చాలామంది మంత్రం ఉపదేశించమని అడుగుతున్నారు. మంత్రాన్ని మంత్రసిద్ధి పొందిన గురువు మాత్రమే ఇవ్వగలరు. కొందరు గురువు దగ్గరకు ఎందుకు వెళ్ళాలని, గురువు ప్రాముఖ్యత ఏమిటని అడుగుతున్నారు. వాటన్నిటికి సమాధానంగా స్వామి శివానంద గారు రాసిన గురు తత్త్వ అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి పోస్ట్ చేద్దామని అనిపించింది. అందుకని విఘ్నేశ్వరుడిని తల్చుకుని, ఈ కార్యము ప్రారంభిస్తున్నాను.
-------------------------
ముందుమాట
ఆధ్యాత్మిక గురువు గురించి ఎంతో రాసినప్పటికీ, అతి ముఖ్యమైన ఈ విషయంలో ప్రజల్లో ఇంకా గందరగోళం, అపార్థము, అనుమానము నెలకొని ఉన్నాయి.
ఒక గురువు అత్యవసరమా? ఎవరు సద్గురువు? గురువు తన శిష్యునికి ఎంత మేర సహాయం చేయగలరు? శిష్యుని యొక్క కర్తవ్యం ఏమిటి? దీక్ష/ శిష్యత్వానికి అర్థం ఏమిటి? వీటి గురించి స్పష్టమైన, నిర్దిష్టమైన సమాధానం దొరకక చిత్తశుద్ధి గల సాధకుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఆగి పోతున్నది.
ఇలాంటి పరిస్థితులలో సద్గురు శివానంద జీ మహారాజ్ గారి పుస్తకం ఎంతోమందికి వరం వంటిది. ఈ లోపలి పేజీల్లో పాఠకుడు, గురుశిష్య సంబంధం గురించి ఎన్నో ప్రామాణికమైన, సంక్షిప్తమైన మరియు సాహసోపేతమైన విశదీకరణలు చూస్తాడు.
ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక తృష్ణ గల స్త్రీపురుషుల యొక్క మేలు కొరకు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మరియు బ్రహ్మవిద్యా గురువుయొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు వారన్దరిపై ఉండుగాక.
- ది డివైన్ లైఫ్ సొసైటీ

అనేక కారణాలవలన మీ ఈ అనువాదాన్నిఇంతవరకూ చూడటం కుదరలేదు. ఇప్పుడు నిజంగా కష్టపడి మొదటి భాగం ఎక్కడుందో పట్టుకొని చదవటం మొదలు పెడుతున్నాను. దయచేసి ప్రతిభాగం యొక్క మొదటనూ ప్రథమభాగం యొక్క లింకునూ క్రిందటిభాగం లింకునూ పొందుపరిస్తే పాఠకులకు, ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన పాఠకులకు సదుపాయంగా ఉంటుందని సూచన చేయటానికి సాహసిస్తున్నాను.
ReplyDeleteఅదే విధంగా ప్రతిసారీ క్రిందటి భాగానికి చివర్లో మరుచటి భాగం యొక్క లింకునూ జతపరచితే వరుసగా చదువుకోవటానికి చక్కగా ఉపకరిస్తుందని మరొక సూచన. మీకు కొంచెం శ్రమ అవుతుంది. కాని ప్రజోపయోగిగా ఉంటుంది మరి.
Deleteఆ అనువాదం లింకు నాకు ఇవ్వగలరా శ్యామలీయం గారూ?
Deleteదొరికిందిలేండి. పక్కనే ఉంది. కృతజ్ఞతలు.
Deleteఅలాగే చేస్తానండి...
Deleteఇంతవరకు వచ్చిన అనువాదం చదివాను. బాగుంది. అక్కడక్కడ కొన్ని వాక్యాలు కృతకంగా వచ్చాయి గమనించగలరు. ముద్రారాక్షసాలు ఎక్కువగానే ఉన్నాయి సరిచేయండి. మంచి కృషి చేస్తున్నారు. అభినందనలు.
ReplyDeleteతప్పకుండా సరి చేస్తానండి, కొంత సమయం తీసుకుని, సరి చేస్తానండి
Delete