ఇప్పుడు మనం వివరించుకున్న ఈ (Dimensional theory) పరిమాణ సిద్దాంతాల ఆధారంగా ధర్మంలో చెప్పినవి అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
దేవతలు ప్రత్యక్షం అయ్యారు, అదృశ్యమయ్యారు అంటాము. ప్రత్యక్షం అంటే కళ్ళకు కనిపించడం, అంటే దాని ఉనికి ఇంతకముందు కూడా ఉండి ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు కళ్ళకు కనిపించేలా 'వ్యక్తమైంది' అన్నమాట. దృశ్యం అంటే చూసేది, అదృశ్యం అంటే చూడలేనిది. కళ్ళకు కనిపించిన ఆ దేవతా స్వరూపం తిరిగి కనిపించకుండా పోవటం అదృశ్యమవటం. ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతగ్రంథాలు దేవతలు ప్రత్యక్షమవుతారని ఎక్కడా చెప్పలేదు. ప్రవక్తను నమ్మటం వరకే వారికి చెప్పబడింది. కాబట్టి దేవుడెందుకు కనిపించడు అని ఒక హిందువు అడిగితే దానికి ఈ సమాధనం చెప్పచ్చు. అదే ఒక అన్యమతస్థుడు అడిగితే, వాళ్ళ దేవుడు ఈ సృష్టికి దూరంగా, ఎక్కడో ఉంటాడు కనుక కనిపించడు అని చెప్పాలి.
ఇప్పుడు మనకు తలెత్తె ఒక సందేహానికి ఈ సిద్ధాంతం సమాధానమిస్తుంది. కార్యకారణాలతో కూడిన ఈ జగత్తులో (A world of cause and effect) మనం నివసిస్తున్నాము కనుక, అన్నీఇక్కడ జరిగినట్లే ఇతర లోకాల్లో జరుగుతాయని భావిస్తాము. కార్యం అంటే పని, లేదా కర్మకు ప్రతిఫలం, ఒక సంఘటన (Effect). కారణం అంటే దానికి కారణమైన విషయం (Cause). కారణం లేకుండా కార్యం ఉండదని చెబుతుంది సనాతన ధర్మం. 'విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః' అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఈ సిద్ధాంతాన్ని మనకు గుర్తు చేశారు ఆదిశంకరులు. నిజానికి ఈ కార్యకారణ సిద్ధాంతమే హేతువాదం. హేతువు అంటే కారణం. ఏదీ కూడా అకారణంగా, కాకతాళీయంగా, ఏదో అలా జరగదు (without any cause) అని చెప్పడం హేతువాదం. సనాతనధర్మం కూడా ప్రతి విషయంలో అలానే చెబుతుంది.. కానీ హేతువాదులమని చెప్పుకునే కొన్ని తింగరి మూకలకు ఈ విషయం అర్దంకాదు. ప్రతిదాన్ని ఊరికే, లోతైన అవగాహన లేకుండా ప్రశ్నించడమే హేతువాదం అనుకుంటారు. వారికి ధర్మం మీద ద్వేషం తప్ప, సత్యం మీద ప్రేమ లేదు. కొందరు సైంటిష్టులు కూడా కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగాయని చెబుతారు.... అన్నిటికి కారణముంటుందన్న వారే కొన్నిసార్లు అలా సమర్ధించుకుంటారు. కొన్నిసార్లు తమకు తెలియని వాటిని X-factor అంటారు....
కార్యకారణ సిద్ధాంతానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉంది. భూత (past) కాలంలో చేసిన పనులకు వర్తమాన (present), భవిష్య (future) కాలాల్లో జరిగే వాటితో సంబంధం ఉంటుందన్నది ఈ కర్మసిద్ధాంతం చెబుతుంది. సనాతనధర్మానికి పునాది అయిన పునర్జన్మ సిద్ధాంతం కూడా దీని మీదే ఆధారపడి ఉంది. అయితే ఈ కార్యకారణ సిద్ధాంతం అనేది 3-D దాటితే భిన్నంగా మారిపోతుంది. 3-D World దాటినప్పుడు, (10-D లో) అసలు అక్కడ దేశకాలాల ప్రసక్తి లేదు. ఇంతకముందు ఉన్నది, ఇప్పుడున్నది, ఇంక ఉండబోయేది అనే మాటే లేదు. ఎందుకంటే నాకు ముందు ఏముంది అనే ప్రశ్నలో కాలం (time) ఉంది. కాలమే లేనప్పుడు ఇక దైవానికి ముందు ఏముంది? అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది. అక్కడ ఉన్నది ఉనికి (existence) మాత్రమే. అదే సత్. అది కేవలం ఉనికి కాదు, చైతన్యంతో కూడిన ఉనికి, అందుకే అది చిత్. ఆ చైతన్యం ఆనందమయమైనది, కనుక అది ఆనందం. అదే సచ్చిదానందం, ఉపనిషత్తుల్లో భగవంతునిగా చెప్పబడిన తత్త్వం. సచ్చిదానందరూపిణీ అనేది లలితా సహస్రనామల్లో ఒక నామం. మనం 3-D నుంచి కాక, కాలాతీతంగా ఆలోచిస్తే, ఈ సందేహం తొలగిపోతుంది. నిజానికి ఆ సచ్చిదానందమైన ఉనికియే నీలో ఉన్న ఆత్మ కూడా. నీవు దాన్నుంచి వేరు కాదు. కాలంలో కొట్టుకుపోయే శరీరమే నీవనుకోవడం అసలు సమస్యకు మూలకారణం. ఇది వేదాంతం చెబుతుంది. క్వాంటం ఫిజిక్స్‌లో 4-D కి వెళ్ళినప్పుడు, జగత్తు అశాశ్వతమైన బోధపడుతుంది. (ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతాలకు క్వాంటం సిద్ధాంతం వ్యతిరేకమవుతుంది.)
ఇక భూలోకంలో పుట్టిన జీవులకు కర్మాధికారం ఉంది అని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇక్కడే ఉంది. కార్యకారణం సిద్ధాంతం, దేశకాలాలు అనేవి ఈ 3-D జగత్తులో ఉన్నట్లుగా ఇంకెక్కడా ఉండవు. అక్కడి భౌతికశాస్త్ర ధర్మాలు (physical laws) వేరు..... అందుకే దేవతలకు కర్మాధికారం ఉండదు. పైగా వారి లోకనియమాలు వేరు కనుక, వారి ధర్మాలు కూడా వేరు. అవి తెలియకుండా ఏదో నాలుగు పురాణాలు చదివి, దేవతలను అపహాస్యం చేయడం మూర్ఖత్వం తప్ప మరేదీ అనిపించుకోదు.
ఇక్కడ వివరించడానికి ఇంకా చాలా అంశాలున్నా, ఈ అంశాన్ని మనం వేదాంగమైన జ్యోతిష్యాన్ని వివరించడంలో భాగంగా చెప్పుకున్నాం కనుక అది ఇక్కడకు ఆపివేస్తాను. ఇప్పుడు మనకు బయట కనిపించే చాలామంది చేసేది వ్యక్తిగత జాతకాల పరిశీలన. కానీ వేదాంగమైన జ్యోతిష్యంలో చెప్పబడింది ఇది కాదు. అన్నిలోకాల్లో జరిగే మార్పులను గమనిస్తూ, జరగబోయే సంఘటనలను దర్శించి, ఏ కాలంలో, ఏ ముహూర్తాన యజ్ఞయాగాది కర్మలు చేస్తే సమస్త లోకాలకు మేలు కలుగుతుందో, కీడు తొలగుతుందో పరిశీలించి ముహూర్తం నిర్ణయించడం దీనిపని. ఇది అందరికి తెలియని విద్య. ఇలాంటి వేదాంగ జ్యోతిష్యం తెలిసిన ఒక మహాపురుషుడిని (ఋషిని) నేను చూశాను.
Scientific గా మన ధర్మంలోని అంశాలను చెప్పుకుంటున్నా, ఋషులు, భగవంతుడు అందుకు భిన్నంగా అనుకుంటున్నారు. హిందువులు ఈ అంశాలను కేవలం మనస్సు పని అయిన Logical thinking తో కాకుండా, అనుభవజ్ఞానంతో, హృదయంతో (beyond mind and intellect) తెలుసుకోవాలని, విశ్వాసంతో వీటిని దర్శించే స్థాయిని పొందాలని ఋషులు ఆశిస్తున్నారు. మనకు ఆ potential ఉందని కూడా ఋషులు గుర్తు చేస్తున్నారు.
To be continued.......