. నిజానికి బేరం చేయాల్సిందెక్కడ? చేకూడదనిదెక్కడ? ఈ చిన్న వ్యాపారులకు షాప్ పెట్టుకునే స్థోమత కూడ ఉండదు.
వీధిలో కూర్చునే వ్యాపరులేమీ లాభాలు గడించడంలేదు. మీరు ఆ రోజు కూరలో, పువ్వులో కొనకపోతే, అవి చెడిపోయి పూర్తిగ నష్టం వస్తుందని మీరడిగిన ధరకు ఇస్తున్నారు. అది చెక్కబొమ్మలు మొదలైనవి అమ్ముకునే వారు కూడా ఎదో కొంతైనా వస్తుందని మనకు అమ్ముతారు. ఇప్పుడు మనమొక విషయం ఆలోచిద్దాం. మీరు తినడానికి కొంటున్న వస్తువులు, లేదా అలంకరణ కోసమో, పూజ కోసమో కొంటున్న వస్తువులు అనుకుందాం- అవతల వ్యక్తిని ఏడిపించి కొంటే అది మీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది. వాళ్ళు ఏడుస్తూ కూరలమ్మితే, అది కొన్న మీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? పూజ కోసం కొనే వస్తువులైనా, వారిని బాధపెట్టి కొంటే, దేవుడెలా సంతోషిస్తాడు. ఈ రెండే కాదు, ఇంకా చాలా వస్తువులు, ముఖ్యంగా తమ రోజు గడపడం కోసం వ్యాపారం చేస్తున్నవారి దగ్గర బేరం చేసి, వారిని క్షోభ పెట్టడం మనకు దుష్కర్మను తీసుకురాదా? అలా ఏడుస్తూ ఇవ్వకు బాబు, కాస్త నవ్వుతూ ఇవ్వు అంటారు. పైకి నవ్వినా లోపల భాద ఉండదా? చిన్న చిన్న షాపుల్లో అమ్ముకునేవారు కూడా అంతే. పెద్ద పెద్ద మాల్స్ లో అయితే మైంటెనెన్స్ అని, అదని, ఇదని బోలేడు ధర చెప్తారు. కానీ చిన్న షాపుల్లో అలా కాదు. మనమే ఆలోచించాలి.
మనమేమీ భూదానం, సువర్ణదానం, అన్నదానం మొదలైన దానాలు చేయక్కర్లేదు. ఏ పూటకాపూట తిండి కోసం వ్యాపారం చేసుకునేవారి దగ్గర బేరం చేయకుండా కొంటే చాలు. బేరం చేయకుండా కొని చూడండి, వారి కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో. అది మనకు ఆశీర్వాదం కూడా అవుతుంది. అలాగే అది వారికి, వారి కుటుంబానికి ఆ రోజు తిండికి కారణం కావచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ ధరలే కొన్నా, ఆ మిగితాది దానంగా మీకు అన్నదానం చేసిన పుణ్యం రాకుండా ఉంటుందా?
మధ్య తరగతి వాళ్ళే బేరం చేస్తారనుకోవడం పొరపాటు. పెద్దపెద్ద కార్లలో వచ్చి కూడా కొందరు బేరం చేయడం చూశాను. ఏమయ్యా! పావుకిలో నేరేడు పళ్ళు 30 కి ఇస్తున్నావా? 20 కి ఇవ్వరాదా? అంటారు, అడిగి 20 రూపాలకే తీసుకుంటే ఇంకో నాలుగు అదనంగా వెయ్యి, లేదా ఇంకో 6 వేయ్యి అంటారు. అసలు అలా అడగడానికి సిగ్గు ఉంటుందా? మనమేమీ ఈ సమాజం కోసం పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్నవారి పట్ల ప్రేమతో, కరుణతో మెలిగితే చాలు. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి బేరాలు చేయడం ఆపండి.
చాలా మంచి విషయం - ఎంతోమంది అస్సలు పట్టించుకోని విషయం - చాలా బాగా చెప్పారు.
ReplyDelete