Sunday, 17 December 2017

హిందూ ధర్మం - 255



ఏకకణ జీవి నుంచి మొదలైన సృష్టి క్రమగా వృద్ధి పొంది కోతి నుంచి మానవుడు పరిణామం చెందాడని, ఈ జీవపరిణామంలో మానవుడి ఉనికి 1,00,000 (లక్ష) ఏళ్ళకు మించదని 'డార్విన్ మతస్థుల' వాదన. అయితే మన పురాణాల ప్రకారం శ్రీ రాముడు 24 వ త్రేతాయుగంలో అవతరించాడు. ఇప్పుడున్న 28 వ కలియుగం. శ్రీ కృష్ణుడు 28 వ కలియుగం నాటి వాడు(ఈ వివరాలు మనం ఇంతక ముందే చెప్పుకున్నాము).మధ్యలో 4 మహాయుగాలున్నాయి. అంటే దరిదాపుగా 1.5 కోట్ల ఏళ్ళ క్రితం శ్రీ రాముడు ఈ భూమిపై చరించాడు అనేది ఒక వాదన. ఈ సృష్టి ఏర్పడి వేదంగా జ్యోతిషం, శ్రీ మద్భాగవతం ప్రకారం 197.29 కోట్ల సంవత్సరాలు గడిచిందని చెప్పుకున్నాము. మరి దీనికి ఆధారలేంటీ? ఇది మొదటి ప్రశ్న కాగా, ఇక రెండవ ప్రశ్న. మానవుడు కోతి నుంచి ఉద్భవించాడనేది సనాతన వైదిక గ్రంథాల ప్రకారం ఎంతవరకు ఆమోదయోగ్యం? ఈ రెండింటికి సమాధానం అన్వేషిద్దాం.

మానవజాతి ఉనికి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. గత 150 ఏళ్ళ నుంచి ఎందరో శాస్త్రవేత్తలు మానవుడి ఉనికి మూలాలను అన్వేషించే పనిలో పడ్డారు. ఎంతలేదన్నా మానవజాతి ఆలోచించడం మొదలుపెట్టింది గత 10,000 ఏళ్ళలోనే అని గట్టిగా నొక్కి చెప్పే శాస్త్రవేత్తలున్నారు. కానీ కొందరు ప్రపంచ ప్రఖ్యాత న్యూరోశాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆధునిక మానవుడి మెదడు అభివృద్ధి జరిగి కనీసం లక్ష సంవత్సరాలు అయ్యింది. 

నిజానికి ఈ విషయంలో మైకిల్ క్రీమో మరియు రిచార్డ్ ఎల్ ధాంసన్ ఎంతో పరిశోధన చేశారు. గత 150 ఏళ్ళుగా పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపి వెలువరించిన అనేక ఆధారాలను చూపించి, మానవపరిణామం గత 10,000 ఏళ్ళలో జరిగిందని చెప్పడం బూటకమని తేల్చేశారు. గ్రహం హాన్‌కాక్ గారు Fingerprints of the Gods అనే పుస్తకం రాసారు. అందులో మానవ నాగరికత 12,000 ఏళ్ళ నుంచి 20,000 ఏళ్ళ క్రితం నాటిదని, అప్పుడు ఇంతకంటే ఎంతో వికాసం చెందిన మానవ జాతి ఉండెదని, ఒక భారీ విపత్తు కారణంగా అది అంతమై, మంచు యుగం అంతానికి దారి తీసిందని చెప్పగా, వీరు దాన్ని మరింత వెనక్కు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితానికి తీసుకెళ్ళారు. వారు ఉదహరించిన నిదర్శనాల్లో ఒకటి చెప్పుకుందాము.

గత శతాబ్దంలో, కాలిఫోర్నియా లోని Sierra Nevadas పర్వతాల్లో బంగారం కనుగొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి దానిని వెలికి తీసేందుకు గని తవ్వేవాళ్ళు వచ్చారు. ముందుగా అక్కడి వాగుల్లో బంగారన్ని వెలికి తీయగా, తర్వాత కొండ అంచు వెంబడి గనుల తవ్వకం జరిపారు. దృఢమైనరాతిని తవ్వుతుండగా, ఆ కార్మికులకు మానవ అస్థిపంజరాలు, ఈటెలు, లెక్కకు మించిన రాతి పనిముట్లు కనిపించాయి. ఇవి విభిన్న ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి. ఒకటి కాలిఫోర్నియాలోని Tuolumne County వద్దనున్నTable Mountain  లో కనుగొనబడింది. ఆధునిక భూగర్భ నివేదికల ప్రకారం, అస్థిపంజరాలు మరియు కళాకృతులు కొనుగొన్న ఆ పర్వతపు రాయి వయస్సు 5 కోట్ల సంవత్సరాలు. అనగా 5 కోట్ల ఏళ్ళకు పూర్వం మానవుడు అక్కడ నివసించాడనడానికి అది ఒక సాక్ష్యం. ఇది విని వైదిక పురాతత్వ శాస్త్రవేత్తలు విస్మయం చెందరు. కానీ 'పుస్తకజ్ఞానమాత్రమైన' పురాతత్వ శాస్త్రజ్ఞులు ఎంతో విస్మయం చెందుతారు, ఎందుకంటే అతని పుస్తకాల ప్రకారం అప్పుడు మానవుడు, ఆ మాటకు వస్తె ఆదిమానవుడు కూడా లేడు. కాల్ఫోర్నియాలో దొరికిన వీటి గురించి సైన్సు ప్రపంచానికి డా.జే.డి.విట్నీ, కాల్ఫోర్నియా రాష్ట్ర భూగర్భశాస్త్రజ్ఞుడు ఎంతో జాగ్రత్తగా నమోదు చేసి, నివేదిక అంజజేశాడు. అతని The Auriferous Gravels of the Sierra Nevadas నివేదికను 1880 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. 

To be continued......

No comments:

Post a Comment