Sunday, 24 December 2017

హిందూ ధర్మం - 256

కానీ ఇలాంటి పరిశోధనల గురించి ఈనాడు మనమెందుకు వినడంలేదు? విట్నీ పరిశోధనను డా.విల్లియం హెచ్ హోంస్, ప్రబలమైన మానవశాస్త్రజ్ఞుడు కొట్టిపారేశారు. ఆయన వార్షిక నివేదిక 1898-99 లో వారు చెప్పిందేమిటంటే, "ఈనాడు మానవపరిణామ క్రమాన్ని విట్నీ ఒప్పుకుని ఉంటే, అతను తన సారాంశాన్ని (మానవులు ఉత్తర అమెరికాలో పురాతన కాలం నుంచి ఉన్నారనే విషయాన్ని) వెళ్ళడించడానికి సంకోచించేవారు". ఆయన చూపిన సాక్ష్యాలను ఏ మాత్రం పరిశీలించకుండానే వారు ఇలా చెప్పేశారు. అంటే తాము అంగీకరించే సిద్ధాంతానికి భిన్నమైనది ఎవరైనా ప్రస్తావన చేస్తే, దాన్ని ఏదో ఒక రకంగా బుట్టదాఖలు చేస్తారు. ఇది సైన్స్ సమాజంలో ఉన్న నాలెడ్జ్ ఫిల్టర్ (Knowledge filter) కు ఉత్తమ ఉదాహరణ అంటారు మైకిల్ క్రీమో.

వారు ఇంకా ఇలా అంటారు. సైన్సును నమ్మేవారు ఎంతో హేతుబద్దంగా (rational), దేన్నైనా స్వీకరించే మనసు (open mind) తో ఉంటారని చెప్తారే కానీ, వాస్తవంలో అలా కాదు. సైన్స్ ప్రపంచంలో నాలెడ్జ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఒక వేళ తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు మానవ ఉనికి కొన్ని కోట్ల సంవత్సరాలని ఋజువులు దొరికినా, దాన్ని విస్మరించాలి. ఎందుకంటే అప్పటికే 'ఆమోదం పొందిన సైన్స్ సిద్ధాంతాలకి అది వ్యతిరేకం కనుక'. అంటే దొరికిన వాటి పట్ల హేతుబద్ధంగా పరిశోధించడం కాక, దాన్ని వడపోస్తారు. ఈ వడపోతలో ఏదైనా ఆధారాలు కొద్దిగా అటు ఇటుగా ఉంటే, అది ఎంతో కష్టంతో ఆ నాలెడ్జ్ ఫిల్టర్ దాటుతుంది. అది ఒకవేళ ఆ విషయానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటే, అది విస్మరించబడుతుంది "నిజానిజాలతో సంబంధం లేకుండా". ఇలా మానవుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల ఏళ్ళ క్రితమే ఉద్భవించాడని చెప్పే ఎన్నో సాక్ష్యాలను తొక్కేశారని, అవన్ని తన పుస్తకంలో పొందుపరిచానని చెప్పారు మైకిల్ క్రీమో. 

ఇంకా వారు ఇలా అంటారు- ఆధునిక చరిత్ర నుంచి ఒక సంఘటన తీసుకుందాము. 1979 లో మేరి లీకే, తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని Laetoli అనే ప్రదేశంలో కొన్ని డజన్ల అడుగుజాడల (Foot prints) ను కనుగొన్నారు. అవి ఆధునిక మానవుల అడుగుజాడలతో ఏ మాత్రం వేఱుచేయఁదగనివని చెప్పారు. కానీ అవి 37 లక్షల ఏళ్ళ పూర్వం నాటి ఘనీభవించు అగ్నిపర్వతపు బూడిద పొరల్లో దొరికాయి. ప్రామాణిక లెక్కల ప్రకారం, అలాంటి అడుగుజాడలు కలిగిన మానవులు అంత పూర్వం ఉండేవారు కాదు. మరి ఈ  అడుగుజాడల గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు?

వాళ్ళు ఏమంటారంటే 37 లక్షల ఏళ్ళకు పూర్వం ప్రాచ్య ఆఫ్రికాలో మనలాంటి పాదచిహ్నాలు (Foot prints) కలిగిన ఒక విధమైన ఆదిమానవుడు ఉండేవాడట. అలా ఆ కాలిజాడలు ఏర్పడ్డాయట. అది ఆసక్తికరమైన ప్రతిపాదన, కానీ దురదృష్టవశాత్తు దానికి ఏ విధమైన ఆధారాలు లేవు. అయితే శాస్త్రవేత్తల వద్ద తూర్పు ఆఫ్రికాలో 37 లక్షల ఏళ్ళకు పూర్వం ఉన్న ఆదిమ మానవుడి అస్థిపంజరాలు ఉన్నాయి. వాళ్ళు వాటిని Australopithecus అంటారు. వారి పాదచిహ్నాలు, ఆధునిక మానవుడి పాదచిహ్నాల నుంచి వేరుగా ఉంటాయి.

దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ప్రపంచ పురాతత్త్వ కాంగ్రెస్ లో నేను మాట్లాడుతుండగా, ఈ ప్రశ్న వచ్చింది. అక్కడ రోన్ క్లార్క్ అనే శాస్త్రవేత్త కూడా మాట్లాడుతున్నారు. దక్షిణ ఆఫ్రికాలోని Sterkfontein, లో, ఆయన ఒక పూర్తి Australopithecus అస్థిపంజరాన్ని కనుగొన్నారు. ప్రపంచంలోని అతిపురాతన మానవ మూలపురుషునిగా ప్రపంచమంతా విస్తారంగా ఈ పరిశోధన యొక్క ప్రచారం జరిగింది. అది కూడా  వలె 37 లక్షల ఏళ్ళ నాటిదే. కానీ అక్కడొక సమస్య ఉంది. క్లార్క్ ఆ  కాలిముద్రను ఆదిమానవుడి చెందినదిగా కథ అల్లారు, ఎందుకంటే అది చూడటానికి ఆదిమమానవుడి పాదంలానే ఉంది. ఉదాహరణకు బొటను వేలు చాలా పెద్దగా, మానవుడి బొటను వ్రేలు లాగా బయటకు వచ్చింది మరియు మిగితా వ్రేళ్ళు కూడా చాలా పెద్దగా, మానవుని పాదాలకంటే ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉన్నాయి. మొత్తంగా అది మానవుని పాదంలాగ లేదు. కనుక క్లార్క్ తన ఉపన్యాసం ముగించిన తర్వాత, నేను ప్రశ్నించేదుకు చేయి ఎత్తాను. "మీరు చూపిన Australopithecus పాదముద్రలు, మేరి లీకే చూపిన Laetoli, పాదముద్రలతో ఎందుకు సరిపోవడంలేదు. రెండూ 37 లక్షల ఏళ్ళ క్రితం నాటివే. కానీ ఆవిడవి చూడటానికి ఆధునిక మానవులు వలె ఉంటాయి కదా?". అక్కడున్న సమస్య చూడండి. ఆయన మానవజాతిలోని పూర్వికుడిగా చెప్తున్న ఆ కాలిముద్రలు చూపుతుంటే, అది ఆఫ్రికాలోని ఇంకో ప్రాంతంలో మనలాంటి మానవులు అదే సమయంలో తిరిగినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. మరి ఆయన నా ప్రశ్నకు ఎలా సమాధానమిచ్చారు. ఆయన చూపుతున్న Australopithecus యే Laetoli లో పాదముద్రలు వేశాడని, కానీ పాదము యొక్క ఒక పక్కకు తన పెద్ద వ్రేళ్ళను నొక్కుతూ నడిచాడని, అతని మిగితా క్రిందకు కాలివ్రేళ్ళు ముడుచుకున్నాయని ఆయన అన్నారు. నాకు ఇది సంతృప్తికరమైన వివరణగా తోచలేదు. 

To be continued.....

No comments:

Post a Comment